
జెర్సీ సిటీ: అమెరికా న్యూజెర్సీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరోసారి చెలరేగింది. మంగళవారం రాత్రి నగర వీధుల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సాధారణ పౌరులు కాగా, ఒక పోలీసు అధికారి, కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగులు యూదులకు చెందిన కొషర్ సూపర్ మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నట్టు నగర మేయర్ స్టీవెన్ చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, కేవలం యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగారని, పోలీసులు వారిని హతం చేశారని ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment