kosher supermarket
-
అమెరికాలో కాల్పులు ఆరుగురు మృతి
జెర్సీ సిటీ: అమెరికా న్యూజెర్సీ నగరంలో తుపాకీ విష సంస్కృతి మరోసారి చెలరేగింది. మంగళవారం రాత్రి నగర వీధుల్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు సాధారణ పౌరులు కాగా, ఒక పోలీసు అధికారి, కాల్పులకు తెగబడిన ఇద్దరు దుండగులు ఉన్నారు. దుండగులు యూదులకు చెందిన కొషర్ సూపర్ మార్కెట్ని లక్ష్యంగా చేసుకున్నట్టు నగర మేయర్ స్టీవెన్ చెప్పారు. ఇది ఉగ్రవాదుల దాడి కాదని, కేవలం యూదుల్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు దిగారని, పోలీసులు వారిని హతం చేశారని ట్వీట్ చేశారు. -
పలువురిని కాపాడిన ముస్లిం యువకుడు
పారిస్: ఉగ్రవాది దాడి నుంచి పలువురిని కాపాడిన ముస్లిం యువకుడిపై ఆన్ లైన్ లో ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం తూర్పు పారిస్ లో కొషెర్ సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఉగ్రవాది పలువురిని బందీలుగా పట్టుకుని నలుగురి కాల్చి చంపాడు. సూపర్ మార్కెట్ ఉద్యోగి లసానా బాతిలి(24) ఈ సమయంలో సమయస్ఫూర్తితో పలువురిని రక్షించాడు. ఉగ్రవాది సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించగానే కరెంట్ తీసేశానని, 15 మందిని బేస్ మెంట్ రూమ్ లోని పంపించి ప్రాణాలు కాపాడానని ఫ్రెంచ్ చానల్ బీఎఫ్ఎం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. వారిని గదిలో పెట్టి తాళం వేశానని, నిశ్శబద్దంగా ఉండాలని వారికి సూచించానని చెప్పాడు. ఫ్రైట్ ఎలివేటర్ ద్వారా పలువురిని బయటకు పంపించి తాను కూడా బయటపట్టాడు. దాదాపు నాలుగు గంటల ఆపరేషన్ తర్వాత ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తర్వాత లోపల దాక్కున్న వారు బయటకు వచ్చారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తమ ప్రాణాలు కాపాడిన బాతిలికి కృతజ్ఞతలు తెలిపారు. బాతిలి సాహసానికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.