ఫ్రాంక్‌ఫర్ట్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తి పైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బులñ æ్లట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్ కౌంటీలోని వైట్స్‌బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ములిన్స్‌ను ఆయన ఛాంబర్‌లోనే లెట్చర్ కౌంటీ షరీఫ్ షాన్ ఎం.స్టైన్స్ కాలి్చచంపారు. విషయం తెల్సి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు.
అసలేం జరిగిందంటే?
గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్‌గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్స్‌తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గేహార్ట్ శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. షరీఫ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు.
కోర్టులో జడ్జిని కాల్చి చంపిన పోలీసు
Published Sat, Sep 21 2024 6:26 AM | Last Updated on Sat, Sep 21 2024 6:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment