judge died
-
కోర్టులో జడ్జిని కాల్చి చంపిన పోలీసు
ఫ్రాంక్ఫర్ట్: అమెరికాలో తుపాకీ సంస్కృతికి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన ఘటనల్లో సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఈసారి ఏకంగా న్యాయమూర్తి బలయ్యారు. న్యాయమూర్తి పైకి ఆ ప్రాంత పోలీసు ఉన్నతాధికారి బులñ æ్లట్ల వర్షం కురిపించడం గమనార్హం. గురువారం కెంటకీ రాష్ట్రంలోని లెట్చర్ కౌంటీలోని వైట్స్‌బర్గ్ జిల్లా కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న 54 ఏళ్ల జిల్లా జడ్జి కెవిన్ ములిన్స్‌ను ఆయన ఛాంబర్‌లోనే లెట్చర్ కౌంటీ షరీఫ్ షాన్ ఎం.స్టైన్స్ కాలి్చచంపారు. విషయం తెల్సి పోలీసులు పక్కనే ఉన్న పాఠశాలలోని విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించేశారు. కాల్పులు జరిగినప్పుడు కోర్టులో దాదాపు 50 మంది ఉన్నారు. అసలేం జరిగిందంటే? గత ఎనిమిదేళ్లుగా అదే కౌంటీలో షరీఫ్‌గా పనిచేస్తున్న షాన్ గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వైట్స్‌బర్గ్ కోర్టు భవనానికి వచ్చి జడ్జి ములిన్స్‌తో విడిగా అత్యవసరంగా మాట్లాడాలని అనుమతి కోరాడు. దీంతో జడ్జి ఆయనను తన ఛాంబర్‌కు తీసుకెళ్లి గది తలుపులు మూసేశారు. చాలాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని బయట వరండాలో వేచి ఉన్న వ్యక్తులు చెప్పారు. అయితే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందని, తర్వాత షరీఫ్ షాన్ చేతులు పైకెత్తి బయటికొచ్చి లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. ఛాంబర్ లోపలికి వెళ్లి చూస్తే బుల్లెట్ల గాయాలతో రక్తమోడి జడ్జి నిర్జీవంగా పడి ఉన్నారని కెంటకీ రాష్ట్ర పోలీసు అధికార ప్రతినిధి మ్యాట్ గేహార్ట్ శుక్రవారం వెల్లడించారు. జడ్జిని షరీఫ్ ఎందుకు చంపారనే కారణం ఇంకా తెలియరాలేదు. ఏ విషయం మీద జడ్జి, షరీఫ్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. షరీఫ్‌ను అరెస్ట్ చేసి పోలీసులు హత్యానేరం కింద దర్యాప్తు మొదలుపెట్టారు. -
జడ్జిల భద్రతపై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు
సాక్షి, న్యూఢిల్లీ: జడ్జిల భద్రతకు సంబంధించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జడ్జిల భద్రతపై చర్యలు తీసుకోవాలని సూప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. జడ్జిల భద్రత సంబంధించిన అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రమే చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయవాదుల భద్రత చర్యల స్థితిగతులకు సంబంధించిన నివేదికలు దాఖలు చేయనందుకు జార్ఖండ్ రాష్ట్రంపై సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం జడ్జిల భద్రతకు చర్యులు తీసుకున్నప్పటికీ వారిపై పదేపదే దాడులు జరుగుతున్నాయని తెలిపింది. జార్ఖండ్‌కు తీవ్రమైన సీసీటీవీల కొరత ఉందని, అవి కేవలం నేరం జరిగిన దృశ్యాలను మాత్రమే నమోదు చేస్తాయని పేర్కొంది. కానీ నేరాలు, బెదిరింపులు జరగకుండా నిరోధించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. వారం రోజుల్లో జడ్జిల భద్రతకు సంబంధించి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వారంలోగా నివేదికను సమర్పించకపోతే రూ.లక్ష జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది. -
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ శంతను గౌడర్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మోహన్ శంతను గౌడర్ (62) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జస్టిస్ శంతను గౌడర్ ఇటీవల గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రి ఐసీయూలో చేరారు. పరిస్థితి విషమించి మృతి చెందారు. అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో జరిగాయి. 1958లో కర్ణాటకలో జన్మించిన జస్టిస్ శంతను గౌడర్ 1980లో బార్‌కౌన్సి ల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. 2004 లో కర్ణాటక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గౌడర్ 2016లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన పదవీకాలం 2023 మే వరకు ఉంది. జస్టిస్ గౌడర్ మృతిపట్ల సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జస్టిస్ లోయా మృతిపై సిట్ విచారణ జరపండి
న్యూఢిల్లీ: సీబీఐ జడ్జి బీహెచ్ లోయా మృతిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ బృందంతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్రపతి∙కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ నేతృత్వంలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల బృందం రాష్ట్రపతిని కలసి వినతిపత్రం అందచేసింది. ‘ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాం. సీబీఐ, ఎన్ఐఏలపై మాకు విశ్వాసం లేదు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఎంపిక చేసిన స్వతంత్ర అధికారుల బృందంతో దర్యాప్తు చేయించాలని మేం కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, డీఎంకే తదితర పార్టీలకు చెందిన 114 మంది ఎంపీలు వినతిపత్రంపై సంతకాలు చేశారు. -
‘లోయా మృతిపైనే మా విచారణ’
న్యూఢిల్లీ: సీబీఐ దివంగత జడ్జి బీహెచ్ లోయా మృతికి సంబంధించి మాత్రమే తమ విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ లోయా అనుమానాస్పద మృతిపై తదుపరి విచారణకు ఆదేశించాలా? వద్దా? అనేదే పరిశీలిస్తామంది. సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ చేసిన కేసులో బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, నాటి గుజరాత్ హోం మంత్రి అమిత్ షాను నిర్దోషిగా ప్రకటించడం సహా...మరే ఇతర అంశాల జోలికి తాము వెళ్లబోమని తేల్చిచెప్పింది. అమిత్ షా నిందితుడిగా ఉండిన సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తుండగానే 2014 డిసెంబర్ 1న లోయా అనుమానాస్పద స్థితిలో గుండెపోటుతో మరణించారు. -
జస్టిస్ లోయా మృతిపై విచారణ వాయిదా
-
జస్టిస్ లోయా మృతిపై విచారణ వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ లోయా మృతికి దారితీసిన పరిస్థితులు అందరికీ తెలియాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లోయా మృతి కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సుప్రీం కోర్టుకు డాక్యుమెంట్లను సమర్పించింది. వచ్చే వారానికి కేసును వాయిదా వేసిన కోర్టు పిటిషనర్లకు వివరాలు అందచేయాలని సూచించింది. ఈ కేసులో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. ముంబయికి చెందిన జర్నలిస్ట్ బీఆర్ లోన్, సామాజిక కార్యకర్త తెహసీన్ పూనావాల జస్టిస్ లోయా మృతిపై నిష్పక్షపాత విచారణ చేపట్టాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ చీఫ్ అమిత్ షా నిందితుడిగా ఉన్న సోహ్రబుద్దీన్ షేక్ బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా 2014, డిసెంబర్ 1న గుండెపోటుతో మరణించారు. కాగా సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నుంచి అమిత్ షాను కోర్టు నిర్ధోషిగా నిర్ధారించింది. జస్టిస్ లోయా మృతిపై విచారణ చేపట్టాలని న్యాయవ్యవస్థ సహా రాజకీయ పార్టీల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. -
గుండెపోటుతో చండీగఢ్ హైకోర్టు జడ్జి మృతి
తిరుపతి: మహాశివరాత్రి సందర్భంగా తిరుమల దర్శనానికి విచ్చేసిన చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేశ్ కుమార్(60) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబసభ్యులతో కలసి పద్మావతి అతిథి గృహంలో దిగారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయనకు ఆకస్మికంగా గుండె నొప్పి రావడంతో అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం స్విమ్స్‌కు తరలించారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ నరేశ్ కుమార్ కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.