గుండెపోటుతో చండీగఢ్ హైకోర్టు జడ్జి మృతి
తిరుపతి: మహాశివరాత్రి సందర్భంగా తిరుమల దర్శనానికి విచ్చేసిన చండీగఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరేశ్ కుమార్(60) గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఉదయం ఆయన కుటుంబసభ్యులతో కలసి పద్మావతి అతిథి గృహంలో దిగారు.
సాయంత్రం 4 గంటల సమయంలో ఆయనకు ఆకస్మికంగా గుండె నొప్పి రావడంతో అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం స్విమ్స్‌కు తరలించారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ నరేశ్ కుమార్ కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.