హైకోర్టులో తహశీల్దార్ మృతి
హైదరాబాద్‌సిటీ: అనంతపురం జిల్లా పెనుగొండ తహశీల్దార్ ఇంతియాజ్ మహ్మద్ హైకోర్టు ఆవరణలో కుప్పకూలి చనిపోయాడు. గవర్నమెంట్ ఆఫ్ రెవెన్యూ కార్యాలయానికి వచ్చిన ఇంతియాజ్ మంగళవారం గుండెపోటుకు గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
హైకోర్టు సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సమాచారాన్ని పోలీసులకు హైకోర్టు సిబ్బంది తెలిపారు. పోలీసులు ఇంతియాజ్ కుటుంబసభ్యులకు సమాచారాన్ని అందించారు. ఇంతియాజ్ మహ్మద్ మృతితో ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.