వెంకన్న సేవలో హైకోర్టు తాత్కాలిక సీజే
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ కుమార్ బి భోసలే శనివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఈవో సాంబశివరావు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.