సాక్షి, న్యూఢిల్లీ: జడ్జిల భద్రతకు సంబంధించిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. జార్ఖండ్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జడ్జిల భద్రతపై చర్యలు తీసుకోవాలని సూప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. జడ్జిల భద్రత సంబంధించిన అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రమే చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. న్యాయవాదుల భద్రత చర్యల స్థితిగతులకు సంబంధించిన నివేదికలు దాఖలు చేయనందుకు జార్ఖండ్ రాష్ట్రంపై సీరియస్ అయింది.
రాష్ట్ర ప్రభుత్వం జడ్జిల భద్రతకు చర్యులు తీసుకున్నప్పటికీ వారిపై పదేపదే దాడులు జరుగుతున్నాయని తెలిపింది. జార్ఖండ్‌కు తీవ్రమైన సీసీటీవీల కొరత ఉందని, అవి కేవలం నేరం జరిగిన దృశ్యాలను మాత్రమే నమోదు చేస్తాయని పేర్కొంది. కానీ నేరాలు, బెదిరింపులు జరగకుండా నిరోధించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. వారం రోజుల్లో జడ్జిల భద్రతకు సంబంధించి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. వారంలోగా నివేదికను సమర్పించకపోతే రూ.లక్ష జరిమానా విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment