న్యూఢిల్లీ: డీఎంకే నేత డీఎంకే నేత సెంథిల్ బాలాజీకి అవినీతి కేసులో బెయిల్ లభించిన కొద్దిసేపటికే తమిళనాడు మంత్రిగా ఆయనతిరిగి బాధ్యతలు స్వీకరించడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలపై అరెస్ట్ అయిన వ్యక్తి వమంత్రివర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతారనే అభిప్రాయం ఎవరికైనా వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.మంత్రి సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ మేరకు జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనం..సెంథిల్ బాలాజీ బెయిల్‌ను రద్దు చేసేందుకు నిరాకరించింది. బెయిల్ ఉత్తర్వులు ఇతరులకు ప్రయోజనం చేకూర్చాయని, కాబట్టి మెరిట్‌లపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. అయితే బాలాజీ మంత్రి వర్గంలో చేరడం వల్ల సాక్షులు ఒత్తిడికి గురవుతున్నారా లేదా అనే దానిపై పిటిషన్ పరిధిని పరిమితం చేస్తామని కోర్టు తెలిపింది.
‘మేము బెయిల్ ఇచ్చిన మరుసటి మీరు మంత్రి అయ్యారు. ఇప్పుడు సీనియర్ క్యాబినెట్ మంత్రిగా ఉంఉన్నారు. ఈ సమయంలో సాక్షులు ప్రభావితం అవుతారనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది.. ఏం జరుగుతోంది’ అని సెంథిల్ బాలాజీ తరఫున న్యాయవాదిని జస్టిస్ ఏఎస్ ఓకా ప్రశ్నించారు. అయితే దీనిపై తమకు కొంత సమయం కావాలని బాలాజీ న్యాయవాది తెలపడంతో.. తదుపరి విచారణకు డిసెంబరు 13కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
కాగా డీఎంకే పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సెంథిల్ బాలాజీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం అన్న డీఎంకేలో చేరారు. 2011 నుంచి 2015 వరకు జయలలిత ప్రభుత్వంలో రవాణాశాఖ మంత్రిగా మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదుచేసింది. ఈ కేసులో గతేడాది జూన్‌లో ఆయనను అరెస్ట్ చేయగా.. 8 నెలల తర్వాత మంత్రిపదవికి బాలాజీ రాజీనామా చేశారు. 14 నెలలు జైల్లో ఉన్న అనంతరం సెప్టెంబరు 26న సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం స్టాలిన్ మంత్రివర్గంలో విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖల మంత్రిగా చేరారు.
Comments
Please login to add a commentAdd a comment