చైల్డ్‌పోర్నోగ్రఫీ వీక్షణ ముమ్మాటికీ నేరమే: సుప్రీం కోర్టు | Watching Child Porn Pocso Offence Or Not, Supreme Court Final Verdict Full Details Inside | Sakshi
Sakshi News home page

చైల్డ్‌పోర్నోగ్రఫీ వీక్షణ ముమ్మాటికీ నేరమే.. సుప్రీం కోర్టు తుది తీర్పు

Published Mon, Sep 23 2024 9:30 AM | Last Updated on Mon, Sep 23 2024 1:30 PM

Watching Child Porn POCSO offence or Not: Supreme Court Final Verdict Full Details

చైల్డ్ పోర్నోగ్రఫీ.. మద్రాస్‌ హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం

ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని జనవరి 11న మద్రాసు హైకోర్టు తీర్పు

ఆ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ

పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టిన అత్యున్నత న్యాయస్థానం

ఆ పదాన్ని వినియోగించొద్దని కోర్టులకు సూచన

న్యూఢిల్లీ: చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా? కాదా? అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అదేం నేరం కాదని గతంలో మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. ముమ్మాటికీ నేరమేనంటూ సీజేఐ ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెల్లడించింది.   

పోక్సో చట్టం సెక్షన్‌ 15 ప్రకారం.. చైల్డ్‌ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను(ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు  ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్‌ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొంటూ.. దాన్ని పక్కన పెట్టేసింది. అలాగే ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కొనసాగించాలని స్పష్టం చేసింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్‌ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దు అని  సుప్రీం కోర్టు సూచించింది. 

కేసు ఏంటంటే..
తమిళనాడుకు చెందిన 28ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని వీక్షించాడన్న అభియోగాలపై క్రిమినల్‌ చర్యలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11వ తేదీన సంచలన తీర్పు వెల్లడించింది. అతను కేవలం వీడియోలు కేవలం చూసాడని,ఇతరులకు పంపలేదని పేర్కొంది. ఐటీ యాక్ట్‌ సెక్షన్‌ 67బీ కింద అతని చర్య నేరం కాదని స్పష్టం చేసింది. అలాగే.. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ జస్టిస్‌ ఎన్‌ ఆనంద్‌ వెంకటేష్‌ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇలాంటి కేసుల్లో శిక్షించే బదులు, వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. 

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఫరీబాద్‌కు చెందిన జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ అనే ఎన్‌జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మద్రాస్‌ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో వాదనలు ముగించి.. తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్‌ పోర్నోగ్రఫీ నేరమేనని గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు.. ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు సైతం చైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్‌ కింద నేరం కాదని తెలిపింది. అయితే రెండు వారాలు తిరగకముందే ఆ తీర్పును రీకాల్‌ చేస్తూ మరో తీర్పు ఇచ్చింది.

ఇదీ చదవండి: జడ్జిల్లారా.. జాగ్రత్త! అన్ని కళ్లు మన మీదే!! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement