final judgement
-
చైల్డ్‌పోర్నోగ్రఫీ వీక్షణ ముమ్మాటికీ నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా? కాదా? అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. అదేం నేరం కాదని గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ.. ముమ్మాటికీ నేరమేనంటూ సీజేఐ ధర్మాసనం సోమవారం తుది తీర్పు వెల్లడించింది. పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను(ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు నిల్వ చేసుకోవడం కూడా నేరమే అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును తీవ్ర తప్పిదంగా పేర్కొంటూ.. దాన్ని పక్కన పెట్టేసింది. అలాగే ఈ కేసులో నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తేస్తూ.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని స్పష్టం చేసింది. పనిలో పనిగా.. కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దు అని సుప్రీం కోర్టు సూచించింది. కేసు ఏంటంటే..తమిళనాడుకు చెందిన 28ఏళ్ల యువకుడు ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్లోడ్ చేసుకుని వీక్షించాడన్న అభియోగాలపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఈ ఏడాది జనవరి 11వ తేదీన సంచలన తీర్పు వెల్లడించింది. అతను కేవలం వీడియోలు కేవలం చూసాడని,ఇతరులకు పంపలేదని పేర్కొంది. ఐటీ యాక్ట్ సెక్షన్ 67బీ కింద అతని చర్య నేరం కాదని స్పష్టం చేసింది. అలాగే.. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం.. ఛైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇలాంటి కేసుల్లో శిక్షించే బదులు, వారికి సరైన మార్గం చూపడం ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా,జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో వాదనలు ముగించి.. తీర్పును రిజర్వ్ చేసింది. అయితే విచారణ సందర్భంలోనే.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమేనని గతంలో పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. ఈ ఏడాది జులైలో కర్ణాటక హైకోర్టు సైతం చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఐటీ యాక్ట్ కింద నేరం కాదని తెలిపింది. అయితే రెండు వారాలు తిరగకముందే ఆ తీర్పును రీకాల్ చేస్తూ మరో తీర్పు ఇచ్చింది.ఇదీ చదవండి: జడ్జిల్లారా.. జాగ్రత్త! అన్ని కళ్లు మన మీదే!! -
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం: మంత్రి బొత్స
-
జడ్జి యాదవ్ చివరి తీర్పు
అయోధ్య: మూడు దశాబ్దాలుగా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్‌కి ఇదే ఆఖరి తీర్పు. ఆయన తన కెరీర్లో మొట్టమొదటి సారిగా ఫైజాబాద్ జిల్లా (ఇప్పుడు అయోధ్య జిల్లాగా పేరు మార్చారు) అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే అయోధ్యకు సంబంధించిన అత్యంత కీలకమైన తీర్పునిచ్చి ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఏర్పాటైన లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారిగా ఎస్కే యాదవ్ అయిదేళ్ల క్రితం 2015, ఆగస్టు 5న నియమితులయ్యారు. అప్పట్నుంచి ఆయన ఆధ్వర్యంలోనే కేసు విచారణ నడుస్తోంది. ఏళ్లకి ఏళ్లు విచారణ గడుస్తూ ఉండడంతో ప్రతీ రోజూ విచారణ జరిపి, రెండేళ్లలో తీర్పు చెప్పాలంటూ 2017 ఏప్రిల్ 19న సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టుని ఆదేశించింది. అప్పట్నుంచి ఎస్కే యాదవ్ ప్రతీ రోజూ కేసుని విచారించారు. ఏడాది కిందటే పదవీ విరమణ కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ జిల్లా పఖాన్పూర్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ 31 ఏళ్ల వయసులో జ్యుడీషియల్ సర్వీసెస్‌లోకి వచ్చారు. ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులోకి అడుగు పెట్టి జిల్లా జడ్జి వరకు ఎదిగి సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. గత ఏడాదే న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేశారు. లక్నో బార్ కౌన్సిల్ ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం కూడా చేసింది. అయితే అయిదేళ్లుగా కేసు విచారిస్తూ ఉండడంతో సుప్రీం కోర్టు ప్రత్యేక న్యాయమూర్తిగా ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ న్యాయం జరుగుతుందని భావిస్తే సుప్రీం కోర్టుకి న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడిగించే హక్కు ఉంది. అలా కూల్చివేత ఘటనలో తీర్పు చెప్పిన న్యాయమూర్తిగా యాదవ్ రికార్డు సృష్టించారు. -
తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది.1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వరుస బాంబు పేలుళ్లలో తుండా పాత్ర ఉందన్న పోలీసులు అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో తుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న తుండా కేసులో కీలక తీర్పు వెలవరించింది. నిజానికి ఈ కేసులో తీర్పును గత నెల 18న వెల్లడించాల్సి ఉంది. కానీ, ఈ కేసును విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెలవులో ఉండడంతో నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించింది. -
ఉగ్రవాది కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా పడింది. తుండా కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్ జైల్లో ఉన్న కరీమ్ తుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే విచారణ అనంతరం తుండా కేసులో తుది తీర్పును కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. కాగా, దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా నిందితుడిగా ఉన్నాడు. ఆయా దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఢిల్లీ పోలీసులు రెండేళ్ల క్రితం నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు. ఇతన్ని ఏడేళ్ల కిందట నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండా కీలక పాత్ర వహించాడు. ఇతను 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. సిట్ పిటీ వారెంట్‌పై హైదరాబాకు తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన పలు పేలుళ్ల కేసులలో తుండా హస్తం ఉంది. తుండాపై ఆంసాట్, నకిలీ పాస్ పోర్టుల కేసులున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ యువకుల్ని ఉగ్రవాదంపై ఆకర్షితుల్ని చేసి శిక్షణ కూడా ఇచ్చాడు కరీమ్ తుండా. 1998లో గణేష్ ఉత్సవాల్లో బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడన్న అభివయోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి. -
హైకోర్టులో అప్పీల్ చేయనున్న సమత దోషులు
సాక్షి, ఆదిలాబాద్: సమత కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులు అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్నారు. దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానాను శనివారం రోజున కుటుంబ సభ్యులు చెల్లించారు. రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. సమత అత్యాచారం, హత్య కేసులో షేక్ బాబు, షాక్ షాబుద్దీన్, షేక్ మగ్దుమ్‌కి ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష తీర్పు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయ మూర్తి విచారణ జరిపి మరణశిక్ష విధించారు. (‘మరణమే’ సరి..) -
బతుకు దెరువుకొచ్చి బలైపోయిన సమత
సాక్షి, ఆసిఫాబాద్: బతుకుదెరువు కోసం గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ వెంట్రుకలకు బుడగలు, స్టీలు సామాన్లు అమ్ముతూ జీవనం సాగించే దళిత మహిళ సమత మృగాళ్ల చేతిలో బలైపోయింది. రోజులాగే వ్యాపారం కోసం వెళ్లిన ఆమెపై మృగాళ్లు పట్టపగలే అడవిలో అత్యాచారం ఆపై హత్యకు పాల్పడ్డారు. దీంతో ఒక్క సారిగా మన్యం ఉలిక్కిపడింది. తాగిన మైకంలో బాధితురాలిపై కత్తితో దాడి చేసి చేతి వేళ్లు, కాళ్లు నరికి బలత్కారానికి పాల్పడిన తీరు కలచి వేసింది. బతుకు దెరువు కోసం వచ్చిన దళిత మహిళపై దాడి జరిగిన తీరుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసలు వ్యక్తమయ్యాయి. గురువారం నేరస్తులకు ఉరి శిక్ష విధించడంపై స్థానికులు, దళిత, మహిళా సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఒంటరి మహిళపై అఘాయిత్యం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్‌కు చెందిన సమత తన భర్తతో కలసి ఐదేళ్ల కిత్రం కుమురం భీం జిల్లా జైనూర్ మండల కేంద్రంలో నివాసముంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లి వారి స్వగ్రామం. గత నవంబర్ 24న సమత భర్త బైక్‌పై లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతను విడిచి జైనూర్ మండలం మోడీగూడ వెళ్లాడు. సాయంత్రం 6 గంటలు దాటినా ఆమె తిరిగి చెప్పిన చోటికి రాకపోయే సరికి రాత్రి 8 గంటలకు జైనూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఆ మర్నాడు ఎల్లాపటార్ నుంచి రాంనాయక్ తండాకు వెళ్లే దారి మధ్యలో విగత జీవిగా పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత 27న ఎల్లాపటార్‌కు చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దుంలను అరెస్టు చేసి లోతుగా విచారణ చేపట్టారు. మృగాళ్ల దాష్టీకం.. వస్తువులు విక్రయిస్తూ ఎల్లాపటార్ నుంచి రాంనాయక్‌తండాకు నడుచుకుంటూ వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఎల్లాపటార్‌కు చెందిన షేక్‌బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్దుంలు ఆమెను అడ్డగించారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెలారు. మొదట షేక్ బాబు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టగా, మిగతా ఇద్దరు ఆమె కాళ్లు, చేతులు గట్టిగా అదిమి పట్టుకున్నారు. ఆ తర్వాత వారూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా కాళ్లు, చేతులు, తలపై తీవ్రంగా గాయపర్చారు. ఆమె నెలసరి సమయంలోనే మృగాళ్లు ఈ ఘాతు కానికి పాల్పడినట్లు అక్కడి ఆధారాలను బట్టి తేలింది. దిశ ఎన్‌కౌంటర్‌తో పెరిగిన ఒత్తిడి.. వాస్తవానికి సమత ఘటన.. దిశ ఘటన కంటే 3 రోజుల ముందే జరిగింది. దిశ ఘటనలో పౌర సమాజం పెద్ద ఎత్తున స్పందించడం, ఆ తర్వాత నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో మరణించడంతో సమతకు సమన్యాయం చేయాలని నిరసనలు వచ్చాయి. పలువురు నేతలు ఆదిలాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. సమత భర్తకు ఉద్యోగం అట్రాసిటీ కేసులో బాధితులుకు ఇచ్చే పరిహారం కింద సమత భర్తకు ఘటన జరిగిన పక్షం రోజుల్లోనే ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అటెండర్ ఉద్యోగం ఇస్తూ కుమ్రంభీం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికసాయం అందజేసి, మృతురాలి ఇద్దరు కుమారులను స్థానిక ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించారు. -
‘మరణమే’ సరి..
సాక్షి, ఆదిలాబాద్: అవును.. వారికి ఉరితాడే సరి.. తప్పతాగి ఓ అమాయకపు మహిళను చెరచిన ఆ మృగాళ్లకు మరణమే సరైన శిక్ష.. మానవత్వం మరచి అతి కిరాతకంగా ఆ నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ కామాంధులకు చావే మిగతా మృగాళ్లకు మేల్కొలుపు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష తీర్పు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. గతేడాది నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయ మూర్తి విచారణ జరిపారు. ఈ కేసులో ఎన్నో సవాళ్లను అధిగమించి అనేక సాక్ష్యాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. డిసెంబర్ 11న ఈ ప్రత్యేక కోర్టు ఏర్పడింది. బాధితురాలు, నిందితుల తరఫున వాదప్రతివాదనలు విన్న తర్వాత కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిని గురువారం తీర్పు వెలువరించారు. మొదట నేరం రుజువైనట్లు దోషులతో పేర్కొన్న ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు జడ్జి ఏమైనా చెబుతారా అని నిందితులను అడిగితే వారు.. కంటతడి పెట్టడంతో 10 నిమిషాల పాటు బ్రేక్ తీసుకున్న న్యాయమూర్తి ఆ తర్వాత తీర్పునిచ్చారు. నిర్ధారణ జరిగిందిలా.. సమతపై గతేడాది నవంబర్ 24న సామూహిక అత్యాచారం చేసి, ఆమె చేతి వేళ్లు, కాళ్లను కోసేసి హతమర్చారు. రెండో రోజు ఆ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. ఆ తర్వాత 2 రోజుల్లోనే నిందితులను గుర్తించారు. ఎల్లపటార్ కు చెందిన షేక్ బాబును ఏ1గా, షేక్ షాబొద్దీన్ను ఏ2గా, షేక్ మఖ్దుంను ఏ3గా గుర్తించారు. దర్యాప్తు వేగవంతం చేసి 20 రోజుల్లో తగిన ఆధారాలు సేకరించారు. మృతిచెందిన సమతకు సంబంధించి డీఎన్ఏ సరిపోలిన నివేదిక, ఘటనా స్థలి నుంచి ఆమె దుస్తులు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, భౌతిక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఎం.మల్లారెడ్డి లేఖ రాశారు. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ఆదిలాబాద్‌లో ఎస్సీ, ఎస్టీ కోర్టునే ప్రత్యేక కోర్టుగా మలిచి ఈ కేసును విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 11న ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 14న ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు నిందితులపై ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 25 మంది సాక్షుల విచారణ.. నిందితుల తరఫు వాదించేందుకు ఏ న్యాయవాదీ ముందుకు రాలేదు. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన న్యాయవాది రహీంను నిందితుల తరఫున వాదించేం దుకు కోర్టు నియమించింది. ఈ కేసును డిసెంబర్ 16న ప్రత్యేక కోర్టు క్రైం నం.117/2019గా నమోదు చేసింది. డిసెంబర్ 23 నుంచి 31 వరకు సాక్షులను విచారించింది. కేసులో పోలీసులు 44 మంది సాక్షులను ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు 25 మంది సాక్షులను విచారించింది. జనవరి 7, 8 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా, జనవరి 10న డిఫెన్స్ లాయర్ తన వాదనలు వినిపించారు. ఆ తర్వాత నిందితులను కోర్టు విచా రించగా ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని విన్నవించారు. తమ తరఫున సాక్షులున్నారని కోర్టుకు తెలపగా, సాక్షులను ప్రవేశపెట్టేందుకు 2 రోజులు అనుమతించినా.. సాక్షులు ఎవరూ కోర్టుకు హాజరుకాలేదు. ఈ నెల 20న వాదనలు పూర్తి కాగా, 27న ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే జడ్జి అనారోగ్యం కారణంగా గురువారానికి వాయిదా పడింది. ఈ సెక్షన్లు నమోదు: సమతను హతమర్చినందుకు 302, ఆర్–డబ్ల్యూ సెక్షన్ల కింద మరణ శిక్ష. ముగ్గురు ముందస్తు ప్రణాళిక ప్రకారమే నేరానికి పాల్పడినందుకు 34 ఐపీసీ, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినందుకు 376డీ, వస్తువులను దొంగిలించినందుకు 404 ఐపీసీ, దళితురాలైన ఆమెపై ఈ నేరానికి పాల్పడినందుకు ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం ప్రకారం శిక్షలు విధించారు. ముగ్గురికి కలిపి 26 వేల జరిమానా విధించారు. నేరం జరిగిన రోజు నుంచి 66 రోజుల్లో ఈ తీర్పు వెలువడటం గమనార్హం. సెంట్రల్ జైలుకు తరలింపు: సమత కేసు విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను ఆదిలాబాద్‌లోని జిల్లా జైలులో ఇన్ని రోజులు ఉంచారు. గురువారం వీరికి మరణ శిక్ష విధించడంతో ఆదిలాబాద్ జిల్లా జైలు కాకుండా సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉరిపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. సమత ఆత్మకు శాంతి చేకూరింది టేకు గోపీ, సమత భర్త నిందితులకు కోర్టు మరణశిక్ష విధించడంతో సమత ఆత్మకు శాంతి చేకూ రింది. ఆమెను కోల్పోవడం తీరనిలోటు. తల్లి కోసం పిల్లలు కన్నీరు మున్నీర వుతున్నారు. దోషులు అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేశారు. వారిని వెంటనే ఉరితీయాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా తీర్పునిచ్చారు. జడ్జిలకు పాదాభివందనం టేకు కనకవ్వ, సమత అత్త ఇంత త్వరగా న్యాయమైన తీర్పు ఇచ్చిన జడ్జిలకు పాదాభివందనం. ఈ తీర్పుద్వారా మహిళలకు స్వాతంత్రం వచ్చినట్లయింది. నిందితులు మీది కోర్టులకు వెళ్లకుండా చూడాలి. రాష్ట్రపతి కూడా దళిత మహిళల అక్రోదనను అర్థం చేసుకొని క్షమాభిక్ష పెట్టవద్దని కోరుతున్నాం. -
సత్వర న్యాయం
రెండు నెలలక్రితం కుమురం భీం అసిఫాబాద్ జిల్లాలో చిరు వ్యాపారం చేసుకుంటున్న మహిళను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులు షేక్ బాబు, షాబుద్దీన్, షేక్ మఖ్దూంలకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఉదంతం జరిగిన మూడు రోజులకు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని చకచకా దర్యాప్తు చేశారు. గత నెల 11న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకాగా 14న పోలీసులు చార్్జషీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కూడా అంతే వేగంతో దర్యాప్తు జరిపి 45 రోజుల్లో తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష పడింది కనుక తెలంగాణ హైకోర్టు దీన్ని ధ్రువీకరించాల్సివుంటుంది. ఉరిశిక్ష విధింపు విషయంలో భిన్నాభిప్రాయం ఉన్నవారు సైతం తెలంగాణ పోలీ సులు పకడ్బందీగా దర్యాప్తు చేయడాన్ని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కూడా ఈ కేసు విచారణను సత్వరం పూర్తి చేయడాన్ని హర్షిస్తారు. అత్యాచారాలు తరచుగా చోటుచేసుకోవడానికి గల ముఖ్య కారణాల్లో వ్యవస్థలు సక్రమంగా స్పందించకపోవడం ఒకటని 2012లో నిర్భయ ఉదంతం తర్వాత కేంద్రం నెలకొల్పిన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ చెప్పడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన ఉదంతంలో కూడా పోలీసులు ఇంతే వేగంతో స్పందించారు. ఘటన జరిగిన 48 రోజుల్లో విచారణ పూర్తయి నేరగాడికి ఉరిశిక్ష పడింది. ఈ కేసు తీర్పును సమీక్షించిన తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. గత నవంబర్ 27న వైద్యురాలు దిశను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన నిందితులు ఆ తర్వాత డిసెంబర్ 6న ఎన్కౌంటర్లో మరణించారు. ఆ నిందితులు ఇదే తరహాలో తెలంగాణ, కర్ణాటకల్లో 15మంది మహిళల ప్రాణాలు తీసినట్టు తమ దర్యాప్తులో వెల్ల డైందని పోలీసులు చెప్పారు. యాదాద్రి జిల్లాలోని హాజీపూర్‌లో బాలికల ప్రాణాలు తీసిన కేసులోని నిందితుడికి ఇంకా శిక్ష పడాల్సివుంది. సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబికి, మీడియాలో బాగా ప్రచారంలోకొచ్చిన కేసుల విషయంలో మాత్రమే పోలీసులు శ్రద్ధ పెడుతున్నారని, న్యాయస్థానాలు కూడా వేగంగా విచారణ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. అత్యాచారం కేసుల్లో మాత్రమే కాదు... ఆడపిల్లల పట్ల జరిగే ఏ చిన్న లైంగిక నేరంలోనైనా ఇదేవిధమైన శ్రద్ధ పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. ముఖ్యంగా తమ కుమార్తెను ఫలానా వ్యక్తి వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు దాన్ని అత్యంత సాధారణమైన విషయంగా తీసుకోవడం పోలీసు విభాగాల్లో రివాజు అయింది. అసలు బాధితులు ఫిర్యాదు చేసేవరకూ వచ్చారంటేనే పరిస్థితి వారి చేయి దాటిపోయిందని అర్థం. మన సమాజంలో ఏ ఆడపిల్లయినా వేధింపులు ఎదుర్కొన్నప్పుడు అంత త్వరగా తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా సిద్ధపడదు. కుటుంబాల్లో ఆడపిల్లల్ని పెంచే విధానం ఇందుకు ఒక కారణం. అలా చెబితే తననే నిందిస్తారేమో, అసలు బయటకే వెళ్లొద్దని కట్టడి చేస్తారేమో అని సందేహపడుతుంది. చదువుకునే బాలికైతే చదువు ఆపేస్తారని భయపడుతుంది. వేధింపుల స్థాయి పెరిగాక తప్పనిసరై ఇంట్లో చెబుతుంది. తల్లిదండ్రులు సైతం పోలీసుల వరకూ వెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరిద్దామని చూస్తారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే కుటుంబం పరువు పోతుందని భయపడతారు. అందరూ వేలెత్తి చూపుతారని సందేహపడతారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మరింత తాత్సారం చేస్తే ఏమవుతుందో వేరే చెప్పనవసరం లేదు. దిశ విషయంలో పోలీసులు వెంటనే స్పందించలేదు. ఆమె తన సోదరికి ఫోన్ చేసి తన టూ వీలర్ పాడైందని, బాగు చేసుకొస్తానని వెళ్లినవాడు ఇంకా రాలేదని చెప్పిన కాసేపటికే స్విచాఫ్ కావడంతో వెంటనే ఆ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ వారి నుంచి సరైన స్పందన రాలేదని, వెంటనే కదిలివుంటే ఆమె ప్రాణాలు నిలిచేవని కుటుంబసభ్యులు ఆరోపిం చారు. బాధితులకు ఎవరూ అండగా రారని, వారు నిస్సహాయులని తెలిసినప్పుడే నేరగాళ్లు మరింత పేట్రేగిపోతారు. కనుకనే సమాజంలో నిస్సహాయులుగా ఉండేవారి రక్షణకు ఉద్దేశించిన వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నాయో, అవి తమ విధులను ఎలా నిర్వర్తిస్తున్నాయో ఎప్పటికప్పుడు తనిఖీ చేసే యంత్రాంగం ఉండాలని జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సూచించింది. తనిఖీల్లో అలసత్వంతో ఉన్నట్టు తేలినపక్షంలో కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది .లోగడ వరంగల్ జిల్లాలో జరిగిన ఉదంతంలోగానీ, ఇప్పుడు సమత కేసు ఉదంతంలోగానీ సత్వర దర్యాప్తు జరగడం, వెనువెంటనే నేరగాళ్లకు కఠిన శిక్షలు పడటం వంటివి హర్షించదగ్గవే అయినా... వాటి తీవ్రతతో నిమిత్తం లేకుండా ఏ కేసు విషయంలోనైనా ఇదే స్థాయిలో స్పందించే స్వభావాన్ని పోలీసులు అలవర్చుకుంటే నేరస్వభావాన్ని మౌలిక దశలో కట్టడి చేయడం వీలవుతుంది. ఈ క్రమంలో నిందితులు పలుకుబడి కలిగినవారైనా ఉపేక్షించకూడదు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో శాసనసభ్యుడిపై అత్యాచారం ఆరోపణలొచ్చినప్పుడు పోలీసులు ఎంతో తాత్సారం చేయడం వల్ల అతగాడు మరింత రెచ్చిపోయాడు. ఆ ఎమ్మెల్యే మనుషులు ఆమె తండ్రితోసహా కుటుంబంలో నలుగురిని హతమార్చడంతోపాటు రోడ్డు ప్రమాదం పేరిట బాధితురాలినే హత్య చేయాలనుకున్నారు. తీవ్రమైన నేరాలకు కఠిన శిక్షలు విధించడానికి అనువుగా చట్టాలు సవరించడం, వెంటవెంటనే నేరగాళ్లకు శిక్షలు పడేవిధంగా అన్ని వ్యవస్థలూ చురుగ్గా పనిచేయడం నేరాలను అరికట్టడంలో ఎంతో ఉపయోగపడతాయి. అదే సమయంలో మద్యపానం మహమ్మారిని అదుపు చేయడం, అశ్లీల వీడియోలపై కట్టడం చేయడం అత్యంత ముఖ్యం. ఒక మనిషి మృగంగా మారడానికి తోడ్పడుతున్న ఈ మాదిరి ప్రమాదకరమైన వాటిని నిర్మూలించకుండా నేరాలను అరికట్టడం సాధ్యం కాదు. కనుక ప్రభుత్వాలు వీటిపై కూడా దృష్టి పెట్టాలి. -
సమత కేసు దోషులకు ఉరిశిక్ష
-
సమత కేసుపై సర్వత్రా ఉత్కంఠ
-
సమత కేసులో కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఆదిలాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమత కేసులో ఆదిలాబాద్ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెల్లడించింది. అనేక పరిణామాల మధ్య దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం తుది తీర్పు ఇచ్చింది. సమత హత్యాచార నిందితులు షేక్ బాబా, షేక్ షాబూద్దీన్, షేక్ ముఖ్ధీమ్‌లను దోషులుగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. ముందుగా నిందితులను జైలు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు హాలులోకి పిలిచిన జడ్జి వారి కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరం రుజువైందని నిందితులకు చెప్పారు. నిందితుల తరపున న్యాయవాది రహీం వాదనలు వినిపించిన రహీం.. శిక్ష తగ్గింగాలని న్యాయమూర్తిని కోరారు. కుటుంబానికి తామే ఆధారమంటూ న్యాయమూర్తి ముందు నిందితులు కన్నీరు పెట్టుకున్నారు. ముగ్గురు నిందితులకు నలుగురు పిల్లలు ఉన్నారని, శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. కాగా సమత భర్త గోపి, కుటుంబ సభ్యులు కోర్టుకు చేరుకున్నారు. అలాగే సమత స్వగ్రామం గోనంపల్లె వాసులు సైతం కోర్టుకు భారీగా చేరుకున్నారు. దీంతో కోర్టు దగ్గర పెద్ద సంఖ్యలో పోలీసులను మొహరించారు. కేసుకు సంబంధించిన వాదనలు ఈ నెల 20న పూర్తయ్యాయి. ఈ నెల 27న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉండగా న్యాయమూర్తి అనారోగ్య కారణంగా ఈ నెల 30కు వాయిదా వేశారు. కొమురంభీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్‌లో గతేడాది నవంబర్ 24న సమతపై సామూహిక అత్యాచారం చేసి, ఆమెను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. -
సమత కేసు, హాజీపూర్ కేసు: తుది తీర్పు వాయిదా
సాక్షి, ఆదిలాబాద్: తీవ్ర సంచలనం సృష్టించిన సమత ఆత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నేడు తుదితీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో వాయిదా వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. మరోవైపు హాజీపూర్ హత్య కేసులోని విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేశారు. చదవండి: ప్రభుత్వ ఆదేశాలతో 'సమత' పిల్లలకు ఉచిత విద్య -
హాజీపూర్ కేసు: ఈ నెల 27న తుది తీర్పు
సాక్షి, నల్గొండ: హాజీపూర్ వరుస హత్యల కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 27న పోక్సోకోర్టు తీర్పును వెలువరించనుంది. ఈ మేరకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిపై ముగ్గురు బాలికలపై హత్యాచారం కేసులు నమోదు కాగా, ఈ నెల 8 నాటికి ఒక కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. అయితే, మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే తీర్పును వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే అంతా అబద్ధం సార్.. -
అంతిమ తీర్పు..సమాజానికి కనువిప్పు
- ముగిసిన జాతీయ నాటిక పోటీలు - చాలు.. ఇక చాలు నాటికకు ప్రథమ బహుమతి - ద్వితీయ స్థానంలో నిలిచిన ‘సప్తపది’ కర్నూలు(కల్చరల్): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు ముగిశాయి. మంగళవారం ప్రదర్శించిన ‘అంతిమ తీర్పు’ నాటిక సమాజానికి కనువిప్పు కలిగించింది. ప్రస్తుత కుటుంబంలోని బలహీనపడుతున్న బంధాల గురించి తెలియజేసింది. ఒక తల్లి ఒక దురదృష్ట సంఘటనకు కుమిలిపోతూ భర్తను, కొడును దూరం చేసుకోవడం, అనంతరం ఆ తల్లి జరిగిన సంఘటనకు పశ్చాత్తాపపడి భర్తను, కొడుకును దగ్గరికి తీసుకోవడం నాటకంలోని ప్రధాన ఒతివృత్తం. భవాని ప్రసాద్ రచించిన ఈ నాటకానికి డాక్టర్ సి.ఎస్.ప్రసాద్ దర్శకత్వం వహించారు. చాలు...ఇక చాలు జాతీయ స్థాయి నాటిక పోటీల్లో భాగంగా మంగళవారం ఉదయం 10:30 గంటలకు ప్రదర్శించిన చాలు.. ఇక చాలు నాటిక... ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఏది అడిగినా కాదు.. లేదు.. కుదరదు.. అని చెప్పకుండా ప్రతిదీ సమకూరుస్తున్నారు. ఆ తల్లిదండ్రులే వయస్సు మల్లిన తర్వాత పిల్లలను ఏది అడిగినా కాదు.. లేదు.. కుదరదు.. అని సులువుగా చెప్పేస్తున్నారు. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న ప్రస్తుత తరం వైఖరి చాలు.. ఇక చాలు.. అంటూ ప్రదర్శించిన సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. భవాని ప్రసాద్ రచించిన ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. కల్లందిబ్బ.. సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్ వారి ‘కల్లం దిబ్బ’ నాటిక ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను చిత్రీకరించింది. దళారీలు రైతులను దోచుకోవడం, వ్యవసాయంలో తీరని నష్టాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల జీవితాలు కల్లం దిబ్బలా తయారయ్యాయని ఈ నాటిక తెలియజేసింది. రావి నూతల ప్రేమ కిషోర్ రచించిన ఈ నాటికకు బజారప్ప దర్శకత్వం వహించారు. సమాజాన్ని మార్చే నాటికలు.. ముగింపు ఉత్సవంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టీజీవి కళాక్షేత్రం చైర్మన్ టీజీ భరత్ మాట్లాడారు. నాటకం.. సమాజ మార్పునకు దోహదం చేస్తుందనిచెప్పారు. ప్రేక్షకులకు కనువిందు చేసి కనువిప్పు కల్గింగే శక్తి నాటకాలకు ఉందన్నారు. రాయలసీమ కళాకారులు సినీరంగంలో ఎదిగేందుకు, తక్కువ ఖర్చులో సినిమాలు నిర్మించేందుకు అవసరమైన సహకారాలు అందిస్తామన్నారు. ఉత్తమ నాటికగా చాలు.. ఇక చాలు... జాతీయస్థాయి నాటిక పోటీల్లో శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు నాటకసమాజం వారు ప్రదర్శించిన ‘చాలు.. ఇక చాలు..’ నాటిక ఉత్తమ నాటికగా ఎంపికయ్యింది. చిలకలూరిపేట అంజనా రాథోడ్ నాటక సమాజం ప్రదర్శించిన నాటిక సప్తపది ఉత్తమ ద్వితీయ నాటికగా, ఉషోదయ కళానికేతన్ కోటపాడు వారు ప్రదర్శించిన గోవు మహాలక్ష్మీ ఉత్తమ తృతీయ నాటికగా ఎంపికయ్యాయి. ‘మనిషి కాటు’ నాటికలోని ఆఫీసర్ పాత్రధారి వంజారి కృష్ణమూర్తి ఉత్తమ విలన్‌గా, ‘సందడే సందడి’ నాటికలోని దొంగ పాత్రధారి క్రొవ్విడి జోగారావు ఉత్తమ హాస్య నటుడుగా, ‘మనిషి కాటు’ నాటికంలోని పోలమ్మ పాత్రధారిణి సుజాత ఉత్తమ సహాయ నటిగా, ‘కల్లం దిబ్బ’ నాటికలోని వేణు పాత్రధారి మంజునాథ్ ఉత్తమ సహాయ నటుడుగా ఎంపికయ్యారు. గోవు మా లక్ష్మీ’ నాటికలోని వెంకటలక్ష్మీ పాత్రధారి లహరి నత్తమ నటిగా, చాలు ఇక చాలు నాటికలోని రామారావు పాత్రధారి గోపరాజు రమణ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. రాజీ నాటిక దర్శకుడు పి.వి.శేషయ్య ఉత్తమ దర్శకుడిగా, చాలు ఇక చాలు నాటిక రచయిత భవాని ప్రసాద్ ఉత్తమ రచయితగా ఎంపికయ్యారు. పారిశ్రామికవేత్త టి.జి.భరత్, లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఈ కళాకారులను సన్మానించారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన గోపిశెట్టి వెంకటేశ్వర్లు, వన్నెం బలరాం, సుభాన్ సింగ్, నాట్య కళాకారుడు కరీముల్లాలను సన్మానించారు. ఈమని రామకృష్ణప్రసాద్ పాడిన అన్నమయ్య కీర్తనలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం సలీం బాషా, మహమ్మద్ మియా, ఇనాయతుల్లా ప్రదర్శించిన హాస్యవల్లరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో లలిత కళాసమితి ఉపాధ్యక్షులు సి.వి.రెడ్డి, కోశాధికారి బాల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు రాజరత్నం, ఎన్.డి.క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. -
సత్యం కేసులో తుది తీర్పు రేపే!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కేసులో తుది తీర్పు గురువారం వెలువడనుంది. మార్చి 9వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ''ఏప్రిల్ 9న తీర్పు వెలువరిస్తాం. ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఏప్రిల్ 9 తీర్పునకు చిట్టచివరి తేదీ అవుతుంది. ఇక వాయిదాల ప్రసక్తి లేదు. కోర్టు వేచి చూడదు'' అని ఆయన అప్పట్లో అన్నారు. 2009 జనవరి 7వ తేదీన సత్యం స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ఖాతాలను తప్పుగా చూపించి లేని లాభాలను లెక్కల్లో చెప్పినట్లు స్వయంగా కంపెనీ వ్యవస్థాపకుడు, నాటి ఛైర్మన్ బైర్రాజు రామలింగరాజు ప్రకటించారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, ఇతరులను సీఐడీ విభాగం అధికారులు రెండు రోజుల తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులు బెయిల్‌పై బయటే ఉన్నారు. ఆరేళ్ల పాటు విచారణ సాగింది. -
'సత్యం' కేసు తుది తీర్పు మార్చి 9కి వాయిదా
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పిం చిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది.కాగా సెబీ కేసులో ఆర్థిక నేరాల కోర్టుకు నిందితులు హాజరయ్యారు. అలాగే ఇదే కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిలిపివేసింది. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటాదారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ...ఈ వ్యవహారం లో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది.