
సాక్షి, ఆదిలాబాద్: తీవ్ర సంచలనం సృష్టించిన సమత ఆత్యాచారం, హత్య కేసులో తుదితీర్పు ఈ నెల 30వ తేదీకి వాయిదా పడింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో జరిగిన సమత అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నేడు తుదితీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉండటంతో వాయిదా వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. మరోవైపు హాజీపూర్ హత్య కేసులోని విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేశారు.