హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా పడింది. తుండా కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్ జైల్లో ఉన్న కరీమ్ తుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే విచారణ అనంతరం తుండా కేసులో తుది తీర్పును కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. కాగా, దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా నిందితుడిగా ఉన్నాడు. ఆయా దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడు.
ఢిల్లీ పోలీసులు రెండేళ్ల క్రితం నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు. ఇతన్ని ఏడేళ్ల కిందట నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండా కీలక పాత్ర వహించాడు. ఇతను 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. సిట్ పిటీ వారెంట్‌పై హైదరాబాకు తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన పలు పేలుళ్ల కేసులలో తుండా హస్తం ఉంది. తుండాపై ఆంసాట్, నకిలీ పాస్ పోర్టుల కేసులున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ యువకుల్ని ఉగ్రవాదంపై ఆకర్షితుల్ని చేసి శిక్షణ కూడా ఇచ్చాడు కరీమ్ తుండా. 1998లో గణేష్ ఉత్సవాల్లో బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడన్న అభివయోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment