Nampally criminal court
-
నాగ్ పిటిషన్.. కొండా సురేఖకు బిగ్ షాక్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంతత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. దీని ఆధారంగా.. మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేస్తూ తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాగార్జున దావా వేసిన విషయం తెలిసిందే.చేసిన ఆరోపణలకుగానూ కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునపై కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు. ఆ తర్వాత ‘ఎక్స్’లో క్షమాపణ కోరుతూ పోస్ట్ పెట్టారన్నారు.ఎక్స్‌లో మంత్రి కొండా సురేఖ పెట్టిన పోస్టును ఆయన కోర్టు ముందు చదివి వినిపించారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అశోక్‌రెడ్డి అన్నారు. కచ్చితంగా కొండా సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హురాలు అని పేర్కొన్నారు. అంతకు ముందు.. కొండా సురేఖ తరఫు న్యాయవాది గురుప్రీత్ సింగ్.. ఆమె క్షమాపణలు చెప్పినట్లుగా కౌంటర్ దాఖలు చేశారు.అయితే ఈ వ్యాఖ్యల వల్ల నాగార్జున కుటుంబం మానసికంగా ఎంతో కుంగిపోయిందని న్యాయవాది అశోక్ రెడ్డి వాదించారు. అంతకు ముందు.. నాగార్జున, ఆయన కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ.. డిసెంబర్ 12న సురేఖను కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: కొండా సురేఖకు ఇదొక గుణపాఠం కావాలి! -
ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఐపీఎస్ ప్రభాకర్‌రావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అమెరికాలో ఉన్న ఆయన్ని భారత్‌కు రప్పించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు సీబీఐ లేఖ రాసింది.తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్న సంగతి తెలిసిందే. ఎస్ఐబీ మాజీ చీఫ్ అయిన ప్రభాకర్‌రావు.. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన టైంలోనే విదేశాలకు వెళ్లిపోయారు. విచారణ నిమిత్తం రావాలన్నా.. సహకరించడం లేద దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. తాను వైద్యం కోసం అమెరికా వచ్చానని, విచారణ నుంచి తనకు ఊరట కావాలని ఆయన విజ్ఞప్తి చేసినప్పటికీ.. నాంపల్లి కోర్టు అందుకు అనుమతించలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సిట్, తెలంగాణ సీఐడీ సాయంతో సీబీఐని ఆశ్రయించింది. దీంతో.. జాతీయ దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతించింది. ప్రభాకర్‌రావుతో పాటు ఐన్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ కుమార్‌పైనా రెడ్ కార్నర్ నోటీసులకు అనుమతి జారీ చేసింది. త్వరలో ఇంటర్‌పోల్ వీళ్లిద్దరినీ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. అదే జరిగితే.. వాళ్లను భారత్‌కు రప్పించడం సులువు అవుతుంది. -
Nampally Criminal Court: నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2018కి సంబంధించిన ఓ కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అయితే, తొలిసారిగి హైదరాబాద్‌లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. వివరాల ప్రకారం.. అదనపు కట్నం కేసులో భార్యను చంపిన భర్తకు నాంపల్లి కోర్టు ఉరిశిక్ష విధించింది. భవానీ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇంజమ్ హక్ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో 2018లో ఇంజమ్ హక్ తన భార్యను హత్య చేశాడు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా నేడు నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ఇదిలా ఉండగా.. తొలిసారి హైదరాబాద్‌లో ఒక నిందితుడికి ఉరిశిక్ష విధించడం ఇదే మొదటిసారి. -
వివేకా కేసులో ఫైనల్ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన CBI
సాక్షి, హైదరాబాద్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు విధించిన విచారణ గడువు ఇవ్వాళ్టితో ముగియనుండడంతో CBI ఇవ్వాళ(శుక్రవారం) నాంపల్లి కోర్టులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులు, అనుమానితులను పలు మార్లు విచారించింది సీబీఐ. విచారణకు వచ్చిన వారందరి స్టేట్మెంట్లు రికార్డు చేసింది. ఇప్పటివరకు దాఖలైన ఛార్జ్ షీట్ల సంఖ్య చూస్తే ఇవ్వాళ్టిది మూడోది. 2021 తొలి ఛార్జ్ షీట్ 2022 జనవరిలో సప్లమెంటరీ ఛార్జ్ షీట్ 2023 జూన్ 30 ఫైనల్ చార్జిషీట్ దాఖలు ఈ కేసుకు సంబంధించి నిందితుల రిమాండ్ ముగియటంతో కోర్టులో హాజరు పర్చారు సీబీఐ అధికారులు. అయితే వీరికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ పొడిగించిన సీబీఐ కోర్టు.. కేసు విచారణను జులై 14 కు వాయిదా వేసింది. ఇక ఇదే కేసుకు సంబంధించి సునీత వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 3 న విచారించనుంది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత పిటిషన్ వేయగా.. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారించింది. ఈ కేసును జులై 3న తదుపరి విచారణ కోసం చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు లిస్ట్ చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సిబిఐతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ రోజుతో సిబిఐకి ఇచ్చిన విచారణ గడువు ముగియడంతో సునీత పిటిషన్‌కు ఎంత వరకు వాలిడిటీ ఉంటుందన్నది జులై 3న తేలనుంది. ఇదీ చదవండి: ఎందుకీ ఈగో క్లాషెస్?.. సునీతకు సుప్రీంకోర్టు ప్రశ్న -
హైదరాబాద్ జిల్లాలో 1,02,611 కేసులు పరిష్కారం
నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ప్రేమవతి, డీసీపీ జోయెల్ డేవిస్‌తో కలిసి ప్రారంభించారు. ఇందులో రాజీ చేసుకోదలచిన క్రిమినల్ కేసులు, మోటారు ప్రమాద కేసులు, గృహహింస, చెక్‌బౌన్స్, ప్రి లిటిగేషన్ కేసులు మొత్తం 1,02,611 పరిష్కారం అయ్యాయి. పార్టీలు, న్యాయవాదులు కలిసి పెండింగ్‌లో ఉన్న కేసులను లోక్‌అదాలత్‌లో సామరస్యంగా పరిష్కరించుకున్నారు. అనంతరం ప్రేమవతి మాట్లాడుతూ...క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ఈ లోక్ అదాలత్ సరైన వేదిక అన్నారు. ఒకసారి లోక్ అదాలత్‌లో కేసు రాజీ అయితే మళ్లీ అప్పీలుకు వెళ్లే అవకాశం ఉండదని చెప్పారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగే బదులు ఒకేసారి లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందని, ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని కోరారు. న్యాయవాదులు ఈ లోక్‌అదాలత్‌లలో ముఖ్య పాత్ర వహిస్తారని, పార్టీలకు సన్నిహితంగా ఉన్న కారణంగా లోక్ అదాలత్‌ల గురించి పార్టీలకు వివరించి అధిక సంఖ్యలో కేసులు రాజీ అయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మెట్రోపాలిటన్ సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్, రెండవ అదనపు ట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి భూపతి, ఆరవ అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి జాన్సన్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు జోయెల్ డేవిస్, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్‌లో కేసులు రాజీ కుదిరిన కొంత మందికి అవార్డు కాపీలను అందజేశారు. 1,02,611 కేసులు పరిష్కారం ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 32 బెంచీలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,02,611 కేసులు పరిష్కారం అయ్యాయి. క్రిమినల్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ కోర్టు ప్రాంగణం, మనోరంజన్ కోర్టు ప్రాంగణం, సికింద్రాబాద్ రైల్వే కోర్టు ప్రాంగణం, పురానీ హవేలీ కోర్టు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో కుటుంబ తగాదా కేసులు–277, చెక్»ౌన్స్ కేసులు–1,615, ఎస్టీసీ కేసులు–98,050, సీసీ ఐపీసీ కేసులు– 2,669 పరిష్కారమయ్యాయి. అలాగే ఈ లోక్ అదాలత్‌లో రూ.3,61,97000 పరిహారం కింద చెల్లించినట్లు కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో... రంగారెడ్డి కోర్టులు: రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హరేకృష్ణ భూపతి పాల్గొన్నారు. అదాలత్‌లో కేసు రాజీపడితే ఇరు వర్గాలు గెలిచినట్లే అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాలుగా ఆస్తి తగాదాలతో సతమతమవుతున్న అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చి..ఇకపై కలిసి మెలిసి జీవించాలని వారికి సూచించారు. ఇక జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,04,769 కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి డా.పట్టాబి రామారావు, రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రవీందర్, ఎసీపీ శ్రీధర్ రెడ్డి, ప్రాసిక్యూషన్ డైరెక్టర్ కస్తూరి బాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే కేసును, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. బెయిల్ మంజూరు కాకపోవడంతో ముగ్గురు నిందితులు యథావిధిగా చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండనున్నారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలపై రామచంద్రభారతి, నందు, సింహయాజి అనే ముగ్గురు వ్యక్తులను సాక్ష్యాధారాలతో సహా మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) విచారిస్తోంది. ఎరకు ఎక్కడ? ఎప్పుడు బీజం పడిందో తేల్చే పనిలో పడ్డారు. రామచంద్రభారతి, నందు, సింహయాజీలకు ఒకరితో మరొకరికి పరిచయం ఎలా ఏర్పడింది? వీరిని ఎవరెవరు కలిశారు? అనే వివరాలను రాబట్టడంలో నిమగ్నమయ్యారు. చదవండి: 'ఆ నలుగురు' ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్.. 4 ఠాణాల్లో ఫిర్యాదులు.. పీటీ వారెంట్ మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై పోలీసులు పీటీ వారెంట్ కోరారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇప్పటికే నందకుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్‌లో రెండు కేసులు నమోదవ్వగా.. కేసు దర్యాప్తులో భాగంగా విచారించేందుకు నందకుమార్ అరెస్ట్‌కు అనుమతించాలని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల ఎర కేసులో ఏ2 గా ఉన్న నందకుమార్.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పీటీ వారెంట్‌కు నాంపల్లి కోర్టు అనుమతిస్తే.. పోలీసులు నందును విచారించనున్నారు. -
నాంపల్లి కోర్టులో అక్బరుద్దీన్‌కు ఊరట
-
వివాదాస్పద వ్యాఖ్యల కేసు: అక్బరుద్దీన్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్, నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైంది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బుధవారం ఈ మేరకు తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు.. కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ సంస్థకు నాంపల్లి కోర్టు మంగళవారం గట్టిషాక్ ఇచ్చింది. గతంలో కన్నబాబు,అంబటి రాంబాబులపై హెరిటేజ్ సంస్థ పరువునష్టం కింద నాంపల్లి కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో నాంపల్లి కోర్టు కేసును కొట్టివేసింది.హెరిటేజ్ కేసులో సంస్థ అధికారులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. ఈ మేరకు కన్నబాబు, అంబటి రాంబాబులపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది. -
పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి
సాక్షి,హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథిని పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని విచారించనున్నారు. ప్రస్తుతం పార్థసారథి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో వున్నారు. కాగా రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్ పోలీసులు ఆగస్టు 19న అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. చదవండి:Telangana Schools Reopen: ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే -
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మంత్రి తలసానికి ఊరట
సాక్షి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు మరికొందరిపై పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నమోదైన కేసును నాంపల్లి కోర్టు సోమవారం కొట్టేసింది. ఈ కేసులో మంత్రి తలసానితో పాటు ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, రాజేశ్వరరావు, టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్, అప్పటి మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప నిందితులుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ గతేడాది ఎన్నికల్లో ప్రచారం చేశారనే ఆరోపణలపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ కోసం నాంపల్లి కోర్టు ఆధీనంలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. అభియోగపత్రాలతో పాటు కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కొట్టివేసింది చదవండి: ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం -
రాజా సింగ్‌కు షాక్.. ఏడాది జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షాక్ తగిలింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐదు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్లో రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆడియో కలకలం) ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్ తెలిపారు. -
నలమాస కృష్ణకు 14 రోజుల రిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను అరెస్టు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచింది. విచారణ అనంతరం 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్‌పై నలమాస కృష్ణను చర్లపల్లి జైలుకు ఎన్ఐఏ తరలించింది. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్) మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసింది. గత ఆదివారం ఖమ్మంలో కృష్ణను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కృష్ణ 8 నెలల పాటు జైలు జీవితం గడిపి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు. అనారోగ్యం కారణంగా ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం ఖమ్మం కోర్టులో ప్రవేశ పెట్టి పిటి వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు. (సరిహద్దు వివాదం: ముగిసిన చర్చలు ) -
తుండాను నిర్దోషిగా ప్రకటించిన నాంపల్లి కోర్టు
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను నిర్దోషిగా ప్రకటిస్తూ నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది.1998లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తుండాపై కేసు నమోదైన విషయం తెలిసిందే. వరుస బాంబు పేలుళ్లలో తుండా పాత్ర ఉందన్న పోలీసులు అందుకు తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించకపోవడంతో తుండాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. డిఫెన్స్ వాదనతో ఏకీభవించిన కోర్టు.. గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్న తుండా కేసులో కీలక తీర్పు వెలవరించింది. నిజానికి ఈ కేసులో తీర్పును గత నెల 18న వెల్లడించాల్సి ఉంది. కానీ, ఈ కేసును విచారణ జరుపుతున్న న్యాయమూర్తి సెలవులో ఉండడంతో నాంపల్లి కోర్టు మంగళవారం తుది తీర్పును వెలువరించింది. -
ఉగ్రవాది కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా
హైదరాబాద్: ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండా కేసులో తుది తీర్పు వాయిదా పడింది. తుండా కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్ జైల్లో ఉన్న కరీమ్ తుండాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అయితే విచారణ అనంతరం తుండా కేసులో తుది తీర్పును కోర్టు ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. కాగా, దేశ వ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో తుండా నిందితుడిగా ఉన్నాడు. ఆయా దాడుల తర్వాత కొన్ని రోజుల పాటు పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఢిల్లీ పోలీసులు రెండేళ్ల క్రితం నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు. ఇతన్ని ఏడేళ్ల కిందట నేపాల్ సరిహద్దుల్లో కరీంను పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థలో తుండా కీలక పాత్ర వహించాడు. ఇతను 1990లో యువకులను ఉగ్రవాదంపై మళ్లించాడు. సిట్ పిటీ వారెంట్‌పై హైదరాబాకు తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన పలు పేలుళ్ల కేసులలో తుండా హస్తం ఉంది. తుండాపై ఆంసాట్, నకిలీ పాస్ పోర్టుల కేసులున్నాయి. పాకిస్తాన్ బంగ్లాదేశ యువకుల్ని ఉగ్రవాదంపై ఆకర్షితుల్ని చేసి శిక్షణ కూడా ఇచ్చాడు కరీమ్ తుండా. 1998లో గణేష్ ఉత్సవాల్లో బాంబ్ బ్లాస్ట్‌కు ప్లాన్ చేశాడన్న అభివయోగాలు కూడా ఇతనిపై ఉన్నాయి. -
ఇక్కడ ఇక్రమ్.. అక్కడ ప్రశాంత్
పాకిస్తాన్లో పొరపాటున అడుగుపెట్టి బందీగా మారిన విశాఖ యువకుడు ప్రశాంత్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళ కోసం అక్రమ మార్గంలో పాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఏడాదిగా ఖైదీగా ఉన్న ఇక్రమ్ కేసు తెరపైకి వచ్చింది. ఇతను ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉండగా, నాంపల్లి కోర్టులో కేసు విచారణ ముగియగానే పాక్‌కు డిపోర్టేషన్ (బలవంతంగా తిప్పి పంపడం) చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ దుబాయ్‌లో ప్రేమ.. పెళ్లి పాతబస్తీకి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లి అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ పరిచయమయ్యాడు. తాను భారతీయుడినని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి, ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన ఆమె హైదరాబాద్ వచ్చేశారు. ఆమెను వెతుక్కుంటూ హైదరాబాద్‌కు.. 2011లో ఇక్రమ్ సదరు మహిళను వెతుక్కుంటూ, దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చాడు. ఆపై రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి, అట్నుంచి హైదరాబాద్ చేరాడు. ఆరు నెలల తరువాత ఇక్రమ్ అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలిసి ఆమె అతడిని దూరం పెట్టారు. కక్షగట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించి, వాటిని కొందరికి ఆన్లైన్లో విక్రయించానని బెదిరించాడు. డబ్బివ్వకపోతే ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, అధికారులు గతేడాది జూన్‌లో ఇక్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలా బయటపడింది.. ఇక్రమ్ అరెస్టయినపుడు.. మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్టున్న సర్టిఫికెట్లు, అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్, ఇతర గుర్తింపుకార్డులు, పాక్ పాస్‌పోర్ట్‌కు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతి స్వాధీనమయ్యాయి. సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాక్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. దీంతో ఇతడి వద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్ధారించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రి త్వ శాఖ (ఎంఈఏ) ద్వారా పాక్ ఎంఈఏకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ ఇచ్చిన జవాబు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. దీంతో ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలయ్యా యి. ఈ కేసు విచారణ ముగిసి, అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందేనని ఎంఈఏ నుంచి అందిన ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కోర్టులో కేసు పెండింగ్ లేకుండా డిస్పోజైన వెంటనే అతడిని ఢిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగిస్తామని సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్నారు. -
‘బిగ్‌బాస్’కు ఊరట
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్-3 నిర్వాహకులకు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్ కోఆర్డినేటర్ టీమ్ సభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బిగ్‌బాస్ కోఆర్డినేటర్స్ మహిళలను వేధిస్తున్నారంటూ.. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా కార్యక్రమ నిర్వాహకులు అభిషేక్, రవికాంత్, రఘులపై బంజారాహిల్స్ , రాయదుర్గం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ అగ్రిమెంట్ వ్యవహారంతో పాటు క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ టీమ్ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి వాదనలు విన్నధర్మాసనం బిగ్‌బాస్ టీం సభ్యులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. -
కోర్టుకు అక్బరుద్దీన్.. పోలీసుల హైఅలర్ట్!
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చంద్రయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. బార్కస్ ప్రాంతంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అక్బర్ ప్రత్యర్థి వర్గం కూడా కోర్టు విచారణకు హాజరవ్వడంతో ఇక్కడ ఒకింత ఉద్రిక్తత నెలకొంది. అక్బర్ వర్గం, ఆయన ప్రత్యర్థి మహమ్మద్ పహెల్వాన్ వర్గం ఎదురుపడితే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. -
కోర్టులో మహిళా డ్రైవర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత నినాదాన్ని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.రజని ఆచరణలో చేసి చూపించారు. నాంపల్లి క్రిమినల్‌కోర్టులో మొదటిసారిగా ఇద్దరు మహిళా డ్రైవర్లను నియమించారు. ఆమె నేతృత్వంలో బుధవారం ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. డ్రైవర్లుగా పురుషులు మాత్రమే చేయగలరన్న అపోహను పక్కనపెట్టి ఇద్దరు మహిళలను డ్రైవర్లుగా న్యాయవ్యవస్థ విధుల కోసం ఎంపిక చేశారు. -
విభజన కోసం 3న ‘చలో హైకోర్టు’
తెలంగాణ లాయర్ల జేఏసీ పిలుపు 2 నుంచి 4 వరకు అన్ని కోర్టుల్లో విధుల బహిష్కరణకు విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయడంతోపాటు బార్ కౌన్సిల్‌ను విభజించాలంటూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఈనెల 3న (మంగళవారం) చలో హైకోర్టు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సోమవారం (2వ తేదీ) నుంచి 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో విధులను బహిష్కరించాలని కోరింది. 3న న్యాయవాదులంతా ఉదయం 10.30 గంటల నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చాంబర్ ముందు బైఠాయించి శాంతియుతంగా ధర్నా చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేసే వరకూ కోర్టుల్లో ఎటువంటి నియామకాలు చేపట్టరాదని ముక్తకంఠంతో నినదించింది. తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం.రాజేందర్‌రెడ్డి, నాంపల్లి క్రిమినల్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.కొండారెడ్డి నేతృత్వంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో శనివారం అన్ని జిల్లాలకు చెందిన న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు (బార్ అసోసియేషన్), బార్ కౌన్సిల్ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా....ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హైకోర్టు, బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. అలాగే ప్రత్యేక హైకోర్టు, కౌన్సిల్, పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని వివరించారు. అలాగే ఏడేళ్లలోపు శిక్షలు విధించదగ్గ నేరాలు చేసిన వ్యక్తులకు పోలీస్స్టేషన్లలోనే బెయిల్ ఇచ్చేలా నేర విచారణ చట్టం (సీఆర్పీసీ)లోని సెక్షన్ 41(ఎ)కు చేసిన సవరణ వల్ల పోలీసుల్లో అవినీతి పెరిగిపోయిందని ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సవరణను అడ్డంపెట్టుకొని పోలీసులు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందువల్ల బెయిల్ మంజూరు చేసే అధికారం కోర్టులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజా సవరణలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ పోలీసులు బెయిల్లు మంజూరు చేయకుండా చర్యలు చేపట్టాలని డీజీపీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్.రామచందర్‌రావు, సహోదర్‌రెడ్డి, అనంతసేన్‌రెడ్డి, సునీల్‌గౌడ్, లక్ష్మణ్‌కుమార్, జావెద్, జేఏసీ నేతలు గండ్ర మోహన్‌రావు, శ్రీరంగారావు, గోవర్దన్‌రెడ్డి, అనిల్, వై.రాములు, అనంతరఘు, నారాయణరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగత్పాల్రెడ్డి (సిటీ సివిల్ కోర్టు), విజయ్‌కుమార్ (నాంపల్లి కోర్టు), రాజిరెడ్డి (రంగారెడ్డి), గుడిమల్ల రవికుమార్ (వరంగల్), బిపిన్ పాటిల్ (ఆదిలాబాద్), ఆనంద్ (నల్లగొండ), ప్రతాప్‌రెడ్డి (మెదక్), విష్ణువర్ధన్‌రెడ్డి (సంగారెడ్డి), ఉపేందర్‌రెడ్డి (ఖమ్మం), మధుసూదన్‌రెడ్డి (కరీంనగర్) తదితరులు పాల్గొన్నారు. హైకోర్టును విభజించాలి జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి న్యాయశాఖ ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, హైకోర్టును విభజించనందున సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బి.లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రత్యేక హైకోర్టు కోసం న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సీజేఐతో మళ్లీ మాట్లాడతా: సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టును వీలైనంత త్వరగా విభజించి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేసే విషయంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (సీజేఐ)ను కోరానని, ఈ ప్రక్రియ వేగవంతానికి మరోమారు మాట్లాడతానని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం సచివాలయంలో తనను కలిసిన తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులకు సీఎం ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, 3న ఇందిరాపార్కులో సభ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని వారీ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. -
ఆ ఇద్దరు నన్ను మోసం చేశారు: పూరి జగన్నాథ్
హైదరాబాద్: తనను బిల్డర్ సుబ్బరాజు, రామరాజులు మోసగించారని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన కుటుంబానికి చెందిన ఖాళీ స్థలాన్ని రామరాజు, సుబ్బరాజులకు ఐదేళ్ల కిత్రమే విక్రయించానని చెప్పారు. ఆ సమయంలోనే మాసాబ్‌ట్యాంక్ ఎస్బీఐ బ్రాంచ్‌లో తనకు రూ.5 కోట్ల రుణం ఉందని ఆ ఇద్దరికి చెప్పానని పూరి స్పష్టం చేశారు. అయితే ఆ రుణాన్ని తమ పేర్లపైకి బదిలీ చేసుకుంటామని సుబ్బరాజు, రామరాజులు తనకు హామీ ఇచ్చారని చెప్పారు. అందుకు ఆ బ్రాంచ్ మేనేజర్ కూడా అంగీకరించాడని తెలిపారు. ఇందకు సంబంధించిన సాక్ష్యాధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం నేనే ఇంటిపై రుణం తీసుకునేందుకు సదరు బ్యాంక్‌కు వెళ్లగా ఎస్బీఐలో రుణం పెండింగ్‌లో ఉందని బ్యాంకు అధికారులు తనకు గుర్తు చేశారు. ఆ క్రమంలో వెంటనే తాను (2011లో) బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి... సుబ్బరాజు, రామరాజులపై ఫిర్యాదు చేసినట్లు పూరి వివరించారు. ఆ విషయం తెలుసుకున్న ఆ ఇద్దరు విదేశాలకు పారిపోయారన్నారు. తాన నుంచి కొనుగోలు చేసిన ఆ స్థలాన్ని వారిద్దరు ఇతరులకు విక్రయించారని చెప్పారు. అసలు విషయం వారికి తెలియక ఫ్లాట్ యజమానులు తనపై ఫిర్యాదు చేశారని పూరి విశదీకరించారు. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్‌పై సీసీఎస్ పోలీసులు గురువారం చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో పూరి జగన్నాథ్ కుటుంబానికి వెయ్యి గజాల స్థలం ఉంది. ఆ స్థలంపై ఓ జాతీయ బ్యాంకులో సుమారు రూ. 5 కోట్ల రుణం తీసుకున్నారు. సగం వాయిదాలు సక్రమంగా చెల్లించారు. ఇదిలావుండగా, ఈ స్థలాన్ని బిల్డర్ సుబ్బరాజుకు డెవలప్మెంట్కు ఇవ్వగా సదరు బిల్డర్ ఫ్లాట్స్ కట్టి నలుగురికి విక్రయించాడు. బ్యాంకు రుణం తీరకపోవడంతో అధికారులు రుణం చెల్లించాలంటూ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. బ్యాంకులో రుణం ఉండగా ఫ్లాట్స్ ఎలా కొనుగోలు చేస్తారని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో ఫ్లాట్ యజమానులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించిరు. బిల్డర్ సుబ్బరాజుతోపాటు పూరి జగన్నాథ్‌లు తమను మోసం చేసి ఫ్లాట్లు విక్రయించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నాంపల్లి కోర్టు నుంచి పూరి బెయిల్ తీసుకున్నారు. సదరు ఖాళీ స్థలం పూరి జగన్నాథ్ భార్య లావణ్య పేరుతో ఉందని, బిల్డర్‌కు అగ్రిమెంట్ చేసే సమయంలో బ్యాంకు రుణం గురించి ప్రస్తావించారా లేదా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని సీసీఎస్ డీసీపీ పాల్ రాజు తెలిపారు. కాగా బిల్డర్ సుబ్బరాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని డీసీపీ చెప్పారు. దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. -
అబూసలేం పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: మాఫీయా డాన్ అబూసలేం పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నకిలీ పాస్‌పోర్టు కేసులో ఏడేళ్ల జైలుశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. 2001లో ఈ నేరానికి పాల్పడినందుకు అబూ సలేంతోపాటు బాలీవుడ్ నటి మోనికా బేడీని సెప్టెంబర్ 2002లో పోర్చుగల్‌లోని లిస్బన్లోని ఓ షాపింగ్ మాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు నిందితులను నవంబర్ 11, 2005లో భారత్‌కు తీసుకు వచ్చారు. 2007లో మౌనికా బేడీని భోపాల్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించడంతో మోనికా బేడి జైలు నుంచి విడుదల అయ్యింది. హైదరాబాద్ సీబీఐ నాంపల్లి కోర్టు అబూ సలేంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే అబూసలెం రైలులో వివాహం చేసుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. -
మాఫియాడాన్‌కు ఏడేళ్ల శిక్ష
-
మాఫియా డాన్ అబూ సలేంకు ఏడేళ్ల జైలుశిక్ష
నకిలీ పాస్ పోర్టుల కేసులో మాఫియా డాన్ అబూ సలేంకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. పన్నెండేళ్ల తర్వాత అబూ సలేం కేసులో కోర్టు తుది తీర్పును వెల్లడించింది. అబూసలేంపై 120 (బి), 490, 471 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారమే నకిలీ పాస్ పోర్ట్ కేసులో అబూ సలేంను దోషిగా నిర్ఱారించారు. ఇప్పటికే అబూ సలేం 6 సంవత్సరాల 10 రోజులు జైలుశిక్ష అనుభవించారు. ఇదే కేసులో సినీ నటి మోనికా బేడి మూడేళ్ల జైలుశిక్ష అనుభవించింది.