కోర్టుకు అక్బరుద్దీన్.. పోలీసుల హైఅలర్ట్!
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చంద్రయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. బార్కస్ ప్రాంతంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
అక్బర్ ప్రత్యర్థి వర్గం కూడా కోర్టు విచారణకు హాజరవ్వడంతో ఇక్కడ ఒకింత ఉద్రిక్తత నెలకొంది. అక్బర్ వర్గం, ఆయన ప్రత్యర్థి మహమ్మద్ పహెల్వాన్ వర్గం ఎదురుపడితే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.