Akbaruddin
-
డిప్యూటీ సీఎం చేస్తా..! అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నించారు.అక్భరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్ అన్నారు. అది ఓల్డ్‌సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్అండ్ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు.‘‘కాంగ్రెస్ బీ ఫామ్‌పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్‌లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. -
వక్ఫ్ ఆక్రమణలపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో వక్ఫ్‌బోర్డు ఆస్తులు కబ్జాదారుల పాలవుతు న్నాయని, వీటిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 78 వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఆస్తులున్నాయని, వీటిలో 50 శాతానికిపైగా ఆక్రమణలకు గురైనట్లు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం జీరో అవర్‌లో అక్బరుద్దీన్ మాట్లాడారు. పల్లెల పేర్ల మార్పుపై రగడ ! పల్లెసీమలకు వందల ఏళ్లుగా ఉన్న పేర్లను యథాతథంగా కొనసాగించాలని, మార్చాల్సిన అవసరం లేదని ఎంఐఎంఎల్పీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. గ్రామాల పేర్ల మార్పు ప్రక్రియ ను సులభతరం చేస్తే హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి వంటి పేర్లు సైతం మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన తెలంగాణ పంచాయతీరాజ్ సవరణబిల్లు –2021ను ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ప్రశాంత తెలంగాణలో ఈ ప్రతిపాదనలతో సమస్యలు వస్తాయని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క అన్నారు. -
అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అబ్బురపరిచే ప్రగతిని సాధిస్తూ అన్ని రంగాల్లో అసాధారణ పురోగతి సాధిస్తోందని అసెంబ్లీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. అసెంబ్లీలో సోమవారం ఐటీ, పరిశ్రమల రంగంలో ప్రగతిపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్బంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిపారుదల వ్యవస్థను పటిష్టం చేయడం, మిషన్ కాకతీయతో చెరువుల్ని పునరుద్ధరించటం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతుండటం తో రైతులు సుఖంగా ఉన్నారని అక్బరుద్దీన్ చెప్పా రు. దేశమంతా ముక్కున వేలేసుకునే విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ ఒకవైపు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే, పారిశ్రామిక రంగా నికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పరిశ్ర మలు, ఐటీ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారినందుకు హైదరాబాదీగా గర్వపడుతున్నానన్నారు. ఈ అభివృద్ధిలో హైదరాబాద్ పాతబస్తీని కూడా భాగస్వామ్యం చేయాలని కోరారు. కేటీఆర్ కృషి అసామాన్యం ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు తమ ద్వితీయ క్షేత్రం గా హైదరాబాద్‌ను ఎంచుకోవటం వెనుక మంత్రి కేటీఆర్ కృషి అసామాన్యమైందని అక్బరుద్దీన్ ప్రశంసించారు. గతంలో ఐటీ అంటే బెంగళూరుగా స్థిరపడిపోయిన స్థితిని తిరగరాసి రాష్ట్రం నంబర్ వన్‌గా నిలబడిందని చెప్పారు. ఐటీ టవర్ నిర్మించండి శంషాబాద్ విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న 50 ఎకరాల వక్ఫ్‌బోర్డు స్థలం కబ్జాదారుల ఆగడాలకు పరాధీనం కాబోతోందని అక్బరుద్దీన్ తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మైనారిటీ యువత కోసం అందులో ఐటీ టవర్ నిర్మించాలని కోరారు. కాగా, ఎస్సీ, ఎస్టీలకు టి ప్రైడ్ కింద ఇన్సెంటివ్స్ ఇస్తున్నట్టే మైనార్టీ ఎంటర్ప్రెన్యూర్లకు సహకరించాలని అక్బరుద్దీన్ కోరారు. హైదరాబాద్‌లో ఫ్రీ వైఫై అన్నారని, కరోనా టైంలో పేద విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినేం దుకు నాలుగైదు గంటలు ఫ్రీ వైఫై ఇవ్వాలన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో ఇక్కడి యువతకే 50 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేయా లని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పాతబస్దీలో కూడా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు. భారీ పెట్టుబడులు వస్తున్నాయ్: వివేకానంద రాష్ట్రంలోని సుస్థిర ప్రభుత్వం, శాంతియుత వాతావరణం వల్ల భారీ పెట్టుబడులు వస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద చెప్పారు. పరిశ్రమలు, అంతకుముందు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై చర్చ కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని, రాజాసింగ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. గృహనిర్మాణ సంస్థ, ఉద్యాన వర్సిటీ, పంచాయతీరాజ్, నల్సార్ చట్ట సవరణల బిల్లులను మం త్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. -
మజ్లిస్ శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేతగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ దారుస్సలాంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఎన్నుకున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభాపక్షనేతగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి. పార్టీ అధినేత అసదుద్దీన్‌కు సోదరుడైన అక్బరుద్దీన్ 1999లో రాజకీయ అరంగేట్రం చేసిన మొద టి పర్యాయమే చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్క డ గతంలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతి నిథ్యం వహించిన రాజకీయ ప్రత్యర్థి, మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధినేత మహ్మద్ అమానుల్లాఖాన్‌ను ఓడించి అక్బరుద్దీన్ మొదటిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అక్బరుద్దీన్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 5 సార్లు చాంద్రాయణగుట్ట నుంచి ఎన్నికయ్యారు. ప్రతిసారి ప్రత్యర్థులను చిత్తుచేసి భారీ మెజార్టీ సాధిస్తూ వస్తున్నారు. సమావేశంలో పార్టీ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూప్రక్షాళన’ తర్వాత లెక్కలు తేలుతాయి
సాక్షి, హైదరాబాద్: భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తయి, నివేదికలు వచ్చాక రాష్ట్రంలోని వక్ఫ్, దేవాదాయ భూములపై స్పష్టత వస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. కబ్జాలతో వక్ఫ్, దేవాదాయ భూములకు అన్యాయం జరిగిందన్నారు. చాలావరకు వక్ఫ్ భూములు పార్ట్–బి (వివాదంలో ఉన్న భూముల కేటగిరీ)లో ఉన్నాయని.. వాటికి రెవెన్యూ అధికారులు సైతం పరిష్కారం చూపలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన అంశంపై మంగళవారం శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ బదులిచ్చారు. వక్ఫ్ భూముల కబ్జాపై బుధవారం శాసనసభలో చర్చిద్దామని, ఈ సమస్యకు మంచి ముగింపు ఇద్దామని చెప్పారు. పాఠశాలలు, సబ్స్టేషన్లు, బస్టాండులు, స్మశానాల కోసం కొంత మంది విరాళంగా ఇచ్చిన భూముల యాజమాన్య హక్కులు ఇంకా వారి పేర్ల మీదే ఉన్నాయని... చెరువుల శిఖం, నీటి పారుదల కాల్వల భూములు అన్యాక్రాంతం అయ్యాయని పేర్కొన్నారు. అలాంటివన్నీ భూరికార్డుల ప్రక్షాళనలో బయటపడతాయని స్పష్టం చేశారు. పరిరక్షణకు చర్యలు చేపడతాం.. రాష్ట్రంలో 56 వేల ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురయ్యాయని.. వాటిని పంపిణీ చేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని కేసీఆర్ చెప్పారు. న్యాయస్థానాలు అడ్డుకోవడంతో ఆ పంపకాలు నిలిచిపోయాయన్నారు. దేవాలయాల భూముల హక్కులను ఎవరూ హరించలేరని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక భద్రాచలం రామాలయానికి చెందిన 930 ఎకరాల భూములు ఏపీలోని మూడు గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయని.. ఆ గ్రామాలను తెలంగాణలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య లేవనెత్తిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆ గ్రామాల విలీనానికి సూత్రప్రాయంగా అంగీకరించారని, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఢిల్లీకి వెళ్లి ఈ అంశంపై కేంద్రంతో మాట్లాడుతారని వెల్లడించారు. ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం జీవో 58 కింద 125 చదరపు అడుగులలోపు ప్రభుత్వ స్థలాలను 100 శాతం ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని.. ఆ స్థలంలో ఎన్ని అంతస్తుల భవనాలను నిర్మించినా ఎలాంటి రుసుము వసూలు చేయమని కేసీఆర్ ప్రకటించారు. జీవో 58 కింద 125 చదరపు అడుగుల్లోపు స్థలాల్లో ఒక అంతస్తు భవనం ఉన్నా 10 శాతం భూమి విలువ చెల్లించాలంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ప్రస్తావన మేరకు సీఎం ఈ వివరణ ఇచ్చారు. జీవో 59 కింద స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా ప్రభుత్వానికి రూ.530 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.330 కోట్లు వచ్చాయన్నారు. ఇక ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటు చేసిన సభాసంఘం మూడేళ్లు గడిచినా నివేదిక ఇవ్వలేదని.. త్వరగా నివేదిక తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ సూచించగా.. ఆ అంశం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. గిరిజనేతరులకు హక్కులు ఏజెన్సీ ప్రాంత భూములపై గిరిజనులకే హక్కు ఉండేలా కేంద్ర చట్టం 1/70 అమల్లో ఉండడంతో.. ఆ ప్రాంతంలోని భూములను యాభై అరవై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు హక్కులు కల్పించడం సాధ్యం కావట్లేదని కేసీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజకీయపక్షాలు ఏకాభిప్రాయానికి వస్తే.. ఆ భూములను భూసేకరణ చట్టం కింద గిరిజనుల నుంచి సేకరించి గిరిజనేతర రైతులకు పంపిణీ చేస్తామన్నారు. దేవాదాయ భూములపై సర్వే జరపాలి రాష్ట్రంలోని 20 వేలకుపైగా ఆలయాల పరిధిలో 86 వేల ఎకరాల భూములుండగా.. అందులో 56 వేల ఎకరాలు కబ్జా అయ్యా యని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వక్ఫ్ భూముల రెండో సర్వే తరహాలోనే దేవాదాయ భూముల సర్వేకు ఆదేశించాలని ప్రభుత్వానికి సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్, దేవాదాయ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ రైతులకు పంపిణీ చేశారని.. భూరికార్డుల ప్రక్షాళనలో ఆ భూములను ప్రభుత్వ భూములుగా పరిగణిస్తే వక్ఫ్, దేవాదాయ భూములకు అన్యాయం జరుగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణలోని భూములను అడ్డగోలుగా విక్రయించి ఏపీ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేశారని అక్బరుద్దీన్ ఆరోపించారు. హజ్రత్ హుస్సేన్ షావలి దర్గాకు చెందిన భూములను అప్పటి ప్రభుత్వం ఐటీ రంగ అభివృద్ధి కోసం ల్యాంకో సంస్థకు కేటాయించగా.. ల్యాంకో అక్కడ నివాస భవనాలు నిర్మించి ఉల్లంఘనలకు పాల్పడిందని, దీనిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. -
అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసు..
- నలుగురికి పదేళ్ల జైలు - తొమ్మిది మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలో సంచలనం రేపిన ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిలో హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌లను దోషులుగా తేల్చింది. వీరికి ఒక్కొక్కరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రధాన నిందితుడైన మహ్మద్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ మహ్మద్ పహిల్వాన్‌తో పాటు మరో 9 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. నిర్ధోషులుగా ప్రకటించిన వారిలో హుస్సేన్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ హసన్, అబ్దుల్లా బిన్ యూనుస్ యాఫై, అవద్ బిన్ యూనుస్ యాఫై, యూనుస్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ యూనుస్ యాఫై, ఈసా బిన్ యూనుస్ యాఫై, మహ్మద్ బహదూర్ అలీఖాన్ అలియాస్ మునవర్ ఇక్బాల్, సైఫ్ బిన్ హుస్సేన్ యాఫై, మహ్మద్ అమెరుద్దీన్ అలియాస్ ఆమోర్లు ఉన్నారు. దోషులకు విధించిన పదేళ్ల జైలుశిక్షలో వారు అనుభవించిన ఆరేళ్ల జైలు శిక్షను కోర్టు మినహాయించింది. కోర్టు పరిసరాల్లో గట్టి బందోబస్తు.. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని కేశవగిరిలోని బార్కాస్–బాలాపూర్ రోడ్డులో అక్బరుద్దీన్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అక్బరుద్దీన్ తీవ్రంగా గాయపడ్డారు. అక్బరుద్దీన్ గన్మన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇబ్రహీం బిన్ యూనుస్ యాఫై హతమయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహ్మద్ బిన్ ఒమర్ యాపై అలియాస్ మహ్మద్ పహిల్వాన్ చేర్చడంతో పాటు మొత్తం 14 మందిపై అభియోగాల్ని నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ ప్రారంభించిన నాంపల్లి కోర్టు 86 మంది సాక్షుల్ని విచారించింది. గత నెలలో వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును వాయిదా వేసింది. గురువారం తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో పలువురు నిందితులు చాలా కాలంగా జైలులోనే ఉన్నారు. ప్రధాన నిందితుడు మహ్మద్ పహిల్వాన్ బెయిల్‌పై విడుదలయ్యాక వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో కోర్టు ఆయనకు 2012 ఏప్రిల్ 25న బెయిల్ రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది మే 2న పహిల్వాన్ లొంగిపోయారు. అప్పటి నుంచి చర్లపల్లి జైల్లోనే ఉంటున్నారు. నిందితుల్లో మరో ఆరుగురు బెయిల్‌పై ఉండగా ఎనిమిది మంది చర్లపల్లి జైల్లో ఉన్నారు. పహిల్వాన్ విడుదల.. కాగా, కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన వారిలో పహిల్వాన్‌తో పాటు మరో నలుగురు గురువారం రాత్రి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జైలు ఆవరణలో పహిల్వాన్ మాట్లాడుతూ... చేయని నేరానికి శిక్ష అనుభవించానని, 2019 కల్లా తానేంటో నిరూపించుకొంటానని చెప్పారు. ఆరు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులకు దూరం చేసి మానసికంగా హింసించిన వారి సంగతి దేవుడే చూచుకొంటారన్నారు. -
బిల్లుల పెండింగ్ ఎందుకు?
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసిన డీకే అరుణ - రెండు గ్రామాల్లో ‘డబుల్’ ఇళ్లు కడితే సరిపోతుందా? - నిధులన్నీ హరీశ్, కేటీఆర్, ఇతర మంత్రులే తీసుకుంటే ఎలా? సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా రెండు పడక గదుల ఇళ్ల పథకం ప్రారంభ దశలో ఉండడం దారుణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. హామీ ఇచ్చిన మొత్తం ఇళ్లను మరో రెండున్నరేళ్లలో పూర్తి చేయడం ఎలా సాధ్యమో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. పేదల ఇళ్ల పథకాలపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ప్రధాన హామీల్లో రెండు పడక గదుల ఇళ్ల పథకం ఒకటని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సీఐడీ దర్యాప్తు బూచి చూపి, వాటి బిల్లుల చెల్లింపును పెండింగ్‌లో పెట్టడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటివరకు సీఐడీ దర్యాప్తులో తేలిన వివరాలను బహిర్గతం చేయాలని అరుణ డిమాండ్ చేశారు. సీఎం నియోజకవర్గంలోని ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో రెండు పడక గదుల ఇళ్లు కడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. దీనిపై ప్రజలు తమను నిల దీస్తుంటే ఏం సమా ధానం చెప్పాలో తెలి యటం లేదన్నారు. ఎక్కువ నిధులు హరీశ్, కేటీఆర్, ఇతర మంత్రులే తీసుకుంటే ఎలాగన్నారు. హరీశ్ స్పందిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే పార్టీలకు అతీతంగా పనులు జరుగు తున్నాయని, అరుణ మాటలు సరికాద న్నారు. దీంతో మరి సిద్దిపేట ఇంతలా అభి వృద్ధి చెందిందంటే అది గత కాంగ్రెస్ ప్రభు త్వాల పని కాదా అని అరుణ ప్రశ్నించారు. అసెంబ్లీలోనూ ‘షీటీమ్స్’ కావాలి! డీకే అరుణ మాట్లాడుతున్న సమయంలో కొందరు సభ్యులు అడ్డు తగలడంతో ఆమె ‘షీటీమ్స్’ ప్రస్తావన తెచ్చారు. ‘అయ్యా హోంమంత్రి గారు. మీరు తండ్రి సమానులు. సభలో మహిళా సభ్యురాలు మాట్లాడు తుండగా ఇలా అడ్డు తగులుతుంటే మాకు రక్షణ కావాలి. అందుకే సభలో కూడా షీటీమ్స్ అవసరం ఉందనిపిస్తోంది.’’ అని ఆమె వ్యాఖ్యానించారు. జాప్యం తగదు: కె.లక్ష్మణ్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఐడీహెచ్ కాలనీ ఇళ్లను చూపి ఓట్లు పొందిన టీఆర్ఎస్.. ఇప్పుడు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయడం సరికాదని బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. నర్సన్నపేట, ఎర్రవల్లిల్లో డబుల్ ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. హైదరా బాద్‌లో 32 చోట్ల శంకుస్థాపన చేసినా ఎక్కడా పనులు మొదలుపెట్టలేదని స్పష్టం చేశారు. ముస్లింలకు అన్యాయం: అక్బరుద్దీన్ బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంలో ముందు నుంచీ ముస్లింలకు మరింత అన్యాయం జరిగిందని మజ్లిస్ సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఆరోపించారు. 2007 నుంచి 2016 వరకు ఇళ్ల మంజూరీలో ముస్లింల వాటా కేవలం 1.36 శాతం ఉందని.. కొత్తగా కేటాయించే ఇళ్లలో వారికి 12 శాతం వాటా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో డబుల్ ఇళ్ల యూనిట్ కాస్ట్‌ను రూ.9 లక్షలకు పెంచాలన్నారు. ప్రతి గ్రామం ఎర్రవల్లి కావాలి: సండ్ర రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఎర్రవల్లి తరహాలో కొత్త ఇళ్లతో కళకళలాడేలా చేయాలని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య కోరారు. వచ్చిన దరఖాస్తుల్లో 2.5 లక్షల మందిని అర్హులుగా తేల్చినట్టు సీఎం చెబితే, గృహనిర్మాణ శాఖ ఆ సంఖ్యను 50 వేలుగా పేర్కొందని... ఈ గందరగోళంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
రాష్ట్ర ఆదాయం రూ.47 వేల కోట్లు
ఆరు నెలల్లో రెవెన్యూ రాబడిలో గణనీయ వృద్ధి: ఈటల - సేల్స్ ట్యాక్స్, వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదల - ఇప్పటివరకు బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఏడాది రాష్ట్ర ఆదాయంలో గణనీయ వృద్ధి సాధించామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆరు నెలల కాలంలో రాష్ట్ర ఆదాయం రూ. 47 వేల కోట్ల మేర ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ రాబడి, లోటు, ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలపై విపక్ష నేత కె.జానారెడ్డి, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు ఈటల సమాధాన మిచ్చారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినా రాష్ట్ర ఆదాయం తగ్గదని, మున్ముందూ మరింత గొప్పగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఆదాయం వ్యాట్ రూపేణ 22 శాతం పెరిగిందని, వాహనాల పన్ను 35 శాతం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లపై 56 శాతం కలిపి మొత్తంగా గతేడాదికన్నా 13 శాతం వృద్ధి ఉందని వివరించారు. భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే 44 శాతం తక్కువగా ఉందన్నారు. నోట్ల రద్దుతో కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నా దాన్ని కేంద్రం ఆర్థిక సాయం రూపంలో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. 2014–15లో రాష్ట్రంలో మిగులు రూ. 369 కోట్లు మేర ఉండగా, 2015–16లో ఆడిటర్ జనరల్ నివేదికల ప్రకారం రూ. 3,121 కోట్ల మిగులు ఉందన్నారు. ప్రస్తుత ఏడాది మిగులు ఎలా ఉండనుంది జీఎస్టీ శ్లాబ్‌లపై స్పష్టత వచ్చాక మార్చి అనంతరం తెలుస్తుందన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి ప్రణాళికేతర వ్యయం రూ. 28,858.33 కోట్లు, ప్రణాళిక వ్యయం రూ. 22,756.77 కోట్లుగా ఉందని, మొత్తంగా బడ్జెట్ ఖర్చు రూ. 51,615 కోట్లని వెల్లడించారు. మార్చి నాటికి బడ్జెట్ వ్యయం రూ. లక్ష కోట్లు దాటుతుం దన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి రూ. 17వేల కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉం డగా ఇప్పటికే మూడు విడతల మాఫీ పూర్తయిందన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్ వాకౌట్ విద్యార్థుల ఫీజు బకాయిలపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదంటూ ఎంఐఎం... ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీల బడ్జెట్ విడుదలపై స్పష్టత లేదంటూ కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు: జానా ఇదే అంశంపై సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్ర బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లుగా ఉంది. కానీ ఇప్పటివరకు ఆరు నెలల ఆదాయం 47 వేల కోట్లని అంటున్నారు. మరో ఆరో నెలల్లో మరో రూ.47 వేల కోట్లు వచ్చినా బడ్జెట్ రూ. లక్ష కోట్లు దాటదు. ఇదే విషయాన్ని గతంలోనే చెప్పా. అదే ఇప్పుడు నిజమవుతోంది. ఇక పెద్దనోట్ల రద్దుతో ఆదాయం 20 వేల కోట్ల మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రే చెబుతున్నారంటే దీనికి అదనంగా మరో రూ. 10 వేల కోట్లు కచ్చితంగా తగ్గుదల ఉంటుంది. ఎలా చూసినా లక్ష కోట్ల బడ్జెట్ దాటడం కష్టం. ఈ ఏడాది బడ్జెట్ ఖర్చు మొదలు పెట్టనే లేదు’ అని పేర్కొన్నారు. ముమ్మాటికీ లోటు రాష్ట్రమే: అక్బరుద్దీన్ ‘రాష్ట్రంలో 2014–15లో మిగులు కనబడుతున్నా, 2015–16లో 4 వేల కోట్ల మేర లోటు ఉంది. ప్రస్తుత ఏడాదిలోనూ ఖర్చు రూ. 51 వేల కోట్ల మేర ఉండగా ఆదాయం 47 వేల కోట్లే ఉంది. అలాం టప్పుడు మిగులు రాష్ట్రం ఎలా అవుతుంది. 10.93 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల మెయింటెనెన్స్ చార్జీలు, రీయిం బర్స్మెంట్ ఫీజులు చెల్లించలేదు. షాదీ ముబారక్ కింద కేవలం 30 కోట్లే విడుదలయ్యాయి. మరి మిగులు రాష్ట్రం అని ఎలా అంటారు’ అని ప్రశ్నించారు -
కోర్టుకు అక్బరుద్దీన్.. పోలీసుల హైఅలర్ట్!
హైదరాబాద్: ఎంఐఎం శాసనసభాపక్ష నేత, చంద్రయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరయ్యారు. బార్కస్ ప్రాంతంలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ నిమిత్తం ఆయన కోర్టుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అక్బర్ ప్రత్యర్థి వర్గం కూడా కోర్టు విచారణకు హాజరవ్వడంతో ఇక్కడ ఒకింత ఉద్రిక్తత నెలకొంది. అక్బర్ వర్గం, ఆయన ప్రత్యర్థి మహమ్మద్ పహెల్వాన్ వర్గం ఎదురుపడితే అవాంఛనీయ ఘటనలు జరగవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. -
అక్బరుద్దీన్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
హైదరాబాద్: ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ నేతలు ఆదివారం ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో అక్బరుద్దీన్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందున ఆయనపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. -
మీరు గౌరవం ఇస్తే మీకూ గౌరవం దక్కుతుంది..
-
అక్బరుద్దీన్‌కు సమన్లు జారీ చేసిన ముంబై కోర్టు
ముంబై: విద్వేషపూరిత ప్రసంగంతో సంబంధముందనే ఆరోపణలతో ఎంఐఎం నేత, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి కుర్లా సబర్బన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. సమన్లను ఆయనకు అందించాలని కుర్లా పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన సమన్లు అందిచడంలో హైదరాబాద్ పోలీసులు విఫలమయ్యారని పిటిషనర్ గుల్హమ్ హుస్సేన్ ఖాన్ తెలపడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2012లో మత సామరస్యాన్ని బలహీనపర్చేలా అక్బరుద్దీన్ ప్రసంగించారని 2013లో కేసు వేశారు. ఈ ప్రసంగం ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడానికి నిరాకరించినట్లు హుస్సేన్ కోర్టుకు నివేదించారు. -
కేసీఆర్‌కు ప్రతిపక్షాల మద్దతు!
హైదరాబాద్: భూ కేటాయింపులపై ఈరోజు తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. సొసైటీల ముసుగులో కొందరు పెద్దలు గద్దల్లా భూములను కబ్జా చేయటమే కాకుండా, దర్జాగా అమ్ముకున్నారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శించారు. ఎన్ని విచారణ కమిటీలు వేసినా ఫలితం కానరాలేదన్నారు. సొసైటీలన్నింటిని రద్దుచేసి ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని అక్బరుద్దీన్ సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పందించారు. సొసైటీ భూముల్లో అక్రమాలపై ఒకటి కాదు రెండు సభా సంఘాలు ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరారు. సభాసంఘం ఏర్పాటుపై ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ** -
టీఆర్ఎస్, మజ్లిస్ల దోస్తీకి ఏమైంది?
-
అక్బరుద్దీన్‌కు హరీష్ బుజ్జగింపులు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడంపై శుక్రవారం సభలో రగడ చోటుచేసుకుంది. పేరు మార్పుపై కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. రాజీవ్ గాంధీ పేరును ఎలా మార్చుతారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం ఇదే అంశంపై స్పీకర్‌తో అన్ని పార్టీల నేతలు భేటీ అయ్యారు. సభ ప్రారంభం అయిన తర్వాత సీఎం కేసీఆర్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తప్పుబడుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని బీజేపీ, టీడీపీ తప్ప మిగత పార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. దాంతో సభలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయటంతో మరోసారి సమావేశాలకు అంతరాయం కలిగింది. దాంతో స్పీకర్ అసెంబ్లీని 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అసెంబ్లీ వాయిదాపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన అంశాలను చర్చించకుండానే సభ వాయిదా వేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ అధికారులు అన్ని పార్టీలను కోరారు. అయితే బీఏసీ సమావేశానికి వచ్చేది లేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. దాంతో బీఏసీ సమావేశానికి హాజరు కావాలని హరీష్ రావు... అక్బరుద్దీన్‌ను బుజ్జగిస్తున్నారు. -
ఎన్టీఆర్ మరణానికి కారకులు ఎవరు?
-
ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్న ఒవైసీ సోదరులు
ఎంఐఎంపై శివసేన విమర్శలు ముంబై: ముంబై ముస్లింలను ఆల్ ఇండియా మజ్లిస్ ఇతైహాదుల్ ముస్లిమీన్ పార్టీ నేతలు తమ వ్యాఖ్యలతో తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఎంపీ అసదుద్దీన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సోదరులు స్థానికుల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశంలోని ముస్లింలను వారు తప్పుదారి పట్టిస్తున్నారని శివసేన అధికార పత్రిక సామ్నాలో దుయ్యబట్టారు. నాందేడ్ మున్సిపల్లో విజయం తరువాత ఎంఐఎంని మరఠ్వావాడ కార్పొరేషన్‌కూ విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండుచోట్ల ఎంఐఎం విజయం సాధించిన విషయం విదితమే. కాంగ్రెస్ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతి ఎంఐఎంపై చేసిన వ్యాఖ్యలను ఠాక్రే సమర్థించారు. ఆమెకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. -
39 మంది భారతీయులు క్షేమమే కానీ ...
న్యూఢిల్లీ: ఇరాక్‌లో అంతరుద్ధ్యం నేపథ్యంలో అపహరణకు గురైన 39 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇరాక్‌లో ఆ దేశ విదేశాంగా అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ విలేకర్లతో మాట్లాడుతూ... భారతీయులు ఇప్పటికీ బందీలుగానే ఉన్నారని తెలిపారు. వారిని విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దాదాపు రెండు నెలల క్రితం ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలోని 39 మంది భారతీయులను తిరుగుబాటుదారులు అపహరించుకుని పోయిన సంగతి తెలిసిందే. ఇరాక్‌లో తిరుగుబాటుదారుల వద్ద బందీలుగా ఉన్న కొంతమంది భారతీయులు ఇప్పటికే విడుదలై స్వదేశానికి చేరుకున్నారు. మరికొంత మంది తిరుగుబాటుదారుల వద్ద బందీలుగా ఉన్నారు. వారిని విడిపించేందుకు ఇరాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
హైదరాబాద్ ఎవరి జాగీరూ కాదు: అక్బరుద్దీన్