హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టడంపై శుక్రవారం సభలో రగడ చోటుచేసుకుంది. పేరు మార్పుపై కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. రాజీవ్ గాంధీ పేరును ఎలా మార్చుతారంటూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సమావేశాలను పది నిమిషాలు వాయిదా వేశారు.
అనంతరం ఇదే అంశంపై స్పీకర్తో అన్ని పార్టీల నేతలు భేటీ అయ్యారు. సభ ప్రారంభం అయిన తర్వాత సీఎం కేసీఆర్ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తప్పుబడుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని బీజేపీ, టీడీపీ తప్ప మిగత పార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. దాంతో సభలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయటంతో మరోసారి సమావేశాలకు అంతరాయం కలిగింది. దాంతో స్పీకర్ అసెంబ్లీని 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా అసెంబ్లీ వాయిదాపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఏసీలో నిర్ణయించిన అంశాలను చర్చించకుండానే సభ వాయిదా వేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు సోమవారం బీఏసీ సమావేశానికి రావాలని శాసనసభ అధికారులు అన్ని పార్టీలను కోరారు. అయితే బీఏసీ సమావేశానికి వచ్చేది లేదని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. దాంతో బీఏసీ సమావేశానికి హాజరు కావాలని హరీష్ రావు... అక్బరుద్దీన్ను బుజ్జగిస్తున్నారు.
అక్బరుద్దీన్కు హరీష్ బుజ్జగింపులు
Published Fri, Nov 21 2014 2:17 PM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement
Advertisement