సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నించారు.
అక్భరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్ అన్నారు. అది ఓల్డ్‌సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్‌ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్‌అండ్ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు.
‘‘కాంగ్రెస్ బీ ఫామ్‌పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్‌లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment