సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్‌టీఎల్‌లో కట్టారు.. కూల్చేస్తారా? అని ప్రశించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది తొలగిస్తారా? జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం,సెక్రటేరియట్‌లు, ప్రముఖుల ఘాట్‌లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నాయి వాటిని కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment