సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలకు మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై శనివారం చర్చ కొనసాగుతుంది. చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదు.రెండు పంటలది రైతు భరోసా ఇవ్వలేదు.ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ.17వేల బాకి పడ్డారు.రూ.26వేల కోట్లు రైతులకు బాకీ పడ్డారు.
రైతులకు ఉన్న బకాయిలను క్లియర్ చేసి...కొత్త రైతు భరోసా రైతులకు ఇవ్వాలి.రుణమాఫీ రూ.40 వేల కోట్లు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు...కేబినెట్‌లో రూ.31వేలు అయ్యింది. బడ్జెట్ కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లయ్యింది.రుణమాఫీ కాలేదు...కొండారెడ్డి, సిరిసిల్ల పోదామా? ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి’అని కేటీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment