కె.చంద్రశేఖర రావు
హైదరాబాద్: భూ కేటాయింపులపై ఈరోజు తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. సొసైటీల ముసుగులో కొందరు పెద్దలు గద్దల్లా భూములను కబ్జా చేయటమే కాకుండా, దర్జాగా అమ్ముకున్నారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శించారు. ఎన్ని విచారణ కమిటీలు వేసినా ఫలితం కానరాలేదన్నారు. సొసైటీలన్నింటిని రద్దుచేసి ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని అక్బరుద్దీన్ సూచించారు.
దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పందించారు. సొసైటీ భూముల్లో అక్రమాలపై ఒకటి కాదు రెండు సభా సంఘాలు ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరారు. సభాసంఘం ఏర్పాటుపై ప్రతిపక్షాలు మద్దతు పలికాయి.
**