Land allotments
-
నేడు కర్ణాటకలో కాంగ్రెస్ నిరసనలు
బెంగళూరు: మైసూరులో భూకేటాయింపుల వివాదంలో కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ అనుమతించడాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం ప్రకటించారు. ‘‘ ఏం లేకున్నా గవర్నర్ దీన్నొక కేసులా మార్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఈ ఉదంతంపై కాంగ్రెస్ నిరసన బాటలో పయనిస్తుంది. తాలూకా, జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలకు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ మెమొరాండం అందజేస్తారు’’ అని నిరసన కార్యక్రమ వివరాలను డీకే వివరించారు. 22న సీఎల్పీ భేటీగవర్నర్ నిర్ణయాన్ని ఐకమత్యంతో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని చాటేందుకు 22వ తేదీన సీఎల్పీ భేటీని నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, బయోటెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ‘‘ ముడా భూకేటాయింపుల అంశంపై ఈ భేటీలో చర్చిస్తారు. చట్టబద్ధంగా ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నామో ఆయన వివరిస్తారు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాదించనున్న సింఘ్వీ, సిబల్ !మైసూరు భూకేటాయింపుల కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టులో సీఎం సిద్ధరామయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, కపిల్ సిబల్ వాదించే అవకాశముంది. ఈ మేరకు వీరిద్దరూ నేడు బెంగళూరుకు వస్తున్నట్లు సీఎం కార్యాలయం తెలిపింది. -
MUDA scam: సిద్ధూ మెడకు ‘ముడా’ ఉచ్చు
సాక్షి, బెంగళూరు: మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదం చివరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. ఖరీదైన భూములు భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ శనివారం అనుమతి ఇచ్చినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో సిద్ధూపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టే అవకాశముంది. ‘‘ నాకు అందిన పిటిషన్ ప్రకారం భూకేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక ఆధారాలున్నాయి. మీపై విచారణకు ఎందుకు ఆదేశించకూడదో 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సీఎంకు గత నెల 26న షోకాజ్ నోటీసు ఇచ్చా. దాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి మండలి చేసిన తీర్మానంలో హేతుబద్ధత లేదు. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి. హడావిడిగా మాజీ ఐఏఎస్ వెంకటాచ లపతి ఆధ్వర్యంలో విచారణ కమిటీ, హైకోర్టు విశ్రాంత జడ్జి పీఎన్ దేశాయ్ ఆధ్వర్యంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయడం చూస్తుంటే ఇందులో భారీ అవకతవకలు జరిగినట్లు భావించవచ్చు’’ అని గవర్నర్ గెహ్లోత్ వ్యాఖ్యానించారు. అయితే గవర్నర్ ఉత్తర్వులను రద్దుచేయాలంటూ సిద్ధరా యమ్య హైకోర్టును ఆశ్రయిస్తే ఆ కేసు విచారణ సందర్భంగా తమ వాదనలు సైతం వినాలంటూ ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ శనివారం కర్ణాటక హైకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలుచేశారు. 21వ తేదీన ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులోనూ కేసు వేస్తానని టీజే అబ్రహాం చెప్పారు.తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్యతనపై దర్యాప్తునకు గవర్నర్ ఆదేశించడాన్ని సీఎం తీవ్రంగా తప్పుబట్టారు. నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలన్న బీజేపీ డిమాండ్‌పై స్పందించారు. ‘‘గవర్నర్ కేంద్రప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారారు. చట్టవ్యతిరేక ఉత్తర్వులిచ్చి రాజ్యాంగబద్ధ పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారు. ఉత్తర్వులపై చట్టప్రకారం పోరాడతా. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. కేంద్రం, బీజేపీ, జేడీ(ఎస్) ఇందులో కీలక పాత్రధారులు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల మద్దతు నాకు ఉంది. నేను రాజీనామా చేయాల్సినంత తప్పేమీ చేయలేదు. మైనింగ్ లైసెన్స్‌ల కుంభకోణంలో జేడీఎస్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై లోకాయుక్త దర్యాప్తునకు కోరితే ఆయనపై విచారణకు ఆదేశించలేదుగానీ నాపై ఆగమేఘాల మీద విచారణకు ఆదేశించారు. ఫిర్యాదులున్నా బీజేపీ మాజీ కేంద్ర మంత్రులు శశికళ జోళె, మురుగేశ్ నీలాని, జనార్ధన్ రెడ్డిలపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశాలివ్వలేదు?’’ అని సీఎం అన్నారు.విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీవిచారణను ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సీ ఎంగా కొనసాగే అర్హత లేదని, రాజీనామా చేయా లని రాష్ట్రంలో విపక్ష బీజేపీ డిమాండ్చేసింది. ఆయ న దిగిపోతేనే దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర అన్నారు. ‘‘కాంగ్రెస్ వంచనకు, కుటుంబ రాజకీయాలకు ఈ స్కామ్ మరో మచ్చుతునక. దళితులకు అండగా ఉంటామనే సీఎం స్వయంగా దళితుల భూములను లాక్కున్నారు’’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. దాదాపు రూ.4,000–5,000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీయేతర ప్రభుత్వాలను వేధిస్తున్నారు: ఖర్గేప్రతిపక్షాలపాలిత రాష్ట్రాలను మోదీ సర్కార్ నియమించిన గవర్నర్లు తీవ్రంగా వేధిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ‘‘ ఏకంగా సీఎం మీదనే విచారణకు ఆదేశించేంత తప్పు ఏం జరిగింది?. ఏ కారణాలు చెప్పి దర్యాప్తునకు అనుమతి ఇచ్చారు?. పశ్చిమబెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాల్జేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది. కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు. ‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు. అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు. అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పరిశ్రమల భూకేటాయింపులు మరింత సరళం
సాక్షి, అమరావతి : సులభతర వాణిజ్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు భూ కేటాయింపులను మరింత సరళతరం చేసింది. 2023–27 పారిశ్రామిక విధానం కింద.. పరిశ్రమలు లీజు విధానంలో కాకుండా నేరుగా భూములు కొనుగోలు చేసేలా పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు 33/99 ఏళ్లకు లీజు విధానంలో ఈ కేటాయింపులు చేస్తుండగా నిధుల సమీకరణకు లీజు ఒప్పందాలు అడ్డంకిగా మారుతున్నాయంటూ పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మన్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా పొందుపరిచారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేసే వారు భూమి విలువను మొత్తం ఒకేసారి చెల్లిస్తే తక్షణం వారితో ఏపీఐసీసీ లేదా పరిశ్రమల శాఖ భూమి కొనుగోలు ఒప్పందం చేసుకుంటుంది. ప్రాజెక్టు ఏర్పాటుచేసేటప్పుడు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలన్నీ నిర్ధిష్ట కాలపరిమితిలోగా చేసుకుంటే వెంటనే ఆ భూమిపై పూర్తి హక్కులను కేటాయిస్తూ తుది సేల్ డీడ్‌ను అందజేస్తారు. అదే మధ్య, పెద్ద, భారీ పరిశ్రమల విషయానికొస్తే.. దశల వారీగా ప్రాజెక్టులు చేపట్టినా మొత్తం భూమి విలువ ఒకేసారి చెల్లిస్తే సేల్ అగ్రిమెంట్ చేస్తారు. అలాగే, డీపీఆర్ ప్రకారం దశల వారీగా ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలుచేసిన తర్వాత తుది అమ్మకం డీడ్‌ను అందజేస్తారు. ఒకవేళ పరిశ్రమలు పెట్టేవారు దశల వారీగా సేల్‌డీడ్‌ను కోరుకుంటే ఆ ఫేజ్‌లో చేరుకోవాల్సిన లక్ష్యాలు చేరుకుంటే ఆ మేరకు ఆ భూమికి సేల్‌డీడ్ చేస్తారు. ఒకవేళ రెవెన్యూ శాఖ భూమి కొనుగోలు చేసి ఇవ్వాల్సి వస్తే అప్పుడు కూడా పరిశ్రమల శాఖ ఆమోదించిన డీపీఆర్ నిబంధనలు చేరుకున్న తర్వాతనే భూమిని కేటాయిస్తారు. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. -
అందుకే ‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపు రద్దు
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో రూ.40 కోట్లు విలువ చేసే భూమి కేవలం రూ.50.05 లక్షలకే కేటాయింపు.. జాతీయ రహదారుల విస్తరణలో ఎకరం భూమి కోల్పోతే దానికి నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా అలా చేయకుండా అత్యంత ఖరీదైన చోట 1.5 ఎకరాలు కేటాయింపు.. జిల్లా కలెక్టర్ అభ్యంతరపెట్టినా ఖాతరు చేయని వైనం. ఇవీ.. గత ప్రభుత్వం ఆంధ్రజ్యోతి దినపత్రికకు నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ఆర్థిక ప్రయోజనం కల్పించిందో చెప్పడానికి నిదర్శనాలు. జిల్లా కలెక్టర్, సీసీఎల్‌ఏలు కనీసం రూ.7.26 కోట్లకు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించినా పెడచెవిన పెడుతూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అర ఎకరం భూమిని కేవలం రూ.5 వేలకు, మరో ఎకరం భూమిని రూ.50 లక్షలకు ఆంధ్రజ్యోతికి చెందిన ఆమోదా పబ్లికేషన్‌కు కేటాయించేశారు. వ్యాపారం చేసుకునే సంస్థకు ప్రజాప్రయోజనాల పేరుతో అత్యంత ఖరీదైన భూమిని కారుచౌకగా కట్టబెట్టడంపై విశాఖ వాసి ఒకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయడంతో ఈ అక్రమ వ్యవహారం బయటకొచ్చింది. విశాఖపట్నం నడిబొడ్డున మధురవాడలోని పరదేశీ పాలెంలో సర్వే నెంబర్లు 191/10–14 వరకు ఉన్న 1.5 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని తేలడంతో ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ఈ భూకేటాయింపును రద్దు చేసింది. అక్రమ వ్యవహారం ఇలా.. ఎన్‌హెచ్–5 విస్తరణలో భాగంగా ఆంధ్రజ్యోతికి చెందిన ఎకరం భూమిని 1986లో ప్రభుత్వం తీసుకుంది. దీనికి నష్టపరిహారంగా ఏకంగా 1.5 ఎకరాల విలువైన భూమిని కొట్టేయడానికి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కథ నడిపించారు. 2014లో చంద్రబాబు సీఎం కాగానే జిల్లా కలెకర్ట్‌కు విజ్ఞప్తి చేయించారు. సాధారణంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల కోసం భూమిని సేకరించినప్పుడు నష్టపరిహారం ఇస్తుంది తప్ప బదులుగా ఖరీదైన ప్రాంతంలో అంతే పరిమాణంలో భూమి ఇవ్వదు. అయితే.. చంద్రబాబు ఏకంగా 1.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ జూలై 28, 2017లో నిర్ణయం తీసుకున్నారు. ఆమోద పబ్లికేషన్ భూమి తీసుకొని రెండేళ్లు దాటినా ఇంతవరకు అక్కడ ఎటువంటి పనులూ ప్రారంభించలేదని, ఫిర్యాదు అందిన తర్వాత నోటీసులు జారీ చేయడంతోహడావిడిగా బుల్డోజర్లు, జేసీబీలు తీసుకొచ్చి చదును చేయడం ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ నివేదికలో పేర్కొనడంతో ప్రభుత్వం భూకేటాయింపును రద్దు చేసింది. (చదవండి: అక్రమ ఆమోదంపై వేటు) -
‘ఆంధ్రజ్యోతి’కి స్థల కేటాయింపులు రద్దు
తన తాబేదార్లకు, అంతేవాసులకు విశాఖను వడ్డించిన విస్తరిలా మార్చేసి.. భూములను అడ్డంగా వడ్డించేసిన గత టీడీపీ సర్కారు నిర్వాకం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. తాబేదార్లకే కాదు.. నిత్యం తనకు భజన చేసే తోక పత్రికలకు సైతం రూ.కోట్ల విలువైన భూములను నామమాత్రపు ధరలకు ధారాదత్తం చేసేసిన పచ్చ సర్కారు.. పచ్చి అక్రమాలకు.. తాజాగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. అప్పనంగా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకొని.. వాటిని అర్హులైన పేదలకు ఇచ్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే నగర శివారు పరదేశిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న అత్యంత విలువైన ఒకటిన్నర ఎకరాల భూమిని తన తోక పత్రికకు దఖలుపరుస్తూ.. 2017లో అప్పటి టీడీపీ సర్కారు జరిపిన కేటాయింపులపై ఇప్పటి ప్రభుత్వం వేటు వేసింది. ఆ భూమిని పేదలకు కేటాయించాలని బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించింది. కాగా అడ్డగోలుగా పొందిన ఆ భూమిని ఇప్పటికే తవ్వుకొని కంకర అమ్మకాల ద్వారా రూ.7 కోట్లకుపైగా అప్పనంగా వెనుకేసుకోవడం కొసమెరుపు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ శివారున పరదేశిపాలెంలో రూ.కోట్ల విలువైన 1.50 ఎకరాల స్థలాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్య సంస్థ అయిన ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేవలం రూ.50 లక్షల 5వేలకే ఇచ్చేస్తూ.. 2017 జూన్ 28న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దానికి ముందు ఎప్పుడో.. 1986లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ప్రెస్‌కు పరదేశిపాలెం గ్రామ పరిధి సర్వే నెం.191, 168లలో ఎకరా రూ.10వేల ధరకు 1.50ఎకరాల భూమి కేటాయించింది. అయితే కొన్నాళ్లకు జాతీయ రహదారి విస్తరణ కోసం ఇందులో ఎకరా భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన 50 సెంట్ల భూమి అప్పటి నుంచి ఆ సంస్థ అధీనంలోనే ఉంది. జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16) కోసం స్వాధీనం చేసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా వేరే భూమి ఇవ్వాలని, 1986లో తమకు కేటాయించిన ధరకే ఎకరా రూ.10వేల చొప్పున రేటు నిర్ణయించాలని ఆంధ్రజ్యోతి యాజమాన్యం 2016లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరింది. ఇలా సదరు పత్రిక కోరడమే ఆలస్యం.. ఆగమేఘాల మీద స్పందించిన బాబు సర్కారు అదే ప్రాంతంలో ఒకటిన్నర ఎకరాల భూమిని గుర్తించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కలెక్టర్ చెప్పిన రేటు కాదని.. అప్పటి జిల్లా కలెక్టర్ యువరాజ్ ఈ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉందని పేర్కొంటూ.. మార్కెట్ విలువ ఎకరా రూ.7.26 కోట్లుగా నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. 2016 ఆగస్టు 10న ఇచ్చిన ఈ నివేదికను అనుసరించి అదే ఏడాది అక్టోబర్ 4వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ రివైజ్డ్ నివేదిక పంపించారు. ఆ నివేదికలో కూడా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.7.26 కోట్లకే కేటాయించాల్సిందిగా ఎలినేషన్ ప్రతిపాదనలు పంపారు. కానీ టీడీపీ సర్కారు జిల్లా అధికారుల సిఫార్సులను లెక్కలోకి తీసుకోలేదు. పరదేశిపాలెం సర్వేనంబర్ 191/10 నుంచి 191/14లో అందుబాటులో ఉన్న ఎకరా 50 సెంట్ల భూమిని ఆమోద పబ్లికేషన్స్‌కు కేటాయిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికల వలవన్ 2017 జూన్ 28న జీవో ఎంఎస్. 25ను జారీ చేశారు. 0.50 సెంట్ల భూమిని పాత ధర కింద ఎకరా రూ.10వేల రేటుతో, ప్రత్యామ్నాయంగా ఇస్తున్న ఎకరా భూమిని ఎకరా రూ.50 లక్షల రేటుతో కేటాయించాలని సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడేళ్లలో భూమిని ఉపయోగించాలనీ, ఆ భూమిలో ఉన్న వాటర్ బాడీస్ (చెరువులు, గెడ్డలు)ను రూపు మార్చకూడదని స్పష్టం చేశారు. సంబంధిత అవసరాలకు మాత్రమే వినియోగించాలని, వివరాలను జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రతి మార్చి 31వ తేదీకల్లా ఈ భూమి వినియోగంపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక్కడ ఎకరా కోట్లలో పలుకుతుందనేది అందరికీ తెలిసిందే. అలాంటిది ఒకటిన్నర ఎకరాల భూమిని కేవలం రూ.50లక్షలకే ధారాదత్తం చేయడం అప్పట్లోనే వివాదమైంది. ఇప్పుడు బలహీనవర్గాలకు కేటాయించేలా... పేదలకు చెందాల్సిన విలువైన భూమిని అధికారం అడ్డం పెట్టుకొని ఆంధ్రజ్యోతికి అప్పనంగా ఇచ్చేసినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. విలువైన ఈ స్థలంలో పదుల సంఖ్యలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమి కేటాయింపును రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలాన్ని బలహీనవర్గాలకు కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు సూచించనున్నట్లు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. గ్రావెల్ తరలింపుతో రూ.కోట్లు కొల్లగొట్టారు ఇక ఎకరాన్నర స్థలంలో ఉన్న కొండలను చదును చేసే పనిని టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఓ బడా నిర్మాణ సంస్థకు సదరు భూమి పొందిన ఆమోదా పబ్లికేషన్స్ అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ సంస్థ కొండను చదును చేసి రోజుకు సుమారు రూ. 2లక్షల విలువ చేసే గ్రావెల్ తరలిస్తోంది. ఏడాది నుంచి ఈ వ్యవహారం సాగుతోంది. మొత్తంగా ఇప్పటివరకు రూ. 7కోట్ల విలువైన గ్రావెల్‌ను అడ్డగోలుగా తరలించినట్టు చెబుతున్నారు. ఈ కొండను లెవెల్ చేసి గ్రావెల్ అమ్ముకున్నందుకు ప్రతిగా సదరు సంస్థ ఉచితంగా ఆమోదా పబ్లికేషన్స్‌కు కార్యాలయం నిర్మించి ఇవ్వాలన్నదే వారి మధ్య ఒప్పందంగా తెలుస్తోంది. -
రాజధానిలో భూమి తీసుకో..అమ్ముకో
సాక్షి, అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే చిప్ డిజైనింగ్ కంపెనీ సాక్‌ట్రానిక్స్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీల వర్షం కురిపించింది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నాలుగు అంతస్థుల భవనంలో కార్యకలాపాలు సాగిస్తున్న ఈ కంపెనీకి రాజధాని అమరావతిలో 40 ఎకరాల భూమిని కారుచౌకగా కేటాయించింది. రూ.160 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.20 కోట్లకే కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలో ఎకరం భూమి ధరను ప్రభుత్వమే రూ.4 కోట్లుగా గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, సాక్‌ట్రానిక్స్‌కు ఎకరం కేవలం రూ.50 లక్షలకే కేటాయిస్తూ హాడావిడిగా ఉత్తర్వులను జారీ చేసింది. విలువైన భూమి కేటాయించడమే కాకుండా పూర్తిగా అమ్ముకోవడానికి లేదా లీజుకు ఇచ్చుకోవడానికి హక్కులు సైతం కల్పించడం గమనార్హం. అమరావతిలో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సాక్‌ట్రానిక్స్ దరఖాస్తు చేసుకున్న రెండు నెలల్లోనే శరవేగంతో ఫైల్ ముందుకు కదిలింది. ఆ సంస్థకు అత్యంత తక్కువ ధరకే విలువైన భూమిని కేటాయించడమే కాకుండా భారీగా రాయితీలు కల్పించడం ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధానిలో వేలం విధానంలోనే ప్రైవేట్ కంపెనీలకు భూ కేటాయింపులు చేయాలని ఏపీసీఆర్డీఏ స్పష్టంగా చెపుతోంది. కానీ, దాన్ని పక్కన పెట్టి సాక్‌ట్రానిక్స్‌కు భూ కేటాయింపులు చేయడం గమనార్హం. రాయితీల్లోనే రూ.250 కోట్ల లబ్ధి 2014–2020 ఎలక్ట్రానిక్స్ పాలసీ ప్రకారం లభించే రాయితీలే కాకుండా ఇంకా అదనపు ప్రయోజనాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు రాయితీల విలువ రూ.250 కోట్లు ఉంటుందని అధికారులు చెపుతున్నారు. కేవలం ఒక్క భూమిపైనే రూ.140 కోట్ల ప్రయోజనం నేరుగా లభించింది. ఇవికాకుండా ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం గ్రాంట్‌గా ఎకారానికి గరిష్టంగా రూ.30 లక్షలతోపాటు అన్ని గ్రాంట్లు కలిపి గరిష్టంగా రూ.50 కోట్లకు వరకు ఇచ్చారు. ఈ విషయాన్ని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ల్యాండ్ కన్వర్జేషన్ చార్జీల నుంచి సైతం మినహాయింపు ఇచ్చారు. ఆంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో 54 ఎకరాల్లోనే అతిపెద్ద క్యాంపస్ నిర్మించింది. ఒక చిన్న చిప్ కంపెనీకి రాజధాని అమరావతిలో ఏకంగా 40 ఎకరాలు కేటాయిచండమే కాకుండా, ఇతరులకు అమ్ముకునే హక్కును కూడా కల్పించడం వెనుక ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అమరావతి భూములపై ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులు తదితర విశేష వ్యక్తులకు ప్రభు త్వం ఇళ్ల స్థలాలు కేటాయించడంపై అభ్యంత రం వ్యక్తం చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాష్, రిటైర్డ్ లెక్చరర్ లక్ష్మణ రెడ్డి వల్లం రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవా దులు సత్యప్రసాద్, మహేష్ బాబు పిటిషన్ లోని అంశాలను వివరిం చారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి విధానం లేకుండా వందలాది ఎకరాలను వివిధ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని పేర్కొన్నారు. అమృత వర్సిటీకి 200 ఎకరాలు, బీఆర్ఎస్ మెడిసిటీ హెల్త్‌కేర్ సంస్థకు 100 ఎకరాలు, ఇండో ృ యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థకు 150 ఎకరాలు.. ఇలా అనేక సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెట్టిందని ఆ జీవోలను జత పరిచారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులు, పల్లె రఘునాథరెడ్డి కుమారుడు పల్లె వెంకట కృష్ణ కిశోర్ రెడ్డి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంబంధీకులు, మంత్రి నారాయణ సంబంధీకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు కూతురు లక్ష్మీసౌజన్య తదితరులకు ఈ కేటాయింపులు జరిగాయని విన్నవించారు. విశాఖపట్నంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయా యని దీనిని సొమ్ము చేసుకునేందుకు అధికా రం, పలుకుబడి ఉన్న నేతలు రెవెన్యూ అధికా రులతో కుమ్మక్కయి ప్రభుత్వ భూములను మాయం చేశారన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
కేసీఆర్‌కు ప్రతిపక్షాల మద్దతు!
హైదరాబాద్: భూ కేటాయింపులపై ఈరోజు తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. సొసైటీల ముసుగులో కొందరు పెద్దలు గద్దల్లా భూములను కబ్జా చేయటమే కాకుండా, దర్జాగా అమ్ముకున్నారని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఘాటుగా విమర్శించారు. ఎన్ని విచారణ కమిటీలు వేసినా ఫలితం కానరాలేదన్నారు. సొసైటీలన్నింటిని రద్దుచేసి ప్రభుత్వం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని అక్బరుద్దీన్ సూచించారు. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు స్పందించారు. సొసైటీ భూముల్లో అక్రమాలపై ఒకటి కాదు రెండు సభా సంఘాలు ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరారు. సభాసంఘం ఏర్పాటుపై ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. ** -
''మైహోంకి భూ కేటాయింపు టి- ప్రభుత్వ హయాంలో''