న్యూఢిల్లీ: ఇరాక్లో అంతరుద్ధ్యం నేపథ్యంలో అపహరణకు గురైన 39 మంది భారతీయులు క్షేమంగానే ఉన్నారని ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఇరాక్లో ఆ దేశ విదేశాంగా అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ విలేకర్లతో మాట్లాడుతూ... భారతీయులు ఇప్పటికీ బందీలుగానే ఉన్నారని తెలిపారు. వారిని విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
దాదాపు రెండు నెలల క్రితం ఇరాక్లోని మోసుల్ పట్టణంలోని 39 మంది భారతీయులను తిరుగుబాటుదారులు అపహరించుకుని పోయిన సంగతి తెలిసిందే. ఇరాక్లో తిరుగుబాటుదారుల వద్ద బందీలుగా ఉన్న కొంతమంది భారతీయులు ఇప్పటికే విడుదలై స్వదేశానికి చేరుకున్నారు. మరికొంత మంది తిరుగుబాటుదారుల వద్ద బందీలుగా ఉన్నారు. వారిని విడిపించేందుకు ఇరాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.