సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేతగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ దారుస్సలాంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఎన్నుకున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభాపక్షనేతగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి. పార్టీ అధినేత అసదుద్దీన్‌కు సోదరుడైన అక్బరుద్దీన్ 1999లో రాజకీయ అరంగేట్రం చేసిన మొద టి పర్యాయమే చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఇక్క డ గతంలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతి నిథ్యం వహించిన రాజకీయ ప్రత్యర్థి, మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధినేత మహ్మద్ అమానుల్లాఖాన్‌ను ఓడించి అక్బరుద్దీన్ మొదటిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అక్బరుద్దీన్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 5 సార్లు చాంద్రాయణగుట్ట నుంచి ఎన్నికయ్యారు. ప్రతిసారి ప్రత్యర్థులను చిత్తుచేసి భారీ మెజార్టీ సాధిస్తూ వస్తున్నారు. సమావేశంలో పార్టీ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment