సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ సభలో బుల్లెట్ ప్రూఫ్ లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటంలో కొత్తేముందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం కూడా అక్కడ బ్లులెట్ ప్రూఫ్ లేకుండా పర్యటించిందని, అందులో తాను కూడా ఉన్నానని గుర్తుచేశారు.
ప్రస్తుతం పరిస్ధితులు మారాయని అన్నారు. టీ–20 వరల్డ్ కప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో తలపడిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని అసదుద్దీన్ ఖండించారు. దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోందని, మైనారిటీలను దోషులుగా చూపించి మెజారిటీ మతస్తులను ఉపయోగించుకునే రాజకీయాలు పెరిగిపోతున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment