asduddin owaisi
-
పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్‌తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రేవంత్ ప్లాన్?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో తెలంగాణలో బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ చేసిన ప్రకటనపై ఇప్పుడు కాంగ్రెస్ దృష్టిపెట్టింది. కాంగ్రెస్‌కు సంప్రదాయకంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చే కుట్రలో భాగంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కాంగ్రెస్‌పై పడే ప్రభావం ఎలా ఉంటుంది, దీనిని ఎలా ఎదుర్కోవాలన్న విషయాలపై ఆలోచన చేస్తోంది. ఈ మేరకు వ్యూహాలను సిద్ధం చేయాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించినట్టు సమాచారం. ముస్లిం ఓటర్లు 15% నుంచి 40% వరకున్న 49 నియోజకవర్గాల పరిధిలో కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఎంఐఎంను అడ్డుకోవాల్సిందే.. రాష్ట్రంలో సుమారు 44 లక్షల ముస్లిం జనాభా ఉంది. ఇందులో 20 వేలకన్నా ఎక్కువ ముస్లిం ఓటర్లున్న నియోజకవర్గాలు 49 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యేలున్న స్థానాలతోపాటు కొత్తగా జహీరాబాద్, సంగారెడ్డి, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, కరీంనగర్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, వరంగల్ ఈస్ట్, మహబూబ్‌నగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డిలలో మజ్లిస్ పోటీచేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేసినట్టు తెలిసింది. ఇందులో మెజార్టీ స్థానాలు ప్రస్తుత సర్వేల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవేనని.. కేవలం ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకే ఎంఐఎం ఆ స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఎంఐఎం ప్రాబల్యాన్ని అడ్డుకోకుంటే.. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. కర్ణాటకలో కలసిరావడంతోనే.. కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లడం విజయానికి బాటలు వేసిందని.. బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన 4% రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామన్న ప్రకటన కాంగ్రెస్‌కు కలసి వచి్చందని నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ హామీఇచ్చి అమలు చేయలేకపోయిన ముస్లింలకు 12% రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. ముస్లింలలో ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ఆ మార్పుల ప్రచారం కేసీఆర్ కుట్ర -
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. బిగ్ బాంబ్ పేల్చిన ఒవైసీ!
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న బోధన్ ఎంఐఎం నేతలతో ములాఖత్ అయ్యారు. అయితే, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో మజ్లిస్ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జైలు ములాఖత్ అనంతరం ఒవైసీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెబుతాం. ఎంఐఎం కౌన్సిలర్స్, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తాం. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత, షకీల్ గెలుపు కోసం పనిచేశారు. తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కవగానే ఉన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాము. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారు. ఆ మసీదులు వెంటనే కట్టాలి అని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఎంఐఎం బలపడటం కోసం ముందుగా పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. మణిపూర్‌లో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీలో కోల్డ్‌వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు? -
కవిత విచారణ.. ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత.. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో.. కవిత, బీఆర్ఎస్ పార్టీ సర్కార్‌పై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీజేపీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఒవైసీ.. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చినట్లు అసద్ పేర్కొన్నారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలన్నట్టు అంటున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి కారణంగానే కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందన్నారు. BJP MPs have called for economic boycott of Muslims; they’ve asked people to keep weapons at home. But Modi govt is busy targeting @TelanganaCMO & his family for his leadership in Telangana’s inclusive development — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2023 -
మోదీకి ఊహించని షాక్.. ఒవైసీకి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ
కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన ఎంపీ.. సొంత పార్టీ బీజేపీపైనే సంచలన విమర్శలు చేశారు. దీంతో దేశంలోనే ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల ప్రకారం.. యూపీలోని పిలిభిత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. కేంద్రానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. దేశంలోని నిరుద్యోగ సమస్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని నిరుద్యోగం గత మూడు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్ ప్రాబ్లమ్ అంటూ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగితేనే దేశం శక్తివంతం అవుతుందని కుండబద్దలుకొట్టారు. ఒక వైపు ఉద్యోగాలు లేక దేశంలోని కోట్ల మంది యువత నిరుత్సాహంలో మునిగి ఉన్నారని అన్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కొద్దిరోజుల కిత్రం పలు కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల ఖాళీలను వెల్లడించారు. ఈ సందర్బంలో తాను చదవి వినిపించిన డేటా తనది కాదని.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీదని తెలిపారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న పోస్టుల గురించి తన డేటాను చదవి వినిపించిన అసదుద్దీన్ ఒవైసీకి వరణ్ గాంధీ కృతజ్ఞతలు చెప్పారు. बेरोज़गारी आज देश का सबसे ज्वलंत मुद्दा है और पूरे देश के नेताओं को इस मुद्दे पर सरकार का ध्यान आकृष्ट कराना चाहिए। बेरोज़गार नौजवानों को न्याय मिलना चाहिए,तभी देश शक्तिशाली बनेगा। मैं आभारी हूँ की रोजगार के ऊपर उठाए गए मेरे सवालों का @asadowaisi जी ने अपने भाषण में ज़िक्र किया। pic.twitter.com/MAqfTOtHKZ — Varun Gandhi (@varungandhi80) June 13, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగిపై అసదుద్దీన్ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ -
TS: గవర్నర్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు చేయగా.. రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అయితే ఇటీవల గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో గవర్నర్ సైతం కేంద్రానికి పలు ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ గవర్నర్‌తో వ్యహరిస్తున్న తీరును బీజేపీ తప్పుపడుతోంది. @DrTamilisaiGuv Excellency the Governor is a titular head and appointing a bjp party member as your Public relations officer is a case of impropriety ,it also raises doubts about your complaints with regards to @TelanganaCMO https://t.co/mihPZBXrcX — Asaduddin Owaisi (@asadowaisi) April 22, 2022 -
అసదుద్దీన్ ఒవైసీని అందుకే చంపాలనుకున్నా
లక్నో: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన నిందితుడు సచిన్ పండిట్ నేరం అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు విచారణలో అతడు వెల్లడించాడని తెలిపారు. బుల్లెట్లు తగిలే ఉంటాయనుకున్నా ‘నేనో పెద్ద రాజకీయ నాయకుడిని కావాలనుకున్నాను. కానీ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని కలత చెందాను. అందుకే నా స్నేహితుడు శుభమ్‌తో కలిసి ఒవైసీ హత్యకు పథకం వేశాను. నేను ఒవైసీపై కాల్పులు జరిపినప్పుడు ఆయన వంగిపోయాడు. దీంతో కిందకు కాల్పులు జరిపాను. ఒవైసీకి బుల్లెట్లు తగిలే ఉంటాయని అనుకున్నాను. తర్వాత అక్కడి నుంచి పారిపోయాన’ని పోలీసుల విచారణలో సచిన్ వెల్లడించాడు. దాడికి చాలాసార్లు ట్రైచేశా ఒవైసీపై దాడికి చాలా రోజులు నుంచి ప్రణాళిక తయారు చేసినట్టు చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఎంపీ కదలికలను తెలుసుకునేవాడినని, దాడి చేయడానికి పలుమార్లు ఒవైసీ సమావేశాలకు కూడా వెళ్లినట్టు తెలిపారు. అయితే సమావేశాలకు జనం భారీ సంఖ్యలో రావడంతో దాడి చేయడం సాధ్యపడలేదని అన్నాడు. ‘ఒవైసీ మీరట్ నుంచి ఢిల్లీకి వెళతారని తెలుసుకుని.. నేను ఆయన కంటే ముందే టోల్గేట్ వద్దకు చేరుకున్నాను. ఒవైసీ కారు రాగానే కాల్పులు జరిపాన’ని పోలీసుల విచారణలో సచిన్ చెప్పినట్టు సమాచారం. పిస్టల్ ఇచ్చింది అతడే ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇప్పటివరకు సచిన్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు హాపూర్ అడిషినల్ ఎస్పీ తెలిపారు. సచిన్ నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి పిస్టల్ సమకూర్చిన మీరట్‌కు చెందిన తలీమ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సచిన్ ఉద్దేశం గురించి అతడికి తెలియదని విచారణలో తేలింది. కాగా, సచిన్ పండిత్ బీజేపీ నాయకులతో కలిసివున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (చదవండి: ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడను) -
బుల్లెట్ ప్రూఫ్ లేకుండా మాట్లాడటంలో కొత్తేముంది?
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్ సభలో బుల్లెట్ ప్రూఫ్ లేకుండా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడటంలో కొత్తేముందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో పార్లమెంటరీ ప్రతినిధుల బృందం కూడా అక్కడ బ్లులెట్ ప్రూఫ్ లేకుండా పర్యటించిందని, అందులో తాను కూడా ఉన్నానని గుర్తుచేశారు. ప్రస్తుతం పరిస్ధితులు మారాయని అన్నారు. టీ–20 వరల్డ్ కప్‌లో ఆదివారం పాకిస్తాన్‌తో తలపడిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని అసదుద్దీన్ ఖండించారు. దేశంలో ప్రతి అంశం మతాల మధ్య గొడవలా తయారవుతోందని, మైనారిటీలను దోషులుగా చూపించి మెజారిటీ మతస్తులను ఉపయోగించుకునే రాజకీయాలు పెరిగిపోతున్నాయన్నారు. -
West Bengal Election 2021 బెంగాల్ దంగల్: దీదీకి మొదలైన తలనొప్పి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకోసం మిషన్ బెంగాల్లో భాగంగా రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో ప్రణాళికలు రచించడంలో నిమగ్నమయ్యాయి. త్వరలో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పోటీ అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీకి మధ్యే ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను సమీకరించేందుకు పలు ప్రాంతీయ పార్టీలు దృష్టిపెట్టడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో జెండా ఎగురవేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి దుమారానికి తెరలేపారు. ఒవైసీ రంగప్రవేశంతో రాష్ట్రంలో ఉన్న 30 శాతం మంది ముస్లింల ఏకీకరణ జరుగుతుందని దీదీకి కలవరం మొదలైంది. ఇప్పడా కలవరం మరింత పెరుగుతోంది. బంగ్లాదేశ్ ముస్లింల ప్రభావంతో, ఫుర్ఫురా షరీఫ్ దర్గాకు చెందిన ఫిర్జాదా అబ్బాస్ సిద్దిఖీ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అనే పార్టీని ఏర్పాటు చేసి తాను బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒవైసీ–సిద్దిఖీల మధ్య ముస్లింల ఏకీకరణ అనే అంశంలో ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ప్రయోజనం పొందుతారు? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే వీరిద్దరి మధ్య పోటీ దీదీకి కలిసొస్తుందని తృణమూల్ నాయకులు ఆశిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ తృణమూల్, బీజేపీ మధ్య ఉన్నప్పటికీ కాంగ్రెస్– వామపక్షాలు కలిసి పోటీ చేస్తుండడంతో పోటీ ఇప్పుడు త్రిముఖపోటీగా ఉండనుంది. బెంగాల్లో తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు ఇతర రాష్ట్రాల్లోని మరికొన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల సమీకరణపై దృష్టిపెట్టాయి. అయితే ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరి విజయావకాశాలను దెబ్బతీస్తాయనే విషయంపై స్పష్టత కరువైంది. హిందుత్వ ఎజెండాతో బరిలో దిగే బీజేపీ దూకుడుకు కళ్లెంవేసేందుకు శివసేన వ్యూహరచన చేస్తోంది. బెంగాల్ ఎన్నికల్లో జార్ఖండ్ రాజకీయ పార్టీలు తమ ప్రాధాన్యతను పెంచుకునే పనిలోఉన్నాయి. ఇప్పటికే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఝాడ్‌గ్రామ్ జిల్లాలో జరిగిన మొదటి ఎన్నికల సమావేశంలో తమ పార్టీ 40 స్థానాల్లో బరిలో దిగనుందని ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. జార్ఖండ్‌లో బీజేపీ మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ నాయకులు బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ), హిందూస్తానీ లెఫ్ట్ ఫ్రంట్ (హమ్), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో సహా శివసేన వంటి పార్టీలు బెంగాల్ బరిలో తమ వ్యూహాలు రచిస్తున్నాయి. హేమంత్ సోరెన్‌కు మమతా బెనర్జీతో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ, బెంగాల్ ఎన్నికల్లో జేఎంఎం బరిలో దిగుతుందన్న సోరెన్ ప్రకటనను దీదీ జీర్ణించుకోలేకపోతున్నారు. హేమంత్ బెంగాల్ వచ్చి రాజకీయాలు చేస్తున్నాడని మమత వ్యాఖ్యానించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 54 పార్టీలు తమ అభ్యర్థులను బరిలో దింపాయి. బీఎస్పీ 161, ఎస్పీ 23 మంది, శివసేన 21 మంది అభ్యర్థులను నిలబెట్టింది. జేఎంఎం, ఏజేఎస్‌యూ, ఎల్జేపీ, ఎన్సీపీ, ఆర్జేడీ అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ ఫలితంలేకుండా పోయింది. పదేళ్లు అధికారంలో ఉన్న కారణంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాల్లో 193 సీట్లలో పోటీకి సంబంధించి కాంగ్రెస్, వామపక్షాలు ఒప్పందం పూర్తయింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయని తృణమూల్ నాయకులు భావిస్తున్నారు. త్రిముఖ పోటీలో చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారబోతోంది. ఒవైసీ– సిద్దిఖీలు ముస్లిం ఓటు బ్యాంకుపై దృష్టిసారించగా, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్(ఏజేఎస్‌యూ) గిరిజనులు ఎక్కువగా ఉన్న పురూలియా, ఝాడ్‌గ్రామ్, పశ్చిమ మేదినీపూర్, బంకురా, తూర్పు మరియు పశ్చిమ బర్ధమాన్, వీర్‌భూం వంటి జిల్లాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజన ఓట్లు చాలా సీట్ల విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. చదవండి: అద్దంలో చూస్కోండి: బీజేపీ నేతలకు మమత సలహా కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ సీఎం -
నన్ను కొనే మనిషి ఇంకా పుట్టలేదు: ఒవైసీ
కోల్‌కతా: ముస్లింలను విభజించడానికి కోట్లు ఖర్చు పెట్టి బీజేపీ హైదరాబాద్ నుంచి ఒక పార్టీని తీసుకువచ్చింది అంటూ ఎంఐఎంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండి పడ్డారు. డబ్బుతో అసద్‌ని కొనే మనిషి ఇంకా పుట్టలేదని స్పష్టం చేశారు. అంతేకాక ముస్లిం ఓట్లు మమత జాగిరు, ఆస్తులు కాదని మండిపడ్డారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘డబ్బుతో నన్ను కొనే మనిషి ఇంతవరకు పుట్టలేదు. ఆమె(మమతా బెనర్జీ) ఆరోపణలు అవాస్తవాలు. ఆమె ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఆమె పార్టీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు. సొంత రాష్ట్రంలోనే ఆమె భయపడుతున్నారు. బిహార్ ఓటర్లును, మాకు ఓటు వేసిన ప్రజలను ఆమె అవమానించారు. గతంలో పార్టీలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఓటు కట్టర్లు అని ఆరోపిస్తే.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో గుర్తు పెట్టుకొండి. ముస్లిం ఓట్లు ఏమైనా మీ జాగీరా’ అంటూ ఒవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. (చదవండి: మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) "ఇప్పటివరకు మీరు మీకు విధేయులైన మీర్ జాఫర్స్, సాదిక్లతో మాత్రమే వ్యవహరించారు. తమ గురించి ఆలోచించే, మాట్లాడే ముస్లింలను మీరు ఇష్టపడరు. బిహార్‌లోని మా ఓటర్లను మీరు అవమానించారు. ముస్లిం ఓటర్లు మీ జాగీర్ కాదు'' అని తృణమూల్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒవైసీ ట్వీట్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించడంతో.. వచ్చే ఏడాది బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో కూడా ఎంఐంఎం పోటీ చేయాలని భావిస్తోన్నట్లు సమాచారం. -
‘మా ఎన్నికలతో నీకేం పని’
సాక్షి, హైదరాబాద్ : ప్రధానిగా నరేంద్ర మోదీ తిరిగి ఎన్నిక అయితేనే భారత్-పాక్ మధ్య శాంతి చర్చలు సాగుతాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగుతాయని, పాకిస్తాన్లో ఎన్నికల ప్రక్రియ సైన్యం, నిఘా సంస్థల నియంత్రణలో ఉంటుందన్న సంగతి ఇమ్రాన్ గుర్తెరగాలన్నారు. ఇమ్రాన్ ప్రకటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, కశ్మీర్ సమస్య పరిష్కారానికి నరేంద్ర మోదీ తిరిగి ప్రధాని కావాలని తాను కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించడం సరైంది కాదని స్పష్టం చేశారు. కశ్మీర్ ఏ ఒక్కరి ప్రైవేట్ ఆస్తి కాదని తాను ఇమ్రాన్‌కు గుర్తుచేస్తున్నానని ఓవైసీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఓవైసీ విలేకరులతో మాట్లాడుతూ ప్రధానిగా మోదీ మళ్లీ అధికారం చేపట్టాలని ఇమ్రాన్ ఖాన్, పాక్ ఐఎస్ఐ కోరుతున్నాయని, వారి ఆకాంక్షను భారత ప్రజలు నెరవేర్చబోరని వ్యాఖ్యానించారు. కశ్మీర్ భారత్‌కు గుండెకాయ వంటిదని, అది దేశంలో అంతర్భాగమని ఓవైసీ పేర్కొన్నారు. -
టీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం సభలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు మద్దతుగా మజ్లిస్ పార్టీ రంగంలో దిగింది. ఇప్పటికే మజ్లిస్ పార్టీ శ్రేణులు టీఆర్ఎస్తో కలసి పాదయాత్రలతో ప్రచారంలో పాల్గొంటున్నాయి. అలాగే టీఆర్ఎస్ బహిరంగ సభల్లో మజ్లిస్ అగ్రనేతలు పాల్గొని మద్దతు ప్రకటిస్తున్నారు. మంగళవారం సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని పహాడీషరీఫ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ పాల్గొని టీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముస్లిం పక్షపాతి కేసీఆర్‌ను బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 16 స్థానాల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. అంతకుముందు కూడా సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అహ్మద్‌నగర్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఓవైసీ సభల్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొనడం టీఆర్ఎస్ నేతలకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. మరోవైపు హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అసద్ ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాదయాత్రలు, రాత్రి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే మహారాష్ట్రలో సైతం మిత్రపక్షాల అభ్యర్థులకు మద్దతుగా చందాపూర్, అమరావతి, నాగ్‌పూర్ సభల్లో పాల్గొన్నారు. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ లోక్‌సభతో పాటు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బిహార్‌లోని కిషన్‌గంజ్ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
ప్రధాని పదవికి కేసీఆర్ అర్హుడు
హైదరాబాద్: ప్రధానమంత్రి పదవికి కేసీఆర్ అర్హుడని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధులలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్నికల సభల్లో ఆయన పాల్గొన్నారు. సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌కు మద్దతుగా అహ్మద్‌నగర్ డివిజన్ లోని ఫస్ట్‌లాన్సర్‌లో, గోల్కొండ రిసాలా బజార్లలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీల కంటే కేసీఆర్ సమర్థుడైన నాయకుడని అన్నారు. పాలన అనుభవంతో పాటు పేద ప్రజల కష్ట సుఖాలు తెలిసిన కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని పదవికి పూర్తిగా అర్హుడని అన్నారు. ఏ మాత్రం పాలన అనుభవం లేని రాహుల్ ప్రధాని పదవికి ఏ విధంగా అర్హుడవుతాడని ప్రశ్నించారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు మొత్తం 17 ఎంపీ స్థానాలు గెలిచి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కేసీఆర్ చక్రం తిప్పే నాయకుడవుతాడని జోస్యం పలికారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏ మాత్రం ఉనికి లేని బీజేపీ.. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోందని అన్నారు. కేసీఆర్ పారదర్శక పాలనను చూసి తాము ఆయన నాయకత్వాన్ని పూర్తిగా సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్, మాజీ మేయర్, మెహిదీపట్నం కార్పొరేటర్ మాజీద్ హుస్సేన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్, తలసాని సాయికిరణ్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
కాపీ, పేస్ట్ బడ్జెట్: ఒవైసీ
న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కాపీ, పేస్ట్ బడ్జెట్ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. సొంత ఆలోచనలు, దార్శనికత లేకుండా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు లాంటి నాయకులు దేశాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా కేంద్ర మధ్యంతర బడ్జెట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్‌ను ఆర్థిక అధికారులు తయారు చేశారా, ఆర్ఎస్ఎస్ చేసిందా అని ఆయన ప్రశ్నించారు. తాను రైతులకు రుణమాఫీ ప్రకటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారని, ఇప్పుడు ఆయనే రైతులకు తాయిలాలు ప్రకటించారని తెలిపారు. -
మజ్లిస్ శాసనసభాపక్ష నేతగా అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేతగా చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్ దారుస్సలాంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఎన్నుకున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభాపక్షనేతగా ఎన్నిక కావడం ఇది ఐదోసారి. పార్టీ అధినేత అసదుద్దీన్‌కు సోదరుడైన అక్బరుద్దీన్ 1999లో రాజకీయ అరంగేట్రం చేసిన మొద టి పర్యాయమే చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్క డ గతంలో వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతి నిథ్యం వహించిన రాజకీయ ప్రత్యర్థి, మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ) అధినేత మహ్మద్ అమానుల్లాఖాన్‌ను ఓడించి అక్బరుద్దీన్ మొదటిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి అక్బరుద్దీన్ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 5 సార్లు చాంద్రాయణగుట్ట నుంచి ఎన్నికయ్యారు. ప్రతిసారి ప్రత్యర్థులను చిత్తుచేసి భారీ మెజార్టీ సాధిస్తూ వస్తున్నారు. సమావేశంలో పార్టీ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
హంగ్ రాలేదు.. ఎంఐఎం స్థానాలూ మారలేదు!
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో తమను ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఏ పార్టీకి లేవనీ, అందరు సీఎంలు తమకు సలాం కొట్టినవారేనని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికలకు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో హంగ్ వస్తే ఎంఐఎందే కీలక పాత్ర అని కూడా ఆయన వెల్లడించారు. కానీ, ఆయన ఆశలు నెరవేరలేదు. తెలంగాణలో హంగ్ రాలేదు. అలాగనీ ఎంఐఎం గెలిచిన స్థానాల్లో కూడా పెద్దగా మార్పు లేదు. ఎప్పటిలాగే తన కంచుకోట హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. ఈసారి నగర శివారు నియోజకవర్గమైన రాజేంద్రనగర్‌లో పోటీ చేసి.. ఉత్కంఠ రేపినప్పటికీ.. అక్కడ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మరోసారి విజయం సాధించారు. కానీ, ఇక్కడ ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఎంఐఎం రెండోస్థానంలో నిలువడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్స్కే పట్టం కట్టడంతో.. ఎంఐఎంకు ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లభించే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. టీర్ఎస్కే తమ పూర్తి మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఇదివరకే ప్రకటించారు. అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ ఆహ్వానంపై ఆలోచించిస్తానని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కేసీఆర్‌ను కలిసిన ఆయన తమ పార్టీ టీఆర్ఎస్కే అనుకూలమని విస్పష్ట సంకేతాలు పంపారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం.. తమ పనులు చేయించుకోవడం ఆది నుంచి ఎంఐఎం అనవాయితీగా పెట్టుకుంది. గత హయాంలో కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించిన ఎంఐఎం ఈసారి కూడా అలాగే వ్యవహరించే అవకాశముంది. ఎంఐఎం గెలుపొందిన స్థానాలు.. మలక్‌పేట: అహ్మద్ బలాల, నాంపల్లి: జాఫర్ హుస్సేన్ మెరాజ్, చార్మినార్: ముంతాజ్ అహ్మద్ ఖాన్, చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఓవైసీ, యాకుత్ పురా: అహ్మద్ పాషా ఖాద్రి, బహదుర్‌పుర : మహ్మద్ మౌజంఖాన్, కార్వాన్: కౌసర్ మొహినుద్దీన్ స్థానాల్లో విజయం సాధించగా.. రాజేంద్రనగర్‌లో గట్టిపోటినిచ్చి ఓటమి పాలైంది. టీఆర్ఎస్ అభ్యర్థి తలకంటి ప్రకాశ్‌గౌడ్ చేతిలో మీర్జా రహమత్ బైగ్ పరాజయం పాలయ్యారు. -
ఏపీలో ఏమీ చేయలేని బాబు తెలంగాణలో ఏంచేస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి నాలుగేండ్లలో ఆ రాష్ట్రానికి ఏమీ చేయలేని చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఏం చేస్తారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీల అనైతిక పొత్తును ప్రజలు తిప్పికొడతారని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు వల్ల ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఏపీలో కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టీడీపీతో పొత్తువల్ల అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, తెలంగాణలో నిండా మునుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఘోర పరాభవం తప్పదని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంతవరకు ఏపీలో రాజధానిని నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాత్కాలిక సచివాలయంలో తన గదిలోకి వాననీరు వస్తే ఏమీ చేయలేకపోయారన్నారు. ‘నేను చంద్రబాబుకు సవాల్ చేస్తున్నా.. నీవు, నీ కొడుకు కలసి హైదరాబాద్‌లో పోటీ చేయండి. మేం కూడా పోరాడుతాం. ఎవరి శక్తి ఏమిటో తేలిపోతుంది. టీడీపీకి మిగిలిన కొంత బలం కూడా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. టీఆర్ఎస్ హయాంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలు ఎలాంటి వివక్ష లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. సెటిలర్లు.. ఆంధ్రావాళ్లు అని ఎవరైనా అంటున్నారా? తెలంగాణ ప్రజలుగానే చూశారు. శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. పౌరుల్లో అభద్రత లేదు. మత కలహాలు అసలే లేవు. ఇంకా ఏం కావాలి. టీఆర్ఎస్ ఇంకా అభివృద్ధి చేయాల్సింది అని చెప్పగలుగుతామే తప్ప.. ఎలాంటి లోటూ లేదు’అని అన్నారు. మళ్లీ టీఆర్ఎస్కే అధికారం.. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, మళ్లీ సీఎంగా కేసీఆరే అవుతారని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంచేశారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశమే లేదన్నారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని, తిరిగి ఆ పార్టీకే అధికారం కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాకర్షక బలం ముందు ఈ రెండు పార్టీలు ఎదురునిలవలేవన్నారు. ఎంఐఎంకు సీఎం పదవి, ఇతర పదవులపై ఆశలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఉన్న సీట్లను కాపాడుకోవడంతోపాటు బలాన్ని పెంచుకోవడంపైనే దృష్టిసారించామని, తమకు మరో లక్ష్యం లేదని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిపై ఇవీ ఆయన అభిప్రాయాలు.. ఆ ధైర్యం కేసీఆర్‌కే ఉంది.. ప్రజల స్పందనను చూస్తున్నా. ఏ పార్టీ అయినా ఒక్కరోజు కూడా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే గుండె ధైర్యం ఒక్క కేసీఆర్‌కే ఉన్నది. ప్రజల్లో సానుకూలత ఉన్నది కాబట్టే.. తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్తున్నారు. శాసనసభను రద్దుచేయడంతోపాటు వెంటనే అభ్యర్థులను కూడా ప్రకటించారు. మా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టారు. మేం కూడా పోరాడుతాం. మొత్తంగా చూస్తే ప్రజల్లో సీఎం కేసీఆర్‌కు పాపులారిటీ, రేటింగ్ చాలా ఉంది. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా. మరి ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఎక్కడికి పోయింది? చంద్రబాబు మొన్నటివరకు బీజేపీకి మిత్రుడిగా ఉన్నారు. అప్పుడు సెక్యులరిజం గుర్తుకు రాలేదా? ఆయన బీజేపీని ఎందుకు వదిలేశారు. సెక్యులరిజం కోసమా? బీజేపీ ప్రభుత్వం గోరక్షణ పేరుతో ఇక్లాఖ్‌ను చంపినప్పుడు, జునైద్‌ను రైలులో చంపినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనం గా ఉన్నారు? గోరక్షణ పేరుతో మైనార్టీలను చంపా రు. దళితులపై దాడులు జరిగినప్పుడు బాబు ఏం చేశారు? అప్పుడు టీడీపీ కేంద్ర మంత్రివర్గంలో అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆయన సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్ మతకలహాల సమయంలోనూ బాబు కేంద్రంలో బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకున్నారు. హంగ్ వచ్చే పరిస్థితి లేదు ఎంఐఎం అధ్యక్షుడిగా నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నా.. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో హంగ్ వచ్చే అవకాశమే లేదు. టీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీతోమళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. మేం కొన్ని చోట్ల టీఆర్ఎస్తో కూడా కొట్లాడుతాం. మా పార్టీ బలాన్ని నిలుపుకోవడంతోపాటు బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. మైనార్టీలు, బలహీన వర్గాల సంక్షేమమే మా పార్టీ ప్రధాన ఎజెండా. అందుకే మేం టీఆర్ఎస్కు మద్దతిస్తున్నాం. ప్రజలు నాలుగున్నరేండ్లపాటు టీఆర్ఎస్ పాలనను చూశారు. మంచిగా పనిచేశారనే విశ్వాసం వారిలో ఏర్పడింది. కాంగ్రెస్‌కు చెందిన బడా నాయకులు టీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనం. -
ఇస్లాంకు శత్రువు ఐఎస్ఐఎస్
హైదరాబాద్: జీహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదనీ దీనిపేరిట యువత తప్పుదారి పట్టడం సరికాదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ యువతకు హితవుపలికారు. వారికి జీహాద్ చేయాలనే భావనే ఉంటే తమ తమ బస్తీ పరిసరాల్లోని సమస్యలపై దృష్టిసారించాలని విజ్ఞప్తిచేశారు. గురువారం నగరంలోని జామియా నిజామియాలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇస్లాంకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్, సిరియా) ప్రధాన శత్రువన్నారు. ఐఎస్ఐఎస్తో ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ వాదం ఒక దగా, మోసమని చెప్పారు. ఇస్లాం పేరిట రక్తపాతం సృష్టించడం సహించరానిదన్నారు. జీహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్‌లలో కనిపించే సమాచారం చూసి యువత దారితప్పుతోందనీ, ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాంటి సంఘ విద్రోహ శక్తులు పొందుపరచిన సమాచారమే అందులో ఉంటుందన్నారు. జీహాద్‌కు స్పష్టమైన నిర్వచనాన్ని మతగురువులు మౌలానాలను సంప్రదిస్తే తెలుస్తుందన్నారు. నిజంగా జీహాద్ చేయాలనుకుంటే యువత తమ తమ బస్తీ పరిసరాల్లోని చెడు సమస్యలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ కోరారు. ప్రజాస్వామిక దేశంలో మత స్వేచ్ఛను ఆపడం ఎవరి తరంకాదన్నారు.