సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత.. ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీంతో.. కవిత, బీఆర్‌ఎస్ పార్టీ సర్కార్‌పై విపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. బీజేపీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు.
కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఒవైసీ.. దేశంలోని ముస్లింలను ఆర్థికంగా వెలివేయాలని బీజేపీ ఎంపీలు పిలుపునిచ్చినట్లు అసద్ పేర్కొన్నారు. ముస్లింలను ఎదుర్కొనేందుకు ప్రజలు తమ ఇండ్లల్లో ఆయుధాలు పెట్టుకోవాలన్నట్టు అంటున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్.. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి కారణంగానే కక్ష సాధింపులో భాగంగానే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందన్నారు.
BJP MPs have called for economic boycott of Muslims; they’ve asked people to keep weapons at home. But Modi govt is busy targeting @TelanganaCMO &
— Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2023
his family for his leadership in Telangana’s inclusive development
Comments
Please login to add a commentAdd a comment