రాహుల్ గాంధీ ఎద్దేవా
బక్తియార్‌పూర్/పాలీగంజ్/జగదీశ్‌పూర్(బిహార్): తాను సామాన్య వ్యక్తినికాదని, దేవుడు పంపించాడని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం బిహార్‌లో బక్తియార్‌పూర్, పాలీగంజ్, జగదీశ్‌పూర్‌ల్లో ఆయన ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు.
‘‘ఎన్నికల ఫలితాలొచ్చాక బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై మోదీని ఈడీ ప్రశ్నించొచ్చు. అప్పుడాయన ‘నాకేమీ తెలీదు. దేవుడు పంపిస్తే వచ్చా. ఆయన చెప్పినట్లే చేశా’’ అని చెబుతారేమో’’ అంటూ ఎద్దేవా చేశారు. బిలియనీర్లకు సేవ చేయడానికే దేవుడు ఆయన్ను పంపాడా అంటూ మండిపడ్డారు.
పాలీగంజ్‌లో రాహుల్, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె, పాటలీపుత్ర అభ్యర్థి మీసా భారతి సహా డజనుకు పైగా నేతలు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుంగింది. దాంతో రాహుల్ కాస్త పక్కకు నడవగా అక్కడా కుంగింది. వారంతా కింద పడబోయి తమాయించుకున్నారు.
మోదీవి కూలదోసే కుట్రలు: ప్రియాంక
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ప్రియాంకా గాంధీ వద్రా ఆరోపించారు. కాంగ్రా సమీపంలోని చంబాలో ఆమె కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment