మేమొస్తే అగ్నివీర్‌ను రద్దుచేస్తాం: రాహుల్
బాలాసోర్(ఒడిశా): అగ్నివీర్ పథకం ద్వారా ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒడిశాలోని భద్రక్ లోక్‌సభ నియోజకవర్గంలోని సిమూలియా పట్టణంలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ విపక్షాల ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలను మాఫీచేస్తాం.
అగ్నివీర్ పథకం తెచ్చి ప్రధాని మోదీ జవాన్లను కార్మికులుగా మార్చేశారు. మేం అగ్నివీర్‌ను రద్దుచేసి ఆ కార్మికులను మళ్లీ జవాన్లుగా మారుస్తాం. వారికి పెన్షన్, క్యాంటీన్ సౌకర్యాలు కలి్పస్తాం. విధి నిర్వహణలో మరణిస్తే గౌరవప్రద ‘అమ రుడు’ హోదా దక్కేలా చేస్తాం . పంటకు కనీస మ ద్దతు ధరకు చట్టబద్దత కలి్పస్తాం’ అని అన్నారు.
నవీన్ బాబుపై కేసులేవి?: ‘‘ఒడిశాలో బీజేడీ పార్టీ బీజేపీ కోసం పనిచేస్తోంది. నాపై మోపిన 24 పరువునష్టం, క్రిమినల్ కేసులను న్యాయంగా ఎదుర్కొంటున్నా. ఈడీ నన్ను 50 గంటలు విచారించింది. బీజేపీ నా లోక్‌సభ సభ్యత్వాన్ని, నాకు కేటాయించిన అధికారిక ఎంపీ బంగ్లానూ లాగేసుకుంది. నవీన్ బాబు(పట్నాయక్) నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడితే ఆయన మీద కూడా ఇలాగే కేసులు ఉండాలికదా. మరి లేవెందుకు?’ అని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లకు అంతకుమించి తెలీదు
హాలీవుడ్ ‘గాంధీ’ సినిమా తర్వాతే గాం«దీజీ విశేషాలు ప్రపంచానికి తెలిశాయంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. ‘‘ ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లకు గాం«దీజీ గురించి అంతకుమించి ఏం తెలీదు. ఎందుకంటే ఆర్‌ఎస్‌ఎస్ ‘శాఖ’లో శిక్షణపొందిన వాళ్లు గాడ్సేను ఆరాధిస్తారు. గాం«దీజీ గురించి వాళ్లకు తెలిసింది శూన్యం. హిందుస్తాన్, సత్యం, అహింసా మార్గం వంటి చరిత్ర వాళ్లకు బొత్తిగా తెలీదు. మోదీ అలా మాట్లాడతారని ఊహించిందే’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment