సాక్షి, హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చాలా రోజుల తర్వాత ట్వీట్ చేసిన కవిత.. అదానీ వ్యవహారంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు చేశారు.
‘‘అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా?. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా?. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??’’ అంటూ కవిత సూటిగా ప్రశ్నించారు.
అఖండ భారతంలో
అదానికో న్యాయం...
ఆడబిడ్డకో న్యాయమా ?
ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా ?
ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ??— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 21, 2024
కాగా, లిక్కర్ కేసులో.. మార్చి 15వ తేదీన తన నివాసంలో కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ 11న ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. మొత్తం ఈ కేసులో ఐదు నెలలపైనే ఆమె తీహార్ జైల్లో గడిపారు. ఆగస్టు 27న సుప్రీం కోర్టులో ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను.. ద్విసభ్య ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది.
ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ట్విట్టర్ వేదికగా సత్యమేవ జయతే అని కామెంట్స్ చేస్తూ ఓ పోస్టు చేశారు. తన భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. తాజాగా, కొన్ని రోజుల విరామం అనంతరం తొలిసారిగా బీజేపీ, ప్రధాని మోదీపై ఆరోపణలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment