సాక్షి, నిజామాబాద్: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పేరు రాహుల్ గాంధీ కాదు.. ఎన్నికల గాంధీగా పెట్టుకోవాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు.
కాగా, ఎమ్మెల్సీ కవిత బోధన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ బలంగా ఉందని ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ వంటి కీలక నేతలు నిజామాబాద్‌కు వస్తున్నారు. టూరిస్టులు రావొచ్చు.. వెళ్లొచ్చు. రాహుల్ జీ ఇక్కడికి రండి.. అంకాపూర్ చికెన్ తినండి.. అన్ని చూడండి.. కానీ, ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండి. రాహుల్ గాంధీ ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఆయన పేరు ఎన్నికల గాంధీ అని పెట్టుకోవాలి. బీసీ గణన గురించి రాహుల్ చెప్పాల్సిన అవసరం లేదు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయ్యింది చంద్రబాబు హయాంలో అది రాహుల్ గాంధీ గమనించాలి. నిజాం షుగర్స్ కార్మికులు, రైతులకు నష్టం జరగకుండా ఆదుకున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వం. రాహుల్ అవాక్కులు.. చెవాక్కులు మాట్లాడుతున్నారు. ప్రజలు అది అర్థం చేసుకోవాలి. గడిచిన పదేళ్లలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదు. రాహుల్‌కి అవి తెలియవా?. ఎన్నికల కోసం బీజేపీని మీరు ఒక మాట అంటారు.. వాళ్లు మిమ్మల్ని ఒకటి అని ఇబ్బందులు తెస్తారు. మేమంతా శాంతి సమరస్యాలతో ఉంటాం. ప్రధాని మోదీ బీఆర్‌ఎస్ పథకాలను కాపీ కొడుతున్నారు. వ్యవసాయం పండుగలా మార్చిన వ్యక్తి కేసీఆర్. సీఎం కేసీఆర్ హయాంలో సాగునీటి రంగం పూర్తిగా అభివృద్ధి చెంది మూడు పంటలు సాగవుతున్నాయి’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో భారీ షాక్..
Comments
Please login to add a commentAdd a comment