సాక్షి, నిజామాబాద్: ఆయా పార్టీ అగ్రనేతల పర్యటనలు చూస్తుంటే.. పంటలపై మిడతల దండు దాడి చేసినట్టు ఉందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, రాహుల్‌పై మండిపడ్డారు. దండయాత్రకు వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆమె దుయ్యబట్టారు.
‘‘రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ప్రియాంక చదువుతున్నారు. బీజేపీ హయాంలో పెద్ద కంపెనీలే బాగుపడ్డాయి. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు?. రాహల్ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదు. వెయ్యి బుల్‌డోజర్లకు కారు ఒక్కటే సమాధానం. ట్రైలర్‌కే భయపడ్డారు. సినిమా మిగిలే ఉంది’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ నాయకులు వెంటపడి రైతు బంధును ఆపించారు. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుంది. నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలి. బీజేపీతో మా శతృత్వం. కాంగ్రెస్ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది’’ అంటూ ఆమె ధ్వజమెత్తారు.
‘‘మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా?. 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కరెంట్ కావాలా?. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. యువత అడగాలి. మతం పేరుతో మంట పెట్టాలని ఒక పార్టీ, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుంది’’ అని కవిత నిప్పులు చెరిగారు.
చదవండి: బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్.. రైతుబంధుకు ఈసీ బ్రేక్
Comments
Please login to add a commentAdd a comment