Rahul Gandh
-
Lok Sabha Elections: లక్ష్యాన్ని చేరుకోని ఇరు పార్టీలు!
దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. అబ్ కి బార్... 400 పార్’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీయే) ఆ లక్ష్యాన్ని అందుకునే లక్షణాలు దాదాపుగా కనిపించకపోగా... అధికార పక్షాన్ని గద్దె దింపుతాం... 295 స్థానాలతో పగ్గాలు చేపడతాం అని బీరాలకు పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి (ఇండియా) కూడా తన లక్ష్యానికి దగ్గరలోనే నిలిచిపోయింది. కాకపోతే గత ఎన్నికల్లో కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి వంద సీట్ల వరకూ సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి ఎన్డీయే, ఇండియా కూటమి భాగస్వాముల్లో ఫిరాయింపుల్లాంటివేవీ కనిపించడం లేదు కానీ.. ఫలితాలన్నీ వెలువడిన తరువాత అసలు రాజకీయం మొదలకానుంది. సరే.. రెండు ప్రధాన కూటములు తమ తమ లక్ష్యాలను సాధించలేక పోయాయి? ఎందుకు? అతి విశ్వాసమా? లేక వ్యూహ రచన లోపమా?ఎన్డీయేలో ఏం కొరవడింది?ముందుగా ఎన్డీయే కూటమి విషయం చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఎన్నికల రణనీతిని సమర్థంగా అమలు చేయడంలో మోడీ చాలా దిట్ట అన్న పేరు ఉంది. మోడీ-అమిత్ షాల ద్వయం అప్పట్లో కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాగా.. తరువాతి కాలంలో బీజేపీ వెనకుండి నడిపించే ఆర్ఎస్ఎస్ కార్యకర్తల బలాన్ని, క్రమశిక్షణను ఆసరాగా చేసుకుని జాతీయ స్థాయి ఎన్నికల్లోనూ తమ సత్తా చాటగలిగారు. ప్రతి నియోజకవర్గాంలోని ఒక్కో పోలింగ్ బూత్‌కు బాధ్యులుగా కొందరు కార్యకర్తలను నియమించడం... ప్రణాళికాబద్ధంగా ప్రచారం సాగించడం... తమకుతాము ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మోడీ-అమిత్ షాల శైలి రాజకీయాలని అర్థమవుతుంది. ఈ శైలితోనే మోడీ ప్రధానిగా రెండుసార్లు గెలవగలిగారనడం అతిశయోక్తి కాదు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303కుపైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించింది కూడా. అయితే ఈ విజయంలో భాగమైన చాలామంది భాగస్వామ్య పక్షాలను నిలబెట్టుకోలేకపోయిందన్నది కూడా నిష్టూర సత్యం. భాగస్వామ్య పక్షాలు చాలావరకూ తప్పుకున్న నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రులను వెతుక్కునే ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఈ మిత్రత్వం ప్రభావం తక్కువే అన్నది తాజా ఫలితాల నేపథ్యంలో స్పష్టమవుతోంది.కాంగ్రెస్ మాటేమిటి?ఒకప్పుడు దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు (రాజీవ్ గాంధీ హయాంలో 425) సాధించిన... దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను ఏకపక్షంగా శాంసిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో గణనీయంగా బలహీన పడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పార్టీ రాజకీయాలన్నింటికీ ఢిల్లీని కేంద్రం చేసుకోవడం.. నమ్మకంగా పనిచేసిన సీనియర్ నేతలను నిరాదరించడం, సమయానకూలంగా వ్యూహాలను, కార్యాచరణను మార్చుకోకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ పతనానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో అతి స్వల్ప స్థానాలకు పరిమితమైన తరువాత గానీ ఈ పార్టీ తగిన పాఠలు నేర్చుకోలేకపోయింది. ఎన్డీయే దెబ్బకు కుదేలు కాగా మిగిలిన జవసత్వాలు కొన్నింటినైనా ఒక్కటి చేసుకుని మళ్లీ పైకి ఎదిగే ప్రయత్నాలు మొదలుపెట్టంది. పార్టీ అధ్యక్షుడిగా వైఫల్యాలు మూటకట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ జోడో యాత్ర కానీ.. భారత్ న్యాయ యాత్ర కానీ రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ‘పప్పు’ ముద్రను తొలగించడంలో ఎంతో ఉపకరించిందనడంలో సందేహం లేదు. గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ దశ తిరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నేతలందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడితే విజయావకాశాలు పెరుగుతాయని తెలంగాణ విజయంతో అర్థమయింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది మొదలు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త జోష్‌తో పనిచేసిందని చెప్పాలి. బీజేపీ ప్రచారానికి మాటకు మాట రీతిలో జవాబివ్వడంతోపాటు ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది ఈ పార్టీ. అదే సమయంలో ప్రతిపక్షాలన్నింటినీ ఒక దగ్గర చేర్చేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించాయని చెప్పాలి. దళిత నేత మల్లికార్జున ఖర్గేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించబోమన్న హామీల నేపథ్యంలో ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటివి ఇండియా కూటమిలో భాగంగా నిలిచాయి. ఎన్నికల్లోనూ ఐకమత్యంతో పోరాడాయి. అంతిమ ఫలితాలేమైనప్పటికీ కాంగ్రెస్, ఇండియా కూటముల ప్రదర్శన మునుపటి కంటే మెరుగుపడటం ఎన్నో రాజకీయ పాఠాలు నేర్పుతుంది. -
రాహుల్ నా సలహాలు పాటిస్తారు! : అస్సాం సీఎం హిమంత
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తాను పెంచుకునే గడ్డం విషయంలో తన సలహాలు పాటిస్తాడని ఎద్దేవా చేశారు. సీఎం హిమంత ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.‘2022లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సమయంలో భారీ గడ్డంతో ఉన్నారు. అప్పుడు అచ్చం ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అన్నాను. అనంతరం రాహుల్ తన గడ్డం మొత్తం తీసివేశారు. ఇప్పుడు ‘‘అమూల్ బాయ్’’లా ఉన్నారని అన్నాను. నేను రాహుల్ గాంధీని సద్దాం హుస్సేన్‌తో పోల్చితే గడ్డం మొత్తం తీసివేశారు... మళ్లీ నేను ‘అమూల్ బాయ్’ గా ఉన్నారని అనేసరికి చిన్నగా గడ్డం పెంచారు. రాహుల్ గాంధీ నా సలహాలు పాటిస్తారు. రాహుల్ గాంధీ టీ షర్ట్ ధరించడాన్ని చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. కానీ ప్రతిపక్షానికి నేృత్వత్వం వహించే వ్యక్తి.. ఒక కుర్రాడిలా టీ షర్ట్ వేసుకోవటం మన దేశ దురదృష్టం’’ అని సీఎం హిమంత సెటైర్లు వేశారు.ఇక.. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం బుక్ చూపించిన విషయం తెలిసిందే. అయితే ఆయన పట్టుకున్న బుక్ ఎరుపులో రంగులో ఉండటంతో అది భారత్ రాజ్యాంగం కాదని.. చైనా రాజ్యాంగం అంటూ హిమంత విమర్శలు గుప్పించారు. భారత రాజ్యాంగం బుక్ నీలం రంగులో ఉంటుందని తెలిపారు. అయితే హిమంత మాటలకు కాంగ్రెస్ నాయకులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. -
‘పెళ్లెప్పుడు?’ పిల్లాడి ప్రశ్నకు రాహుల్ ఏమన్నారు?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో కొనసాగింది. ఈ సమయంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీని ఆరేళ్ల బుడ్డోడు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడిగాడు. దీనికి రాహుల్ గాంధీ సరదా సమాధానం ఇచ్చారు. అదేమిటో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే! ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఉన్న రాహుల్‌ను ఆ కుర్రాడు ఈ ప్రశ్న అడగగానే రాహుల్ గాంధీ కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ష్ అనే ఆరేళ్ల బాలుడు రాహుల్ గాంధీకి సంబంధించి ఓ బ్లాగ్ క్రియేట్ చేశాడు. దానిలో ఆ కుర్రాడు రాహుల్ గాంధీని కాబోయే ప్రధానిగా అభివర్ణించాడు. ఆ కుర్రాడు రాహుల్ గాంధీని ‘మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని అడిగాడు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ ‘ఇప్పుడు నేను పనిలో బిజీగా ఉన్నాను. తర్వాత ఆలోచిస్తాను’ అని అన్నారు. తరువాత వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా బీహార్ వచ్చిన రాహుల్‌ను చూసేందుకు జనం తరలివచ్చారు. ఈ యాత్ర మణిపూర్‌లో ప్రారంభమై పశ్చిమ బెంగాల్ మీదుగా బీహార్‌కు చేరుకుంది. -
ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్ మాటామంతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వివిధ వర్గాలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, పారిశుధ్య కార్మికులతో మాటామంతి జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంపాదించినదంతా డీజీల్, పెట్రోల్‌కే సరిపోతుందని ఆటోడ్రైవర్లు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డెలివరీ బాయ్స్ విజ్ఞప్తి చేశారు. గిగ్‌వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం రాజస్థాన్‌లో ఒక స్కిమ్ అమలు చేస్తున్నామని, ప్రతి ట్రాన్సాక్షన్లో కొంత మొత్తాన్ని గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నామని రాహుల్ తెలిపారు. చదవండి: కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా? -
వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్: ఆయా పార్టీ అగ్రనేతల పర్యటనలు చూస్తుంటే.. పంటలపై మిడతల దండు దాడి చేసినట్టు ఉందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, రాహుల్‌పై మండిపడ్డారు. దండయాత్రకు వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆమె దుయ్యబట్టారు. ‘‘రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ప్రియాంక చదువుతున్నారు. బీజేపీ హయాంలో పెద్ద కంపెనీలే బాగుపడ్డాయి. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు?. రాహల్ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదు. వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం. ట్రైలర్‌కే భయపడ్డారు. సినిమా మిగిలే ఉంది’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ నాయకులు వెంటపడి రైతు బంధును ఆపించారు. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుంది. నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలి. బీజేపీతో మా శతృత్వం. కాంగ్రెస్ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది’’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ‘‘మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా?. 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కరెంట్ కావాలా?. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. యువత అడగాలి. మతం పేరుతో మంట పెట్టాలని ఒక పార్టీ, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుంది’’ అని కవిత నిప్పులు చెరిగారు. చదవండి: బీఆర్ఎస్కు ఊహించని షాక్.. రైతుబంధుకు ఈసీ బ్రేక్ -
అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి?
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని తన మునుపటి అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్ రాయ్ మరోమారు స్పష్టం చేశారు. తరతరాలుగా గాంధీ కుటుంబం అమేథీ ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తోందని, 2024 ఎన్నికల్లో రాహుల్ ఈ స్థానం నుంచే పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పునరుద్ఘాటించారు. కాగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్.. అమేథీలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అమేథీ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే అదేసమయంలో రాహుల్ కేరళలోని వయనాడ్ సీటులో 4.31 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మొదటిసారిగా దక్షిణ భారతదేశంతో కాంగ్రెస్ సత్తాను చాటారు. రాహుల్ గాంధీ తన పాత కంచుకోట అమేథీకి తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అజయ్ రాయ్ తన అభిప్రాయం తెలియజేయడం ఇది రెండోసారి. గతంలో లక్నోలో కూడా ఆయన ఇదే తరహా ప్రకటన చేశారు. ఇదిలా ఉండగా రామ మందిర ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చడం ద్వారా లబ్ధిపొందాలని బీజేపీ చూస్తున్నదని ఆయన విమర్శించారు. రామ మందిర నిర్మాణం అనేది మతవిశ్వాసాలకు సంబంధించిన అంశమని, దానిని భారీ కార్యక్రమంగా చేయకూడదని అన్నారు. ఎన్నికల సంవత్సరంలో జనాన్ని వంచించేందుకు బీజేపీ ఇలాంటి పనులను చేస్తున్నదన్నారు. రాముడు అందరివాడని, బీజేపీకే పరిమితం కాడని అజయ్ రాయ్ అన్నారు. కాగా అమెథీ లోక్‌సభ బరిలో బీజేపీ తిరిగి స్మృతి ఇరానీని రాహుల్‌తో పోటీకి దించనున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. -
తొలిరోజు ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ
Updates.. హైదరాబాద్‌లో తాజ్ కృష్ణా హోటల్లో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు ఇవాళ భేటీ కొనసాగింది. పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ లాంటి కీలక నేతలు భేటీలో మాట్లాడారు. కేంద్రం తీరుపై విమర్శలతో పాటు ఇండియా కూటమి ఐక్యత ప్రధానంగా ఇవాళ్టి చర్చ నడిచింది. రేపు.. ఆదివారం కూడా సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఎన్నికల నేపథ్యం.. పార్టీలో సమన్వయంపై ఇంకా చర్చించాల్సి ఉంది. 07:30PM స్కాంసృతిక కార్యక్రమాల అనంతరం.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, కీలక నేతలు పాల్గొన్నారు. 06:49PM బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్కింగ్ కమిటీ సభ్యులతో అన్నారు. 05:05PM ►ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై రేపు(ఆదివారం) అంతర్గత సమావేశంలో చర్చిద్దామని.. అలాగే సంస్థాగత సమస్యలపైనా రేపటి సమావేశంలో వివరంగా మాట్లాడతాను అని ఖర్గే సభ్యులను ఉద్దేశించి తెలిపారు 04:49PM అధికారంలో ఉండి శాంతి స్థాపనలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోంది. మోదీ ప్రభుత్వ పద్దతులు లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి: ఖర్గే 04:40PM మన ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉంది. జాతీయ భద్రత విషయంలో, చైనా ఆక్రమణల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు: ఖర్గే 04:34PM ►ఇండియా కూటమి సమావేశాలు విజయవంతం కావడంతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు దిగుతోందని CWC సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. 03:56PM ► ఖర్గే అధ్యక్షతన కొనసాగుతున్న సీడబ్ల్యూసీ భేటీ 03:15PM ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీ ► హైదరాబాద్ తాజ్ కృష్ణ లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యకతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం ► 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ,మణీపూర్ ఇష్యూ ,ఇండియా కూటమి లో సీట్ల సర్దుబాటు అంశం తో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల పై చర్చ. ► హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల వేదికగా.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు. ► తాజ్ కృష్ణ కు చేరుకున్న తుమ్మల నాగేశ్వరరావు.. మరి కొద్దిసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక ► హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, చత్తీస్ఘఢ్ సీఎం భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్. ► తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన విందుకు హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక మిగతా సీడబ్ల్యూసీ సభ్యులు.. #WATCH | Congress president Mallikarjun Kharge, Parliamentary Party Chairperson Sonia Gandhi, MP Rahul Gandhi, Congress General Secretary Priyanka Gandhi Vadra, Rajasthan CM Ashok Gehlot, Chhattisgarh CM Bhupesh Baghel and party leader Sachin Pilot arrive at Hyderabad airport to… pic.twitter.com/2fyvAA20n1 — ANI (@ANI) September 16, 2023 ► ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi leave for Hyderabad to attend the Congress Working Committee (CWC) meeting, from Delhi airport. pic.twitter.com/hgSb9LTn4R — ANI (@ANI) September 16, 2023 ►తాజాగా టీపీసీసీ నేతలు మాట్లాడుతూ.. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ ఉంటుంది. ఆరు గ్యారెంటీ హామీల కోసమే బహిరంగ సభ. రేపు విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు. తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరికలు ఉంటాయి. సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో తుమ్మల చేరే అవకాశం ఉంది. ►కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలే ప్రధాని అజెండాగా సీడబ్ల్యూసీ భేటీ. మణిపూర్ అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తాం. తెలంగాణ ప్రభుత్వ అవినీతి ప్రజలకు తెలుసు. ►కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)’ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ►తాజ్‌కృష్ణ హోటల్లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు. ►శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ మొదలవుతుంది. ఐదు కీలక అంశాలు ఎజెండాగా.. ►శని, ఆదివారాల్లో జరిగే ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. ►త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, భారత్ జోడో యాత్ర–2 నిర్వహణ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇండియా ►కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి. ►ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారమే చేరుకున్న 52 మంది ►సీడబ్ల్యూసీలోని సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84మంది సమావేశాలకు హాజరుకానున్నారు. శుక్రవారమే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. ►హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా తదితరులు ఉన్నారు. ►పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్ భగేల్, మరికొందరు నేతలు శనివారం రానున్నారు. బహిరంగ సభ.. నియోజకవర్గ పర్యటనలు ►సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్ ‘విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ►సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ►ఆ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల హామీలుగా గ్యారంటీ కార్డు స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. ► ఇక ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. -
సుప్రీం తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీకి లాలూ డిన్నర్ పార్టీ
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగై రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా మోదీ ఇంటి పేరు వివాదంలో సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చి రాహుల్ గాంధీకి ఊరటనివ్వడంతో లాలూ రాహుల్ గాంధీని తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు ఆహ్యానించారు. విందులో బీహార్ స్పెషల్ చంపారన్ మటన్ తెప్పించి స్వయంగా తానే వండి వడ్డించారు. రాహల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసులో అమలు కావాల్సిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా రాష్ట్రీయ జనతా దళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు హాజరైన రాహుల్ గాంధీని లాలూ మొదట పుష్పగుచ్ఛమిచ్చి అభినందించి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కొద్దిసేపు రాజకేయాలు మాట్లాడుకుని తర్వాత ఇద్దరూ విందులో పాల్గొన్నారు. విందులో రాహుల్ కోసం లాలూ స్వయంగా మటన్ వండటం విశేషం. లాలూ చేసిన ప్రత్యేక వంటకాన్ని రాహుల్ చాలా ఆస్వాదించారు. దీని కోసం లాలూ బీహార్ నుండి ప్రత్యేకంగా చంపారన్ దేశీయ మటన్ తెప్పించి బీహార్ స్టైల్లో దాన్ని తానే స్వయంగా వండారు. రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు భారీ ఉపశమనం ఇవ్వడంతో ఆయన పార్లమెంటులో తిరిగి అడుగు పెట్టడానికి మార్గం సుగమమైంది. అయితే దానికి ఎంత సమయం పడుతుంది, ప్రభుత్వంపై జరగనున్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొంటారా లేదా అన్నదే తేలాల్సి ఉంది. మోదీ ఇంటిపేరు వివాదంలో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తూ సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును ఆయన సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే విధించింది. आज @RahulGandhi जी ने RJD अध्यक्ष @laluprasadrjd जी से उनके दिल्ली स्थित निवास पर मुलाकात की। pic.twitter.com/NMXa4jP8hi — Congress (@INCIndia) August 4, 2023 ఇది కూడా చదవండి: కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు భారత సైనికులు మృతి -
ప్రమాదం వారసత్వ రాజకీయాలకే.. ప్రజాస్వామ్యానికి కాదు!: అమిత్ షా
కౌశాంబి: వారసత్వ రాజకీయాలు, కులవాదానికే ప్రమాదం తప్ప దేశ ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రమాదం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. కులతత్వం, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు అనే మూడు అల్సర్లతో కాంగ్రెస్ పార్టీ భారత ప్రజాస్వామ్యాన్ని చుట్టుముట్టిందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఈ మూడింటినీ తొలగించి వేసినందుకే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు భయపడుతోందని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ యూకేలో ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు బదులిచ్చారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ‘కౌశాంబి మహోత్సవ్’ను ప్రారంభించి, అనంతరం జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. తమ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటుపడిందనే ఒకే ఒక్క కారణంతో పార్లమెంట్ సమావేశాలను సవ్యంగా సాగనీయని కాంగ్రెస్‌ను దేశం క్షమించదని అమిత్ షా ఆరోపించారు. ఎటువంటి కార్యకలాపాలు, చర్చ లేకుండానే బడ్జెట్ సమావేశాలు ముగియడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంలోని నిబంధనల ప్రకారమే రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయిందని ఆయన చెప్పారు. ఒక్క రాహుల్ గాంధీయే కాదు, ఈ చట్టం కింద ఇప్పటి వరకు 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల సభ్యత్వాలు రద్దయ్యాయన్నారు. చట్టానికి లోబడి నడుచుకుని, హైకోర్టులో అనర్హత వేటు నుంచి బయటపడాలని రాహుల్‌కు సూచించారు. సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రధాని మోదీని 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. -
‘మిస్టర్ గాంధీ కేసును గమనిస్తున్నాం’
రాహుల్ గాంధీపై కోర్టు కేసు, అనర్హతవేటు తదితర పరిణామాలపై అమెరికా స్పందించింది. రాహుల్ గాంధీ కేసును తమ దేశం గమనిస్తోందని, భావప్రకటనా స్వేచ్ఛతో సహా ప్రజాస్వామ్య విలువలకు భాగస్వామ్య నిబద్ధత విషయంలో భారత ప్రభుత్వంతో అమెరికా ఎప్పుడూ నిమగ్నమై ఉంటుందని పేర్కొంది. రాహుల్ గాంధీని అనర్హత వేటు పరిణామంపై అమెరికా అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్‌కు సోమవారం(అక్కడి కాలమానం ప్రకారం) మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. చట్టబద్ధమైన పాలన, న్యాయ స్వాతంత్ర్యం పట్ల గౌరవం ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభం. భారత దేశంలోని కోర్టులలో మిస్టర్ గాంధీ (రాహుల్ గాంధీని ఉద్దేశించి) కేసును మేము గమనిస్తూనే ఉన్నాం.. భావ స్వేచ్ఛ ప్రకటన సహా ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు భారత్‌తో కలిసి మేం ముందుకు నడుస్తాం. ఇరు దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు.. కీలకమైన మానవ హక్కుల పరిరక్షణను(భావ స్వేచ్ఛ ప్రకటనసహా), ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తూనే వస్తున్నాం అని తెలిపారాయన. అయితే.. ఈ విషయంలో భారత ప్రభుత్వంతో గానీ, రాహుల్ గాంధీతో గానీ అమెరికా ఏమైనా సంప్రదింపులు జరిపిందా? అని ప్రశ్నించగా.. అలాంటిదేం జరగలేదని ఆయన బదులిచ్చారు. కాగా, కాగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘మోదీ ఇంటి పేరు’(2019లో చేసినవి) వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో దోషిగా తేలిడంతో.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు. ఆపై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయనపై లోక్‌సభ సభ్యునిగా అనర్హత వేటు పడింది. బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలు ఈ నిర్ణయాన్ని ఖండించాయి. ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. విపక్షాలన్నింటిని ఏకం చేసుకుని కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తోంది. (చదవండి: యూఎస్ టేనస్సీ: స్కూల్లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి) -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?
ముంబై: భారత్ జోడో యాత్రలో భాగంగా వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రాలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. సావర్కర్‌ను అవమానిస్తే మహావికాస్ అఘాడీతో తెగదెంపులు చేసుకునేందుకైనా వెనుకాడబోమని శివసేన సీనియర్ నేత సంజయ్‌రౌత్ హెచ్చరించారు. ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతారని పేర్కొన్నారు. సావర్కర్ విషయం తమకు చాలా ముఖ్యమని, ఆయన హిందుత్వ సిద్ధాంతలను శివసేన నమ్ముతుందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సావర్కర్ గురించి కాంగ్రెస్ మాట్లాడవద్దని సూచించారు. ఈ విషయంలో ఉద్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్లతే తుది నిర్ణయమని థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే కూడా ఇప్పటికే ప్రకటించారు. శివసేన నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపట్టింది. రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించలేదని, చరిత్రలో జరిగిన విషయాన్ని మాత్రమే చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ఈ విషయంపై సంజయ్ రౌత్‌తో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో మహావికాస్ అఘాడీ(ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి)పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. వీర్ సావర్కర్ బ్రిటిషర్లను క్షమాపణలు కోరిన వ్యక్తి అని అన్నారు. అండమాన్ జైలులో మూడు నాలుగేళ్లకే భయపడి బ్రిటిషర్లకు లేఖలు రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతులను ఆధారంగా చూపారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. సావర్కర్‌ను అవమానించిన వారికి మహారాష్ట్ర ప్రజలే తగిన రీతితో బుద్ధి చెబుతారని విమర్శించింది. చదవండి: 'ఇండోర్‌లో అడుగుపెడితే చంపేస్తాం..' రాహుల్ గాంధీకి బెదిరింపులు -
Bharat Jodo Yatra: చిన్న వ్యాపారాలపై బీజేపీ దెబ్బ: రాహుల్
సాక్షి, బళ్లారి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన విధానాలతో కొన్ని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూర్చుతూ చిన్న, మధ్య తరహా వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. భారత్ జోడో యాత్ర ఆదివారం బళ్లారి జిల్లాలో కొనసాగింది. మోకా గ్రామంలో ఆయన వ్యాపారులతో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత్ స్థానం మరింతగా పడిపోవడంపై రాహుల్ ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కలిసి భారత్‌ను ఇంకా ఎంతకాలం బలహీనం చేస్తాయని ప్రశ్నించారు. జోడో పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. మోకాకు వెళ్లే దారిలో ఒక అభిమాని పట్టుకున్న జెండా రాడ్‌కు విద్యుత్ తీగలు తాకి ఐదుగురికి గాయాలయ్యాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న రాహుల్‌గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. రాహుల్ రాత్రి బళ్లారి జిల్లాలో బస చేశారు. సోమవారం ఉదయం మోకా నుంచి ఏపీలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఛత్రగుడిలోకి యాత్ర ప్రవేశిస్తుంది. -
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న గౌరి లంకేశ్ తల్లి!
బెంగుళూరు: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ గౌరి లంకేశ్ 2017లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ మేరకు గౌరి లంకేశ్ తల్లి ఇందిరా, చెల్లి కవిత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ శుక్రవారం జోడోయాత్రలో భాగంగా శుక్రవారం కర్ణాటక పర్యటిస్తున్నప్పుడూ దివగంత జర్నలిస్ట్ తల్లి, చెల్లి ఇద్దరు పాల్గొన్నారు. భారతదేశ నిజమైన స్ఫూర్తికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరి లంకేశ్ లాంటి వాళ్ల కోసం నిలబడతానని రాహుల్ గాంధీ అన్నారు. వాస్తవానికి గౌరి లంకేశ్ సెప్టెంబర్ 5, 2017న రాజరాజేశ్వరి నగర్‌లోని తన ఇంటికి వస్తున్న సమయంలో మోటరు సైకిల్‌పై వచ్చిన కొందరు అగంతకులు ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ట్విట్టర్లో.... "గౌరి లంకేశ్ సత్యం, ధైర్యం, స్వాతంత్య్రం కోసం నిలబడింది. గౌరి లంకేశ్ లాగా భారతదేశ నిజమైన స్ఫూర్తికోసం ప్రాతినిథ్యం వహిస్తున్న లెక్కలేనంతమంది వ్యక్తుల కోసం నిలబడతాను. ఈ భారత జోడో యాత్ర వారి స్వరం. దీన్ని ఎప్పటికి నిశబ్దంగా ఉంచలేరు" అని రాహుల్ ట్విట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 3,750 కి.మీ భారత జోడో యాత్ర సెప్టంబర్ 8న కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విభజన రాజకీయాలను ఎదుర్కోవాలని కోరింది. గురువారం కర్ణాటకలో సాగుతున్న జోడోయాత్రలో సోనియా గాంధీ పాల్గొనడంతో పార్టీ శ్రేణుల్లో కొండంత నూతన ఉత్సాహం వచ్చింది. Gauri stood for Truth Gauri stood for Courage Gauri stood for Freedom I stand for Gauri Lankesh and countless others like her, who represent the true spirit of India. Bharat Jodo Yatra is their voice. It can never be silenced. pic.twitter.com/TIpMIu36nY — Rahul Gandhi (@RahulGandhi) October 7, 2022 (చదవండి: శివసేన మాదే.. ఎన్నికల గుర్తు వాళ్లదెలా అవుతుంది?) -
'వాళ్ల కోసం నింగి నుంచి నక్షత్రాలైనా తెస్తారు..కానీ ప్రజలకు మాత్రం'
సాక్షి,న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇకపై సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ ఉండదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించిన మరునాడే ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'ప్రకటనల కోసం కేంద్రం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రధానికి కొత్త విమానం కొనుక్కోవడానికి డబ్బులుంటాయి. పారిశ్రామిక రంగంలోని స్నేహితులకు పన్ను రాయితీలు చేస్తున్న ప్రభుత్వం వద్ద దేశంలోని సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో రాయితీ కోసం 1500 కోట్లు లేవా? కేంద్రం తన స్నేహితుల కోసం ఆకాశం నుంచి నక్షత్రాలైనా తీసుకొస్తుంది కానీ ప్రజలను మాత్రం రూపాయి కోసం కష్టపడేలా చేస్తుంది' అని రాహుల్ ధ్వజమెత్తారు. विज्ञापनों का ख़र्च: ₹911 Cr नया हवाई जहाज़: ₹8,400 Cr पूंजीपति मित्रों के टैक्स में छूट: ₹1,45,000 Cr/साल लेकिन सरकार के पास बुज़ुर्गों को रेल टिकट में छूट देने के लिए ₹1500 करोड़ नहीं हैं। मित्रों के लिए तारे तक तोड़ कर लाएंगे, मगर जनता को कौड़ी-कौड़ी के लिए तरसाएंगे। — Rahul Gandhi (@RahulGandhi) July 22, 2022 2020 వరకు సీనియర్ సిటిజెన్లకు రైలు టికెట్లలో 50శాతం వరకు రాయితీ ఇచ్చేది కేంద్రం. కానీ కరోనా కారణంగా దాన్ని నిలిపివేసింది. అయితే ఇకపై కూడా రాయితీ ఇచ్చే ఆలోచన లేదని బుధవారం పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అలా చేస్తే రైల్వేకు నష్టాలు వస్తాయని తెలిపింది. క్రీడాకారులకు కూడా ఇకపై రాయితీ ఉండబోదని స్పష్టం చేసింది. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలకు దిగారు. చదవండి: సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్ -
రాజీనామా ఉపసంహరించుకున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీని కలుసుకున్న అనంతరం తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. సిద్ధూ తన రాజీనామా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) కాగా, రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో తాను లేవనెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన విధులను యథావిధిగా తిరిగి కొనసాగిస్తునున్నట్లు పేర్కొన్నారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ క్యాబినేట్లోని అధికారుల నియమాకాలపై తీవ్ర అసంతృప్తితోపాటు, ఇటీవల చన్నీ కుమారుడి వివాహానికి కూడా సిద్ధూ దూరంగా ఉండటం తదితర పరిణామాలన దృష్ట్య కాంగ్రెస్‌లో అంతర్గత ఉద్రిక్త వాతావరణం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు "సిద్ధూ కూడా తాన తన పదవికి రాజీనామా చేసిన గానీ ‘తాను గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రీల సిద్ధాంతాలను పాటిస్తాను. తాను కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా.. లేకున్నా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల పక్షాన నిలబడతాను వ్యతిరేక శక్తులు నన్ను కిందకు తోయాలని చూసినా అంతకు మించిన ఆశావాదంతో పంజాబ్‌లో ప్రతి పౌరుడి గెలుపు కోసం కృషి చేస్తాను" అంటూ ట్విటర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. (చదవండి: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్") -
70 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులన్నీ అమ్మేస్తున్నారు : రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రం సోమవారం ప్రకటించిన జాతీయ మానిటైజేషన్ విధానంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా అభివృద్ది చేసిన ప్రతిష్టాత్మక ఆస్తులను తెగనమ్ముతోందంటూ బీజేపీ సర్కార్‌పై మండిపడ్డారు. ప్రధాని మోదీ తన స్నేహితులైన పరిశ్రమ పెద్దలకు ఆస్తులను కట్టబెడుతున్నారంటూ మంగళవారం మీడియా సమావేశంలో రాహుల్ మోదీపై విరుచుకు పడ్డారు. కేవలం ఇద్దరు ముగ్గురు బడా కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తాజా ప్రణాళికలని రాహుల్ గాంధీ విమర్శించారు. కోట్లాదిమంది పౌరులకు ఉపయోగకరంగా ఉండే రైల్వేలను ఎందుకు ప్రైవేటీ కరిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోర్టులు, విమానాశ్రయాలు ఎవరు పొందుతున్నారో గమనించాలంటూ బడా కంపెనీలను గుర్తుచేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజాధనంతో నిర్మించిన బంగారం లాంటి ఆస్తులను మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని రాహుల్ ధ్వజమెత్తారు. జాతీయ మానెటైజేషన్ పైప్‌లైన్ ద్వారా మోదీ తన పారిశ్రామిక స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదు,కానీ కీలక పరిశ్రమలను ఎప్పుడూ తాము ప్రైవేటీకరించలేదన్నారు. ఈ నేపథ్యంలోనే సర్కార్ ఏం అమ్ముతోందో, ఏ ఆస్తి ఎవరికి చేరుతోంది యువతకు తాను చెప్పాలనుకుంటున్నానని రాహుల్ తాజాగా వెల్లడించారు. దేశ భవిష్యత్తుపై భారీ ప్రభావం ముఖ్యంగా కరోనా గురించి తాను హెచ్చరించినపుడు అందరూ నవ్వారు. కానీ చివరికి ఏం జరిగిందో మీరే చూశారని రాహుల్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళిక దేశ భవిష్యత్తుపై భారీ ప్రభావం చూపుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాల రంగాలలో ప్రైవేట్ కంపెనీలను భాగస్వామ్యం చేయడం, కీలక రంగాల్లో గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని, తద్వారా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌పై కేంద్ర మాజీమంత్రి పీచిదంబరం కూడా మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ ఆస్తులను నిర్మించాయనే విషయాన్ని బీజేపీ ఇప్పటికైనా గుర్తించాలని కాంగ్రెస్ సీనియర్ శశి థరూర్ ట్వీట్ చేశారు. At least now, BJP should acknowledge that national assets were created since independence by successive @incIndia govts so that today's BJP goverment can sell them to overcome the financial mess created in last 7 years of their misgovernance! https://t.co/lVJP2Jcnfc — Shashi Tharoor (@ShashiTharoor) August 24, 2021 -
Rahul Gandhi: మోదీది మొసలికన్నీరు
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక కోవిడ్ మరణాలకు ప్రధాని మోదీ కన్నీరు కార్చడమే కేంద్ర ప్రభుత్వం స్పందన అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర పరిస్థితులను చక్కదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని ట్విట్టర్ ద్వారా విరుచుకుపడ్డారు. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 212 కోవిడ్ మరణాలు సంభవించగా, వియత్నాంలో ఇది 0.4, చైనాలో 2 మరణాలు మాత్రమే నమోదైనట్లు వివరించారు. అదేవిధంగా, దేశ జీడీపీ ప్రస్తుతం –8కి పడిపోగా ఇదే సమయంలో పొరుగునున్న బంగ్లాదేశ్ జీడీపీ 3.8, చైనా 1.9, పాకిస్తాన్ 0.4గా ఉందంటూ ఆర్థిక వేత్త కౌశిక్ బసు ట్వీట్ చేసిన చార్ట్‌ను కూడా రాహుల్ షేర్ చేశారు. ప్రధాని మోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వైద్యులతో వర్చువల్ సమావేశం సందర్భంగా దేశంలో కోవిడ్ మరణాలపై ఉద్వేగంతో కంట తడిపెట్టడంపై ఆయన పై వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలన ఫలితంగానే కోవిడ్‌కు బ్లాక్‌ఫంగస్ మహమ్మారి తోడైందన్నారు. ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు మోదీ చప్పట్లు, కంచాలతో చప్పుళ్లు చేయాలని ప్రజలను కోరనున్నారని ఎద్దేవా చేశారు. (చదవండి: Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్ వేవ్ ఆపటం కష్టం’) -
బీజేపీకి వత్తాసు : ఫేస్బుక్ క్లారిటీ
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బీజేపీతో చేతులు కలిపిందన్న విమర్శలపై ఫేస్బుక్ స్పందించింది. రాజకీయాలు, రాజకీయనేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది. రాజకీయ లేదా పార్టీ అనుబంధ సంస్థలతో సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్‌ను తాము నిషేధించామనీ, ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో ఇంకా చాలా చేయాల్సి ఉందనీ, తమ కఠిన నిబంధనల అమలులో పురోగతి సాధిస్తున్నామన్నారు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాగా భారతదేశంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తో పొత్తు పెట్టుకున్న ఫేస్బుక్ , బీజేపీ ,దాని అనుబంధ సంస్థ నేతలు చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యలను పట్టించుకోవడంలేదంటూ 'వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన ప్రత్యేక కథనం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధానికి దారి తీసింది. బీజేపీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మలుచుకుంటోందంటూ కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇండియాలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫేస్బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయనడానికి అమెరికా మీడియా కథనం నిదర్శనమని రాహుల్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న శశిథరూర్ పౌరుల హక్కులను పరిరక్షించడం, సామాజిక/ఆన్లైన్ న్యూస్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని నివారించడం అనే అంశంపై సాక్ష్యాలను పరిశీలిస్తామన్నారు. దీనిపై గతంలో ఫేస్బుక్ కు నోటీసులిచ్చినట్టు గుర్తు చేశారు. దీంతో వివాదం రేగింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ ఆ రోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయినవారు ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని, కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్బుక్ ఒప్పందంతో రెడ్ హ్యాండెడ్ గా దోరికిపోయింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఎదురు దాడి చేసిన సంగతి తెలిసిందే. भाजपा-RSS भारत में फेसबुक और व्हाट्सएप का नियंत्रण करती हैं। इस माध्यम से ये झूठी खबरें व नफ़रत फैलाकर वोटरों को फुसलाते हैं। आख़िरकार, अमेरिकी मीडिया ने फेसबुक का सच सामने लाया है। pic.twitter.com/PAT6zRamEb — Rahul Gandhi (@RahulGandhi) August 16, 2020 Our Parliamentary committee will, in the normal course, consider testimony under the topic “Safeguarding citizens’ rights & prevention of misuse of social/online news media platforms”. The subject is squarely within the IT Cmt’s mandate& @Facebook has been summoned in the past. https://t.co/saoK8B7VCN — Shashi Tharoor (@ShashiTharoor) August 16, 2020 -
ఆగస్టు 10 నాటికి 20 లక్షలకు పైమాటే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కీలక హెచ్చరిక చేశారు. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలన్నారు. (పది లక్షలు దాటిన కేసులు) దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను దాటేసింది. ఇదే వేగంతో కరోనా విస్తరిస్తూ ఉంటే..ఆగస్టు 10వ తేదీ నాటికి దేశంలో 20 లక్షల కేసులను కూడా దాటేస్తుందని అంచనా వేశారు. ఈ మహమ్మారిని కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దేశంలో మొత్తం కేసులు ఈ వారంలో 10 లక్షలను దాటుతాయంటూ గతంలో హెచ్చరించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. (కరోనాతో మాజీ సీనియర్ అధికారి, రచయిత్రి మృతి) కాగా ప్రస్తుతం ప్రపంచంలో కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా 35 లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 20.1 లక్షల పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలోనూ, 10 లక్షలకు పైగా కేసులతో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. అయితే కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే, ఆగస్టు రెండో వారంలోపే కేసుల విషయంలో బ్రెజిల్‌ను అధిగమించనుందనే అంచనాలు నెలకొన్నాయి. -
రాహుల్‌పై ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భోపాల్: చైనాతో ఘర్షణ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజుకున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో తెరపడేటట్టు లేదు. తాజాగా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి మాత్రమే ఈ దేశాన్ని రక్షించగలడని చాణక్య చెప్పారు. ఒక విదేశీ మహిళకు జన్మించిన వ్యక్తి ఎప్పటికి దేశభక్తుడు కాలేడు’ అంటూ ప్రజ్ఞా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘మీకు రెండు దేశాల పౌరసత్వం ఉంటే, మీలో దేశభక్తి భావాలు ఎలా ఉంటాయి’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి నైతికత, నీతి, దేశభక్తి లేదని ఆరోపించారు. ‘ఒకసారి కాంగ్రెస్ పార్టీ లోపలికి చూడాలి. వారికి ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ పార్టీకి నీతి, ధైర్యం, దేశభక్తి లేవు’ అని ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ విరుచుకుపడడ్డారు. అయితే ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ విదేశీ మూలాలు గురించి బీజేపీ తరచుగా విమర్శలు చేయడం సాధారణమే. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి జేపీ ధనోపియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఎమ్పీ పదవికి అవమానానన్ని తెచ్చిపెట్టారని ఆరోపించార. ఉగ్రవాద కేసులో చిక్కుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ గురించి.. రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజ్ఞా మతిసస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని.. ఆమెకు వెంటనే తగిన చికిత్స అందించాలని ధనోపియా తెలిపారు. -
సాయుధులుగానే ఉన్నారు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉన్న భారతీయ సైనికుల వెంట ఆయుధాలు కూడా ఉంటాయని, వారు తమ పోస్ట్‌ను వదిలి బయటకు వెళ్లే ప్రతీసారి ఆయుధాలను కూడా తీసుకునే వెళ్తారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం స్పష్టం చేశారు. ‘ఆయుధాలు ఇవ్వకుండా సైనికులను మృత్యుఒడికి పంపిస్తారా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. ‘1996లో, 2005లో భారత్, చైనాల మధ్య కుదిరిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం.. రెండు దేశాల సరిహద్దు గస్తీ బృందాలు ఆయుధాలను ఉపయోగించకూడదు’ అని జై శంకర్ వివరించారు. సోమవారం రాత్రి గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల సమయంలోనూ.. విధుల్లో ఉన్న భారతీయ సైనికులు సాయుధులుగానే ఉన్నారని తెలిపారు. ‘నిరాయుధులైన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి చైనా పెద్ద నేరం చేసింది. ఆ సైనికులను నిరాయుధులుగా ప్రమాద ప్రాంతానికి ఎవరు, ఎందుకు పంపించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ప్రశ్నించారు. భారతీయ సైనికుల త్యాగంపై రెండు రోజుల తరువాత రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందించారని రాహుల్ విమర్శించారు. అది కూడా, తన నివాళి ట్వీట్లో చైనా పేరును ప్రస్తావించకుండా, భారత సైన్యాన్ని రాజ్‌నాథ్ అవమానించారని ఆరోపించారు. భారత సైనికులు చనిపోవడం చాలా బాధాకరం. విధుల్లో భాగంగా మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు’ అని బుధవారం ఉదయం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. -
ఇకపై అక్కడ సోనియా మాత్రమే!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్కంఠ పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆయన రాజీనామా ఆమోదం పొందిన తర్వాత యూపీఏ చైర్పర్సన్ మరోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ఉన్న రాహుల్ గాంధీ పోస్టర్, నేమ్‌ప్లేట్‌ను తొలగించి సోనియా గాంధీ నేమ్ ప్లేట్‌ను అక్కడ అమర్చారు. ఇక పార్టీ ప్రధాన కార్యాలయంలో సోనియాతో పాటు ప్రియాంక గాంధీ వాద్రాకు మాత్రమే ప్రత్యేక కార్యాలయాలు ఉండనున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అనంతరం సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. సోనియా గాంధీనే అధ్యక్షురాలుగా నిర్ణయించినట్లు అంతర్గత ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటామని పార్టీ నాయకుడు పిఎల్ పునియా వెల్లడించారు. కాగా సోనియా గాంధీ 1998 నుంచి 2017 వరకు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగిన విషయం తెలిసిందే. -
‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీజేపీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ‘ప్రతిదీ కొనలేం.. ప్రతి ఒక్కరిని బెదిరించలేం.. ప్రతి అబద్ధం బయటపడే రోజు తప్పక వస్తుంది.. త్వరలోనే బీజేపీ ఈ విషయాన్ని గ్రహిస్తుందని’ ప్రియాంక ట్వీట్ చేశారు. ‘ప్రజలు భరించినంత వరకే.. నాయకుల అంతులేని అవినీతి, ప్రజా ప్రయోజనాలను కాపాడే సంస్థలను నిర్వీర్యం చేయడం.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం వంటి అంశాలు కొనసాగుతాయి. ఒక్కసారి ప్రజల్లో సహనం నశిస్తే.. ఎంతటి నాయకుడైనా తుడిచిపెట్టుకుపోతా’డని మరో ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. One day the BJP will discover that everything cannot be bought, everyone cannot be bullied and every lie is eventually exposed. 1/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 23, 2019 దురాశ, స్వార్థ ప్రయోజనాలే గెలిచాయి: రాహుల్ కాగా, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దురాశ ముందు నిజాయతీ, ప్రజాస్వామ్యం, కర్ణాటక ప్రజల తీర్పు కుప్పకూలిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తమను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
రాహుల్ రాజీనామాకు సోనియా అంగీకారం!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. తాజాగా సోమవారం కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరు దూతలు అహ్మద్‌పటేల్, కేసీ వేణుగోపాల్లను రాహుల్ వద్దకు పంపగా, ఆయన తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టంగా చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తాను మళ్లీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోననీ, ఇందుకోసం మరొకరిని ఎంపిక చేసుకోవాలని రాహుల్ సూచించినట్లు సమాచారం. కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకూ తాను తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తానని రాహుల్ చెప్పారు. తొలుత రాహుల్ రాజీనామాకు ఒప్పుకోని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, సోదరి ప్రియాంక ఆయన్ను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ వెనక్కి తగ్గకపోవడంతో వీరిద్దరూ చివరకు ఆయన రాజీనామాకు అంగీకరించిట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన కొత్త ఎంపీలను కలుసుకునేందుకు రాహుల్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నూతన సారథిగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ కోసం పనిచేస్తా.. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ తాను పార్టీ కోసం పనిచేస్తానని కాంగ్రెస్ దూతలకు రాహుల్ చెప్పినట్లు సమాచారం. రాహుల్ కాంగ్రెస్ చీఫ్‌గా తప్పుకుంటే తాను తీవ్రమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీనియర్ నేత చిదంబరం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్, ప్రియాంకలు సీనియర్ నేతలపై మండిపడినట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. ‘ఈ విషయంలో తప్పుడు కథనాలు, వదంతులకు దూరంగా ఉండాలని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన వివరణ ఇచ్చారు. నెహ్రూకు నివాళులు.. భారత తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 55వ వర్ధంతి సందర్భంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్, మాజీ ప్రధాని మన్మోహన్లు యమునా నదీతీరన ఉన్న శాంతివన్లో సోమవారం ఆయనకు నివాళులు అర్పించారు. కర్ణాటక, రాజస్తాన్‌లో నీలినీడలు పార్టీలో సంక్షోభం కొనసాగుతున్న వేళ కర్ణాటక, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు రమేశ్ జర్కిహోళీ, డా.సుధాకర్‌లు బీజేపీ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బొటాబోటీ మెజారిటీతో కొనసాగుతున్న నేపథ్యంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి గల అవకాశాలపై చర్చించారు. మంత్రి పదవులు దక్కక గుర్రుగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలపై బీజేపీ దృష్టి సారించినట్లు సమాచారం. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం జూన్ 10 వరకే కొనసాగుతుందని కాంగ్రెస్ నేత కేఎన్ రాజన్న బాంబు పేల్చారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌లో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఈ ఘోర ఓటమికి రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లోత్ నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకోవాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ చీఫ్‌గా రాహుల్ తప్పుకున్న నేపథ్యంలో పార్టీలో కూడా రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్, జార్ఖండ్ చీఫ్ అజయ్ కుమార్, అస్సాంలో పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా సహా పలువురు నేతలు తమ అధ్యక్ష పదవులకు రాజీనామాలు సమర్పించారు. -
రాహుల్ చెప్తే మోదీపై పోటీ
వయనాడ్: పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశిస్తే వారణాసిలో లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై సంతోషంగా పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. రాహుల్ పోటీచేస్తున్న వయనాడ్ నియోజకవర్గంలో ప్రియాంక ప్రచారం నిర్వహించారు. అసమ్మతి గొంతుక అణచివేత ప్రజాస్వామ్యాన్ని, అసమ్మతి గొంతుకను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అణచివేస్తోందని ప్రియాంక ఆరోపించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన సీఆర్పీఎఫ్ జవాన్ వీవీ వసంతకుమార్ కుటుంబాన్ని పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. ‘మనమంతా ప్రేమించే, నమ్మే దేశాన్ని కాపాడుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ దేశంలో అయితే మనమంతా స్వేచ్ఛగా ఉంటామో, ఎక్కడైతే మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలమో, మనకు నచ్చిన మతాన్ని ఆచరిస్తూ, నచ్చిన ఆహారాన్ని తింటూ ఇష్టమైన జీవనశైలిని గడపగలమో.. దాన్ని కాపాడుకునేందుకే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ గొప్ప లక్ష్యం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు. ప్రియాంకను ఓ దొంగ భార్యగానే ప్రజలు చూస్తారన్న కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యలపై స్పందిస్తూ..‘మా నానమ్మ, నాన్న, మా అమ్మ.. వీళ్లందరిని బీజేపీ నేతలు ఏదో ఒక కారణం చూపి విమర్శించేవారు. వాళ్లు ఇలాంటి మాటలు చెబుతూనే ఉంటారు. మేం మా పనిలో ముందుకు సాగుతాం’ అని అన్నారు. అధికారం కోసం పోటీ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని స్పష్టం చేశారు. ‘దేశంలో అనూహ్యంగా ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించలేని పరిస్థితి నెలకొంది. ప్రజలంతా భయపడుతున్నారు. ప్రజాహక్కులను కాపాడాల్సిన సంస్థలను, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్నారు. విమర్శలకు భయపడే ప్రభుత్వం నుంచి దేశాన్ని రక్షించాలని మీ అందర్ని కోరుతున్నా. సంకుచిత భావజాలంతో వ్యవహరించే వ్యక్తుల నుంచి, అసమ్మతిని అణచివేసే వ్యక్తుల నుంచి దేశాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని చెప్పారు. పర్యటనలో భాగంగా వయనాడ్ నుంచి సివిల్స్ సాధించిన తొలి గిరిజన యువతి శ్రీధన్య సురేశ్‌ను కలుసుకున్న ప్రియాంక ఆమెను అభినందించారు.