తొలిరోజు ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ | CWC Meeting In Hyderabad Taj Krishna live Updates | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో తొలిరోజు ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ.. హైలైట్స్‌ ఏంటంటే..

Published Sat, Sep 16 2023 8:45 AM | Last Updated on Sat, Sep 16 2023 9:07 PM

CWC Meeting In Hyderabad Taj Krishna live Updates - Sakshi

Updates..

హైదరాబాద్‌లో తాజ్‌ కృష్ణా హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు ఇవాళ భేటీ కొనసాగింది. పార్టీ ప్రెసిడెంట్‌ ఖర్గేతో పాటు సోనియా గాంధీ లాంటి కీలక నేతలు భేటీలో మాట్లాడారు. కేంద్రం తీరుపై విమర్శలతో పాటు ఇండియా కూటమి ఐక్యత ప్రధానంగా ఇవాళ్టి చర్చ నడిచింది.  రేపు.. ఆదివారం కూడా సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఎన్నికల నేపథ్యం.. పార్టీలో సమన్వయంపై ఇంకా చర్చించాల్సి ఉంది. 

07:30PM
స్కాంసృతిక కార్యక్రమాల అనంతరం.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇచ్చిన విందులో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, కీలక నేతలు పాల్గొన్నారు.

06:49PM
బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్కింగ్ కమిటీ సభ్యులతో అన్నారు. 

05:05PM
►ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై రేపు(ఆదివారం) అంతర్గత సమావేశంలో చర్చిద్దామని.. అలాగే సంస్థాగత సమస్యలపైనా  రేపటి  సమావేశంలో వివరంగా మాట్లాడతాను అని ఖర్గే సభ్యులను ఉద్దేశించి తెలిపారు

04:49PM
అధికారంలో ఉండి శాంతి స్థాపనలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోంది. మోదీ ప్రభుత్వ పద్దతులు  లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి: ఖర్గే

04:40PM
మన ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉంది. జాతీయ భద్రత విషయంలో, చైనా ఆక్రమణల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు: ఖర్గే

04:34PM
►ఇండియా కూటమి సమావేశాలు విజయవంతం కావడంతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు దిగుతోందని CWC సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు.

03:56PM
► ఖర్గే అధ్యక్షతన కొనసాగుతున్న సీడబ్ల్యూసీ భేటీ

03:15PM
ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీ
► హైదరాబాద్ తాజ్ కృష్ణ లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యకతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం

► 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ,మణీపూర్ ఇష్యూ ,ఇండియా కూటమి లో సీట్ల సర్దుబాటు అంశం తో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల పై చర్చ.

► హైదరాబాద్‌ సీడబ్ల్యూసీ సమావేశాల వేదికగా..  ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు. 

► తాజ్ కృష్ణ కు చేరుకున్న తుమ్మల నాగేశ్వరరావు.. మరి కొద్దిసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక

► హైదరాబాద్‌ చేరుకున్న సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీ, రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌, చత్తీస్‌ఘఢ్ సీఎం భూపేశ్‌ బఘేల్‌, సచిన్‌ పైలట్‌.

► తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన విందుకు హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక మిగతా సీడబ్ల్యూసీ సభ్యులు..

► ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ.

►తాజాగా టీపీసీసీ నేతలు మాట్లాడుతూ.. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్‌ విజయభేరి సభ ఉంటుంది. ఆరు గ్యారెంటీ హామీల ‍కోసమే బహిరంగ సభ. రేపు విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు. తాజ్‌కృష్ణ హోటల్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరికలు ఉంటాయి. సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో తుమ్మల చేరే అవకాశం ఉంది. 

►కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలే ప్రధాని అజెండాగా సీడబ్ల్యూసీ భేటీ. మణిపూర్‌ అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తాం. తెలంగాణ ప్రభుత్వ అవినీతి ప్రజలకు తెలుసు.

►కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)’ సమావేశాలకు సర్వం సిద్ధమైంది.
►తాజ్‌కృష్ణ హోటల్‌లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో కాంగ్రెస్‌ అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు. 
►శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ మొదలవుతుంది. 

ఐదు కీలక అంశాలు ఎజెండాగా.. 
►శని, ఆదివారాల్లో జరిగే ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ చర్చించనుంది. 
►త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, భారత్‌ జోడో యాత్ర–2 నిర్వహణ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇండియా ►కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి. 
►ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

శుక్రవారమే చేరుకున్న 52 మంది 
►సీడబ్ల్యూసీలోని సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84మంది సమావేశాలకు హాజరుకానున్నారు. శుక్రవారమే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. 
►హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌సింగ్‌ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్‌ చెన్నితాల, కొడుక్కునిల్‌ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్‌ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్‌ సింగ్‌ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్‌ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్‌ తివారీ, గౌరవ్‌ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా తదితరులు ఉన్నారు. 
►పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్‌ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్‌ భగేల్, మరికొందరు నేతలు శనివారం రానున్నారు. 

బహిరంగ సభ.. నియోజకవర్గ పర్యటనలు 
►సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్‌ ‘విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది.
►సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు.
►ఆ సభా వేదికపై నుంచి కాంగ్రెస్‌ ఎన్నికల హామీలుగా గ్యారంటీ కార్డు స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు.
► ఇక ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement