Taj Krishna
-
తాజ్ కృష్ణ లో ప్రీమియర్ మల్టీసిటీ ఫ్రాంచెస్ ఎక్స్పో (ఫొటో గ్యాలరీ)
-
గెలుపు దిశగా కాంగ్రెస్.. పక్కా ప్లాన్‌తో రెడీగా డీకే శివకుమార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మరోవైపు.. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇక, బీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలు పలుచోట్ల వెనుకంజలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. గెలుపొందిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. రిసోర్టు రాజకీయం కొనసాగే అవకాశం ఉంది. ఇక, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్లాన్ రచిస్తున్నారు. ట్రబుల్ షూటర్ డీకే.. శనివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు చేరుకొని ఎన్నికల ఫలితాలను విక్షిస్తున్నారు. #WATCH | On being asked if party MLAs will be shifted to Bengaluru as buses stationed outside Hyderabad's Taj Krishna, Congress leader & Karnataka minister Rahim Khan says, "If that situation comes, then party high command will decide." pic.twitter.com/nrAXP5MgQr — ANI (@ANI) December 3, 2023 మరోవైపు.. కాంగ్రెస్ నేతలు తాజ్‌కృష్ణలో రూమ్స్‌ను బుక్ చేసుకున్నారు. దాదాపు 100 గదులను రిజ్వర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ అభ్యర్థులను తాజ్‌కృష్ణకు తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కర్ణాటకకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి జంప్ కాకుండా హస్తం పార్టీ ముందస్తుగానే ప్లాన్ చేసింది. Telangana | Luxury buses have been stationed at Hyderabad's Taj Krishna. pic.twitter.com/1hJsAsfJrd — ANI (@ANI) December 3, 2023 -
తాజ్ కృష్ణ వద్ద కావేరి బస్సులు...కేసీఆర్ మాస్టర్ ప్లాన్..!?
-
తాజ్ కృష్ణలో కాంగ్రెస్ నేతలు..అసలు ఏం జరుగుతుంది ?
-
తాజ్ కృష్ణలో కాంగ్రెస్ అభ్యర్థులు
-
హైదరాబాద్ : బంజారాహిల్స్ సూత్ర ఎగ్జిబిషన్ ప్రారంభంలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే..
Updates.. 19: 20PM తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరీ సభ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలు ఇవే.. 1. మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, రూ. 500లకే మహిళలకు గ్యాస్ పిలిండర్, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం 2. రైతుభరోసా కింద రూ. 15 వేల పెట్టబడి సాయం, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల సాయం, వరి పంటకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ 3. గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 4. గృహ నిర్మాణానికి రూ. 5లక్షల సాయం 5. విద్యార్థులకు రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ 6. వృద్ధులకు నెలకు రూ. 4వేల చొప్పున పెన్షన్, రూ. 10 లక్షల వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా 18.02 PM ► తుక్కుగూడలో జరుగుతున్న విజయ భేరీ సభ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సభాప్రాంగణానికి కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే చేరుకున్నారు. ►తాజ్‌కృష్ణలో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► సోనియా గాంధీ ప్రకటించబోయే 6 గ్యారెంటీ స్కీంలు ఇవే.. 1. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్. 2. ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ. 3. రెండు లక్షల ప్రభుత్వ ఉధ్యోగాల భర్తీ. 4. దలిత, గిరిజనులకు 12 లక్షల ఆర్థిక సహాయం. 5. ఇందిరమ్మ ఇళ్ళకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం. 6. మహిళా సాధికారతకు ప్రత్యేక నిధి. ► కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. పార్టీలో క్రమశిక్షణను పాటించాలి. సొంత పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ. 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల నుంచి నివేదిక. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏఐసీసీ నేతల ప్రచారంపై త్వరలోనే షెడ్యూల్ ప్రకటిస్తాం. ► హోటల్ తాజ్‌కృష్ణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం. బీఆర్ఎస్, ఎంఐఎం బీజేపీకి పరోక్ష మద్దతుదారులు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించాం. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఇవాళ జరిగే సమావేశంలో చర్చిస్తాం. సాయంత్రం జరిగే విజయభేరిలో సోనియాగాంధీ గ్యారంటీలను ప్రకటిస్తారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్‌కు సభలోనే శంఖుస్థాపన చేస్తారు. తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయభేరిలో ఇవ్వబోయే గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో పథకాలు అన్నీ అమలు చేసేలా గ్యారెంటీ ఇవ్వబోతున్నాం. సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు లక్షలాదిగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ► డీకే శివకుమార్ మాట్లాడుతూ.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశం ఎజెండా. విద్వేష రాజకీయాలను దేశం నుంచి పాలద్రోలడమే కాంగ్రెస్ లక్ష్యం. సరైన ఎజెండా చెప్పకుండా పార్లమెంట్ ప్రత్యేక సోషన్ పెడుతున్నారు. ► కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక. ► నగరంలోని తాజ్‌కృష్ణ వేదికగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. రెండో రోజు సమావేశాలు ఆదివారం ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ► ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొననున్నారు. ► తొలిరోజు సమావేశంలో 14 జాతీయ అంశాలపై తీర్మానం. ► ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఆదివారం సాయంత్రం నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ విజయభేరి సభకు సర్వం సిద్ధమైంది. ప్యాబ్‌సిటీ సమీపంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ► కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సహా యువనేత రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ సహా సీడబ్ల్యూసీ ముఖ్యులు, అన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ అధ్యక్షులు, డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు హాజరు కానున్నారు. రెయిన్ ఫ్రూప్ టెంట్లు.. భారీ వర్షానికి సైతం నేతలు తడవకుండా ఉండేందుకు రెయిన్ ఫ్రూప్ టెంట్లను వేశారు. నేతల ప్రసంగాలు స్పష్టంగా విన్పించేందుకు సభాస్థలికి నాలుగు వైపులా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు, లౌడ్ స్పీకర్లు ఏర్పాటు చేశారు. ►సభా ప్రాంగణం చుట్టూ పెద్ద సంఖ్యలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ►స్వాగత తోరణాలు, భారీ కటౌట్లు, ఫ్లెక్సీల ఏర్పాటులో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. ►సీడబ్ల్యూసీ ముఖ్య నేతల కోసం ప్రధాన వేదికను కేటాయించారు. పీసీసీలు, మాజీ మంత్రులు, ఎంపీల కోసం ఒకటి.. డీసీసీలు, అనుబంధ సంఘాల నేతలు, కళాకారుల కోసం మరో స్టేజీని కేటాయించారు. ►ఈ మూడు వేదికలపై సుమారు 250 మంది ఆసీనులు కానున్నారు. సభకు వచ్చే ముఖ్య నేతల వాహనాలను ప్రధాన వేదిక వెనుక భాగంలోనే పార్కింగ్ చేయించనున్నారు. భారీ బందోబస్తు.. తుక్కుగూడకు వచ్చి వెళ్లే నాలుగు ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అదనపు డీసీపీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 27 మంది సీఐలు, 61 మంది మంది ఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ► ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్ నుంచి బయలుదేరే ముఖ్య నేతల వాహనాలు శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా తుక్కుగూడకు చేరుకుంటాయి. అటు నుంచి ర్యాలీగా ప్రధాన వేదిక వెనుకభాగంలోని ప్యాబ్‌సిటీ నుంచి సభా ప్రాంగణానికి అనుమతించనున్నారు. మిగిలిన వాహనాలను ప్రధాన రహదారి నుంచి అనుమతిస్తారు. -
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. హైదరాబాద్‌లో పోస్టర్ల వార్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా హస్తం నేతలంతా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టర్ల వార్ చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సీడబ్య్లూసీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ రాజధాని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, వారు పాల్పడిన కుంభకోణాలకు సంబంధించిన వివరాలను వాటిలో పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్లు అంటించారు. ఈ సందర్భగా స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి (బివేర్ ఆఫ్ స్కామర్స్) అంటూ టాగ్ లైన్‌తో గుర్తుతెలియన వ్యక్తులు పోస్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీంతో, ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌పై కూడా పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ఫొటోతో ఓ స్కానర్‌ను రూపొందించారు. దీనిపై బుక్ మై సీఎం.. డీల్స్ అవాలబుల్.. 30 శాతం కమీషన్ అని రాసుకొచ్చారు. దీంతో, ఈ పోస్టర్లు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, రెండు పార్టీలకు చెందిన పోస్టర్లు అంటించడంపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ.. హస్తం నేతలు బిజీబిజీ -
తొలిరోజు ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ
Updates.. హైదరాబాద్‌లో తాజ్ కృష్ణా హోటల్లో కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం తొలి రోజు ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు ఇవాళ భేటీ కొనసాగింది. పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ లాంటి కీలక నేతలు భేటీలో మాట్లాడారు. కేంద్రం తీరుపై విమర్శలతో పాటు ఇండియా కూటమి ఐక్యత ప్రధానంగా ఇవాళ్టి చర్చ నడిచింది. రేపు.. ఆదివారం కూడా సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఎన్నికల నేపథ్యం.. పార్టీలో సమన్వయంపై ఇంకా చర్చించాల్సి ఉంది. 07:30PM స్కాంసృతిక కార్యక్రమాల అనంతరం.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చిన విందులో సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ సభ్యులు, కీలక నేతలు పాల్గొన్నారు. 06:49PM బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వర్కింగ్ కమిటీ సభ్యులతో అన్నారు. 05:05PM ►ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై రేపు(ఆదివారం) అంతర్గత సమావేశంలో చర్చిద్దామని.. అలాగే సంస్థాగత సమస్యలపైనా రేపటి సమావేశంలో వివరంగా మాట్లాడతాను అని ఖర్గే సభ్యులను ఉద్దేశించి తెలిపారు 04:49PM అధికారంలో ఉండి శాంతి స్థాపనలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోంది. మోదీ ప్రభుత్వ పద్దతులు లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి: ఖర్గే 04:40PM మన ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉంది. జాతీయ భద్రత విషయంలో, చైనా ఆక్రమణల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు: ఖర్గే 04:34PM ►ఇండియా కూటమి సమావేశాలు విజయవంతం కావడంతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు దిగుతోందని CWC సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. 03:56PM ► ఖర్గే అధ్యక్షతన కొనసాగుతున్న సీడబ్ల్యూసీ భేటీ 03:15PM ప్రారంభమైన సీడబ్ల్యూసీ భేటీ ► హైదరాబాద్ తాజ్ కృష్ణ లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యకతన ప్రారంభమైన సీడబ్ల్యూసీ సమావేశం ► 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ,మణీపూర్ ఇష్యూ ,ఇండియా కూటమి లో సీట్ల సర్దుబాటు అంశం తో పాటు వివిధ రాష్ట్రాలలో ఉన్న పరిస్థితుల పై చర్చ. ► హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల వేదికగా.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు. ► తాజ్ కృష్ణ కు చేరుకున్న తుమ్మల నాగేశ్వరరావు.. మరి కొద్దిసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక ► హైదరాబాద్ చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం గెహ్లాట్, చత్తీస్ఘఢ్ సీఎం భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్. ► తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన విందుకు హాజరైన ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక మిగతా సీడబ్ల్యూసీ సభ్యులు.. #WATCH | Congress president Mallikarjun Kharge, Parliamentary Party Chairperson Sonia Gandhi, MP Rahul Gandhi, Congress General Secretary Priyanka Gandhi Vadra, Rajasthan CM Ashok Gehlot, Chhattisgarh CM Bhupesh Baghel and party leader Sachin Pilot arrive at Hyderabad airport to… pic.twitter.com/2fyvAA20n1 — ANI (@ANI) September 16, 2023 ► ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. #WATCH | Delhi: Congress Parliamentary Party Chairperson Sonia Gandhi and MP Rahul Gandhi leave for Hyderabad to attend the Congress Working Committee (CWC) meeting, from Delhi airport. pic.twitter.com/hgSb9LTn4R — ANI (@ANI) September 16, 2023 ►తాజాగా టీపీసీసీ నేతలు మాట్లాడుతూ.. రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ ఉంటుంది. ఆరు గ్యారెంటీ హామీల కోసమే బహిరంగ సభ. రేపు విజయభేరి సభలో ఎలాంటి చేరికలు ఉండవు. తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరికలు ఉంటాయి. సాయంత్రం ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో తుమ్మల చేరే అవకాశం ఉంది. ►కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికలే ప్రధాని అజెండాగా సీడబ్ల్యూసీ భేటీ. మణిపూర్ అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తాం. తెలంగాణ ప్రభుత్వ అవినీతి ప్రజలకు తెలుసు. ►కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)’ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ►తాజ్‌కృష్ణ హోటల్లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు. ►శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ మొదలవుతుంది. ఐదు కీలక అంశాలు ఎజెండాగా.. ►శని, ఆదివారాల్లో జరిగే ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. ►త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, భారత్ జోడో యాత్ర–2 నిర్వహణ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇండియా ►కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి. ►ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారమే చేరుకున్న 52 మంది ►సీడబ్ల్యూసీలోని సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84మంది సమావేశాలకు హాజరుకానున్నారు. శుక్రవారమే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. ►హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా తదితరులు ఉన్నారు. ►పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్ భగేల్, మరికొందరు నేతలు శనివారం రానున్నారు. బహిరంగ సభ.. నియోజకవర్గ పర్యటనలు ►సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్ ‘విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. ►సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ►ఆ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల హామీలుగా గ్యారంటీ కార్డు స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. ► ఇక ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. -
Hyderabad: తాజ్‌కృష్ణపై డేగకన్ను
హైదరాబాద్: నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణ కేంద్రంగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర కొత్వాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికే పలువురు పోలీసు సిబ్బంది ఈ బాధ్యతలు చేపట్టారు. సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, దారి తీసే మార్గాలనూ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోనున్నారు. శుక్రవారం నుంచే ప్రముఖులు వస్తుండటంతో అటు శంషాబాద్ విమానాశ్రయంతో పాటు తాజ్ కృష్ణ పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతల విభాగంతో పాటు నగర భద్రత విభాగం, ట్రాఫిక్ వింగ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా పని చేస్తున్నారు. హోటల్లో బస చేసి ఉన్న వారి జాబితాలను సేకరించిన పోలీసులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన గలాభా నేపథ్యంలో మరింత అప్రమత్తయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజ్ కృష్ణతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోకి కేవలం అధీకృత వ్యక్తులనే అనుమతించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ మూడు నాలుగు సార్లు అణువణువూ బాంబు నిర్వీర్యం బృందాలు, స్నిఫర్ డాగ్స్ తనిఖీ చేయనున్నారు. ఇద్దరు డీసీపీ స్థాయి అధికారుల నేతృత్వంలో ఇద్దరు అదనపు డీసీపీలు, నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్–ఇన్స్పెక్టర్లు, 13 మంది ఏఎస్సైలు, 110 మంది కానిస్టేబుళ్ళు, నాలుగు ప్లటూన్ల సాయుధ బలగాలు మూడు షిఫ్టులో విధులు నిర్వర్తిస్తాయి. వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది సైతం అవసరమైన సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సీడబ్ల్యూసీకి సిటీ ముస్తాబు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో తరలివస్తున్న అతిరథ మహారథులకు నగరం స్వాగతం పలుకుతోంది. సమావేశాల వేదిక తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లే మార్గాలను సుందరంగా అలంకరించిన పార్టీ నాయకత్వం.. భారీ కటౌట్లు, జెండాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తింది. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో శని, ఆదివారాల్లో జరగనున్న భేటీకి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, ఖర్గే సహా అధినాయకత్వమంతా హాజరు కానుంది. పార్టీ రథ సారథులు నగరానికి కదిలి వస్తుండటంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాగా.. నగర శివారు తుక్కుగూడ వేదికగా జరిగే విజయభేరి సభకు నగర శివారు ప్రాంతాలు సైతం భారీగా ముస్తాబవుతున్నాయి. విజయభేరి బహిరంగ సభకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా జనసమీకరణకు పార్టీ కసరత్తు చేస్తోంది. -
‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా మారిందని ఏఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాలు ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని మోదీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజలను ఇరిటేట్ చేస్తున్నారని విమర్శించారు. ఇండియా మొత్తం ఇండియా కూటమివైపు చేస్తోందని తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. షర్మిల కాంగ్రెస్నాయకులను కలిసిందని, నిర్ణయం త్వరలో తెలుస్తుందని తెలిపారు. ఈమేరకు 17న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తుక్కుగూడలో విజయభేరి సభాస్థలిని కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, ఇంఛార్జి మణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. రిజర్వేషన్ బిల్లు తెచ్చింది సోనియా గాంధేనని తెలిపారు. రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. భారత్ జోడో యాత్ర తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని.. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. విజయభేరి సభలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటిస్తామని చెప్పారు. చదవండి: మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..? కాంగ్రెస్ అగ్రనేతంతా హైదరాబాద్‌కే.. సీడబ్ల్యూసీ, విజయభేరి సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ రానున్నారు. వీరితోపాటు ప్రియాంక గాంధీ, నాలుగు రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, 29 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ముఖ్యనేతలు తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ హై సెక్యూరిటీ జోన్లోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ ఆగ్ర నేతలంతా ఈ హోటల్లోనే బస చేస్తుండడంతో కేంద్ర బలగాలు హోటల్ మొత్తాన్ని, పరిసరాలను నియంత్రణలోకి తీసుకున్నాయి. -
Congress Party: 100 సీట్లలో ఒక్కో పేరే!.. స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను దాదాపుగా రాష్ట్రంలోనే పూర్తి చేయాలని.. 100 నియోజకవర్గాలకు ఒక్కో అభ్యర్థి పేరుతోనే అధిష్టానానికి జాబితాలను పంపాలని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై ఈ అంశంపై చర్చించింది. కమిటీ చైర్మన్ మురళీధరన్తోపాటు సభ్యులు మాణిక్‌రావ్ ఠాక్రే, సిద్ధిఖీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్ర మార్క, మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, రోహిత్‌చౌదరి తదితరులు ఇందులో పాల్గొన్నారు. మరో సభ్యుడు, గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ అనారోగ్యం కారణంగా హాజరుకాలేదు. ఈ సమావేశంలో భాగంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు, ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) ఇచ్చిన నివేదికలను నేతలు పరిశీలించారు. ఇక్కడే కసరత్తు పూర్తి చేద్దాం.. తొలుత స్క్రీనింగ్ కమిటీలో రాష్ట్రం నుంచి సభ్యులుగా ఉన్న రేవంత్, ఉత్తమ్, భట్టి ఆయా చోట్ల టికెట్ల ఖరారు ప్రాథమ్యాలను వివరించారు. అనంతరం రాష్ట్రంలో సామాజిక వర్గాల వారీగా టికెట్ల కేటాయింపు ఆవశ్యకత, మహిళలకు కేటాయించాల్సిన సీట్లు, యువతకు టికెట్లు, పార్టీ అనుబంధ సంఘాలకు అవకాశం తదితర అంశాలపై చర్చించారు. ఎక్కడెక్కడ ఏ కేటగిరీ నాయకులకు అవకాశం కల్పించగలమనేదానిని పరిశీలించారు. ఏఐసీసీకి పంపే జాబితాను అన్ని కోణాల్లో క్షుణ్నంగా నిర్ధారించి పంపాలని, మెజార్టీ స్థానాల్లో ఒక్కటే పేరు సూచించేలా కసరత్తును ఇక్కడే పూర్తి చేయాలని భేటీలో నిర్ణయానికి వచ్చారు. దాదాపు రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగినా.. నియోజకవర్గాల వారీగా కసరత్తు పూర్తి కాకపోవడంతో త్వరలో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. భేటీ ముగిశాక మురళీధరన్, ఠాక్రే, భట్టి మీడియాతో మాట్లాడారు. మరో రెండు వారాలు పడుతుంది ‘‘అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. సమావేశంలో భాగంగా అన్ని అంశాలపై నిశితంగా పరిశీలన చేశాం. కసరత్తు పూర్తయ్యేందుకు మరో రెండు వారాల సమయం పడుతుంది. మెజార్టీ స్థానాలకు ఒక్కటే పేరు పంపాలని నిర్ణయించాం. త్వరలోనే మరోమారు సమావేశం జరుగుతుంది.’’ – కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఇంకా చర్చించాల్సినవి చాలా ఉన్నాయి ‘‘పీఈసీ సమావేశంలో వచి్చన అభిప్రాయాలు, పీఈసీ ఇచి్చన నివేదికపై సుదీర్ఘంగా చర్చించాం. పీఈసీ సభ్యులతోపాటు డీసీసీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల సలహాలను పరిగణనలోకి తీసుకుంటాం. స్క్రీనింగ్ కమిటీలో ఇంకా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. – పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ప్రామాణికాలపై చర్చించాం స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ రాష్ట్ర నేతల దగ్గర అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాలపై సమావేశంలో మాట్లాడాం. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి ప్రామాణికాలు అనుసరించాలన్న దానిపై చర్చించాం. త్వరలో మరోమారు సమావేశమై కసరత్తు పూర్తిచేస్తాం. – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎల్బీ స్టేడియంలో ఉత్తమ్‌కుమార్‌తో మాట్లాడుతున్న కేసీ వేణుగోపాల్. చిత్రంలో మాణిక్‌రావ్ ఠాక్రే, రేవంత్‌రెడ్డి, పొంగులేటి తుక్కుగూడలో కాంగ్రెస్ సభ – వివరాలు 2లో తుక్కుగూడలో కాంగ్రెస్ సభ – వివరాలు 2లో -
తాజ్ కృష్ణలో ప్రారంభమైన స్క్రీనింగ్ కమిటీ సమావేశం
-
అత్యద్భుతమైన డిజైన్లతో ఆభరణాల ప్రదర్శన (ఫోటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో రహస్య గోరఖ్ సందడి
-
‘ది హాత్’ షురూ
-
డియర్ మామ్
-
బుల్లితెర నటి నవ్య నవ్వు
-
ఫ్యాషన్ ‘ఉత్సవ్’
-
సూపర్ ‘ట్రెండ్స్’
-
తాజ్‌కృష్ణాలో ’ట్రెండ్స్ వివాహ్’ ఎగ్జిబిషన్
-
తాజ్ కృష్ణాలో సుత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్
-
తాజ్ క్రిష్ణాలో అతి పెద్ద జువెల్లరీ ఎక్స్పో
-
తాజ్‌కృష్ణాలో డిజైర్ ఎగ్జిబిషన్
-
సాక్షి ప్రాపర్టీ షోకి విశేష స్పందన
-
మార్చి 4, 5 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో!
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణాలో మార్చి 4, 5 తేదీల్లో సాక్షి మెగా ప్రాపర్టీ షో జరగనుంది. అపర్ణా కన్స్ట్రక్షన్స్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఆదిత్య, రాజపుష్ప, జనప్రియ, మ్యాక్ ప్రాజెక్ట్స్, సైబర్ సిటీ, ఎన్సీసీ, సుమధుర, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్, ఆక్సాన్ హౌజింగ్, శాంతా శ్రీరామ్, ఫార్చ్యూన్ బటర్ఫ్లైసిటీ, ఏఆర్కే ఇన్ఫ్రా, కపిల్ టవర్స్. గ్రీన్ హోమ్స్ వంటి సంస్థలు కూడా పాల్గొననున్నాయి. స్టాల్స్ బుకింగ్ కొరకు 99122 20380, 99516 03004 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
తాజ్‌కృష్ణాలో ట్రెండ్జ్ ఎక్స్పో
డిజైనర్ ఉత్పత్తులకు పేరొందిన ట్రెండ్జ్ ఎక్స్పో హోటల్ తాజ్‌కృష్ణాలో ఏర్పాౖటెంది. మాజీ మిస్ ఇండియా పూర్వా రానా ఈ ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో టాలీవుడ్ యువ తారలు, పేజ్‌త్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ఎక్స్పో మూడు రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకురాలు శాంతి చెప్పారు. – సాక్షి, వీకెండ్ ప్రతినిధి -
తాజ్‌కృష్ణాలో తాప్సీ సందడి
సాక్షి, సిటీబ్యూరో: చెన్నైకి చెందిన యునైటెడ్ ఎగ్జిబిషన్స్ (యూఈ) ఆధ్వర్యంలో నగరంలో ఆభరణాల ప్రదర్శన ఏర్పాౖటెంది. బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణా హోటల్లో ఈ ఎక్స్పోని సినీ నటి తాప్సీ శుక్రవారం ప్రారంభించారు. నటి సోనీ చరిష్టా పాల్గొన్నారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది. -
నగరంలో సునీల్ శెట్టి..
బంజారాహిల్స్: ‘సేవ్ ద చిల్డ్రన్’ పేరుతో తన అత్తగారు విపులా కద్రి 27 ఏళ్ల క్రితం స్థాపించిన స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని సినీనటుడు సునీల్ శెట్టి అన్నారు. తన భార్య మనా శెట్టితో కలిసి బుధవారం తాజ్‌కృష్ణా హోటల్లో ఏర్పాటు చేసిన ‘ఆరాయిష్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఎగ్జిబిషన్ ద్వారా నిధులు సేకరించి... సంస్థ నిర్వహిస్తున్నామని చెప్పారు. వస్త్రాలు, ఆభరణాలు, పాదరక్షలు తదితర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనా శెట్టి మాట్లాడుతూ సామాజిక సేవకు గ్లామర్ రంగాన్ని వినియోగించుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
తాజ్‌కృష్ణాలో జీవిత సందడి
సాక్షి,హైదరాబాద్: ఆభరణాలు ధరించినవారికి రిచ్‌లుక్ తెస్తాయి. కొన్ని మాత్రం దానికి రాయల్ లుక్‌ని కూడా జోడిస్తాయి. అలాంటి రాజసాన్ని ఒలికించే ప్రత్యేకమైన ఆభరణాల ప్రదర్శన బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో శుక్రవారం ఏర్పాౖటెంది. ఈ ప్రదర్శనను సినీ ప్రముఖురాలు జీవిత సహా పలువురు నగర ప్రముఖులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ జైపూర్ జ్యుయల్స్ ప్రతినిధి, డిజైనర్ అపర్ణా సుంకు మాట్లాడుతూ రాజుల కాలం నాటి ఆభరణ శైలుల నుంచి స్ఫూర్తి పొంది వాటికి ఆధునికతను జోడించి అద్భుతంగా తీర్చిదిద్దిన ఆభరణాలను తాము ప్రదర్శిస్తున్నామని తెలిపారు. ప్రదర్శన 3 రోజల పాటు కొనసాగుతుందన్నారు. -
తాజ్ కృష్ణలో కలర్‌ఫుల్ ఎగ్జిభిషన్
-
తాజ్‌కృష్ణలో పెయింటింగ్ ఎగ్జిబిషన్
-
తాజ్ కృష్ణలో ట్రెండ్జ్ వివహ్ కలెక్షన్
-
జీవీకే చౌరస్తాలో వన్‌వే
- వాహన దారులకు చుక్కలు చూపెడుతున్నట్రాఫిక్ బంజారాహిల్స్ చౌరస్తాలన్నీ మూసివేస్తూ యూటర్న్‌లకు శ్రీకారం చుడుతూ వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జీవీకే వన్ చౌరస్తాలో కూడా వన్‌వేను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి ఇక్కడ వన్‌వే అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు వాటర్‌వర్క్స్ కార్యాలయం నుంచి జీవీకే చౌరస్తా మీదుగా తాజ్‌కృష్ణా వైపు వాహనాలు వెళ్లేవి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల వాటర్‌వర్క్స్ కార్యాలయం నుంచి ఎడమవైపుకు తీసుకొని పోస్టాఫీస్ వద్ద యూటర్న్ చేసుకొని తాజ్‌కృష్ణా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక జీవీకే వైపు నుంచి వాటర్వ ర్క్స్ కార్యాలయం వైపు వెళ్లే వాహనదారులు తాజ్ కృష్ణా చౌరస్తాలో యూటర్న్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల వాహనదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు. -
నేడు,రేపు సాక్షి ’ప్రాపర్టీ షో’
-
ప్రాపర్టీ షో అదుర్స్
-
రాచకొండ రంగేళీ..
పచ్చికను చుట్టుకున్న గుట్టలు.. మధ్యలో హొయలుపోతూ సెలయేరు.. వాటిని కంటి చూపుతో నియంత్రిస్తున్న భావన కలిగించేలా రాజభవనాలు.. ఎప్పుడూ పాలనతో గంభీరంగా ఉండే అక్కడి వాతావరణం తొమ్మిది రోజులుగా ఎంతో కోలాహలంగా మారింది. సాధారణ వ్యక్తి నుంచి రాజు వరకు అందరిలోనూ ఉత్సాహం... సామంత రాజులూ వేడుకలో పాలుపంచుకుంటున్నారు. అంతటి ఉత్సాహంలోనూ ప్రజా సంక్షేమ కాంక్షే అక్కడ రాజ్యమేలింది. వర్గాల వారీగా రాజు మంతనాలు జరిపి రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేయాలనే విషయంలో అభిప్రాయ సేకరణ జరిపారు. నచ్చినవారు తోచిన సలహాలిచ్చారు. రాజు సరేనన్నారు. మైమరిపించే ఉత్సాహం రెట్టింపయింది అక్కాడవారికి. ఊహల్లో కల్పనగా పుట్టుకొచ్చే కథలా ఉంది కదూ ఈ వర్ణన. కానీ మనకు రాజధానిగా వర్ధిల్లిన కోట గోడల సాక్షిగా ఇది యథార్థ గాథ. మన చరిత్ర అక్కడి నుంచే మొదలైందనే భావనకు రూపంగా కనిపించే హైదరాబాద్ కాదిది. అంతకు ముందు విలసిల్లిన రాచకొండ వైభవంలో ఓ భాగం. నగరానికి కూతవేటు దూరంలో నాటి రాచరిక దర్పానికి సాక్ష్యంగా నిలిచిన మొండి గోడలే దానికి తార్కాణం. హైదరాబాద్ పుట్టక పూర్వం ఆ దుర్గంలో వసంతోత్సవ వేళ సాక్షాత్కరించిన దృశ్యమే ఈ వర్ణన! హోలీ... రంగుల కేళీ. మనకింతవరకే తెలుసు. కానీ ఈ వసంతోత్సవం వెనక పరమార్థమూ దాగి ఉంది. దాన్ని ఆచరించి చూపిందే ‘రాచకొండ’. హైదరాబాద్ సంస్థానం ఏర్పాటుకు పూర్వం ఈ ప్రాంతాన్ని రేచర్ల పద్మనాయక వంశం (1361-1475) పాలించింది. ఈ వంశంలో రెండో పాలకుడు రెండో సింగమనాయక హయాం (1384-1399) నుంచి వసంతోత్సవాన్ని నిర్వహించిన ప్రస్తావన చారిత్రక గ్రంథాల్లో ఉంది. రాచకొండ సామంతరాజ్యాల్లో ఒకటైన భీమ్‌గల్ ఆస్థానంలో కవిగా వెలుగొందిన కొరవి గోపరాజు విరచిత ‘సింహాసన ద్వాత్రింశిక’లో ఈ వసంతోత్సవ ప్రస్తావన ఉంది. మూడు వర్గాల ప్రజలతో మమేకం... రాచకొండలో ఇది తొమ్మిది రోజుల వేడుక. చివరిరోజు వసంతోత్సవం. ఆరోజు రాజు-బంటు తేడా లేకుండా అంతా కలిసి ఆనందాన్ని పంచుకోవటం ఆనవాయితీ. రాజప్రసాదం వెలుపల ఇందుకు ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసేవారు. దాన్ని వ జ్రవైఢూర్యాలు, రంగురంగుల పూలతో అద్భుతంగా అలంకరించేవారు. ఆ ప్రాంతానికి రాగానే కస్తూరి సువాసన గుబాళించేది. మేళతాళాలు, యువత నృత్యవిన్యాసాల సందడుల మధ్య రాజు పరివారంతో అక్కడికి చేరుకునేవారు. అందుకు గుర్తుగా భేరీలు మోగగానే ఈలలు, చప్పట్లతో ప్రజలు ఆయనను స్వాగతించేవారు. ఆ ప్రాంతం చుట్టూ విస్తరించిన తోటలు, అందులోని పూలు, పండ్ల చెట్లు కొత్త శోభను సంతరించున్న వేళ... రాజ పరివారం అందులో విహరించేది. ఆ తర్వాత సంగీత నృత్యకార్యక్రమాలు జరుగుతుండగా ప్రధాన వేదిక వద్దకు రాజ కుటుంబం చేరుకునేది. ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేసిన వసంత, మదన-రతి, లక్ష్మీఉపేంద్ర, గౌరీశంకర దేవాతామూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించే వారు. మనలోని కోరికలను జయించేలా కామదహనం లాంటి ప్రత్యేక కార్యక్రమాలు హోలీ వేళ నిర్వహించే ఆనవాయితీ ఉన్నందున ఆ తరహా దేవతారూపాల పూజలు జరిగేవి. తర్వాత అక్కడికి చేరుకున్న మేధావులు, కవులు, కళాకారులతో రాజు భేటీ అయ్యేవారు. వారితో పాటు ప్రజల నుంచి పాలనపై అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకునేవారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు, గంధం, కుంకుమలాంటి వాటిని పరస్పరం చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపేవారు. అక్కడే ఉన్న సెలయేరు (ఇప్పుడు మామూలు చెరువుగా ఉంది)లో జలకాలాటలు సాగేవి. తోటల్లోని పూలతో యువతులు మాలలు గుచ్చి రాజుకు సమర్పించేవారు. మామిడి పిందెలను తెచ్చి ఆయనకు కానుకగా ఇచ్చేవారు (ఇప్పటికీ ఆ పాంతంలో పండ్ల చెట్లున్నాయి). ‘రంగుల కేళీ ఎంత ఘనంగా జరగాలో, ఏ రూపంలో నిర్వహించాలో చాటిచెప్పే అద్భుత సంప్రదాయం రాచకొండలో అప్పట్లో విలసిల్లింది. రాజు ప్రజారంజక పాలన అందిస్తే ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆయన ప్రజలతో మమేకమై వారికేం కావాలో తెలుసుకోవాలి. అది ఇక్కడ కనిపించింది. ఆ తీరు నేటి తరానికి ఆదర్శం కావాలి’ అని ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు సత్యనారాయణ చెబుతున్నారు. కొరవి గోపరాజు రాసిన గ్రంథంలో రాచకొండ వసంతోత్సవ వైభవం కళ్లకు కట్టిందన్నారు. గౌరీభట్ల నరసింహమూర్తి ఇండియా అన్ప్లగ్డ్ సంప్రదాయేతర ఇంధన వనరుల్ని ఎక్కువగా వినియోగించుకొని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని కోరుతూ డబ్ల్యూడబ్ల్యూస్ ఎర్త్ అవర్‌కి పిలుపునిచ్చింది. ఈ నెల 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ ‘ఇండియా అన్ప్లగ్డ్’కు నగరవాసులంతా చేయూతనివ్వాలని కోరింది. బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో టెన్నిస్ తార సానియా మిర్జా పాల్గొంది. ఎర్త్ అవర్‌ను అన్ని సంస్థలు, కార్యాలయాలు పాటించి, పర్యావరణ పరిరక్షణలో అంతా భాగస్వాములు కావాలని కోరింది. -
సాక్షి ప్రాపర్టీ షో!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాక్షి ఆధ్వర్యంలో తొలి ప్రాపర్టీ షో జరగనుంది. అపర్ణా కన్స్ట్రక్షన్స్ ప్రధాన స్పాన్సర్‌గా నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షో.. బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ను పెంచడంతో పాటు మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మార్చి 7, 8న తాజ్‌కృష్ణలో.. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని తాజ్‌కృష్ణలో మార్చి 7, 8 తేదీల్లో జరిగే ఈ స్థిరాస్తి ప్రదర్శనలో దాదాపు 30కి పైగా బిల్డర్లు తమ నిర్మాణాలు, లే-అవుట్లను ప్రదర్శిస్తారు. వివిధ ప్రాంతాల్లో కడుతోన్న వ్యక్తిగత గృహాలు, డూప్లేలు, విల్లాలు, ఫ్లాట్ల, వాణిజ్య సముదాయాల సమాచారాన్ని కొనుగోలుదారులు తెలుసుకోవచ్చు. పైగా అక్కడే బ్యాంకులూ ఉండటం వల్ల గృహ రుణాలకు సంబంధించిన వివరాలనూ కనుక్కోవచ్చు కూడా. నగరం నలువైపులా నిర్మిస్తోన్న ప్రాజెక్టుల వివరాల్ని తెలుసుకోవడం కాస్త కష్టమే. స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు కనీసం ఒకట్రెండు నెలలు తిరిగితే తప్ప సమాచారాన్ని తెలుసుకోలేని పరిస్థితి. వివిధ ప్రాంతాల్లో ఏయే నిర్మాణాల్లో ఎంత రేటు చెబుతున్నారు, అవి ప్రస్తుతం ఏయే దశలో ఉన్నాయి, ఏయే రాయితీలను అందిస్తున్నారు వంటి సమాచారాన్ని కొనుగోలుదారుల ముందు ప్రదర్శిస్తారు. ఎంపికలో కీలకమైన ఇలాంటి విషయాలు తెలిస్తేనే.. కొనుగోలుదారులు అంతిమ నిర్ణయానికి రావటం తేలికవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. అనువుతుల కోసం వివిధ ప్రభుత్వ సంస్థలకు కట్టాల్సిన రుసుములు, ఇతరత్రా ఖర్చులూ రెట్టింపయ్యాయి. అయినప్పటికీ పలు సంస్థలు ఇంటి అంతిమ ధరను పెంచట్లేదు. అందుకే నేటికీ నగరంలో ఇళ్ల ధరలు అందుబాటులోనే ఉన్నాయి. ఇతర నగరాలతో పోల్చితే దాదాపు 30 శాతం తక్కువకే లభిస్తున్నాయి. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతుంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి తరుణం. మరి ఆలస్యం దేనికి.. వెంటనే మీ కుటుంబ సభ్యులతో విచ్చేసి నచ్చిన ఇంటిని ఎంచక్కా ఎంపిక చేసుకోండి. స్టాల్స్ బుకింగ్ కోసం 99122 20380, 99516 03004 నంబర్లలో సంప్రదించవచ్చు. -
వివాహ్
అందమైన భామలు సంప్రదాయ సిరులు ఒలికించారు. పట్టు పరికిణీలు, చీరల్లో వయ్యారాల సింగారాలు కురిపించారు. బంజారాహిల్స్ హోటల్ తాజ్‌కృష్ణాలో మంగళవారం ప్రారంభమైన ‘ట్రెండ్జ్’ వివాహ కలెక్షన్ ఎక్స్‌పోలో కలర్‌ఫుల్ డ్రెస్సుల్లో మెరిసిపోయారు. అరవై మందికి పైగా మాస్టర్ డిజైనర్లు రూపొందించిన లక్షకు మించిన డిజైన్లు మగువ మనసు దోస్తున్నాయి. పెళ్లికి కావల్సిన వస్త్రాభరణాలన్నీ ఇందులోని స్టాల్స్‌లో కొలువుదీరాయి. వీటితోపాటు మెటాలిక్, నాన్ మెటాలిక్, ఎత్నిక్ జ్యువెలరీ జిగేల్‌మంటోంది. తేతార్ ఫర్నిషింగ్స్, హోమ్ యాక్ససరీస్ వంటివెన్నో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. శుక్రవారం వరకు ఎక్స్పో కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. -
యాత్రా స్పెషల్
-
కామినీ షరాఫ్ ఫ్యాషన్‌యాత్ర
దేశంలోని ప్రముఖ డిజైనర్ల ఫ్యాషన్ కలెక్షన్‌ను కామినీ షరాఫ్ నగరానికి తీసుకొస్తున్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణాలో అక్టోబర్ 9న ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్యాషన్ ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. మ్యోహో, ఆర్తీ విజయ్ గుప్తా, ప్రియా థోలియా, జూలీ, ఏక్ కార్ఖానా, ఓసా, ఎరుమ్, అలోక్ బైద్, సిల్క్‌వార్మ్, ప్రియంవద, లీలా, హీనా కొచ్చర్, ఆయేషా మన్మీరా, ఆరిషి, జేబైష్, నవ్య, మోనికా భయానా, ప్రీతి ఝవార్, ఆయినా వంటి డిజైనర్లు రూపొందించిన ఫ్యాషన్ దుస్తులు, జ్యువెలరీ కలెక్షన్‌ను ఈ ప్రదర్శనలో నగరవాసులకు అందుబాటులో ఉంచనున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఛోటీ, లిటిల్ వార్డ్రోబ్, మిమోసా, ఓన్స్ బ్రాండ్స్, షీర్ కిడ్స్‌వేర్, మి డల్సె, అన్యా ఆర్గానిక్ చిక్, శ్రుతి జలాన్ ఎన్ లిటిల్ ప్లెజర్స్ వంటి ఫ్యాషన్ దుస్తులను కూడా ప్రదర్శించనుండటం విశేషం. వీటితో పాటు బ్యాగులు, శాలువలు, పాదరక్షలు, హోమ్ డెకర్స్ కూడా ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి. -
ఫ్యాషన్ ఫెస్ట్
ట్రెడిషనల్ వస్త్రాలు, ఫ్యాషన్ డిజైనింగ్స్‌తో ఆకృతి ఎలైట్ ఫ్యాషన్ పెయిర్ కళకళలాడుతోంది. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణాలో మంగళవారం ప్రారంభమైన ఈ ఎక్స్పోను సినీ నటి భాగ్యశ్రీ (వెయ్యి అబద్ధాలు) ప్రారంభించింది. దసరా సీజన్‌కు ఆహ్వానం పలుకుతూ.. పెయిర్ ప్రాంగణాన్ని ట్రెడిషనల్‌గా తీర్చిదిద్దారు. వివిధ రాష్ట్రాలకు, దేశాలకు చెందిన 90 మంది డిజైనర్ల కలెక్షన్లు ఎక్స్‌పోలో కొలువుదీరాయి. దుబాయ్, బ్యాంకాక్, పాకిస్థాన్ తదితర దేశాలకు చెందిన స్టాల్స్ ఫ్యాషన్ ప్రియులను కట్టిపడేస్తున్నాయి. దాండియా కాస్ట్యూమ్స్ ప్రత్యేక ఆకర్షణ. బుధవారంతో ముగియనున్న ఈ ఎక్స్‌పోలో గోటాపట్టీ శారీస్, డిజిటల్ ప్రింట్ శాలువాలు, లెహంగా, యాక్సెరీస్, బండర్ వాల్స్, బెనార స్ మ్యాట్స్ వంటివెన్నో అందుబాటులో ఉన్నాయి. -
స్టైల్ ఎక్స్పో
మగువ అందాన్ని రెట్టింపు చేసే డిజైనర్ చీరలు, డ్రెస్ మెటీరియుల్స్, ఆభరణాలు బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో కొలువుదీరారుు. పండుగల సీజన్‌ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ‘ట్రెండ్జ్’ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పోలో బ్రైడల్ వేర్ ప్రత్యేక ఆకర్షణ. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నుంచి వచ్చిన ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్లు ఇక్కడ తవు డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. నటుడు కృష్ణుడు... ఆయున సతీవుణి గాయుత్రి, కువూర్తె నిత్యతో కలసి షాపింగ్ చేశారు. ప్రవుుఖ డిజైనర్ అవ్రూపాల్ హొయలొలికించారు. వుంగళవారం కూడా ప్రదర్శన ఉంటుంది. -
జ్యువెల్స్ ఆఫ్ ఏషియా
అతివలకు అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నివ్వడంలో ఆభరణాలది ప్రధాన పాత్ర అంటున్నారు మిస్సెస్ ప్లానెట్ మెహక్‌మూర్తి. ‘జ్యువెల్స్ ఆఫ్ ఏషియా’ పేరిట ఆగస్టు ఒకటి నుంచి మూడు రోజుల పాటు హోటల్ తాజ్ కృష్ణాలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్యాలయుంలో బుధవారం జరిగిన కార్యక్రవుంలో ఎగ్జిబిషన్ వివరాలను నిర్వాహకులతో కలిసి ఆమె వివరించారు. ఈ సందర్భంగా అందాల తార మీనాక్షిదీక్షిత్... జ్యువెలరీ ధరించి తళుక్కువుంది. ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఐదు వేలకు పైగా డిజైన్లను ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. - సాక్షి, సిటీప్లస్ -
తాజ్ కృష్ణాలో బంగారు, వజ్రం మాయం
హైదరాబాద్: నగరంలో ఘరానా దొంగతనం జరిగింది. తాజ్ కృష్ణా గోల్డ్ ఎగ్జిబిషన్ లో ఐదు తులాల బంగారు నగలు, ఓ వజ్రం మాయమయ్యాయి. వీటి విలువ దాదాపు 20 లక్షల రూపాయిలు ఉంటుందని అంచనా. నగలు మాయమైన విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
‘మెట్రో మాల్స్’ పైట్రాఫిక్ స్టడీ
=ప్రభావంపై అంచనా కోసం అధ్యయనం =పంజగుట్ట, ఇతరచోట్ల శ్రీకారం =ఫలితాల తరవాతే నిర్మాణ అనుమతులు సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట.. అసలే రద్దీ కూడలి. అటువంటి చౌరస్తాకు ఇరుపక్కలా మైట్రోరైలు సంస్థ మాల్స్ ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ స్థితిగతులు ఎలా ఉండనున్నాయి? మాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలా? వద్దా?.. ఇవన్నీ తేల్చేందుకు నగర ట్రాఫిక్ విభాగం ట్రాఫిక్ సమగ్ర అధ్యయనానికి సోమవారం శ్రీకారం చుట్టింది. అధ్యయన ఫలితాలను బట్టి అనుమతిపై నిర్ధారణకు వస్తుంది. పంజగుట్ట జంక్షన్, మార్గం, ప్రాంతం మీదుగా ఏ సమయంలో ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి? అవి ఏ రకానికి చెందినవనేది శాస్త్రీయ అధ్యయనం చేశాక సదరు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలా? లేదా? అనేది నిర్ధారించడానికే ఈ అధ్యయనం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పంజగుట్ట కేంద్రంగా... హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం పంజగుట్ట చౌరస్తాకు రెండు కి.మీ. పరిధిలో ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. ఇలా కేటాయించిన ఎర్రమంజిల్‌లోని పోలీసు క్వార్టర్లు, జంక్షన్ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్స్ స్థలాల్లో భారీ మాల్స్ నిర్మాణానికి మెట్రోరైల్, ఎల్ అండ్ టీ యోచిస్తున్నాయి. దీనికి ట్రాఫిక్ పోలీసులు నిరభ్యంతర పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే పంజగుట్ట చౌరస్తాలో అనేక భారీ మాల్స్‌తో పాటు సమీపంలోనే నిమ్స్ వంటివి ఉన్నాయి. దీంతో కొత్తగా వచ్చే మాల్స్ వల్ల ట్రాఫిక్‌పై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. రెండు విధాలుగా అధ్యయనం... పంజగుట్ట చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లతో పాటు ఎనిమిది ప్రాంతాల్లో తాజా అధ్యయనాన్ని చేపట్టారు. ఇది రెండు విధాలుగా చేస్తున్నారు. సాధారణంగా సోమవారం మొదటి పనిదినం కావడంతో రద్దీ ఎక్కువుంటుందని దీన్ని ప్రారంభించారు. జంక్షన్, చౌరస్తాలోని అన్ని మార్గాల్లో ఉండి, కీలక రోడ్ల మధ్యలో ఉండి సమయాలను బట్టి వాహనాలను కేటగిరీల వారీగా నమోదు చేస్తున్నారు. ప్రతి రోడ్డుకూ కనీసం 8 మందిని కేటాయించి వాహనాలను లెక్కిస్తున్నారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు జరిగిన ఈ ప్రక్రియను అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. జంక్షన్, దాని చుట్టుపక్కలున్న వ్యాపార సంస్థలు, వాటి రద్దీ వేళలు, ఏ తరహా వాహనాలు ఏ సమయంలో ఎక్కువగా, ఎక్కడకు వస్తున్నాయి? వంటివన్నీ పరిశీలిస్తారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండి సేకరించిన గణాంకాలను నిపుణుల సహకారంతో విశ్లేషించిన అనంతరం ఁమెట్రో మాల్స్రూ.కు ఎన్ఓసీ ఇచ్చే అంశాన్ని నిర్ధారిస్తారు. ట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీకి వినియోగం ఒక ప్రాంతంలో కొత్తగా వచ్చిన నిర్మాణాలు, పెరిగిన వాహనాల సంఖ్య, రద్దీ, మారిన పరిస్థితుల కారణంగా ట్రాఫిక్‌పై పడిన ప్రభావాన్ని అధ్యయనం చేయడాన్ని ఁట్రాఫిక్ ఇంపాక్ట్ స్టడీరూ. అంటారు. ఓ ప్రాంతంలో ఫ్రీ లెఫ్ట్, స్ట్రెయిట్ రైట్ తదితర కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే అక్కడున్న ట్రాఫిక్ వాల్యూమ్ తెలియడం అవసరం. నగరం విస్తరణ, వాహనాల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ అధ్యయనాలు అవసరమని అధికారులు చెబుతున్నారు. పరిశీలన ఇక్కడే.. ఎస్సార్‌నగర్, పంజగుట్ట, ఖైరతాబాద్, మోనప్ప ఐలాండ్, తాజ్‌కృష్ణ, కేసీపీ జంక్షన్లలోనూ, రాజ్‌భవన్, గ్రీన్‌పార్క్ హోటల్ రోడ్, సీఎం క్యాంప్ కార్యాలయం, మైత్రివనం, తాజ్ కృష్ణ, ఎర్రమంజిల్, షాలిమార్, షాదన్ కాలేజ్ రోడ్ల మధ్యలోనూ ఉండి ట్రాఫిక్‌ను అధ్యయనం చేస్తున్నారు.