గెలుపు దిశగా కాంగ్రెస్‌.. పక్కా ప్లాన్‌తో రెడీగా డీకే శివకుమార్‌! | Telangana Assembly Election Results 2023: Congress On The Verge Of Victory In Telangana, Fight Between BRS And Congress - Sakshi
Sakshi News home page

TS Assembly Election Results 2023: గెలుపు దిశగా కాంగ్రెస్‌.. పక్కా ప్లాన్‌తో రెడీగా డీకే శివకుమార్‌!

Published Sun, Dec 3 2023 10:21 AM | Last Updated on Sun, Dec 3 2023 10:57 AM

Congress On The Verge Of Victory In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మరోవైపు.. కొన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ నడుస్తోంది. ఇక, బీఆర్‌ఎస్‌ మంత్రులు, కీలక నేతలు పలుచోట్ల వెనుకంజలో ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తే.. గెలుపొందిన అభ్యర్థులను కర్ణాటకకు తరలించనున్నారు. రిసోర్టు రాజకీయం కొనసాగే అవకాశం ఉంది. ఇక, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్లాన్‌ రచిస్తున్నారు. ట్రబుల్‌ షూటర​్‌ డీకే.. శనివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌కు చేరుకొని ఎన్నికల ఫలితాలను విక్షిస్తున్నారు. 

మరోవైపు.. కాంగ్రెస్‌ నేతలు తాజ్‌కృష్ణలో రూమ్స్‌ను బుక్‌ చేసుకున్నారు. దాదాపు 100 గదులను రిజ్వర్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్‌ అభ్యర్థులను తాజ్‌కృష్ణకు తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల్లో కర్ణాటకకు తరలించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీల్లోకి జంప్‌ కాకుండా హస్తం పార్టీ ముందస్తుగానే ప్లాన్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement