బెంగళూరు : అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్‌లు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.
కోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో సకలేశ్‌పురలోని యెత్తినహోల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు.
2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిభ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు.
సుప్రీంలోనూ ఎదురుదెబ్బ
అక్రమాస్తుల కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవాల్ చేస్తూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
సిద్ధరామయ్యకు ఏం జరగదు
అక్రమాస్తుల కేసుతో పాటు మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,ఆయన భార్య పార్వతిలపై వస్తున్న ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందించారు. సీఎంకి ఏం కాదు.‘కొందరు ముఖ్యమంత్రిపై ఎందుకు విరుచుకుపడుతున్నారో నాకు తెలియదు. ఆయనకు ఏం కాదు. ముడా వ్యవహారంలో ఆయనకు ప్రమేయం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు డీకే శివకుమార్.
Comments
Please login to add a commentAdd a comment