బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వ హయాంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతిని సీఎం సిధ్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉపసంహరించుకోవడం చెల్లదని సీబీఐ తాజాగా హై కోర్టును ఆశ్రయించింది.
దీంతో ఈ కేసు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. సీబీఐ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. ఈ విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే సీబీఐకి హైకోర్టులో తమ ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని తెలిపారు. కాగా, డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వం సమ్మతి ఉపసంహరించుకోవడం అనైతికం అని ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్‌లు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విమర్శలకు సీఎం సిధ్దరామయ్య ఏ మాత్రం వెరవడం లేదు.
అడ్వకేట్ జనరల్ అభిప్రాయం రాకముందే డీకే శివకుమార్ కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వం సమ్మతి ఇచ్చిందని, ఇది చెల్లనందునే తాము సమ్మతి ఉపసంహరించుకున్నామని సిధ్ద రామయ్య సమర్ధించుకుంటున్నారు. అయితే డీకే కేసులో సమ్మతి ఇచ్చిన మాజీ సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఒకసారి సమ్మతి ఇచ్చి విచారణ ప్రారంభం అయిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడం చట్ట ప్రకారం కుదరదన్నారు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య క్షమించరాని నేరం చేశారని ఆరోపిస్తున్నారు.
ఇదీచదవండి..రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్‌కు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment