సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి.
అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్ అభ్యర్థన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు.
In a setback to Karnataka Deputy CM #DKShivakumar, #KarnatakaHC has refused to quash a corruption case registered against him by the #CBI for allegedly possessing assets worth ₹74.93 crore disproportionate to his known sources of income | @Kpsagri reportshttps://t.co/jw0MOK5o6I
— The Hindu-Bengaluru (@THBengaluru) October 19, 2023
Comments
Please login to add a commentAdd a comment