కోల్‌కతా: ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. అభయ ఘటన జరిగిన నేపథ్యంలో సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సందీప్ ఘోష్‌ను విచారిస్తుంది.
కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో సందీప్ ఘోష్‌కు చెందిన మూడు ఫ్లాట్లు, రెండు ఇళ్లు, ఒక ఫామ్‌హౌస్, ముర్షిదాబాద్‌లోని మరో ఫ్లాట్ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఆర్‌జీకర్ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత ఘోష్ అదే కాలేజీకి చెందిన ఆస్పత్రిలో సీనియర్ వైద్యురాలిగా విధులు నిర్వహించనట్లు తేలింది.
అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తుల కొనుగోలు
ఆ సమయంలో సందీప్ ఘోష్ దంపతులు తమ పలుకుబడిని ఉపయోగించి భారీ మొత్తంలో అక్రమ ఆస్థుల్ని పోగేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆసక్తికర విషయం ఏంటంటే? ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రెండు ప్రభుత్వ సిరాస్థుల్ని కొనుగోలు చేశారు.అనంతరం అందుకు అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, 2021 సంవత్సరంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో తన సతీమణి డాక్టర్ సంగీతా ఘోష్‌ని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు’ అని ఈడీ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్‌పై హారిస్‌దే పై చేయి
శుక్రవారం ఈడీ అధికారులు సందీప్ ఘోష్, ఆయన సన్నిహితులు, చెందిన ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదైన కేసులో విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
మరోవైపు అక్రమాస్తుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు మంగళవారం సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక,ఇదే అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 2న సీబీఐ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది.ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.అప్పటి నుంచి ఎనిమిది రోజుల కస్టడీకి పంపింది. తాజాగా ఆ గడువు ముగియడంతో కస్టడీ గడువును పొడిగించాలని అధికారులు సీబీఐ కోర్టును కోరారు. దీంతో కోర్టు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
Comments
Please login to add a commentAdd a comment