Assets case
-
అభయ కేసు : సందీప్ ఘోష్ దంపతులు.. మహా ముదుర్లు
కోల్‌కతా: ఆర్జీకర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. అభయ ఘటన జరిగిన నేపథ్యంలో సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)సందీప్ ఘోష్‌ను విచారిస్తుంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా కోల్‌కతాలో సందీప్ ఘోష్‌కు చెందిన మూడు ఫ్లాట్లు, రెండు ఇళ్లు, ఒక ఫామ్‌హౌస్, ముర్షిదాబాద్‌లోని మరో ఫ్లాట్ డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఆర్జీకర్ ప్రిన్సిపల్‌గా సందీప్ ఘోష్, ఆయన భార్య సంగీత ఘోష్ అదే కాలేజీకి చెందిన ఆస్పత్రిలో సీనియర్ వైద్యురాలిగా విధులు నిర్వహించనట్లు తేలింది.అనుమతి లేకుండా ప్రభుత్వ ఆస్తుల కొనుగోలుఆ సమయంలో సందీప్ ఘోష్ దంపతులు తమ పలుకుబడిని ఉపయోగించి భారీ మొత్తంలో అక్రమ ఆస్థుల్ని పోగేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆసక్తికర విషయం ఏంటంటే? ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే రెండు ప్రభుత్వ సిరాస్థుల్ని కొనుగోలు చేశారు.అనంతరం అందుకు అనుమతి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, 2021 సంవత్సరంలో డాక్టర్ సందీప్ ఘోష్ ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హోదాలో తన సతీమణి డాక్టర్ సంగీతా ఘోష్‌ని అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించారు’ అని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ట్రంప్‌పై హారిస్‌దే పై చేయిశుక్రవారం ఈడీ అధికారులు సందీప్ ఘోష్, ఆయన సన్నిహితులు, చెందిన ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద నమోదైన కేసులో విచారణ కొనసాగుతోంది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుమరోవైపు అక్రమాస్తుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు మంగళవారం సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇక,ఇదే అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 2న సీబీఐ సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసింది.ఘోష్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది.అప్పటి నుంచి ఎనిమిది రోజుల కస్టడీకి పంపింది. తాజాగా ఆ గడువు ముగియడంతో కస్టడీ గడువును పొడిగించాలని అధికారులు సీబీఐ కోర్టును కోరారు. దీంతో కోర్టు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. -
‘అది దేవుడి నిర్ణయమే’: డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు : అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తా. నేను కోర్టు తీర్పు, దేవుణ్ణి నమ్ముతాను’ అని కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్లు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బుధవారం కొట్టి వేసింది.కోర్టు తీర్పు వెలువరించిన తరుణంలో సకలేశ్పురలోని యెత్తినహోల్ ఇంటిగ్రేటెడ్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును పరిశీలించిన సందర్భంగా అక్రమాస్తుల కేసుకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు శివకుమార్ పై విధంగా వ్యాఖ్యానించారు. 2013-2018 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివ కుమార్ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల్ని కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై సెప్టెంబరు 2020న సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. విచారణ ప్రారంభించింది. దర్యాప్తు కొనసాగుతుండగానే ఆ కేసు సీబీఐ నుంచి ఈ ఏడాది ఫిభ్రవరిలో లోకాయుక్త పోలీసులకు బదిలీ అయ్యింది. ఈ కేసు విచారణలో భాగంగా డీకే శివకుమార్ గత వారం లోకాయుక్త పోలీసుల ముందు హాజరయ్యారు. సుప్రీంలోనూ ఎదురుదెబ్బ అక్రమాస్తుల కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యకు ఏం జరగదు అక్రమాస్తుల కేసుతో పాటు మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య,ఆయన భార్య పార్వతిలపై వస్తున్న ఆరోపణలపై డీకే శివకుమార్ స్పందించారు. సీఎంకి ఏం కాదు.‘కొందరు ముఖ్యమంత్రిపై ఎందుకు విరుచుకుపడుతున్నారో నాకు తెలియదు. ఆయనకు ఏం కాదు. ముడా వ్యవహారంలో ఆయనకు ప్రమేయం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు డీకే శివకుమార్. -
రోజుకో మలుపు తిరుగుతున్న డీకే శివకుమార్ సీబీఐ కేసు
బెంగళూరు: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వ హయాంలో సీబీఐకి ఇచ్చిన సమ్మతిని సీఎం సిధ్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఇప్పటికే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇలా ఉపసంహరించుకోవడం చెల్లదని సీబీఐ తాజాగా హై కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసు వ్యవహారం మరింత రసకందాయంలో పడింది. సీబీఐ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. ఈ విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే సీబీఐకి హైకోర్టులో తమ ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని తెలిపారు. కాగా, డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసులో సిద్ధరామయ్య ప్రభుత్వం సమ్మతి ఉపసంహరించుకోవడం అనైతికం అని ప్రతిపక్ష బీజేపీ,జేడీఎస్‌లు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విమర్శలకు సీఎం సిధ్దరామయ్య ఏ మాత్రం వెరవడం లేదు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం రాకముందే డీకే శివకుమార్ కేసు విచారణ కోసం గత బీజేపీ ప్రభుత్వం సమ్మతి ఇచ్చిందని, ఇది చెల్లనందునే తాము సమ్మతి ఉపసంహరించుకున్నామని సిధ్ద రామయ్య సమర్ధించుకుంటున్నారు. అయితే డీకే కేసులో సమ్మతి ఇచ్చిన మాజీ సీఎం యడ్యూరప్ప మాట్లాడుతూ అసలు ప్రభుత్వం ఒకసారి సమ్మతి ఇచ్చి విచారణ ప్రారంభం అయిన తర్వాత దానిని ఉపసంహరించుకోవడం చట్ట ప్రకారం కుదరదన్నారు. ఈ విషయంలో సీఎం సిద్ధరామయ్య క్షమించరాని నేరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇదీచదవండి..రామ జమ్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం: మాజీ పిటిషనర్ ఇక్బాల్‌కు ఆహ్వానం -
కోవిడ్ పేరుచెప్పి.. సీబీఐని ఏమార్చబోయిన బొల్లినేని
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను మంగళవారమే అదుపులోకి తీసుకుని, పలు అంశాలపై ప్రశ్నించినా.. బుధవారం సాయంత్రం అధికారికంగా అరెస్టును ప్రకటించింది. తర్వాత సీబీఐ మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టింది. కోర్టు బొల్లినేని గాంధీకి వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోవిడ్ పేరుతో డ్రామా తన అరెస్టును అడ్డుకోవడానికి బొల్లినేని శ్రీనివాసగాంధీ చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అరెస్టును ఆపాలంటూ తన ఆంతరంగికులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చాడని తెలిసింది. సీబీఐ అధికారులు ఇంటికి వచ్చేసరికి.. తన కుటుంబ సభ్యులకు కోవిడ్–19 పాజిటివ్ వచ్చిందంటూ నకిలీ రిపోర్టులు సిద్ధం చేసి ఉంచినట్టు సమాచారం. అవి నకిలీవని తేల్చిన సీబీఐ అధికారులు..బొల్లినేని గాంధీని అదుపులోకి తీసుకున్నా రు. బొల్లినేని గాంధీపై గతేడాది సీబీఐ మరో కేసు ను నమోదు చేసింది. బొల్లినేని ఓ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. రూ.10 లక్షలు నగదు, మిగతా రూ.4.90 కోట్లకు సిటీ శివారులో భూములు గిఫ్ట్‌గా ఇవ్వాలని షరతు విధించాడు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఇలా లంచం కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నప్పటికీ బొల్లినేనికి గత డిసెంబర్లో పదోన్నతి రావడం గమనార్హం. అయి తే వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 24న సెంట్రల్ జీఎస్టీ నుంచి బొల్లినేని గాంధీని సస్పెండ్ చేస్తూ..సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ట్యాక్సెస్ ఉత్తర్వులు ఇచ్చింది. నోటీసులకు స్పందనే లేదు! 2019 జూలై 8న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, అతని భార్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి.. రూ.3.74 కోట్ల ఆస్తులు గుర్తించింది. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సీబీఐ నమోదు చేసిన కేసు, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా.. గాంధీ స్పందించలేదని, ఒక్కరోజు కూడా విచారణకు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. అసలు సీబీఐ అడిగిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిపై బెదిరింపులు, ప్రలోభాలకు దిగాడని, వారు విచారణకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ మేరకు బాధితులు సీబీఐ అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అరెస్టు చేశారు. చదవండి: (బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్) -
బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ జీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో సీబీఐ వరుసగా ఇచ్చిన అనేక నోటీసులకు ఆయన స్పందించక పోవడం, విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన్ను మంగళవారం హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 2019 జూలైలో గాంధీపై తొలిసారిగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును సీబీఐ నమోదు చేసింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.5 కోట్ల లంచం అడిగారన్న ఫిర్యాదుతో 2020 సెప్టెంబర్‌లో ఆయనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఆరోపణలు ఉన్నా ఆయన 2020 డిసెంబర్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి సాధించడం గమనార్హం. అయితే ఆ తరువాత 2021 ఫిబ్రవరి 24న ఆయన్ను సెంట్రల్ జీఎస్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ఉత్తర్వులిచ్చింది. బదిలీలే లేవు..! సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో 1992లో ఇన్స్పెక్టర్గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందాడు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లోకి డెప్యుటేషన్‌పై వెళ్లి ఏడాదిపాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని.. గతంలో ఎన్నడూ, ఎవరూ పనిచేయని స్థాయిలో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా ఈడీ (ఇన్వెస్టిగేషన్)లోనే విధులు నిర్వర్తించాడు. ఇలాంటి పోస్టుల్లో సాధారణంగా ఎవరికైనా రెండేళ్లే అవకాశం ఇస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే మరో ఏడాది డెప్యుటేషన్ కొనసాగిస్తారు. అంతే తప్ప 13 ఏళ్లపాటు ఒకేచోట కొనసాగించిన దాఖలాలు లేవని సొంత శాఖ అధికారులే విస్తుపోతున్నారు. పోస్టింగ్ వెనుక చంద్రబాబు హస్తం..! నిబంధనలకు విరుద్ధంగా బొల్లినేనికి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్ జీఎస్టీ, బేగంబజార్ రేంజ్‌కి బొల్లినేనిని సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. అక్కడ కూడా నిబంధనల ప్రకారం అతడికి దర్యాప్తు విభాగంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. ఈ సమయాన్ని ‘కూలింగ్ పీరియడ్’ అంటారు. కానీ గాంధీ తనకున్న పరిచయాలతో కూలింగ్ పీరియడ్‌ను తప్పించుకొని యాంటీ ట్యాక్స్ ఎవేషన్ డిపార్ట్మెంట్ (బషీర్‌బాగ్)లో పోస్టింగ్ తెచ్చుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. రూ.65 లక్షల జీతం.. రూ.200 కోట్ల ఆస్తులు! 2010–2019 వరకు పదేళ్లలో రూ. 65 లక్షలు జీతంగా అందుకున్న బొల్లినేని తన కుమార్తె మెడికల్ సీటుకే రూ. 70 లక్షలు చెల్లించడం గమనార్హం. ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ. 3.74 కోట్లు. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో తన ఇంటిని రూ. 1.20 కోట్లతో నిర్మించాడు. 2019 జూలై 8న బొల్లినేనిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, ప్రొద్దుటూరుతోపాటు హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో బొల్లినేని భారీగా స్థిరాస్తులు సంపాదించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా గాంధీపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ అధికారులు బొల్లినేనిపై ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేశారు. భారీ ఎత్తున మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం చదవండి: పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ -
ఏపీకి 58.32.. తెలంగాణకు 41.68%
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌డీడీసీఎఫ్)కు చెందిన ఆస్తులను ఏపీ 58.32 శాతం, తెలంగాణ 41.68 నిష్పత్తిలో పంచుకోవాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని ఏపీఎస్‌డీడీసీఎఫ్ పరిపాలనా భవనం, వసతి గృహాలను, వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.54 కోట్ల సొమ్మును కూడా ఇదే నిష్పత్తిలో పంచుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని.. ఆపరేషనల్ యూనిట్స్ (డెయిరీ, ఇతర తయారీ యూనిట్స్) మాత్రం ఏ రాష్ట్రంలో ఉన్నవి ఆ రాష్ట్రానికే కేటాయించాలని పేర్కొంది. హైదరాబాద్ లాలాగూడలోని విజయ డెయిరీ తెలంగాణకే చెందుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏపీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్ ఆస్తులను తమకుతాము కేటాయించుకుంటూ 2016 మే, 6న జారీ చేసిన జీవో 8ను కొట్టివేసింది. ఆ జీవో పునర్విభజన చట్టానికి విరుద్ధమని తేల్చిచెప్పింది. ఏపీఎస్‌డీడీసీఎఫ్ ఆస్తులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో 8ను సవాల్ చేస్తూ ఫెడరేషన్ ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. తెలంగాణకు రెండు, ఏపీకి రెండు అంతస్తులు ఏపీఎస్‌డీడీసీఎఫ్ లిమిటెడ్ పరిపాలనా భవనాన్ని జనాభా నిష్పత్తి ఆధారంగా తెలంగాణ, ఏపీ సమానంగా పంచుకోవాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తమ తీర్పులో పేర్కొంది. ‘‘2015 డిసెంబర్ 18న ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ జనరల్ బాడీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 58, 42 నిష్పత్తిలో విభజించాలి. గ్రౌండ్ ఫ్లోర్స్‌ను ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకునేలా.. మొదటి, రెండు అంతస్తులు తెలంగాణకు, మూడు, నాలుగో అంతస్తులు ఏపీకి కేటాయించాలి. ఆపరేషనల్ యూనిట్స్ స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకే చెందుతాయి. 2014 జూన్ 2 నాటికి ఆరు బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలు రూ.54 కోట్లను 58.32, 41.68 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలి. సోమాజిగూడలోని వసతి గృహం విలువను లెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం కాగ్‌ను సంప్రదించాలి. కాగ్ 8 వారాల్లోగా విలువ లెక్కగట్టి ఇరు రాష్ట్రాలకు తెలియజేయాలి. కాగ్ రిపోర్టు అందిన మూడు నెలల్లోగా తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్ 58.32 వాటాను ఏపీ డెయిరీ కార్పొరేషన్‌కు బదిలీ చేయాలి..’’అని ఆదేశించింది. -
కంట్లోకారం చల్లి, వేట కొడవలితో నరికి..
చంచల్‌గూడ: ఆస్తి వివాదం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. సవతి తల్లికి ఆస్తి పంచినందుకు ఆమెను కడతేర్చాలని నిశ్చయించుకున్న వ్యక్తి వేట కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే.. మాదన్నపేటకు చెందిన యాదయ్య తన భార్య చెల్లెలు అయిన సుకన్య (57)ను రెండో వివాహం చేసుకున్నాడు. సుకన్య స్థానిక లిటిల్ స్టార్స్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా గత 15 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది. సుకన్యకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. యాదయ్య మొదటి భార్య కుమారుడు కొలన్ శ్రీకాంత్ (46) పోలీసు శాఖలో బాంబు స్క్వాడ్ టీమ్‌లో డాగ్ హ్యాండర్‌గా విధులు ని ర్వహిస్తున్నాడు. ఇతను 1994లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. కాగా తండ్రి కొడుకుల మధ్య గత పదేళ్లుగా ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఆస్తి పంపకాల్లో శ్రీకాంత్‌కు బీహెచ్ఈఎల్లో ఒక ఇల్లు, మాదన్నపేటలో మరో ఇల్లు వచ్చాయి. సుకన్యకు మాదన్నపేటలో ఒక ఇల్లు దక్కింది. యాదయ్య రెండో భార్యకు కూడా ఆస్తి పంపకం చేయడంతో సుకన్య, శ్రీకాంత్‌ల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. రెండు నెలల క్రితమే హత్యకు పథకం.. ఆస్తి విషయంలో పలుమార్లు శ్రీకాంత్ సుకన్యపై బెదిరింపులకు పాల్పడినట్లు బంధవులు తెలిపారు. కాగా రెండు నెలల క్రితం సుకన్య భర్త యాదయ్య కాలం చేశాడు. అంత్యక్రియల రోజు సుకన్యను చంపేస్తానని శ్రీకాంత్ బహిరంగంగా బెదిరించినట్లు బంధువులు వెల్లడించారు. శ్రీకాంత్ బెదిరింపుల నేపథ్యంలో ఆమె ఇంటికి సీసీ కెమెరాలను సైతం అమర్చుకుంది. ఇటీవల శ్రీకాంత్ సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీకాంత్ వ్యవహారంపై సుకన్య పలుమార్లు మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుకన్యకు పంపకాల్లో వచ్చిన భవనంలోని మలిగీలు, కొంత డబ్బు, 15 తులాల బంగారం విషయమై శ్రీకాంత్ వివాదానికి తెర తీసినట్లు తెలుస్తోంది. సుకన్య ఇంట్లోనే ఉందన్న ముందస్తు సమాచారంతో ముందే వేసుకున్న పథకం ప్రకారం శ్రీకాంత్ మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో సుకన్య ఇంటికి వచ్చాడు. కళ్లలో కారం చల్లి సుకన్య మెడ, చాతిపై వేటకొడవలితో నరికాడు. సుకన్య అరుపులు కేక లు వినడంతో పాటు స్థానికులు రాగానే శ్రీకాంత్ అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి పిల్లలు భోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. సంతోష్‌నగర్ ఏసీపీ శివరామ్‌శర్మ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్యా నేరం కింద కే సు నమోదు చేశామని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. గతంలో తండ్రిపై దాడికి దిగిన కేసులో నిందితుడిపై చందానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
మళ్లీ ఈడీ ముందుకు వాద్రా
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారులు వాద్రాను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో బుధవారం వాద్రా ఇచ్చిన సమాధానాలపై సంతృప్తిచెందకపోవడంతో రెండు రోజు విచారణకు పిలిచింది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదుచేశారు. బికనీర్ భూకుంభకోణానికి సంబంధించి మరో మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా ఈ నెల 12న జైపూర్‌లో మళ్లీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మరో కేసులో కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా గురువారం ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేరోజు విచారణకు రావడంతో ఢిల్లీలోని జామ్‌నగర్ హౌజ్ ఈడీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆ ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను నియంత్రించడానికి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉదయం 11 గంటలకు కార్తీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా, 11.25 గంటలకు వాద్రా వచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకే సంబంధించి పి.చిదంబరంను శుక్రవారం విచారించే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మాల్యాతో తల్వార్‌కు సంబంధాలు: ఈడీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాతో కార్పొరేట్ మధ్యవర్తి దీపక్ తల్వార్‌కు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. విదేశాల్లో ఉన్న తల్వార్ కొడుకు ఫిబ్రవరి 11న తమ ముందు విచారణకు హాజరవుతున్నారని, ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని వెల్లడించింది. తల్వార్ కస్టడీని వారం పాటు పొడిగించాలని కోరగా కోర్టు ఫిబ్రవరి 12 వరకు అనుమతిచ్చింది. -
మా వంద కోట్ల మాటేమిటి?
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో తమకు రావాల్సిన వంద కోట్ల రూపాయల కోసం కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జయలలిత మరణం కారణంగా ఆమె మీద విధించిన జరిమానాను సుప్రీంకోర్టు గతంలో రద్దు చేయడంతో.. ఆ తీర్పును మరోసారి సమీక్షించాలని కర్ణాటక కోరుతోంది. ఏదైనా కేసులో శిక్ష పడినప్పుడు దానిపై అప్పీలు చేసినా, నిందితులు జరిమానా చెల్లించడం, జైలుశిక్ష అనుభవించడం లాంటి విషయాలలో మినహాయింపులు, రద్దులు చెల్లబోవని, నిందితులందరికీ సమానత్వం అమలవుతుందని, ఈ కేసులో జైలుశిక్షతో పాటు వంద కోట్ల రూపాయల జరిమానా విధించాని తమ పిటిషన్లో తెలిపింది. ప్రస్తుత కేసులో జయలలిత జైలుశిక్ష అనుభవించే ప్రసక్తి రాదు గానీ.. ఆమెకు విధించిన జరిమానాను మాత్రం తప్పనిసరిగా వసూలు చేయాల్సిందేనని కర్ణాటక సర్కారు కోరింది. ఈ కేసులో విధించిన మొత్తం జరిమానాలో జయలలిత వాటాగా 100 కోట్ల రూపాయలు ఉన్న విషయం తెలిసిందే. ఆ మొత్తం కర్ణాటక ప్రభుత్వానికి రావాల్సి ఉండటంతో.. దాని కోసం ఇప్పుడు ఈ పిటిషన్ దాఖలు చేసింది. -
కనీసం ఇప్పుడైనా...!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళను దోషిగా నిర్ధారిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం శిక్షపడినవారు ఆరేళ్లవరకూ ఎన్నికల్లో పోటీచేయడానికి, ప్రభుత్వ పద వులు నిర్వహించడానికి అనర్హులు గనుక ముఖ్యమంత్రి కావాలన్న శశికళ ఆశలు అడియాసలైనట్టే. ఇలాంటి తీర్పు వెలువడితే ప్రత్యామ్నాయమేమిటన్న అంశంలో శశికళ వర్గానికి ముందే స్పష్టత ఉన్నది గనుక సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే మంత్రి కె. పళనిస్వామిని అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. గవర్నర్ సీహెచ్. విద్యాసాగరరావును ఆయన కలవడం కూడా పూర్తయింది. కనుక సాధ్యమైనంత త్వరగా తదుపరి ఘట్టాన్ని ఆవిష్కరించాల్సింది ఇక గవర్నరే. వాస్తవానికి ఈ నెల 5న అనుకోకుండా సంభ వించిన వరస పరిణామాల్లో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తన పదవికి రాజీనామా చేయడం, లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా తానే శశికళ పేరును ప్రతిపాదించడం, ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చకచకా సంభవించాయి. ఎవరినైనా లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకున్నట్టు వర్తమానం అందిన వెంటనే సర్వసాధారణంగా వారిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం గవర్నర్లు చేసే పని. కానీ శశికళ విషయంలో అలా జరగలేదు. అసలు విద్యాసాగరరావు ఎవరికీ అందుబాటులోకి రాలేదు. ఇలాంటి అయోమయ స్థితిలో ఉన్నట్టుండి ఈ నెల 7న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం తిరగబడ్డారు. తనను బెదిరించి రాజీనామా చేయించారని అనడమే కాదు... చేసిన రాజీనామాను వెనక్కు తీసుకుంటానని కూడా ఆయన ప్రకటిం చారు. వీట న్నిటి పర్యవసానంగా రాష్ట్రంలో అలుముకున్న అనిశ్చితి నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. విచారణ కోర్టుకు తీర్పు కాపీ అందిన వెంటనే, కర్ణాటక పోలీసులు శశికళను అదుపులోకి తీసుకుంటారు. అందుకు తమిళనాడు పోలీసులు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నట్టు కనబడుతోంది. తనకు తీర్పు కాపీ అందలేదని శశికళ చెప్ప డానికి లేదు. దాన్ని పొందే బాధ్యత ఆమె న్యాయవాదులదే. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ ఆమె ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశారంటున్నారు. కానీ ఎలాంటి ఉపశమనమూ లభించకపోవచ్చునన్నది న్యాయ నిపుణుల మాట. ఈ తాజా పరిణామాలతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి కొత్తగా ఒరిగేది ఏమీ ఉండకపోవచ్చు. శశికళపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే బీచ్ రిసార్ట్స్‌లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి ప్రవాహంలా వచ్చి ఉంటే వేరుగా ఉండేది. ఈ నాలుగు రోజుల్లోనూ ఆయన వద్దకు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎంపీలు వచ్చారు తప్ప ఎమ్మెల్యేలు రాలేదు. శశికళను జైలుకు తరలించిన వెంటనే వారంతా పన్నీర్ గూటికొస్తారని చెబుతున్నారుగానీ ఆ అంచనాలను విశ్వసించలేం. మద్రాసు హైకోర్టు ఉత్తర్వు లతో బీచ్ రిసార్ట్స్‌కు వెళ్లిన రాష్ట్ర డీజీపీకి... తాము స్వచ్ఛందంగానే అక్కడున్నా మని ఎమ్మెల్యేలంతా చెప్పి ఉన్నారు. వారి సంఖ్య 94 అని డీజీపీ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపారు. అక్కడ లేని 32మంది పన్నీర్‌సెల్వానికి మద్దతు పలుకుతారని భావించడానికి లేదు. అలాంటి ఉద్దేశముంటే ఈపాటికే వారు ఆ పని చేసి ఉండేవారు. పన్నీర్ ఇంకా ప్రభుత్వ సారథిగా ఉన్నారు గనుక ఆయన పక్షానికి రాకుండా ఎవరూ వారిని నిరోధించలేరు. వాస్తవానికి అలాంటి ఒత్తిళ్లే మైనా ఉంటే గింటే శశికళ శిబిరంలో ఉన్నవారికే ఉన్నాయి. ఆమె వైపు నిలబడి నందుకు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ పరిగణ నలోకి తీసుకుంటే మంగళవారం అన్నా డీఎంకే లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిన సమయానికి మెజారిటీ ఎమ్మెల్యేలు శశికళతోనే ఉన్నారని... వారు పళనిస్వామిని తమ నేతగా ఎన్నుకున్నారని నమ్మక పోవడానికి ఆస్కారంలేదు. ఈ పరిస్థితు ల్లోనైనా తానేం చేయదల్చుకున్నారో విద్యాసాగరరావు విస్పష్టంగా వెల్లడించాల్సి ఉంది. నిజానికి పన్నీర్ సెల్వం రాజీనామా ఆమోదించాక, శశికళ అన్నాడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారని తెలిశాక ఆమెను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఉండాలి. ఆమెకు బలం లేదని ఆ తర్వాత తేలితే వేరే విషయం. ఒకవేళ సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలన్న అభిప్రాయం ఏర్పడి ఉంటే ఆ సంగతైనా ఆయన చెప్పి ఉండాల్సింది. ఏదీ చేయకపోవడంవల్ల రాష్ట్రంలో అనిశ్చితికి గవర్నర్ దోహద పడ్డారన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో రాజకీయ రంగం నుంచి శశికళ వైదొలగినట్ట యింది. పన్నీర్‌సెల్వం రాజీనామాను వెనక్కు తీసుకోవడం కుదరదు. ఆయన వద్ద ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య రెండంకెలకు కూడా చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తొలుత పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి 24 గంటల్లో బలాన్ని నిరూపించుకోమని అడగటం న్యాయం. ఆయన విఫలమైతే పన్నీర్‌కు తదుపరి అవ కాశం ఇవ్వొచ్చు తప్ప అటార్నీ జనరల్ ప్రతిపాదించినట్టు ఆయనకూ, పళని స్వామికి మధ్య అసెంబ్లీలో బలపరీక్ష పెట్టడమన్నది సరికాదు. ఇద్దరి జాబితా ల్లోనూ ఒకే పేర్లున్నప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఏ వర్గంలోనూ చేరని 32మంది ఎమ్మెల్యేలు డీఎంకేకు అనుకూలంగా మారినా, వారిలో కనీసం పదిమంది పన్నీర్ వైపు వెళ్లినా అన్నాడీఎంకేలోని పళనిస్వామి వర్గం వెనువెంటనే మైనారిటీలో పడుతుంది. అలాంటి స్థితిలో శాసనసభను సుప్తచేతనా వస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేయడం మినహా గవర్నర్‌కు వేరే ప్రత్యామ్నాయం ఉండదు. కేంద్రం అండదండలున్నా, తగినంత సమయం ఇచ్చినా పన్నీర్ అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలుగుతారన్న నమ్మకం ఎవరికీ కలగడం లేదు. మొత్తానికి రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రాజ్య మేలుతున్న అనిశ్చితికి సాధ్యమైనంత త్వరగా తెరపడాలని అందరూ కోరుకుంటారు. -
చిన్నమ్మకు కేసుల భయం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే కార్యకలాపాలను తన కనుసన్నల్లో నడిపిస్తున్న శశికళకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల భయం పట్టుకున్నట్లు సమాచారం. అప్పీలు కేసులో ప్రతికూలంగా తీర్పు వెలువడితే తన రాజకీయ భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతోనే ఆమె పార్టీ బాధ్యతలు చేపట్టడానికి వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత తొలి ముద్దాయికాగా, శశికళ రెండో ముద్దాయిగా ఉన్నారు. చెన్నై, బెంగళూరుల్లో 18 ఏళ్లపాటూ సాగిన ఈ కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ బెంగళూరు కోర్టు 2014లో తీర్పు చెప్పింది. వీరు బెంగళూరు హైకోర్టులో అప్పీలు చేసి నిర్దోషులుగా బైటపడ్డారు. దీనిపై కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది, డీఎంకేలు వేర్వేరుగా సుప్రీంకోర్టులో అప్పీలు చేశాయి. ఈ అప్పీలు కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. అవినీతి నిరోధక చట్టం కింద జయపై కేసు నమోదై ఉంది. ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్నవారే ఈ చట్టం కింద శిక్షార్హులు. సీఎం హోదాలో ఉన్నందున జయకు ఈ చట్టం వర్తిస్తుందిగానీ శశికళకు వర్తించదనే వాదనను పార్టీ లేవనెత్తుతోంది. -
నాపై దాడి చేసి రివర్స్ కేసు పెట్టారు
-
కోర్టుకు మాజీ మంత్రి
వేలూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ మంత్రి డీఎంకే పార్టీ ముఖ్య కార్యదర్శి దురైమురుగన్ భార్యతో కలసి బుధవారం ఉదయం వేలూరు కోర్టులో హాజరయ్యారు. మాజీ మంత్రి దురైమురుగన్‌కు సొంతమైన చెన్నై, కాట్పాడిలోని ఇళ్లతోపాటు కళాశాల, కార్యాలయాల్లో 2011లో ఏసీబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే విధంగా దురైమురుగన్ భార్య శాంతకుమారికి సొంతమైన ఆస్తులపై తనిఖీలు చేసి ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ బుధవారం వేలూరు కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు దురైమురుగన్, భార్య శాంతకుమారి హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయమూర్తి దక్షణామూర్తి ఈనెల 11వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్లు ఆ రోజున నేరుగా హాజరు కావాలని తీర్పునిచ్చారు. అనంతరం బయటకు వచ్చిన దురైమురుగన్ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించి వెళ్లిపోయారు. దురైమురుగన్ భార్యతో పాటు కోర్టుకు రావడంతో ఆ ప్రాంతంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎక్సైజ్ ఏసీ సోదరుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్ : చాగల్లు మద్యం డిపోలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఆదిశేషుపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో స్థానిక బడేటివారి వీధిలో నివాసముంటున్న ఆయన సోదరుడు మామిళ్లపల్లి పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఆదిశేషు చాగల్లు డిపోలో బాధ్యతలు స్వీకరించక ముందు గుంటూరులో పనిచేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సుమారు 8 నెలలుగా ఆయన కుంటుంబం, బంధువులు, స్నేహితులపై ప్రత్యేక నిఘా ఉంచిన ఏసీబీ సెంట్రల్ సెల్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఆయన బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన ఆదిశేషు బంధువులు ఏలూరులో నివాసం ఉన్నారని గుర్తించిన అధికారులు పార్థసారథి ఇంట్లో సోదాలు చేశారు. నిందితునికి బినామీగా భావిస్తున్న ఆయన ఇంట్లో స్థిరాస్థులకు సంబంధించిన దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. చాగల్లు డిపోలోనూ.. చాగల్లు: చాగల్లులోని మద్యం డిపోలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒంగోలు ఏసీబీ సీఐ ప్రతాప్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము వచ్చిన బందం మధ్యాహ్నం రెండు గంటల వరకు సోదాలు చేసింది. విజయవాడలో నివసిస్తున్న అదిశేషు ఇంట్లో, అతని బందువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. చాగల్లు డిపోలో మధ్యం నిల్వలు, ఆయన కార్యాలయూన్ని ఏసీబీ అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. డిపో సిబ్బందిని, హమాలీలను బయటికి పంపించేశారు. సోదాలతో డిపో నుంచి మద్యం కేసులు డెలివరీ నిలిచిపోరుుంది. దీంతో మద్యం వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సీఐ ప్రతాప్ మాట్లాడుతూ అదిశేషుకు విజయవాడలో ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అతనిపై కేసు నమోదైందని చెప్పారు. చాగల్లు డిపోలో చేసిన తనిఖీల్లో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించలేదని చెప్పారు. అదిశేషు మూడు నెలల క్రితం బదిలీపై చాగల్లు డిపోకు వచ్చారు. -
ఇక ఢిల్లీ కోర్టులో వీరభద్ర సింగ్ కేసు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్, ఆయన భార్య అక్రమాస్తుల కేసు పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఎలాంటి వివాదానికి తావు లేకుండా ఉండేందుకు ఈ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసినట్లు తెలిపింది. ఇంతకంటే ప్రస్తుతం ఈ పిటిషన్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. ఆరు కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు సీబీఐ ప్రయత్నించగా ఆయన హైకోర్టుకు వెళ్లి రక్షణ పొందారు. దీంతో సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లగా కేసు కింది కోర్టులో ఉన్న సమయంలో తాము మధ్యలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసును ఇక ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. -
జయపై డీఎంకే మరో అస్త్రం
చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సమాయత్తమైంది. రాష్ట్రంలో అనేక ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలున్నా అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ప్రతిష్టాత్మకరమైన సవాళ్లు సాగుతుంటాయి. అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలో కూర్చున్నా ఈరెండు పార్టీలే పంచుకుంటాయి. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని రెండు దఫాలు రాష్ట్రాన్ని ఏలిన డీఎంకేకు 2011 నాటి ఎన్నికల్లో బొక్కబోర్లా పడింది. అ తరవాత వరుసగా వచ్చిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు సైతం డీఎంకేకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. జయపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ చెన్నైలో సాగితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆరోపిస్తూ డీఎంకే పట్టుపట్టి మరీ విచారణను బెంగళూరు కోర్టుకు తరలించింది. కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష వేయడంతో పదవీచ్యుతురాలైనారు. అంతేగాక మరో పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను జయ కోల్పోవాల్సి వచ్చింది. ఆశించినదే జరిగిందని డీఎంకే సంబరపడింది. అన్నాడీఎంకే చుక్కానిలేని నావగా మారిపోవడంతో 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు అధికారం ఖాయమనే ధీమాలో కరుణానిధి ఉండిపోయారు. అయితే అంతలోనే సీన్ తల్లకిందులైంది. తనపై వచ్చిన తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన అనూహ్యరీతిలో జయలలిత నిర్దోషిగా బైటపడింది. మళ్లీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టింది. జయ అవినీ తే ప్రధాన అస్త్రంగా రాబోయే ఎన్నికల్లో రంగంలోకి దిగాలని ఆశించిన డీఎంకే భంగపడింది. సాక్షాత్తు కోర్టే జయను నిర్దోషిగా ప్రకటించడంతో డీఎంకేకు ప్రచారాస్త్రం కరువైంది. ఆర్కేనగర్లో జరుగుతున్న ఉప ఎన్నికలో జయపై పోటీ పెట్టేకంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పీఠం ఎక్కకుండా నిలువరించడమే ముఖ్యమని డీఎంకే అభిప్రాయపడింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అక్కడి ప్రభుత్వం అప్పీలు చేయాలని డీ ఎంకే డిమాండ్ చేసింది. జయ కేసులో కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా డీఎంకే తృప్తి చెందలేదు. జయ ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని గత నెల నిర్వహించిన పార్టీ కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి జయ ఆస్తులను సక్రమంగా లెక్కకట్టలేదంటూ డీఎంకే పార్టీ తమ న్యాయవాదులను పురమాయించింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని దగ్గర ఉంచుకుని డీఎంకే సీనియర్ న్యా యవాది వీజీ ప్రకాశం గత నెలరోజులుగా కసరత్తు చేసి పిటిషన్ సిద్ధం చేశారు. లెక్కల తారుమారును రుజువుచేసేలా ఆధారాలతో కూడిన అప్పీలు ప్రతులను సిద్ధం చేశామని శుక్రవారం పార్టీ తెలిపింది. గత నెల పార్టీలో తీసుకున్న నిర్ణయం మే రకు ప్రధాన కార్యదర్శి అన్బళగన్ పేరున వచ్చేవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జయను నిర్దోషిగా పేర్కొం టూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఆ పిటిషన్లో కోరుతున్నట్లు పార్టీ అగ్రనేత ఒకరు మీడియాకు తెలిపారు. -
అప్పీలు చేశారు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష, 100 కోట్ల జరిమానా విధిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 27న తీర్పు చెప్పింది. జయతోపాటు ఆమె నెచ్చెలి శశికళ, మాజీ దత్తకుమారుడు సుధాకరన్, ఇళవరసిలకు సైతం తలా నాలుగేళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించింది. ఈ తీర్పుపై జయ తదితరులు అప్పీలు కెళ్లగా అందరినీ నిర్దోషిగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు గత నెల 11వ తేదీన తీర్పు చెప్పింది. కింది కోర్టులో జయ ఆస్తులను తప్పుగా లెక్కకట్టారని న్యాయమూర్తి కుమారస్వామి తీర్పులో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన ఈ కేసుపై వెలువడిన తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి. అప్పీలుకు వెళ్లాల్సిందిగా కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది బీపీ ఆచార్య ప్రభుత్వానికి సిఫారసు చేశారు. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలు సైతం అప్పీలుపై పట్టుపట్టాయి. అప్పీలుపై చర్చలు జరుగుతుండగానే జయ మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆర్కేనగర్ నుంచి అసెంబ్లీకి పోటీకి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా, ఈనెల 4వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశమై జయ కేసులో అప్పీలుకు వెళ్లాలని నిర్ణయించారు. అప్పీలు దాఖలు చేసే బాధ్యత ను ప్రభుత్వ న్యాయవాదులు బీపీ ఆచార్య, సంతోష్ గౌడలకు అప్పగించారు. అయితే అప్పీలు పిటిషన్ దాఖలు చేసేందుకు సుప్రీంకోర్టు సెలవులో ఉంది. తాజా తీర్పు వెలువడిన 90 రోజుల్లోగా అప్పీలు చేయాల్సిన నిబంధన ఉన్నందున సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ లో మంగళవారం అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ ఈ అప్పీలును స్వీకరించారు. వచ్చేనెల 1 వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పనిచేస్తున్నందున ప్రధాన న్యాయమూర్తి దత్తు అప్పీలుపై నిర్ణయం తీసుకుంటారు. ఎప్పటి నుంచి విచారణ ప్రారంభించేదీ, ఏఏ న్యాయమూర్తులు విచారణ చేస్తారో ఆయన ప్రకటిస్తారు. అప్పీలు పిటిషన్లో తమను కూడా చేర్చాల్సిందిగా కోరుతూ డీఎంకే పిటిషన్ దాఖలు చేయనుందని ఆ పార్టీ న్యాయవాది శరవణన్ తెలిపారు. అమ్మ శిబిరంలో ఆందోళన: తీర్పు వెలువడి నెలరోజులు దాటి పోవడంతో కర్ణాటక ప్రభుత్వం ఇక అప్పీలుకు వెళ్లదని అంచనా వేసిన అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళనలో పడిపోయారు. అయితే తాజా తీర్పు వెలువడిన 43 రోజుల తరువాత కర్ణాటక అప్పీలుకు వెళ్లింది. దేశ ఎన్నికల చరిత్రలోనే లేని విధంగా అమ్మకు అత్యధిక మెజార్టీ సాధించి పెట్టాలని మంత్రులు, నేతలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. 22వ తేదీన అమ్మ తన ప్రచారంలో సైతం రికార్డు మెజారిటీని ఆశిస్తున్నట్లు ఓటర్లను వేడుకున్నారు. మరో నాలుగురోజుల్లో ఆర్కేనగర్లో పోలింగ్ జరగనుండగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు కావడం ఓటింగ్ సరళిపై ప్రభావం చూపితే ఎలా అనే ఆందోళన నెలకొంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారంలో అప్పీలు అంశాన్ని విపక్షాలు ప్రచారానికి వాడుకోవచ్చని అంచనావేస్తున్నారు. జయ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే: జయ కేసులో కర్ణాటక ప్రభుత్వం అప్పీలు చేయడం పట్ల తమిళనాడులోని ప్రతిపక్షాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. అప్పీలు చేయాలనే కోర్కె ఒక్క డీఎంకేది మాత్రమే కాదు, ప్రజలందరిదీ అని పార్టీ కోశాధికారి స్టాలిన్ అన్నారు. ప్రజల కోర్కె నెరవేరిందని చెప్పారు. అప్పీలు పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించిన కారణంగా సీఎం పదవి నుంచి జయ తప్పుకోవాలని పీఎంకే అగ్రనేత డాక్టర్ రాందాస్ అన్నారు. సీఎంగా జయ ఇక రోజులు లెక్కపెట్టుకోక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పీలు దాఖలులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అన్నారు. -
అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలు
-
నేడు తమిళనాడు సీఎం రాజీనామా
చెన్నై: అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా బయటపడ్డ అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. జయలలిత ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా, ప్రస్తుత తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం రాజీనామా చేయనున్నారు. ఈ రోజే సెల్వం రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ నెల 16న జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణం చేయవచ్చని సమాచారం. జయలలితకు ఈ రోజు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
నేను మేలిమి బంగారాన్ని...
చెన్నై: న్యాయం గెలిచింది... నిజాలు నిగ్గు దేలి..మేలిమి బంగారంలా బైటపడ్డానని అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సంతోషం వ్యక్తం చేశారు. అక్రమాస్తుల కేసులో జయలలితతోపాటు మరో ముగ్గురిపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యర్తలు సంబరాలు చేసుకున్నారు. కర్టాటక హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం కిక్కిరిసిన అభిమానులనుద్దేశించి ఆమె తొలిసారి మాట్లాడారు. న్యాయస్థానాన్ని పొగడ్తలతో ముంచెత్తిన ఆమె ...కోర్టు తీర్పు తనకు చాలా పూర్తి సంతృప్తి నిచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయ శత్రువలు తనపై తప్పుడు కేసులు పెట్టారని, తాజా తీర్పుతో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర భగ్నమైందన్నారు. ఇది తన వ్యక్తిగత విజయం కాదని, ధర్మమే గెలిచిందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని రుజువైందన్నారు. ఇది తుది తీర్పు కాదని, కోర్టులపైన కోర్టులు ఉంటాయని, అది మనస్సాక్షిగా జయలలిత అభివర్ణించారు. తనకోసం ప్రార్థనలు చేసి ప్రతీ ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ట్రయిల్ కోర్టు తీర్పు తరువాత ఆత్మహత్య చేసుకున్న 237 మంది అభిమానులకు సంతాపం తెలిపారు. వాళ్లు కొంచెం సంయమనం పాటించి ఉంటే ఈనాటి సంబరాల్లో పాలు పంచుకునేవారన్నారు. కాగా అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి జయలలితతో పాటు మరోముగ్గురిని నిర్దోషిగా ప్రకటించారు. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసుపై హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. -
తోట నుంచి కోటలోకి..!
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 231 రోజుల పాటు అధికారానికి దూరంగా ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పోయస్ గార్డెన్స్ (తోట) నుంచి... మళ్లీ తమిళనాడు అసెంబ్లీ (కోట)లోకి అడుగు పెట్టేందుకు ఆమె ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16వ తేదీన మరోసారి ఆమె ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇన్నాళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జయ అనుంగు అనుచరుడు పన్నీర్ సెల్వం రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పు వెలువడగానే ఆయన జయలలిత నివాసమైన పోయస్ గార్డెన్స్‌కు వెళ్లారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్టు జయలలితను అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారించి నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధించడంతో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆమె.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం తన పదవిని కోల్పోయారు. రెండేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడిన ఎవరైనా తమ పదవులను కోల్పోతారు. అందుకే ఆమె తన ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. అయితే.. కర్ణాటక హైకోర్టు మాత్రం ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేయడంతో.. ఇప్పుడు మళ్లీ ఆమె ఎమ్మెల్యే అయ్యేందుకు, ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమమైంది. -
జయ కేసు సాగిందిలా..
చెన్నై: అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టు తీర్పుతో ఉపశమనం లభించిన సంగతి తెలిసిందే. జయపై నమోదైన అభియోగాలన్నింటినీ కర్ణాటక హైకోర్టు కొట్టివేసి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పుతో దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకున్నా.. సుదీర్ఘ కాలం పాటు జరిగిన జయలలిత అక్రమ ఆస్తుల కేసును ఒకసారి పరిశీలిద్దాం. * 1991 నుంచి 1996 జయలలిత సీఎంగా ఉన్న సమయంలో అక్రమ ఆస్తులను కూడబెట్టిందంటూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్ కోర్టులో కేసు ఫైల్ * రూ.66 కోట్లకు పైగా కూడబెట్టిందంటూ నమోదైన ఆ కేసులో డిసెంబర్ 7, 1996న జయ అరెస్ట్ * జయతో పాటు మరో ముగ్గురిపై నమోదైన ఆస్తుల కేసులో 1997 లో సెషన్స్ కోర్టులో కేసు విచారణ *1997 జూన్ 4న 120-బి ఐపీసీ, 13(2), 13(1) సెక్షన్ల కింద చార్జిషీట్ నమోదుకు కోర్టు ఆదేశం *1997లో జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించిన మద్రాస్ హైకోర్టు * ఇదే కేసులో అప్పటి గవర్నర్ ఫాతిమా బీవీపై విచారణకు హైకోర్టు ఆదేశం *2000 సంవత్సరం, ఆగస్టులో 250 సాక్షుల విచారణ *2000 సంవత్సరం ,అక్టోబర్ లో తమిళనాడు చిన్నతరహా పరిశ్రమల శాఖలో అవినీతికి పాల్పడినట్లు జయలలితపై అభియోగాలు * ఆ కేసులో నమోదైన అభియోగాలను రద్దు చేసిన సుప్రీంకోర్టు * 2001లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు.. అన్నా డీఎంకేకు పూర్తి మెజారిటీ * జయపై అభియోగాలు ఉండటంతో అంతకుముందు ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచి 2002 ఫిబ్రవరి 21న ప్రమాణ స్వీకారం * 2003 లో డీఎంకే జనరల్ సెక్రటరీ కె అన్ బాంజ్ గాన్ ఆ కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకు బదిలీ చేయాలని పిటిషన్ * జయలలిత సీఎంగా ఉండటంతో ఆ కేసు పక్కదోవ పడుతుందని పిటిషన్ లో ఆరోపణ * అందుకు సుప్రీం అంగీకారం తెలపడంతో కేసు విచారణ కర్ణాటకకు బదిలీ * 2014 సెప్టెంబర్ 27న అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసిలను దోషులుగా తేల్చిన స్పెషల్ కోర్టు. నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల జరిమానా విధింపు * 2014 సెప్టెంబర్ 29న తీర్పును సవాలుచేస్తూ, బెయిల్ కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన జయలలిత * 2014 అక్టోబర్ 7: బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు, బెయిల్ ఇవ్వడానికి కారణాలు లేవని స్పష్టీకరణ * 2014 అక్టోబర్ 9: బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన జయలలిత * 2014 అక్టోబర్ 17: జయలలితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు * 2015 మే 11: అక్రమాస్తుల కేసులో జయలలిత, మరో ముగ్గురు నిర్దోషులంటూ కర్ణాటక హైకోర్టు ప్రకటన -
జయలలిత ఇంటి వద్ద కోలాహల వాతావరణం!
-
'జయలలిత కేసులో అప్పీల్ కు వెళతా'
-
స్టాలిన్ ఆశలపై నీళ్లు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టులో చుక్కెదురతుందని, దాంతో ఈసారి తాను ముఖ్యమంత్రి కావచ్చని ఆశించిన డీఎంకే కోశాధికారి, కరుణానిధి కొడుకు స్టాలిన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేయడంతోపాటు జయలలిత, మరో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించడంతో ఆమె ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు మొత్తం రంగం సిద్ధమైపోయింది. ఆమె అనుంగు అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేసేందుకు సిద్ధమైపోయారు. హైకోర్టు తీర్పు వెలువడగానే ఆయన జయ నివాసమైన పోయస్ గార్డెన్స్‌కు వెళ్లారు. దాంతో డీఎంకే ఆశలు అడియాసలయ్యాయి. అక్రమాస్తుల కేసును హైకోర్టు సమర్థిస్తే.. ఆరేడు నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించడం ఖాయమని, అప్పుడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టవచ్చని కరుణ కుమారుడు స్టాలిన్ భావించారు. కానీ ఇప్పుడు ఆ కేసు నుంచి పూర్తి నిర్దోషిగా ఆమె బయటపడటంతో.. ఎలాంటి మచ్చ లేదు కాబట్టి.. ఎన్నికల ఫలితాల మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది. కేసును ఎక్కువ కాలం నాన్చకూడదని, త్వరగా తేల్చాలని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడంతో తీర్పు ప్రతికూలంగానే వస్తుందని అందరూ అనుకున్నారు. చివరకు తమిళనాడు మంత్రులు కూడా తీర్పు ఎటు తిరిగి ఎటు వస్తుందోనన్న భయంతో భారీగా ఆలయాల్లో పూజలు, పునస్కారాలు, ఊరేగింపులు జరిపారు. కానీ అనుకోకుండా జయలలిత విడుదల కావడంతో పెద్దెత్తున సంబరాలు జరుగుతున్నాయి. -
అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలు!
-
మళ్లీ తమిళనాడు సీఎంగా జయ?
అక్రమాస్తుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడటంతో ఆమెకు రాజకీయంగా కూడా పెద్ద ఊరట లభించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన జైల్లోకి వెళ్లడంతో పాటే.. తన శాసన సభ్యత్వాన్ని కూడా కోల్పోయి, ముఖ్యమంత్రి పదవికి దూరమైన జయలలిత.. ఇప్పుడు మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆమె అనుంగు అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత కోసం ఏ క్షణంలోనైనా తన పదవిని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మ కోసం ఆలయాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచే పూజలు ఆరంభం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో అన్నాడీఎంకే వర్గాల నేతృత్వంలో అభిషేకాలు, హోమాది పూజలు, పాలబిందెలతో ఊరేగింపులు జరిగాయి. ఎట్టకేలకు 'అమ్మ' మళ్లీ ముఖ్యమంత్రి కానుండటంతో.. తమిళనాడు వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. భారీ ఎత్తున బాణసంచా కాలుస్తున్నారు. పార్లమెంటు హాల్లో కూడా అన్నా డీఎంకే ఎంపీలు స్వీట్లు పంచిపెట్టారు. -
జయలలిత నిర్దోషి: హైకోర్టు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిఆర్ కుమారస్వామి కొట్టేశారు. జయలలితపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమె మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా మార్గం సుగమమైంది. 18 ఏళ్లుగా సాగిన అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా తేలుస్తూ, నాలుగేళ్ల జైలుశిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ గతంలో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. దాంతో ఆమె పరప్పన అగ్రహార జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఆమెకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు చేసింది. తర్వాత కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇప్పుడు మొత్తం అక్రమాస్తుల కేసునే హైకోర్టు కొట్టేసింది. దాంతో అసలు ఈ కేసులో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చినట్లయింది. ఫలితంగా.. ఆమె మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కేసులో ఆమెతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
తీర్పు అమ్మకు సానుకూలమా
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ భవిష్యత్తు మరో 24 గంటల్లో తేలిపోనుంది. జయ చేసుకున్న అప్పీలుపై ఈనెల 11వ తేదీ తీర్పు వెలువడ నుండగా, తీర్పు సారాంశం ఎలా ఉంటుందోనని రాష్ట్రమంతా టెన్షన్ నెలకొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి:18 ఏళ్లపాటూ నడిచిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు గత ఏడాది విధించిన నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానాపై జయ కర్నాటక హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అమెతోపాటూ ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న శశికళ, ఇళవరసి, మాజీ దత్తపుత్రుడు సుధాకర్లకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా పడింది. జనవరి 5వ తేదీన అప్పీలుపై విచారణ ప్రారంభం కాగా మార్చి 11 వ తేదీ వరకు న్యాయమూర్తి కుమారస్వామి నేతృత్వంలో వాదోపవాదాలు సాగాయి. మార్చి 18 వ తేదీలోగా విచారణ ముగించి తీర్పుచెప్పాలని సుప్రీం కోర్టు గతంలోనే కర్నాటక హైకోర్టును ఆదేశించి ఉంది. అయితే అత్యంత కీలకమైన కేసు కాబట్టి తీర్పు వెల్లడిలో మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి కుమారస్వామి సుప్రీంకు లేఖ రాశారు. ఈ అభ్యర్థనను మన్నించిన సుప్రీం కోర్టు మే 12వ తేదీలోగా తీర్పు చెప్పేలా గడువును పొడిగించింది. ఈ గడువు ముగిసిపోతున్న దశలో తీర్పు చెప్పేందుకు కర్నాటక హైకోర్టు సిద్దమైంది. ఈనెల 11 వ తేదీన ఉదయం 11 గంటలకు జయ కేసులో తీర్పు చెప్పనున్నట్లు కర్నాటక హైకోర్టు శుక్రవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. 11న రాష్ట్రవ్యాప్తంగా పూజలు ః తీర్పు తేదీ ఖరారైన నేపధ్యంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఊహాగానాల్లో పడిపోయాయి. అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన మిన్నంటింది. కోర్టు తీర్పు జయకు అనుకూలంగా రావాలని ప్రార్థిస్తూ మంత్రులు వలర్మతి, గోకుల ఇందిర శనివారం పూజలు నిర్వహించారు. అలాగే తీర్పు వెలువడే 11 వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు నిర్ణయించారు. పార్టీ అనుబంధ న్యాయవాదుల సంఘం సభ్యులు బెంగళూరుకు పయనం అవుతున్నారు. తీర్పు అనంతరం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కోర్టు శిక్షను ప్రకటించినపుడు ఆందోళనలు, రాస్తారోకోలు, బస్సుల ధ్వంసాలు చోటుచేసుకున్నాయి. 11 వ తేదీన తీర్పు అమ్మకు సానుకూలమా, ప్రతికూలమా అనే మీమాంసలో ముందు జాగ్రత్త చర్యలకు పోలీస్ యంత్రాంగం సిద్ధం అవుతోంది. కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ముమ్మురమైన వాహనాల తనిఖీకి చేపట్టనున్నారు. ఈనెల 12 వ తేదీతో జయకు మంజూరైన బెయిల్ గడువు ముగుస్తుంది. కర్నాటక హైకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సంతోషమే, ప్రతికూలంగా వస్తే వెంటనే బెయిల్ పొడిగింపు దరఖాస్తును సుప్రీం కోర్టులో దాఖలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఒక న్యాయవాది తెలిపాడు. -
సుప్రీంలో జయకు ఊరట
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె బెయిల్‌ను కోర్టు మే 12 వరకు పొడిగించింది. కేసులో జయ అప్పీలుపై కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించే వరకు ఈ బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. జయ అప్పీలుపై తీర్పు వెలువరించే గడువును ఈనెల 18 నుంచి మే 12కు పొడిగించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి చేసిన అభ్యర్థనను కూడా కోర్టు అనుమతించింది. ఆయన తరఫున కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్ దరఖాస్తు దాఖలు చేశారు. భవిష్యత్తులో అవసరమైతే మరింత గడువు కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ధర్మాసనం అనుమతించింది. -
జయ కోసం ఆత్మహత్యా యత్నం
భర్త మృతి; భార్య పరిస్థితి విషమం చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బయటపడడం ఆలస్యమవుతోందని మనస్తాపం చెందిన ఓ అభిమాని, భార్యతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో రాజయోగ్గియం మృతి చెందాడు. విషం తాగిన అతని భార్య ముత్తులక్ష్మి(30) పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తమిళనాడులోని తేని జిల్లా వడపుదుపట్టిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. జయలలిత కేసు విషయంలో బాధపడిన వీరిద్దరూ శుక్రవారం ఉదయం ఇంట్లో విషం తాగారు. విషయం తెలుసుకున్న పక్కింటివాళ్లు వారిని వెంటనే తేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొం దుతూ రాజయోగ్గియం మరణించాడు. ఆత్మహత్యకు పాల్పడిన ఇతని ఇంట్లో సూసైడ్ నోట్ లభించింది. జయలలిత కేసు ఆలస్యమవుతోందని, దీంతో తాము జీవించడం కంటే చావడంమేలని వారు లేఖలో రాశారు. వీరికి దివ్య(7) అనే కుమార్తె ఉంది. -
జయలలిత ఆస్తుల కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించి కర్ణాటక హైకోర్టులో ప్రత్యేక న్యాయస్థానం ముందు బుధవారం వాదనలు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి సీఆర్ కుమార్‌స్వామి తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.ఈ కేసుకు సంబంధించి 14 పేజీల వాదనను ఫిర్యాదుదారు, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి న్యాయమూర్తికి బుధవారం అందజేశారు. -
‘అమ్మ’ కోసం మంత్రి అయ్యప్పమాల
టీనగర్: అక్రమాస్తుల కేసుల నుంచి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత బయటపడాలని అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టి మంత్రి వలర్మతి శుక్రవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా 31 మంది మహిళలు కూడా ఇరుముడి కట్టారు. జయలలిత కేసుల నుంచి బయటపడాలని అన్నాడీఎంకే వర్గాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాయి. మంత్రి వలర్మతి అయ్యప్ప మాల ధరించారు. శుక్రవారం ఉదయం మహాలింగపురం అయ్యప్ప ఆలయంలో ఇరుముడి కట్టారు. వలర్మతితోపాటు 32 మంది మహిళా నిర్వాహకులు ఇరుముడి కట్టారు. తర్వాత ఇరుముడి తలపై మోసుకుంటూ ఆలయూనికి వచ్చారు. అక్కడ నుంచి రాజా అన్నామలైపురం అయ్యప్ప ఆలయానికి యాత్రగా వెళ్లారు. అక్కడ అయ్యప్పకు పూజలు చేశారు. తర్వాత ఇరుముడి సమర్పించి నెయ్యితో అభిషేకం చేశారు. జయలలిత పేరిట పూజలు చేశారు. ఇందులో కౌన్సిలర్లు నుంగై మారన్, డి.శివరాజ్, ఆరుముగం పాల్గొన్నారు. -
జయ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో వాదనలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి. జయలలిత తరఫున ప్రముఖ న్యాయవాదులు నారిమన్, సుశీల్ కుమార్, తులసి వాదనలు వినిపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడిన జయలలిత.. కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా, అక్కడి న్యాయమూర్తి తిరస్కరించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. విచారణ జరుగుతున్న గది బయట సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. విచారణ హాలు వద్ద భారీ సంఖ్యలో న్యాయవాదులు గుమిగూడారు. లోపల కిక్కిరిసి ఉండటంతో ఎవరినీ అనుమతించలేదు. -
అమ్మను చూడాలని..
- బెంగళూరులో మంత్రుల మకాం - దర్శనం లభించక చెన్నైకి తిరిగొచ్చిన వైనం చెన్నై, సాక్షి ప్రతినిధి : ఆదాయూనికి మించి ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను దర్శించుకోవాలని, దుఃఖభారంలో కుంగిపోయి ఉన్న అమ్మను ఓదార్చాలని పదిరోజులుగా పడిగాపులు కాసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు నిరాశ ఎదురైంది. అమ్మ దర్శనం లభించకపోడంతో వారు వెనుదిరిగారు. అన్నాడీఎంకేలో అంతా తానై ఏకచత్రాధిపత్యం సాగిస్తున్న అమ్మ జైలు పాలుకావడం పార్టీ శ్రేణులను తీవ్రంగా కుంగదీసింది. పార్టీ జయాపజయాలకు బాధ్యత వహిస్తూ ఏకైక ప్రజాకర్షణ నేతగా కొనసాగుతున్న జయ ప్రతిష్టపై తీరని మచ్చేపడింది. నాలుగేళ్లు జయ జైలులోనే ఉంటే మరో ఏడాదిన్నర కాలంలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే మీమాంశలో పడిపోయారు. అనేక అనుమానాలు, అవమానాలు, ఆవేదనలు మెదళ్లను తొలుస్తుండగా...అమ్మను జైలులో కలుసుకుని ఒకింత ఉపశమనం పొందాలని మంత్రులు ఆశించారు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఓ పన్నీర్‌సెల్వం పదవీ ప్రమాణం చేయగానే కొందరు మంత్రివర్గ సహచరులతో జైలుకు చేరుకున్నారు. రెండు రోజులు వేచిచూసినా అమ్మ అనుమతి లభించలేదు. బెయిల్ కోసం ప్రయత్నాలు సాగుతున్న సమయంలోనూ పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు బెంగళూరులోనే తిష్టవేశారు. ప్రతిరోజూ జైలు వద్దకు వెళ్లడం, వారిని కలుసుకునేందుకు అమ్మ నిరాకరించడం పరిపాటిగా మారింది. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను విస్మరించి బెంగళూరులో ఉండిపోవడం అమ్మకు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. మంత్రుల తీరుతో పార్టీకి అప్రతిష్టవాటిల్లుతుందని, రానున్న ఎన్నికలపై దీని ప్రభావం పడితే ఫలితాలు తారుమారవుతాయని శశికళ ద్వారా అమ్మ హెచ్చరించినట్లు సమాచారం. పార్టీవారంతా వెంటనే బెంగళూరు విడిచి పోవాలని అమ్మ ఆదేశించడంతో పది రోజుల క్రితం చెన్నై వదిలి వెళ్లిన వారంతా గురు, శుక్రవారాల్లో నగరానికి చే రుకున్నారు. అమ్మకోసం 154 మంది మృతి అమ్మ అంటూ తాము అభిమానంగా పిలుచుకునే జయలలిత జైలు పాలైందన్న ఆవేదనతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 154 మంది అశువులు బాసినట్లు అన్నాడీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. 113 మంది గుండెపోటుతోనూ, 15 మంది ఉరివేసుకుని, 7 మంది విషం తాగి, ఒకరు బస్సు కిందపడి, 14 మంది కిరోసిన్ పోసుకుని, ఇద్దరు నీటి గుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొంది. -
బ్రదర్స్‌తో చిక్కులు
- ఆస్తుల జప్తునకు కసరత్తు - డీవీఏసీ సన్నద్ధం - డీఎంకేలో కలవరం సాక్షి, చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు శిక్ష పడ్డ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకోవాలనుకున్న డీఎంకే వర్గాలకు మారన్ బ్రదర్స్ రూపంలో చిక్కులు ఎదురుకానున్నాయి. ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పంద వ్యవహారం ఉచ్చు మారన్ బ్రదర్స్ మెడకు చుట్టుకుంటోంది. వారికి సంబంధించిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేయడమే లక్ష్యంగా డీవీఏసీ సన్నద్ధం అవుతోంది. దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో డీఎంకే నేతల ప్రమే యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ వ్యవహారం ఆ పార్టీ అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి, మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ అభియోగాలు మోపింది. అలాగే, కరుణానిధి మనవళ్లు మారన్ బ్రదర్స్‌ను బీఎస్ఎన్ఎల్ కనెక్షన్ల దుర్వినియోగం, ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాలు చుట్టుముట్టా యి. ఈ అవినీతి ప్రభావంతో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే డీలా పడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తమపై పడిన మచ్చల్ని చెరుపుకోవడంతోపాటు ప్రజ ల్ని ఆకర్షించి కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఆ పార్టీ అధినేత కరుణానిధి ఉన్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు జైలు శిక్ష పడడం, ఆ పార్టీ వర్గాల వీరంగం, శాంతి భద్రతల క్షీణింపు వ్యవహారాల్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. తమపై పడ్డ అవినీతి బురదను కడిగేసుకునేలా జయలలిత జైలు శిక్ష అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మార్కుల్ని కొట్టేయాలన్న కాంక్షతో ఉరకలు తీస్తున్న డీఎంకేకు మారన్ బ్రదర్స్ రూపంలో చిక్కులు ఎదురుకానున్నాయి. ఆస్తుల జప్తునకు సన్నద్ధం గతంలో చోటు చేసుకున్న ఎయిర్ సెల్, మ్యాక్సిస్ ఒప్పందాల్లో దయానిధి మారన్, కళానిధి మారన్ బ్రదర్స్‌పై సీబీఐ అభియోగాల్ని మోపిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించిన చార్జ్‌షీట్ సైతం కోర్టులో దాఖలైంది. ఈ ఒప్పందాల మేరకు రూ.742 కోట్ల మేరకు నగదు బదలాయింపులు జరిగినట్టు సీబీఐ స్పష్టం చేసింది. దీంతో డెరైక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రంగంలోకి దిగింది. ఇప్పటికే మారన్ బ్రదర్స్‌ను ఈ విభాగం అధికారులు విచారించారు. అందులో లభించిన ఆధారాలు, సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకుని తమిళనాడులోని మారన్ బ్రదర్స్‌కు చెందిన రూ.742 కోట్లు విలువైన ఆస్తుల్ని జప్తు చేసేందుకు డీవీఏసీ వర్గాలు కసరత్తు చేస్తున్నారుు. ఈ కేసు వ్యవహారంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రమేయంపై సైతం దృష్టి కేంద్రీకరించడంపై రాష్ట్రంలో చర్చ మొదలైంది. ఈ ఆస్తుల జప్తు పర్వం మరికొద్ది రోజుల్లో జరగొచ్చన్న సంకేతాలు వెలువడడడంతో డీఎంకే వర్గాల్లో కలవరం మొదలైంది. మారన్ బ్రదర్స్ రూపంలో మళ్లీ తమ అధినేతకు చిక్కులు తప్పవేమోనంటూ కరుణ సేన పెదవి విప్పుతుండడం గమనార్హం. -
బెయిలు రాకపోయిందో.. మీ గతి అంతే!
-
బెయిలు రాకపోయిందో.. మీ గతి అంతే!
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు బెయిల్ వస్తుందా.. రాదా అనే అంశం తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అవుతోంది. ఒకవేళ జయలలితకు బెయిల్ రాకపోతే.. తమిళనాడులో ఉన్న కన్నడిగులను బందీలుగా చేస్తామని హెచ్చరిస్తూ బెంగళూరులో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇంతకుముందు అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారిస్తూ, ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ ఇప్పించాలని కోరుతూ జయలలిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడిగులను బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. దాంతో.. ఈ పోస్టర్ల వ్యవహారంపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి చెన్నై పోలీసులతో మాట్లాడారు. అయితే, తమిళనాడులో ఉన్న కన్నడిగులెవరికీ ఎలాంటి ప్రమాదం లేదని, ఇకముందు కూడా ముప్పు తలెత్తకుండా తాము చూసుకుంటామని అక్కడి పోలీసులు హామీ ఇచ్చారు. ఎవరైనా ఉద్రిక్తతలకు తావిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఇప్పటికే బెంగళూరు సెంట్రల్ జైలు వద్ద నిషేధాజ్ఞలు విధించారు. పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచే నిరసనలు, నిరాహార దీక్షలు ప్రారంభించారు. జయలలితకు మద్దతుగా సంతకాల ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి. మంగళవారం నాడు తమిళనాడులో స్కూళ్లు, కాలేజీలకు ఎలాంటి సెలవు ఇచ్చేది లేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
జయ కేసులో ఏఆర్ రెహ్మాన్ వాంగ్మూలం
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్‌ను విచారించారు. ఈ కేసును విచారించిన బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం రెహ్మాన్‌తో పాటు మాండొలిన్ శ్రీనివాస్ తదితర ప్రముఖుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. జయకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు 100 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. గత శనివారం తుది తీర్పు వెలువడింది. అంతకుముందు కేసు విచారణలో భాగంగా ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జాన్ మైఖేల్.. పలువురు ప్రముఖులను విచారించారు. జయలలిత మాజీ దత్త పుత్రుడు సుధకరన్ వివాహం సందర్భంగా రెహ్మాన్, శ్రీనివాస్ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇదే విషయాన్ని వారు కోర్టుకు తెలియజేశారు. తాము డబ్బులు తీసుకోకుండా ఉచితం ప్రదర్శన ఇచ్చామన, అయితే ఆహ్వానంతో పాటు వెండి, పట్టు వస్త్రాలను కానుకగా ఇచ్చారని తెలిపారు. మరో సంగీత దర్శకుడు అమరన్ మహాబలిపురం రోడ్డులో గల తన 22 ఎకరాల ఫామ్‌హౌస్‌ను జయ సన్నిహితురాలు శశికళకు అమ్మినట్టు కోర్టుకు చెప్పారు. -
జయలలిత కోసం దీక్ష చేసిన తమిళ స్టార్స్
-
అమ్మ నిరసనలకు కమల్, రజనీ డుమ్మా!
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్ర జయలలితకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. తమిళ నటులు, దర్శకులు, నిర్మాతల దగ్గర్నుంచి ప్రదర్శకుల వరకు అనేక మంది వీటికి హాజరయ్యారు. అయితే.. ఇందులో మరో కొత్త ట్విస్టు కనిపించింది. అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్.. ఇలాంటి వాళ్లు మాత్రం ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. వీళ్లలో కమల్‌హాసన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో రాలేకపోయారు. మిగిలినవాళ్లు ఎందుకు రాలేదన్న విషయం మాత్రం ఇప్పటికీ సస్పెన్సుగానే ఉంది. జయలలితకు మద్దతుగా జరిగిన నిరసన కారణంగా రాంచరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా మాత్రం తమిళనాడులో విడుదల కాలేదు. ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో బుధవారమే విడుదలైన ఈ సినిమా.. తమిళనాడులో ఉన్న ప్రేక్షకులకు మాత్రం శుక్రవారం వరకు అందుబాటులోకి రాదు. -
తరగని అభిమానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడినప్పటికీ ఆమె పట్ల అభిమానం చెక్కు చెదరలేదు. అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు జయ అభిమానులు మంగళవారం కూడా పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. పలు సందర్భాల్లో అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆందోళనలు నిర్వహించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంతో పాటు మరో నలుగురు మంత్రులు జయలలితతో సమావేశం కావడానికి వచ్చారు. మరో వైపు రాష్ట్ర హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టు ఎదుట గుమికూడారు. కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కిక్కిరిసిన కోర్టు హాలు హైకోర్టులోని ఎనిమిదో నంబరు హాలు మంగళవారం జయ అభిమానులతో కిక్కిరిసిపోయింది. జయతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిల బెయిల్ పిటిషన్లపై ఈ హాలులో హైకోర్టు సెలవుల ధర్మాసనం న్యాయమూర్తి రత్న కళ విచారణ చేపట్టారు. వీటన్నిటినీ ఒకే సారి విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఇంకా నియమించనందున విచారణను వాయిదా వేశారు. అన్ని పిటిషన్లపై ఏక కాలంలో వాదనలు వింటానని ప్రకటించారు. కాగా కోర్టు హాలు కిక్కిరిసి పోవడంతో జయ న్యాయవాదులు లోనికి వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సి వ చ్చింది. జయకు బెయిల్ లభించవచ్చనే అంచనాతో వచ్చిన అభిమానులు విచారణ వాయి దా పడడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జేత్మలానీ వాదిస్తున్నారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది లతాృకష్ణమూర్తి కూడా కోర్టుకు హాజరయ్యారు. లాడ్జీలన్నీ ఫుల్ జయ అభిమానులతో నగరంలోని చిన్నా చితకా లాడ్జీలన్నీ నిండిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు సరిహద్దులోనిృకష్ణగిరితో పాటు సేలం, కోయంబత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. జైలులో అమ్మను దర్శించుకోవాలన్న వారి కోరిక ఫలించక పోయినా, వేచి చూస్తున్నారు. ఒక వేళ అమ్మకు బెయిల్ లభిస్తే జయ జయ ధ్వానాలతో స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. వాతావరణానికి అలవాటు పడుతున్న జయ జైలు వాతావరణానికి జయలలిత క్రమేపీ అలవాటు పడుతున్నారు. మంగళవారం యథావిధిగా ఉదయం 5.30 గంటలకు నిద్ర లేచి మార్నింగ్‌కు వెళ్లారు. అనంతరం దిన పత్రికలు చదివి అల్పాహారం సేవించారు. అంతకు ముందు వైద్యులు ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తమిళనాడు మంత్రులు ఒలర్మతి, కుహులేంద్ర, మోహన్, సెంథిల్ బాలాజీ,ృకష్ణమూర్తి ్రృభతులు జైలు వద్దకు వెళ్లినప్పటికీ అమ్మ దర్శన భాగ్యం కలుగలేదు. -
జయలలిత.. ఎగిసి పడిన కెరటం!
-
జయ పదవి దక్కేదెవరికి?
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు తమిళనాడులో అధికార అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) పార్టీకి అశనిపాతంలా మారింది. జయలలిత సారథ్యంలో 2011లో డీఎంకేను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే.. ఇటీవలి ఎన్నికల్లో సైతం అద్భుత విజయాలు నమోదు చేసింది. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాల్లో 37 సీట్లు గెలుచుకుంది. తాజా తీర్పుతో.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలు గల అన్నా డీఎంకే ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకపోయినా.. పార్టీకి, ప్రభుత్వానికి నాయకత్వ సమస్య ఎదురుకానుంది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి జయలలిత వైదొలగక తప్పనిసరి పరిస్థితి తలెత్తడంతో.. ఆ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టాన్సీ భూ ఒప్పందం కేసులో దోషిగా నిర్ధారితురాలైన కారణంగా ముఖ్యమంత్రిగా ఆమె నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు 2001లో తీర్పు ఇచ్చినపుడు కూడా జయలలిత సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఒ.పన్నీర్‌సెల్వంను జయలలిత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఆమె తిరిగి వచ్చి ఆ పదవి చేపట్టే వరకూ ఆయనే సీఎంగా కొనసాగారు. ఇప్పుడు సీఎం పదవి దక్కే చాన్స్ ఉన్న వాళ్లలో.. ప్రస్తుతం జయ కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న సెల్వంతో పాటు.. రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, విద్యుత్ మంత్రి ఆర్.విశ్వనాథన్‌ల పేర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి షీలాబాలకృష్ణన్ల పేర్లు వినిపిస్తున్నాయి. -
జయ రాజకీయ జీవితంపై నీలినీడలు
బెంగళూరు : సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ద్రవిడ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత రాజకీయ జీవితంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు సంబంధించి కోర్టు తీర్పుతో జయ రాజకీయ భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం జయలలిత ముఖ్యమంత్రి హోదాతో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోనున్నారు. దీంతో పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా పోయింది. కాగా అనర్హత వేటు పడిన తొలి సీఎంగా జయలలిత రికార్డుల్లోకెక్కారు. ఇక రాజకీయ జీవితంలో ఏనాడు వెనక్కు తిరిగి చూడని జయలలిత జీవితం ఇలా జైలు పాలు కావడాన్ని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. -
చాలాకాలం తర్వాత కారు డోర్ తీసిన జయ
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఒక్కసారిగా...అధికార దర్పం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ మందీ మార్భలంతో దర్జాగా కారు ఎక్కే ఆమె.. చాలా సంవత్సరాల తర్వాత సొంతంగా తానే కారు డోరు తీసుకోవటం విశేషం. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం జయలలిత వెలువలికి వచ్చి తన సొంత కారులో డోర్ లాక్ చేసుకుని చాలాసేపు లోపలే కూర్చుండిపోయారు. జయ..తన నిచ్చెలి శశికళతో కొద్దిసేపు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా బెంగళూరు పోలీసులు పలుమార్లు కారు డోర్లు తట్టి వెలుపలకి రావాలని సూచించారు. అక్రమాస్తుల కేసులో జయలలితకు న్యాయస్థానం నాలుగేళ్ల జైలుతో పాటు, వందకోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా వైద్య పరీక్షల నిమిత్తం జయలలితను బెంగళూరులోని జయదేవ ఆస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్యేగా జయలలితపై అనర్హత వేటు!
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడింది. ఈ అనర్హత వేటు తక్షణమే అమల్లోకి రానుంది. శనివారం బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆమె సీఎం పదవికి అనర్హురాలు కానుంది. దీంతో పాటు ప్రజాప్రాతినిధ్యం చట్ట ప్రకారం ఆమె ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తాజా తీర్పుతో ఆమె పదేళ్ల పాటు రాజకీయ జీవితానికి దూరంగా ఉండనుంది. ఆమెకు నాలుగేళ్ల శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానాను కోర్టు విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి.1996లో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి ఆమెపై దర్యాప్తు చేయాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు చేపట్టాల్సిందిగా కోర్టు ఆదేశించినా.. దర్యాప్తుకు మాత్రం సుదీర్ఘ సమయం పట్టింది. -
'ఆమెకు అంత శిక్ష పడుతుందనుకోలేదు'
చెన్నై : తమిళనాడులో రెండు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కేంద్రాన్ని కోరారు. జయలలితకు జైలుశిక్ష నేపథ్యంలో తమిళనాడు అగ్నిగుండంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సామాన్య వ్యక్తిగానే జయలలితపై ఫిర్యాదు చేశానని సుబ్రమణ్యం స్వామి అన్నారు. జయలలితకు అంత శిక్ష పడుతుందని తాను కూడా ఊహించలేదన్నారు. సామాన్యుడు కూడా అవినీతి, అక్రమాలను ప్రశ్నించవచ్చనే దానికి ఈ కేసు ఉదాహరణ అన్నారు. తనపై చాలా దాడులు జరిగాయని అయినా తాను భయపడలేదని సుబ్రమణ్యం స్వామి తెలిపారు. ఇక జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్లేనని ఆయన అన్నారు. అంతకు ముందు సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్లో జయలలిత జైలుకే ...జేజే అంటూ ట్విట్ చేశారు. -
జయను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా తీర్పు వెలువడిన వెంటనే జయ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మరోవైపు న్యాయస్థానం తీర్పుపై ఆమె సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జయలలితకు శిక్ష ఖరారు కావటంతో అన్నాడీఎంకేలో నిస్తేజం నెలకొంది. న్యాయస్థానం నాలుగేళ్లు శిక్ష వెలువరించటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్భాంత్రికి గురయ్యారు. మహిళా కార్యకర్తలతో పాటు జయ కేబినెట్లోని మంత్రులు కన్నీరు పెట్టుకున్నారు. తీర్పు వెలువడటంతో ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం కోర్టులోనే కంటతడి పెట్టారు. -
జయలలిత జీవిత ప్రయాణమిదీ!
-
జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
బెంగళూరు : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానా విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. మరోవైపు జయలలితకు శిక్ష ఖరారైన నేపధ్యంలో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధినేత్రికి శిక్ష పడటాన్ని జీర్ణించుకోలేని అన్నాడీఎంకె కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. దీంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి. జయలలిత ఆస్తుల కేసులో గత 18 ఏళ్ల నుంచి మొత్తం 358 మందిని కోర్టు విచారించింది. -
జయకు నాలుగేళ్ల జైలు: లైవ్ అప్డేట్స్
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆమెకు ఏ శిక్ష విధించేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. 18 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో.. ఆమె భవితవ్యం ఏమవుతుందోనని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసు తాజా పరిణామాలు ఇవీ. * ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హురాలు కానున్న జయలలిత * కోర్టు తీర్పు నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది * నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వంద కోట్ల జరిమానా * జయతో పాటు శశికళ, ఇళవరసన్, సుధాకరన్ కు నాలుగేళ్ల జైలు * జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. * జయలలితపై అక్రమాస్తుల కేసులో నేరం రుజువైనట్లు న్యాయమూర్తి తెలిపారు. * ఆమెకు ఏశిక్ష విధిస్తారోనన్న విషయమై తుది తీర్పు మధ్యాహ్నం తర్వాత రావచ్చు. * కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న బ్యారికేడ్లను విరగ్గొట్టేందుకు అన్నా డీఎంకే కార్యకర్తలు ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. * కోర్టు ఆవరణలో ఆందోళన చేస్తున్న జయలలిత మద్దతుదారులపై లాఠీఛార్జి * బెంగళూరు మినీ తమిళనాడుగా మారిపోయింది. భారీ సంఖ్యలో అన్నా డీఎంకే, డీఎంకే కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. * ఈ కేసులో నేరం రుజువైతే.... ఆమెకు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. * 1996లో సుధాకరన్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆరోపణలు * నేరం రుజువైతే ఆమె ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది * ఇదే జరిగితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఫలితాలపై కూడా ప్రభావం చూపొచ్చు. * ఒకవేళ జయలలితకు శిక్షపడి, ఆమె పదవిని వదులుకోవాల్సి వస్తే.. ఆమె స్థానంలో తాత్కాలిక సీఎంగా తమిళనాడు మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్‌ను నియమించే అవకాశం * ఆమె కాని పక్షంలో 'అమ్మ'కు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంకు కూడా అవకాశం. * ఈ కేసు.. తనపై తమ ఆగర్భ ప్రత్యర్థి డీఎంకే పన్నిన రాజకీయ కుట్రగా అభివర్ణించిన జయ * కోర్టు బయట భారీసంఖ్యలో గుమిగూడిన అన్నాడీఎంకే మద్దతుదారులు * ఈ కేసులో జయలలితతో పాటు ఆమెకు అత్యంత సన్నిహతురాలైన శశికళా నటరాజన్, ఇళవరసి కూడా కేసులో నిందితులే. -
జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
-
బెంగళూరు కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్
బెంగళూరు : బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ రెడ్డి 144 సెక్షన్ విధించారు. జయ అక్రమాస్తుల కేసు విచారణకు నగర శివార్లలోని పరప్పన ఆగ్రహార జైలు ఆవరణలో....తాత్కాలిక కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జయలలితను దోషిగా నిర్థారించిన కోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయి. కాగా నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు దగ్గర భారీగా బలగాలు మోహరించాయి. -
శశికళ, ఇళవరసి, సుధాకరన్ దోషులే
బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె స్నేహితురాలు శశికళను కూడా న్యాయస్థానం దోషిగా నిర్థారించింది. వీరిద్దరితో పాటు పెంపుడు కుమారుడుసుధాకరన్, ఇళవరసిలు కూడా దోషులుగా తేల్చినట్లు ఎస్పీపీ భవానీ సింగ్ తెలిపారు. జయలలితను బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం... ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. పురచ్చితలైవిగా, అమ్మగా పేరొందిన జయలలిత 1991లో మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 43 ఏళ్ల వయసులోనే సీఎం పగ్గాలు స్వీకరించిన జయలలిత 96 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో జయలలిత భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో నాటి జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి జయలలితపై ఫిర్యాదు చేశారు. -
జయ కేసు: ట్విట్టర్లో ఎవరేమన్నారు?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో పలువురు స్పందించారు. ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఒకప్పుడు లక్స్ ప్రకటనలతో అందరికీ సుగంధాన్ని పంచిన జయ.. ఇప్పుడు జైల్లో అవే సుగంధాలను పంచుతారేమోనని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా ఆమెను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. Now JJ will smell and admire the interiors of jail cells. @Swamy39 @jagdishshetty @arundharhoney @vijay_rajan pic.twitter.com/43oC5g8c99 — Wandering Wolf (@WanderingWolf2) September 27, 2014 Thanks to freedom movement, going to jail is a qualification for our politicians. For whatever reason. #OnlyInIndia @vvsnair @minhazmerchant — Baba Leopard Singh (@Leopard212) September 27, 2014 Hey political pundits,u remember this? “Ordinance to shield convicted leaders is complete nonsense, tear it up:Rahul” http://t.co/JR93HLbgCv — sachin bahad (@sachinbahad) September 27, 2014 TN people should start looking for options beyond Amma & Ayya ..... unfortunately there are alternatives available i guess — Naveen (@emanin) September 27, 2014 Why is police not forcing dispersal of agitated and angry cadre from outside Poes Garden? #Amma #jayaverdict pic.twitter.com/LdRzZXmt4P — Uma Sudhir (@umasudhir) September 27, 2014 @mswami Karma pays back peduliarly.She is overpunished for crimes whichis miniscule compared toother politicians but paying for bigger sins — Global Indian (@sivashiv) September 27, 2014 Public prosecutor asks for 7 years jail for #Jayalalithaa. Defence pleads for her age and health to be taken into account #Jayaverdict — T S Sudhir (@Iamtssudhir) September 27, 2014 #Jayalalithaa disqualified as MLA, loses Chief Ministership instantly; as a pointer, the National Flag on her car has been removed #THJAYA — dinesh surya (@BooDinesh143) September 27, 2014 Law and order goes for a toss in Tamil Nadu as JJ sentence is awaited. #Jayaverdict #Jayalalithaa — Chandra R. Srikanth (@chandra86) September 27, 2014 It took #18years to prove TN CM #Jayalalithaa guilty of corruption. 18 years -Right to get Law. #jayaverdict. — Arunkumar Alagesan (@ArunzTwit) September 27, 2014 #Jaya life is an example for wrong friendship, but her Army will keep increasing & she will come Much Bigger Next time. Nw, "I'm Waiting" — @kamaljii (@kamaljii) September 27, 2014 Oh when will Mayawati and Mulayam follow in the giant heavy footsteps of Jaya?!?? Oh when??? — SUHEL SETH (@suhelseth) September 27, 2014 10 years back in Nov 2004,#Jaya got Kanchi Shankracharya arrested on Diwali day. Diwali is around d corner&deer she goes. Karma spares noone — Ankita Thakur (@Ankitaaa_) September 27, 2014 -
సుబ్రమణ్యంస్వామి ఇంటిపై రాళ్లదాడి
చెన్నై : అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రెచ్చిపోయారు. సుబ్రమణ్యం స్వామి ఇంటిపై అన్నాడీఎంకే కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. అలాగే డీఎంకే పార్టీ కార్యాలయంలో పాటు, ఆపార్టీ ముఖ్య నేతల నివాసాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. సుబ్రమణ్యం ఫొటోను కాల్చివేయటంతో పాటు, చెప్పుల దండలు వేసి తమ నిరసనలు తెలుపుతున్నారు. అలాగే కరుణానిధి నివాసంపై రాళ్లదాడికి యత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తమిళనాడు మొత్తం భారీగా పోలీసులు మోహరించారు. ఇక కడలూరు, మధురై, సేలం, శ్రీరంగంలో బంద్ పరిస్థితులు నెలకొన్నాయి. -
జయ కేసు విచారణకు 18 ఏళ్లు.. ఎందుకు?
జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ సుదీర్ఘంగా 18 సంవత్సరాల పాటు పట్టింది. తమిళనాడులోనే విచారణ జరిగితే అది సవ్యంగా సాగదని, అందువల్ల వేరే రాష్ట్రంలో విచారించాలని డీఎంకే పట్టుబట్టడమే ఇందుకు ప్రధాన కారణం. డీఎంకే వాదనతో సుప్రీంకోర్టు అంగీకరించడంతో.. కేసును బెంగళూరుకు మార్చారు. నిందితులు కూడా లెక్కలేనన్ని పిటిషన్లు దాఖలు చేశారు. దాదాపు కేసు ముగింపు దశకు వచ్చేస్తుందన్న సమయంలో ముఖ్యమంత్రికి ఏకంగా 1339 ప్రశ్నలు సంధించారు. ఇవన్నీ కూడా ఆలస్యానికి కారణాలే. బెంగళూరు కోర్టుకు కేసును బదిలీ చేయడానికే ఆరేళ్ల సమయం పట్టేసింది. 76 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించారు. వాళ్లందరినీ ఒకసారి అప్పటికే క్రాస్ ఎగ్జామిన్ చేసేశారు. వాళ్లలో 64 మంది ప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగారు. తమతో బలవంతంగా సాక్ష్యం చెప్పించారన్నారు. ఈ 18 ఏళ్లలో కేసు విచారణకు జయలలిత కేవలం రెండంటే రెండేసార్లు హాజరయ్యారు. ఒక సందర్భంలో అయితే.. ప్రాసిక్యూషన్ నిందితులతో చేతులు కలిపిందని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించింది. దాంతో ఒక్కసారిగా వ్యవస్థ మొత్తం ఉలిక్కిపడింది. అలా విచారణకు సుదీర్ఘ కాలం పట్టేసింది. -
ఎన్ని పథకాలు పెట్టినా.. 'అమ్మ' ఇంటికే!
అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, తాజాగా అమ్మ సిమెంటు... ఇలా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కూడా 'అమ్మ' చివరకు ఇంటిదారి పట్టక తప్పట్లేదు. ఎప్పుడో 17 ఏళ్ల క్రితమే 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారంటూ నాటి జనతాపార్టీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కేసు పెట్టడం.. దాని విచారణ ఇన్నేళ్ల పాటు సాగడం, చివరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికూన్ ఆమెను దోషిగా నిర్ధారించడంతో ఇక ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాకర్షక పథకాలను ప్రకటించడం ద్వారానే జయలలిత ఎక్కువ ఆదరణ పొంది.. ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, బాలింతలకు ఉయ్యాలలు.. ఇలా అనేక వరాలు కురిపించారు. అయినా కూడా ఇప్పుడు అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో పదవి కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
డీఎంకే కార్యకర్తల సంబరాలు
చెన్నై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్థారణ కావడంతో డీఎంకే సంబరాలు చేసుకుంటోంది. 1996లో అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే జయలలితపై ఆరోపణలకు సంబంధించి అప్పటి అధికార పార్టీ డీఎంకే విచారణకు ఆదేశించింది. అప్పటి నుంచి 18 ఏళ్ల పాటు పట్టువదలకుండా పోరాడిన కరుణానిధి పార్టీ... ఇప్పుడు పురచ్చితలైవి దోషిగా నిర్దారణ కావడంతో ఆనందంలో తేలిపోతోంది. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి నివాసంలో పార్టీ ముఖ్యనేతలు సమావేశమై తాజా పరిణామాలపై చర్చలు జరిపారు. కాగా గత రెండు ఎన్నికల్లో అన్నాడీఎంకే చావుదెబ్బ తిన్న డీఎంకే ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. 2011 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత ధాటికి కరుణానిధి పార్టీ బొక్కబోర్లా పడింది. అంతేకాకుండా అమ్మ పథకాలతో ప్రజల్లో పరపతి పెంచుకుంటున్న జయలలితను దీటుగా ఎదుర్కొనేందుకు కూడా డీఎంకేకు బలం సరిపోవడం లేదు. ఇలాంటి స్థితిలో పార్టీని కాపాడుకుంటూ, ప్రజలకు చేరువయ్యేందుకు ఇప్పుడు డీఎంకేకు ఓ బలమైన ఆయుధం దొరికినట్లు అయింది. జయలలిత అక్రమాలకు పాల్పడినట్లు కోర్టే స్వయంగా పేర్కొనందున ఇప్పుడు అదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి మళ్లీ మద్దతు సంపాదించాలనేది డీఎంకే నేతల ఎత్తుగడగా తెలుస్తోంది. ఇక కోర్టు జయను దోషిగా తేల్చటంతో డీఎంకే కార్యకర్తులు సంబరాలు చేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు. -
తమిళనాడులో హై అలర్ట్, కేబుల్ ప్రసారాలు బంద్
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా నిర్థారణ అయిన నేపథ్యంలో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బస్సు సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తులు దాడులుకు పాల్పడుతూ ....బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. కాగా తమిళనాడులోని పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు పాక్షికంగా బంద్ పాటిస్తున్నారు. కాగా తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు.ఇక అన్నాడీఎంకే కార్యాలయం వద్ద అత్యంత్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధి నివాసంతో పాటు డీఎంకే కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నన్ను హింసించడానికే కేసులు: జయ
బెంగళూరు : తనను హింసించేందుకే ఈ కేసులు పెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అన్నారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని జయ తెలిపారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆమె ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను బెంగళూరు స్పెషల్ కోర్టు దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పు వెలువడనుంది. -
'మండి'పడుతున్న అన్నాడీఎంకే కార్యకర్తలు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ప్రారంభించారు. తమిళనాడు- కర్ణాకట సరిహద్దుల్లో ఉన్న బ్యారికేడ్లను విరగ్గొట్టారు. కోర్టు పరిసరాల్లో కూడా విషయం తెలియగానే ఒక్కసారిగా తీవ్ర ఆందోళనలు, నినాదాలు ప్రారంభించారు. అక్కడ సుమారు పదివేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటుచేసినా కూడా పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. ఇటు తమిళనాడులోను, మరోవైపు కర్ణాటకలోను కూడా అల్లర్లు మొదలైపోయాయి. పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు, దుకాణాలపై దాడులు జరుగుతున్నాయి. దాంతో తమిళనాడులో మొత్తం దుకాణాలు మూసేశారు. కొద్ది సంఖ్యలో ఉన్న పోలీసులు.. అన్నాడీఎంకే మద్దతుదారులను ఏమాత్రం అదుపుచేయలేకపోతున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ విషయం తెలియగానే సంబరాలు జరుపుకొంటోంది. ఇంతకుముందు కూడా జయలలితపై ఆరోపణలు వచ్చినప్పుడే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘోర పరాజయం పాలైంది. ఈ సందర్భాన్ని తలుచుకుని.. ఈసారి తాము మళ్లీ అధికారంలోకి రావచ్చని డీఎంకే భావిస్తోంది. -
మన రాజకీయాల్లో.. ఎందరో దోషులు
భారత రాజకీయ నాయకుల్లో దోషుల సంఖ్యకు ఏమాత్రం కొదవలేదు. ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో వివిధ కేసులలో కొంతమంది నాయకులు దోషులుగా తేలారు. గడ్డి కేసు దగ్గర నుంచి నేరాల వరకు అనేక కేసులు వీటిలో ఉన్నాయి. మాయా కొద్నానీ లాంటి మహిళా నేతలు మత ఘర్షణల కేసులో దోషులుగా తేలారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు మన దేశంలో నేరస్థులుగా నిర్ధారణ అయిన నాయకుల పేర్లు ఒకసారి చూద్దాం... హర్చరణ్ సింగ్ బల్లీ ఓం ప్రకాష్ చౌతాలా ఫూలన్ దేవి బాలముకుంద్ గౌతమ్ సంతోక్‌బెన్ జడేజా పప్పూ కలానీ మాయా కొద్నానీ రషీద్ మసూద్ జగన్నాథ మిశ్రా మహ్మద్ సుర్తీ నీలలోహితదాసన్ నాడార్ రాజు పాల్ మనోజ్ ప్రధాన్ ప్రబోధ్ పురకాయత్ గోపాల్ రాజ్‌వానీ టీఎం సెల్వగణపతి మహ్మద్ షహాబుద్దీన్ జగదీష్ శర్మ సాధు శెట్టి సిబకతుల్లా అన్సారీ అక్షయ్ ప్రతాప్ సింగ్ సురభజన్ సింగ్ శిబు సోరెన్ మహ్మద్ తస్లీముద్దీన్ -
జయ కేసు: చరిత్ర సృష్టించిన మైఖేల్
జాన్ మైఖేల్ డికున్హా.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు పుణ్యమాని ఒక్కసారిగా ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆయన ఎవరో కాదు.. అక్రమాస్తుల కేసులో జయలలితను దోషిగా నిర్ధారించిన న్యాయమూర్తి ఆయనే. బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు మొదట బాలకృష్ణన్ న్యాయమూర్తిగా ఉండేవారు. అయితే ఆయన కేసు విచారణ పూర్తి కాకముందే పదవీ విరమణ చేశారు. దాంతో ఆ తర్వాత ఆ కోర్టుకు న్యాయమూర్తిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన రెండేళ్లకు విచారణ పూర్తయింది. ఈ కేసులో తీర్పును జయలలిత ముందే ఊహించారో ఏమో గానీ, శనివారం నాడు తీర్పు వెల్లడించకుండా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయినా సుప్రీం మాత్రం అందుకు నిరాకరించింది. దాంతో శనివారం నాడే జయలలితను దోషిగా నిర్ధరిస్తూ న్యాయమూర్తి జాన్ మైఖేల్ తీర్పు చెప్పారు. -
జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది
అనుకున్నంతా అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిపోయారు. 18 ఏళ్ల నాటి ఈ కేసులో జయలలితను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు ఈ తీర్పు విన్నవెంటనే అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో వాతావరణం తీవ్ర ఉద్రిక్త భరితంగా మారింది. ఈకేసుకు సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి.. 1996 జూన్‌లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు విచారణ జరపాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు జారీచేసింది జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్‌లో ఛార్జిషీటు దాఖలు చేశారు అక్టోబర్‌లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు 2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు. 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు 2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్‌ను తప్పించింది. తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు. కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు. 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది. తీర్పును వాయిదా వేయాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు అది కుదరదని, 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరపన అగ్రహారంలోని గాంధీభవన్‌లో ప్రత్యేక కోర్టు ఉంది. 1996లో తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుచేశారన్నది ప్రధాన ఆరోపణ 2014 సెప్టెంబర్ 27 వ తేదీన ఆమెకు నాలుగేళ్లు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. షీలా బాలకృష్ణన్‌ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం. -
జయలలితను దోషిగా తేల్చిన కోర్టు
-
తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత
ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు వెలువరింనున్న నేపథ్యంతో ఇటు తమిళనాడు, అటు కర్ణాటక రెండు రాష్ట్రాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హోసూరు ప్రాంతంలో డీఎంకే- అన్నా డీఎంకే కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఇక తీర్పు నేపథ్యంలో డీఎంకే నాయకుడు స్టాలిన్.. తన తండ్రి కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. తీర్పు ఎలా వస్తే ఎలా స్పందించాలన్న అంశంపై ఆయన తండ్రితో చర్చించారు. తమిళనాడులోని అన్ని పార్టీల కార్యాలయాల్లో ఉన్న నేతలంతా తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు దాదాపు లక్ష మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. తీర్పు కోసం తమిళనాడు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. పటిష్ఠమైన బందోబస్తు మధ్య బెంగళూరులోని ఓ జైల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుకు జయలలిత చేరుకున్నారు. -
కేసు ఓడితే.. సీఎం పదవి గోవిందా!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరుకు బయల్దేరారు. ప్రత్యేక కోర్టులో నేడు వెలువడనున్న తీర్పు వినేందుకు ఆమె చెన్నై నుంచి బెంగళూరు వెళ్లారు. జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ కూడా బెంగళూరుకు బయల్దేరారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసుకున్నారంటూ ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నమోదైన కేసు విచారణ సుదీర్ఘంగా ఇన్నాళ్ల పాటు సాగింది. ఈ కేసులో తీర్పును వెలువరించకుండా చూడాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దాంతో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శనివారమే తన తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ ఈ కేసులో తీర్పు జయలలితకు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఆమె తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. అలా జరిగితే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే విషయం కూడా ఇప్పటికే చర్చించుకున్నారు. జయలలిత దృష్టిలో ముగ్గురు ఉన్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం. వారు రాష్ట్ర రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే రిటైరైన షీలాకు పరిపాలనా అనుభవం ఉంది. ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే రిటైరైన తర్వాత కూడా ప్రత్యేక సలహాదారుగా ఆమెను నియమించుకున్నారు. -
సుప్రీంలో జయలలితకు చుక్కెదురు
-
సుప్రీంలో జయలలితకు చుక్కెదురు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు తన తీర్పును శనివారం వెల్లడించకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ జయలలిత దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో శనివారం నాడే జయయలిత కేసులో బెంగళూరు కోర్టు తీర్పు ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లయింది. జయలలితకు తన ఆదాయానికి మించి 66 కోట్ల రూపాయల మేరకు ఆస్తులు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ సుదీర్ఘ కాలం పాటు జరిగింది. ఈ కేసులో శనివారమే తీర్పు వెలువడనుంది. ఈ సందర్భంగా రూ. 1.08 లక్షల మంది పోలీసులతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జయలలితకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే.. తమిళనాడు రాజకీయాల్లో అది భారీ కుదుపే అవుతుంది. ఒక్కసారిగా ఆ రాష్ట్ర రాజకీయాలు గణనీయంగా మారిపోతాయి. -
జయ ఆస్తుల కేసులో రేపే తీర్పు
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే చీఫ్ జయలలితపై ఉన్న రూ. 66 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ట్రయల్ కోర్టు శనివారం తీర్పువెలువరించనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటిగా పేరుగాంచిన అగ్రహారం సమీపంలో తాత్కాలిక న్యాయస్థానాన్ని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంగణంలో న్యాయవాదులు మినహా మరెవరూ ప్రవేశించకుండా చూడాలని పోలీసులు నిర్ణయించారు. జయపై వెలువడుతున్న తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో 1.18 లక్షల మంది పోలీసులను బం దోబస్తుకు వినియోగిస్తున్నారు. శనివారం కనీ సం 20 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు బెంగళూరుకు వచ్చే అవకాశం ఉండటంతో శాం తిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. -
‘అమ్మ ఆస్తుల’ టెన్షన్
చెన్నై, సాక్షి ప్రతినిధి: సీఎం జయలలిత ఎదుర్కొంటున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై ఈనెల 27న బెంగళూరు కోర్టులో తీర్పువెలువడనున్న దృష్ట్యా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రాష్ట్రాలను కలిపే అన్ని రహదారుల్లో గురువారం నుంచే భద్రతను కట్టుదిట్టం చేయడంతోపాటూ ముమ్మర తనిఖీలు ప్రారంభమయ్యూయి. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 1991-96లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టినట్లు బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అరోపిస్తూ ఆ తరువాత (1996) అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వానికి స్వామి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన ఏసీబీ, ఆదాయానికి మించి రూ.66.44 కోట్లను అమ్మ అక్రమంగా ఆర్జించినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో జయతోపాటూ ఆమె దత్తపుత్రుడు సుధాకర్, నెచ్చెలి శశికళ, బంధువు ఇళవరసిలను చేర్చారు. చెన్నైలో కొన్నాళ్లు విచారణ జరిగిన అనంతరం కేసు బెంగళూరులోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. అనేక విచారణల పిదప ఈనెల 20వ తేదీన తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా కోర్టును అగ్రహారం జైలు సమీపంలోకి మార్చాలని బెంగళూరు పోలీస్ కమిషనర్ కోర్టును కోరడంతో తీర్పు ఈనెల 27 వ తేదీకి వాయిదాపడింది. రెండు రాష్ట్రాల్లో టెన్షన్ తీర్పు ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా ఏర్పాట్లపై ఉద్రిక్తత పోలీసు వర్గాల్లోనూ నెలకొంది. కర్ణాటక అదనపు పోలీస్ కమిషనర్ హరిహరన్, తమిళనాడు డీజీపీ రామానుజం పరస్పరం చర్చించుకుంటూ భద్రతా ఏర్పాట్లను ప్రారంభించారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు దారితీసే అన్ని రహదారుల్లో అదనపు చెక్‌పోస్టులు, స్పీడ్ కంట్రోలర్లు వేయడం పూర్తిచేశారు. గురువారం నుంచే అన్ని వాహనాలను తనిఖీలు చేయడం ప్రారంభించారు. తీర్పు వెలువడే రోజున తమిళనాడు నుంచి కనీసం 20 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు బెంగళూరుకు చేరుకునే అవకాశం ఉందని అంచనావేశారు. వీరి వల్ల బెంగళూరులో శాంతిభద్రత సమస్యలు తలెత్తుతాయనే ఆందోళన రెండు రాష్ట్రాల పోలీసుల్లో నెలకొంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే ఒకసారి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటిగా పిలుచుకునే అగ్రహారం సమీపంలో తాత్కాలిక న్యాయస్థానాన్ని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంగణంలో న్యాయవాదులు మినహా మరెవరూ ప్రవేశించకుండా చూడాలని నిర్ణయించారు. జయపై వెలువడుతున్న తీర్పు నేపధ్యంలో రాష్ట్రంలో 1.18 లక్షల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తున్నారు. మంత్రి పూజలు ఇదిలా ఉండగా, ఆస్తుల కేసు నుంచి అమ్మ క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తూ రాష్ట్ర మంత్రి రమణ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. తిరువళ్లూరు సమీపం పుట్లూరులోని ప్రసిద్ధ అంకాళపరమేశ్వరీ ఆలయంలో పూజలు నిర్వహించి వెయ్యిమందికి అన్నదానం చేశారు. -
జయ ఆస్తుల కేసు.. 27న తీర్పు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో ఈనెల 27వ తేదీ కీలకం కానుంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో నడుస్తున్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తుదితీర్పు అదేరోజున వెలువడనుంది. ముఖ్యమంత్రి జయలలిత కొన్నేళ్లుగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కొంటున్నారు. కొంతకాలం ఈ కేసు విచారణ చెన్నైలోనే సాగింది. తమిళనాడులో విచారణ సాగితే జయలలిత ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేయగలరని పేర్కొంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అనుసరించి జయ కేసు బెంగళూరుకు బదిలీ అయింది. బెంగళూరులోని ప్రత్యేక సివిల్ కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. గత నెల 28వ తేదీతో విచారణ ముగియగా ఈనెల 20న తుదితీర్పు చెప్పనున్నట్లు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డీ గుణ ప్రకటించారు. తుది తీర్పు సమయంలో నిందితులంతా తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని తన ఆదేశాల్లో పేర్కొన్నారు. జయ న్యాయవాదులు ఈనెల 15వ తేదీన కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన జయలలిత వాయిదాల సమయంలో ఇప్పటికే 2011 అక్టోబరు 20, 21 తేదీల్లోనూ, నవంబరు 21, 22 తేదీల్లోనూ నేరుగా హాజరయ్యూరని కోర్టుకు తెలిపారు. జెడ్ కేటగిరి భద్రతలో ఉన్న జయలలితకు కర్ణాటక ప్రభుత్వం తగిన బందోబస్తును కల్పించాలని సుప్రీం కోర్టు గతంలోనే ఆదేశించిందని వారు గుర్తుచేశారు. తగిన భద్రతా ఏర్పాట్లు చేసిన తరువాత తీర్పును వెల్లడించాలని కోరారు. బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎమ్ఎన్ రెడ్డి కోర్టుకు ఒక ఉత్తరం సమర్పించారు. జయ భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక కోర్టును పరప్పన అగ్రహార జైలు ప్రాంగణంలోకి మార్చిన తరువాత తీర్పు వెల్లడిస్తే మంచిందని కమిషనర్ సూచించారు. జయ న్యాయవాదుల పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. కోర్టును మరోచోటకు తరలించాలంటే కర్ణాటక హైకోర్టు అనుమతిని తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు తగిన సమయం లేనందున తుదితీర్పును ఈనెల 20 వ తేదీ నుంచి 27 వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జయకు జెడ్ కేటగిరి బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరారు. జయ ఆస్తుల కేసుపై రాష్ట్రంలో పలు ఊహాగానాలు రేగుతుండగా, సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 27న ఎటువంటి తీర్పు వెలువడనుందోనని అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. -
జయలలిత ఆస్తుల కేసులో తీర్పు 27న
బెంగళూర్:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును ఈ నెల 27 వాయిదా వేస్తూ ఇక్కడి ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. వాస్తవానికి ఈ కేసులోని తీర్పును ఈ నెల 20 వ తేదీనే వెలువరించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తీర్పును వెలువరించే ప్రాంతాన్ని మార్చాలని జయలలిత కోర్టును కోరడంతో మరో వారం రోజుల పాటు వాయిదా వేయక తప్పలేదు. ఈ తీర్పుపై ప్రాంతాన్ని మార్చాలని కోరతూ సోమవారం జయలలిత కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో తీర్పును పరపన్నా అగ్రహారా సెంట్రల్ జైల్ ప్రాంతంలో గాంధీ భవన్ వద్ద వెలువరించనున్నట్లు జడ్జి జాన్ మైఖేల్ కున్హా తెలిపారు. అక్కడ జయలలిత భారీ భద్రత ఏర్పాట్లు చేయడానికి చెన్నై పోలీసులు సిద్ధమైయ్యారు. -
ఏసీబీకి చిక్కిన ‘కాలుష్య’ అధికారి
అయిదు జిల్లాల్లో పది చోట్ల సోదాలు రూ.35 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరు కోరుకొండ రమేష్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. అవినీతి సంపాదనలతో ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఏసీబీ ఉన్నతాధికారులు ఉదయమే ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు మొత్తం పది బృందాలుగా ఏర్పడి శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, నెల్లూరు జిల్లాల్లోని రమేశ్ బంధువుల ఇళ్లపైనా పదిచోట్ల తనిఖీలు చేశారు. ఉదయం విశాఖ శ్రీనగర్‌లోని రమేశ్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రమేష్ ఆస్తులు చూసి నివ్వెరపోయారు. 1998లో అసిస్టెంట్ ఇంజినీరుగా విధుల్లో చేరిన ఆయన విశాఖలో మూడు ఖరీదైన ఫ్లాట్లు, శ్రీకాకుళం-పొందూరు మధ్య పదెకరాల భూమి, పది ఇళ్ల స్థలాలు సంపాదించినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా రూ.10 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.10 లక్షల ఎల్ఐసీ పాలసీలు గుర్తించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న ఆయన భార్య శశికళ నివాసంలో సోదాలు చేసి, ఆమె పేరిట మూడు లాకర్లు ఉన్నట్లు తేల్చారు. పాల్వంచలోని రమేశ్ లక్ష్మీపతిరావు ఇంట్లోనూ తనిఖీ చేసి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన రమేష్ ఏడాదిన్నరగా విశాఖ రీజియన్ కాలుష్య నియంత్రణ మండలి విభాగం ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. అధికారాలను దుర్వినియోగం చేసి రమేశ్ భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ డీఎస్పీ నరసింహారావు వెల్లడించారు. మార్కెట్ విలువ ప్రకారం అక్రమ సంపాదన రూ.35 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
గులాబీలో గుబులు!
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: గులాబీ దళంలో సీబీఐ గుబులు నెలకొన్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఇవేం చిక్కులు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి సైతం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు హరీష్‌రావు, అలాగే విజయశాంతిపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని నాంపల్లి సీబీసీ ప్రత్యేక కోర్టు సీబీఐ ఎస్పీని ఆదేశించడంతో మెతుకుసీమలో రాజకీయ కలకలం రేగుతోంది. ఇదే జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు(మాజీ టీఆర్ఎస్ నేత) రఘునందన్‌రావు చేసిన ఆరోపణల ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన బాలాజీ వడేరా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో రాజకీయ విశ్లేషకుల దృష్టి జిల్లా రాజకీయాల మీద పడింది. 2001 తర్వాత కేసీఆర్ ఉద్యమం పేరుతో అక్రమంగా డబ్బు కూడబెట్టారని కోర్టుకు విన్నవించారు. అప్పట్లో టీఆర్ఎస్లో ఉన్న విజయశాంతి ఇంట్లోనే రూ. 100 కోట్ల లావాదేవీలు నడిచాయని, ఇదంతా అక్రమంగా వసూలు చేసిన మొత్తం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి పైముగ్గురు నాయకులు కూడా ఇటీవలే ఎన్నికల కమిషన్‌కు తమ ఆస్తుల అఫిడవిట్లను సమర్పించారు. ఈ ముగ్గురు ఆస్తులు అన్నీ కలిపి కనీసం రూ. 40 కోట్లు కూడా దాటలేదు. కానీ కోర్టు ఏకంగా రూ. 100 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఆదేశించడంతో మిగిలిన ఆస్తులు ఎక్కడ నుంచి బయట పడతాయోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తనకు కారు లేదని చూపించారు. జగదేవ్‌పూర్ మండలం ఎర్రవ ల్లి గ్రామంలో 37 ఎకరాల 70 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్టు కేసీఆర్ చూపించారు. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ 4.5 కోట్లు అని పేర్కొన్నారు. దీనితో పాటు సిద్దిపేట మండలం మిట్టపల్లిలో 2 ఎకరాల భూమి ఉందని దీని మార్కెట్ విలువ రూ. 50 లక్షలు ఉంటుందని చెప్పారు. బంజారాహిల్స్‌లో 584 గజాల స్థలం, కరీంనగర్లో 1,449 గజాల స్థలం ఉందని వీటి మార్కెట్ విలువ రూ. 8.65 కోట్లు అని చెప్పారు. వీటితో పాటు రూ. 7.88 కోట్లు అప్పులు ఉన్నట్లు కేసీఆర్ చూపించారు. ఆయన భార్య పేరిట 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపించారు. విజయశాంతి ఆస్తులు: ఇక విజయశాంతి , ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరిట రూ. 29.87 కోట్లు స్థిరాస్తి ఉన్నట్లు చూపించారు. రూ 70.61 లక్షల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అప్పులు ఏమి లేవన్నారు. టయోటా(రూ.5.89 లక్షలు) వాహనం ఉన్నట్లు చూపించారు. హరీష్ ఆస్తుల వివరాలు: హరీష్‌రావు తన పేరిట రూ. 1.35 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తి ఉందని, తన భార్య శ్రీనిత పేరిట రూ. 1.60 కోట్ల చరాస్తులు ఉన్నాయని చూపించారు. వాటితో పాటు తన భార్యకు రూ 1.21 కోట్ల అప్పుందని పేర్కొన్నారు. 16 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని చూపించారు. -
మాయావతి ఆస్తులపై విచారణ చాలించిన సీబీఐ
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ మొదలుపెట్టిన కేసు విచారణను సీబీఐ చాలించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇప్పటికే ఉత్తర్వులిచ్చినందున, ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగించడం సరికాదని న్యాయసలహా రావడంతో కేసు మూసేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి గత సంవత్సరమే మాయావతి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ సీబీఐ దాఖలుచేసిన ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు కొట్టేసినా, తర్వాత ఓ ప్రైవేటు వ్యక్తి కూడా ఈ కేసులో కలగజేసుకోవడంతో మళ్లీ ఇది మొదటికొచ్చింది. కానీ, ఇటీవల.. ఆగస్టు 8న సుప్రీంకోర్టు ఆ జోక్యాన్ని కూడా కొట్టేసింది. దీంతో మాయావతిపై కేసు మూసేయడానికి మార్గం సుగమమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమలేష్ వర్మ అనే వ్యక్తి.. మాయావతి అక్రమాస్తుల కేసు విషయమై సుప్రీంలో ఓ పిటిషన్ దాఖలు చేయగా, ఆగస్టు 8న సుప్రీం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులు తాజ్ కారిడార్ కేసుకు మాత్రమే సంబంధించినవని, వాటిని సరిగా అర్థం చేసుకోకుండా సీబీఐ కేసు విషయంలో ముందుకెళ్లిందని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యానించింది. అయితే.. మాయావతిపై వేరే కేసు దర్యాప్తు చేయడానికి సీబీఐకి ఉన్న అధికారాలను మాత్రం తాము ప్రశ్నించబోమని సుప్రీం తన తీర్పులో తెలిపింది. తొమ్మిదేళ్లుగా నలుగుతున్న అక్రమాస్తుల కేసును సుప్రీం గత సంవత్సరం జూలై 6న కొట్టేసింది. తమనుంచి ఎలాంటి సూచనలు లేకపోయినా ఎఫ్ఐఆర్ దాఖలుచేయడం ద్వారా సీబీఐ తన పరిధులను అతిక్రమించిందంటూ తలంటింది కూడా!! -
బెయిల్ కోసం విజయసాయిరెడ్డి దరఖాస్తు
ఆస్తుల కేసులో రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి.. బెయిల్ కోసం సీబీఐ కోర్టులో దరఖాస్తు చేశారు. ఇదే కేసులో వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్‌పై విడుదలైన సరిగ్గా ఒక రోజు తర్వాత ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. చంచల్‌గూడ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన.. తన న్యాయవాది ద్వారా బెయిల్ దరఖాస్తు పంపారు. జగన్ సంస్థలకు ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన ఆయన.. జగన్‌కు బెయిల్ రావడంతో దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. విజయ సాయి రెడ్డిపై దాఖలుచేసిన ఏ కేసులోనూ విచారణ ప్రారంభం కాలేదని, అది మరింత ఆలస్యమయ్యేలా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రయోజనాల దృష్ట్యా బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. సుప్రీంకోర్టు సీబీఐకి విచారణ కోసం ఇచ్చిన గడువు కూడా ఈనెల 8వ తేదీతోనే ముగిసిన విషయాన్ని ఆయన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి కూడా నిన్నే బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. -
ములాయంపై కేసు మూసేసిన సీబీఐ
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ముప్పుతిప్పలుపడుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌కు పెద్ద ఊరట. ఆరేళ్లుగా సాగుతున్న ఆ కేసును సీబీఐ శుక్రవారం మూసేసింది. తగిన ఆధారాలు లభించనందునే ప్రాథమిక విచారణ(పీఈ)ను మూసేస్తున్నట్లు పేర్కొంది. పెద్ద మొత్తంలో అడ్వాన్సులను, ఖర్చులను ఆస్తులుగా భావించడం వల్ల డబుల్ అకౌంటింగ్ జరగడం, బహుమతులను కూడా లెక్కలోకి తీసుకోవడం, రుణాలనూ ఆస్తులుగా లెక్కించడం వల్ల.. ఆదాయానికి మించి ఆస్తులున్నట్లుగా పొరబడినట్లు వివరించింది.