తరగని అభిమానం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడినప్పటికీ ఆమె పట్ల అభిమానం చెక్కు చెదరలేదు. అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు జయ అభిమానులు మంగళవారం కూడా పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే పోలీసులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. పలు సందర్భాల్లో అభిమానులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆందోళనలు నిర్వహించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంతో పాటు మరో నలుగురు మంత్రులు జయలలితతో సమావేశం కావడానికి వచ్చారు. మరో వైపు రాష్ట్ర హైకోర్టులో జయ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో కోర్టు ఎదుట గుమికూడారు. కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
కిక్కిరిసిన కోర్టు హాలు
హైకోర్టులోని ఎనిమిదో నంబరు హాలు మంగళవారం జయ అభిమానులతో కిక్కిరిసిపోయింది. జయతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిల బెయిల్ పిటిషన్లపై ఈ హాలులో హైకోర్టు సెలవుల ధర్మాసనం న్యాయమూర్తి రత్న కళ విచారణ చేపట్టారు. వీటన్నిటినీ ఒకే సారి విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి, ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఇంకా నియమించనందున విచారణను వాయిదా వేశారు.
అన్ని పిటిషన్లపై ఏక కాలంలో వాదనలు వింటానని ప్రకటించారు. కాగా కోర్టు హాలు కిక్కిరిసి పోవడంతో జయ న్యాయవాదులు లోనికి వెళ్లడానికి నానా అవస్థలు పడాల్సి వ చ్చింది. జయకు బెయిల్ లభించవచ్చనే అంచనాతో వచ్చిన అభిమానులు విచారణ వాయి దా పడడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జేత్మలానీ వాదిస్తున్నారు. ఆయనతో పాటు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది లతాృకష్ణమూర్తి కూడా కోర్టుకు హాజరయ్యారు.
లాడ్జీలన్నీ ఫుల్
జయ అభిమానులతో నగరంలోని చిన్నా చితకా లాడ్జీలన్నీ నిండిపోయాయి. ముఖ్యంగా బెంగళూరు సరిహద్దులోనిృకష్ణగిరితో పాటు సేలం, కోయంబత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. జైలులో అమ్మను దర్శించుకోవాలన్న వారి కోరిక ఫలించక పోయినా, వేచి చూస్తున్నారు. ఒక వేళ అమ్మకు బెయిల్ లభిస్తే జయ జయ ధ్వానాలతో స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు.
వాతావరణానికి అలవాటు పడుతున్న జయ
జైలు వాతావరణానికి జయలలిత క్రమేపీ అలవాటు పడుతున్నారు. మంగళవారం యథావిధిగా ఉదయం 5.30 గంటలకు నిద్ర లేచి మార్నింగ్‌కు వెళ్లారు. అనంతరం దిన పత్రికలు చదివి అల్పాహారం సేవించారు. అంతకు ముందు వైద్యులు ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తమిళనాడు మంత్రులు ఒలర్మతి, కుహులేంద్ర, మోహన్, సెంథిల్ బాలాజీ,ృకష్ణమూర్తి ్రృభతులు జైలు వద్దకు వెళ్లినప్పటికీ అమ్మ దర్శన భాగ్యం కలుగలేదు.