ఎన్ని పథకాలు పెట్టినా.. 'అమ్మ' ఇంటికే!
అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, తాజాగా అమ్మ సిమెంటు... ఇలా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కూడా 'అమ్మ' చివరకు ఇంటిదారి పట్టక తప్పట్లేదు. ఎప్పుడో 17 ఏళ్ల క్రితమే 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారంటూ నాటి జనతాపార్టీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కేసు పెట్టడం.. దాని విచారణ ఇన్నేళ్ల పాటు సాగడం, చివరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికూన్ ఆమెను దోషిగా నిర్ధారించడంతో ఇక ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ప్రజాకర్షక పథకాలను ప్రకటించడం ద్వారానే జయలలిత ఎక్కువ ఆదరణ పొంది.. ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించారు. విద్యార్థులకు ల్యాప్టాప్లు, బాలింతలకు ఉయ్యాలలు.. ఇలా అనేక వరాలు కురిపించారు. అయినా కూడా ఇప్పుడు అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో పదవి కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది.