జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
బెంగళూరు : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానా విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. మరోవైపు జయలలితకు శిక్ష ఖరారైన నేపధ్యంలో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధినేత్రికి శిక్ష పడటాన్ని జీర్ణించుకోలేని అన్నాడీఎంకె కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. దీంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి. జయలలిత ఆస్తుల కేసులో గత 18 ఏళ్ల నుంచి మొత్తం 358 మందిని కోర్టు విచారించింది.