tamilnadu cm
-
ముఖ్యమంత్రి సలహానే కీలకం
ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. భారత గణతంత్రంలోని గవర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదనేది స్పష్టం. ముఖ్యమంత్రి సలహా లేకుండా సిట్టింగ్ మంత్రిని తొలగించడం ద్వారా తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి రాజ్యాంగపరంగా అరు దైన సాహసోపేత ప్రయోగం చేశారు. వాస్తవానికి, ఆదేశం జారీ చేసిన కొన్ని గంటల్లో, ఆయన దానిని నిలిపివేశారు. అయినా ఈ చర్య రాజకీయ వర్గాల్లో కలకలం రేపడంతో పాటు రాజ్యాంగవేత్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవాలంటూ కేంద్ర హోంశాఖ సూచించిందని అనంతరం గవర్నర్ వెల్లడించారు. దేశంలోని అత్యున్నత న్యాయ అధికారిని సంప్రదించకుండా, ముఖ్యమంత్రి తప్పనిసరి సలహా లేకుండా, అసెంబ్లీలో పూర్తి మెజా రిటీ ఉన్న ప్రభుత్వ మంత్రిని తొలగించాలనే అపూర్వమైన ఉత్తర్వు జారీ చేయడం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా అనేది కీలకమైన ప్రశ్న. ఆర్టికల్ 164 ప్రకారం, సీఎం సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారు. సీఎం సిఫార్సు చేసిన వ్యక్తిని మాత్రమే గవర్నర్ నియమించగలరని ఈ నిబంధన స్పష్టం చేస్తోంది. తన మంత్రులను ఎంపిక చేయడం లేదా తొలగించడం పూర్తిగా సీఎం ప్రత్యేకాధికారం. ఒక మంత్రిని వద్దనుకుంటే, తదనుగుణంగా గవర్నర్‌కు సలహా ఇస్తాడు. పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరించే అన్ని దేశాల్లోనూ ఇదే వాడుకగా ఉంటోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, ‘గవర్నర్ సంతుష్టి (ప్లెజర్)తో ఉన్నంతకాలం మంత్రులు తమ బాధ్యతలు నిర్వహిస్తారు’ అని చెబుతోంది. ఇది ఒక మంత్రి మనుగడ పూర్తిగా గవర్నర్ ఇష్టా నిష్టాలపై ఆధారపడి ఉందనీ, ఏ మంత్రి పట్ల అయినా గవర్నర్ తన సంతుష్టిని ఉపసంహరించుకోవచ్చనీ అభిప్రాయాన్ని కలిగించవచ్చు. ‘గవర్నర్ సంతుష్టి’ అనేది ఇక్కడ కీలకమైన అంశం. దాని నిజమైన భావాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51కి వెళ్లాలి. సెక్షన్ 51లోని సబ్‌సెక్షన్ (1) ప్రకారం, గవర్నర్ తన విచక్షణ మేరకే మంత్రులను పదవుల్లోకి ఎన్ను కోవాలి. అదేవిధంగా సెక్షన్ 51లోని సబ్–సెక్షన్ (5) మంత్రుల ఎంపికకు, తొలగింపునకు సంబంధించి గవర్నర్ తన విధిని విచక్ష ణతో అమలు చేయాలని చెబుతోంది. ఆ విధంగా, భారత ప్రభుత్వ చట్టం, 1935లోని సెక్షన్ 51, మంత్రులను ఎన్నుకోవడానికీ, వారిని తొలగించడానికీ గవర్నర్‌కు విచక్షణాధికారాలను అందిస్తోంది. సంతుష్ట సిద్ధాంతం ఇక్కడ పూర్తిగా పనిచేస్తోంది. భారత ప్రభుత్వ చట్టంలోని నిబంధనలను మన రాజ్యాంగం పెద్ద ఎత్తున పునరుత్పాదన చేసిందనేది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163, 164లో సెక్షన్ 51 గణనీయంగా పునరుత్పాదన అయింది. అటువంటి నిబంధనలో సంతుష్ట సిద్ధాంతం ఒకటి. కానీ రాజ్యాంగ నిర్మాతలు దీనికి సంబంధించి కీలకమైన మార్పు చేశారు. ఆర్టికల్ 164ను రూపొందిస్తున్నప్పుడు, వారు ఒక మంత్రిని ఎంపికచేసే, ఏకపక్షంగా తొలగించే వలసకాల గవర్నర్ అధికారాలను తొలగించారు. అంటే భారత గణతంత్రంలోని గవ ర్నర్లకు, బ్రిటిష్ కాలంనాటి గవర్నర్ల లాగా మంత్రులను ఎంపిక చేసే అధికారం లేదు. పైగా ముఖ్యమంత్రి సలహా లేకుండా మంత్రిని తొల గించే విచక్షణాధికారం గవర్నర్‌కు లేనప్పుడు సంతుష్ట సిద్ధాంతం దాని బలాన్ని కోల్పోతుంది. పైగా రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి అయిన ముఖ్యమంత్రి నుండి సలహా వచ్చినప్పుడు దాన్ని నిర్వర్తించడం లాంఛనప్రాయంగా మారుతుంది. కాబట్టి, ముఖ్యమంత్రి సలహా లేకుండా ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టంగా నిర్ధారించవచ్చు. గవర్నర్ తీసుకునే అలాంటి చర్య రాజ్యాంగ వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో కూడా మనం తీవ్రంగా పరిగణించాలి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన గవర్నర్, మంత్రులను ఇష్టానుసారంగా తొలగించడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదం ఉంది. స్వతంత్రంగా అమలు చేయగల కార్యనిర్వాహక అధికారం గవర్నర్‌కు లేదని గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 153 ప్రకారం, రాజ్యాంగంలో పేర్కొన్న విచక్షణ విధులు మినహా, అతని అన్ని విధులు మంత్రిమండలి సహాయం, సలహాపై మాత్రమే నిర్వహించబడతాయి. 1974 నాటి శంశేర్ సింగ్ కేసులో, ఎన్ను కోబడిన ప్రభుత్వానికి సంబంధించినంతవరకు గవర్నర్ అధికారాలకు సంబంధించిన చట్టాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా నిర్దేశించింది. తదుపరి నిర్ణయాలన్నీ దానిని పునరుద్ఘాటించాయి. కాబట్టి, మన రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ స్థానంపై చట్టం స్థిరపడింది. అలాగే, మంత్రిని నియమించడం లేదా తొలగించడంలో గవర్నర్‌కు విచక్షణాధికారం లేదని ఆర్టికల్ 164 స్పష్టం చేసింది. రెండూ సీఎం పరిధిలోనే ఉన్నాయి. గవర్నర్‌పై కాకుండా సీఎం విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మంత్రులు క్యాబినెట్లో ఉండగలరు. గవర్నర్ అత్యున్నత రాజ్యాంగ కార్యనిర్వాహకుడు. ఆయన ఆదర్శప్రాయమైన నిష్పాక్షికతతో వ్యవహరించాలి. క్రియాశీల రాజకీయ నాయకులను గవర్నర్లుగా నియమించకూడదని రాజ్యాంగ అసెంబ్లీలో కొంతమంది సభ్యుల నుండి డిమాండ్ వచ్చింది. అటువంటి సూచనలు ఆ సమయంలో తీసుకోనప్పటికీ, రాజకీయ నాయకులు లేదా మాజీ అధికారులు రాజ్‌భవన్ లో పని చేసిన సమయంలో ప్రశంసనీయంగా పనిచేశారు. ఈ మహోన్నతమైన, ముఖ్యమైన రాజ్యాంగ పదవిని స్వీకరించే స్త్రీ పురుషులకు ఉంటున్న అనుకూలత, అర్హతల గురించి భారతీయ సమాజం చర్చను ప్రారంభించాల్సిన సమయం ఇది. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని రాష్ట్రాల్లో రాజ కీయాల కేంద్రం మెల్లగా రాజ్ భవన్ వైపు మొగ్గుతోంది. ఇది కచ్చితంగా సానుకూలమైన ఆలోచన మాత్రం కాదు. పి.డి.టి. ఆచారి వ్యాసకర్త లోక్‌సభ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తా!
సాక్షి , చెన్నై: ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని తిరుచ్చిరాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే...శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి 100కు ఫోన్‌చేసి సీఎం పళనిస్వామిని కిడ్నాప్ చేయబోతున్నట్లు 100 నంబర్‌కు ఫోన్ చేశాడు. చెన్నైలోని కంట్రోలు రూంకు వెళ్లిన ఆ ఫోన్ కాల్ వెళ్లగ...అక్కడి అధికారులు వెంటనే చెన్నై ఎగ్మూరు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. తిరుచ్చిరాపల్లి నుంచి ఈ ఫోన్ వచ్చినట్లు గుర్తించి వెంటనే ఆగంతకుడిని పట్టుకోవాల్సిందిగా ఆ జిల్లా పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కేసులో తిరుచ్చిరాపల్లి శాస్త్రి రోడ్డులోని ఒక హోటల్లో పరోటా మాస్టర్‌గా పనిచేసే రహ్మతుల్లా (45) అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో తెలియకుండా ఫోన్ చేశానని రహ్మతుల్లా అంగీకరించాడు. శనివారం ఉదయం అతడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి తిరుచ్చిరాపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. -
మోదీతో తమిళనాడు సీఎం పళనిస్వామి భేటీ
-
ప్రధాని మోదీకి పన్నీరు సెల్వం లేఖ
చెన్నై: తమిళనాట ప్రసిద్ధి చెందిన జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రజలు సంప్రదాయ క్రీడాగా భావించే జల్లికట్టును సంక్రాంతి పండగ సందర్భంగా నిర్వహించుకునేందుకు చట్టపరమైన ఇబ్బందులను తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా వారం రోజులు పాటు నిర్వహించే జల్లికట్టుకు చాలా విశిష్ఠత ఉందని పన్నీరు సెల్వం తెలిపారు. చట్ట పరమైన ఇబ్బందులను తొలగించాలని, ఇందుకు తమ వంతు కృషి చేయాలని మోదీని కోరారు. గతంలో జల్లికట్టు ప్రదర్శనకు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. 2014లో సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధించిన విషయం అందరికి తెలిసిందే. తమిళనాడులో అధికార అన్నా డీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా అన్ని పార్టీలు జల్లికట్టు పై ఆంక్షలు ఎత్తివేయాలని కోరడం గమనార్హం. -
తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్
చెన్నై : జయలలిత మరణం, పన్నీర్ సెల్వం సీఎం గద్దెనెక్కడం, శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడం తదితర పరిణామాల నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బలనిరూపణకు సిద్ధపడాలని ప్రతిపక్ష పార్టీ డీఎంకే డిమాండ్ చేసింది. వెంటనే శాసనసభను సమావేశపరచాలని సూచనలు చేసింది. కాగా ముఖ్యమంత్రి పీఠం మీద జయలలిత నిచ్చెలి శశికళ నటరాజన్‌ను కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం నుంచి పన్నీర్ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో శశికళను సీఎం చేయాలన్న డిమాండ్ రోజురోజుకు ఊపందుకుంటోంది. తాజాగా ఐదుగురు మంత్రులు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇక జయలలిత మరణం తర్వాత ఆమె స్థానంలో అన్నాడీఎంకే పగ్గాలను శశికళ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా చిన్నమ్మ పదవిని చేపట్టడంతో.. ఇదే అదనుగా ఆమెకే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా కట్టబెట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ముఖ్యమంత్రి బలనిరూపణకు సిద్ధం కావాలని డిమాండ్ చేయటం తమిళ రాజకీయాలు ఏ క్షణంలో ఏవిధంగా మలుపు తిరుగుతాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేంద్రం మద్దతు తనకే ఉందని బలంగా నమ్ముతున్న పన్నీరు సెల్వం రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తన సీఎం సీటును కాపాడుకోవడానికి లోలోపల ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆయన ప్రధాని మోదీనికి కూడా కలిశారు. రాష్ట్రానికి వరద సాయం అందించాలంటూ, అలాగే జయలలితకు భారతరత్న ఇవ్వాలంటూ పన్నీరు సెల్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
పార్టీ పగ్గాలు శశికళకు దక్కేనా?
-
నేడు అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం
► పార్టీ పగ్గాలు శశికళకు దక్కేనా? ► వ్యతిరేకీయుల పంతమే నెగ్గేనా ► సీఎం కూడా శశికళే అంటున్న మంత్రి సెల్లూరు రాజా సాక్షి ప్రతినిధి, చెన్నై: నేడు గురువారం రాష్ట్రమంతటా ఉత్కంఠ. దేశ మంతటా ఆసక్తి. అందరిచూపులూ అన్నాడీఎంకే వైపు. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక జరిగేనా లేదా అనే చర్చ నేపథ్యంలో చెన్నైలో గురువారం జరుగుతున్న పార్టీ సర్వ సభ్య సమావేశమే ఈ ప్రత్యేక పరిస్థితులకు కారణం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవులు జయలలిత మరణంతో ఖాళీ అయ్యాయి. అధికారంలో ఉండడంతో వెంటనే వాటిని భర్తీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 5వ తేదీన జయ మరణించిన అదే రోజు అర్ధరాత్రి సీఎంగా పన్నీర్‌సెల్వం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఒక పదవి భర్తీ అయింది. ప్రధాన కార్యదర్శి పదవిపై కొద్ది రోజులు మల్లగుల్లాలు పడ్డారు. ఆ తరువాత అన్నాడీఎంకేలోని అగ్రనేతలంతా శశికళ వైపే మొగ్గుచూపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సమావేశాలను నిర్వహించి తీర్మానాలు చేయించారు. అమ్మ సమాధి సందర్శన పేరుతో చెన్నైకి రప్పించి తీర్మానాల ప్రతులను శశికళకు అందించారు. ఫ్లెక్సీలు కట్టించి, వార్తా పత్రికల్లో ఫుల్‌పేజీ ప్రకటనలు గుప్పించి శశికళ పట్ల తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఇటీవల మరికొంత ముందడుగు వేసి ముఖ్యమంత్రిగా కూడా చూడాలని ముచ్చటపడుతున్నారు. అయితే రెండింటికీ ఆమె అర్హురాలు కారంటూ ద్వితీయ, తృతీయ శ్రేణులతోపాటు పార్టీ కేడర్ నిరసన గళం విప్పారు. పార్టీ నియమావళి ప్రకారం సభ్యురాలిగా ఐదేళ్ల సీనియారిటీ లేని శశికళ ఎంపిక చెల్లదని వాదిస్తున్నారు. సవరణలు చేసి ఎన్నుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. పార్టీ సమావేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొనకుండా శశికళ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సర్వ సభ్య సమావేశానికి వచ్చేవారు విధిగా ఆహ్వాన పత్రాలు తీసుకురావలనే షరతు విధించడం తోపాటు, వ్యతిరేకీయులకు ఆహ్వానాలు పంపకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి తాను పోటీచేస్తానని బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో బుధవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్‌పై అన్నాడీఎంకే శ్రేణులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. శశికళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వల్లనే దాడి చేసినట్లు వారు చెబుతున్నారు. మొత్తం మీద వాడివేడి వాతావరణంలో గురువారం పార్టీ సర్వ సభ్య సమావేశం జరుగనుంది. సీఎం కూడా శశికళనే: మంత్రి సెల్లూరు రాజా గురువారం నాటి సర్వసభ్య సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఖాయమని మంత్రి సెల్లూరు రాజా బుధవారం ప్రకటించారు. అంతేగాక సంక్రాంతి పండుగ అనంతరం ముఖ్యమంత్రిగా కూడా శశికళను ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. పార్టీ అధినేత్రిగా జయలలిత అనేక సవాళ్లను ఎదుర్కొన్నపుడు శశికళే అండగా నిలిచారని ఆయన చెప్పారు. గతంలో వలే ప్రస్తుతం కూడా పార్టీలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్న తరుణంలో ప్రధాన కార్యదర్శి, సీఎంగా శశికళనే సమర్థురాలని ఆయన కితాబు ఇచ్చారు. శశికళ కోసం సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు పన్నీర్‌సెల్వం కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రజాభిమానికే పట్టం: సీనియర్ సినీనటి లత ప్రజాభిమానం కలిగిన వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని సీనియర్ సినీనటి లత బుధవారం విడుదల చేసిన ప్రకటనలో నర్మగర్భమైన వ్యాఖ్యానాలు చేశారు. తన గురువు, అభిమాని విప్లవనాయకుడు ఎంజీ రామచంద్రన్ స్థాపించిన పార్టీలో గందరగోళ పరిస్థితుల నెలకొనడం మంచిది కాదని అన్నారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే ప్రభుత్వానికి కూడా చేటుతెస్తాయని హెచ్చరించారు. ఎంజీఆర్, జయలలితలా ప్రజాభిమానం కలిగిన నేతను ఎన్నుకోవాలని, ప్రజల తీర్పే పరమేశ్వరుని తీర్పుగా ఎన్నిక ప్రక్రియ సాగాలని ఆమె సూచించారు. అగ్రనేత నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ కోరుకునే వ్యక్తే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలని పేర్కొనడం ద్వారా శశికళ ఎంపికను లత పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేగాక జయవలెనే తాను కూడా ఎంజీఆర్ శిష్యురాలినేనని అన్నాడీఎంకేకు గుర్తుచేయడం గమనార్హం. -
ప్రధాని మోదీతో భేటీకానున్న తమిళనాడు సీఎం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సోమవారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశంకానున్నారు. జయలలితకు భారతరత్న అవార్డు ఇవ్వాలని పన్నీరు సెల్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఆమెకు దేశ అత్యున్నత పౌరపురస్కారం ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేయాలని ఇటీవల తమిళనాడు కేబినెట్ తీర్మానించిన సంగతి తెలిసిందే. అలాగే పార్లమెంట్లో జయ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మోదీని తమిళనాడు సీఎం కోరనున్నారు. ఇటీవల తుఫాను కారణంగా రాష్ట్రానికి కలిగిన నష్టంపై సాయం చేయాల్సిందిగా విన్నవించనున్నారు. జయలలిత మరణించిన రోజు రాత్రి పన్నీరు సెల్వం సీఎంగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చెన్నైకు వెళ్లి జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన శశికళను, సెల్వంను ఓదార్చారు. ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ప్రధాని వారికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. -
బతికే అవకాశం ఫిఫ్టీ..ఫిఫ్టీ
-
మరో అద్భుతం జరగాలి
-
మరో అద్భుతం జరగాలి
న్యూఢిల్లీ: మరో అద్భుతం జరిగి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘అద్భుతమైన రీతిలో జయలలిత కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఈసీఎంవో సాయంతో ఉన్నారు. ప్రఖ్యాత వైద్య నిపుణులు చికిత్స చేస్తున్నారు. మరో అద్భుతం జరుగుతుందో లేదో మనకు తెలియదు’ అని స్వామి అన్నారు. జయలలిత చాలా తెలివివంతురాలని, పుస్తకాలు బాగా చదువుతారని, అద్భుతమైన మేథోసంపత్తు ఉందని పేర్కొన్నారు. -
అపోలోలో అమ్మ; 74 రోజుల్లో ఏం జరిగిందంటే..
-
బతికే అవకాశం ఫిఫ్టీ...ఫిఫ్టీ
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం సాయంత్రం తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమెకు ‘ఈసీఎంవో’ ఏర్పాటు చేశామని చెన్నైలోని ఆపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీఎంవో అంటే ఎక్స్ట్రాకార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజెనేషన్. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేక పోయినప్పుడు ఈ యాంత్రిక వ్యవస్థ ద్వారా వాటి విధులను నిర్వహింపజేస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఈ యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రోగి బతికే అవకాశాలు ఫిఫ్టీ, ఫిఫ్టీ మాత్రమే ఉంటాయని ప్రముఖ హృద్రోగ నిపుణులు నరేశ్ ట్రెహాన్ తెలిపారు. ఈ ఈసీఎంవో వ్యవస్థపై రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు కూడా జీవించే అవకాశం ఉంటుంది. ఏ రకంగాను వైద్యానికి రోగి శరీరం స్పందించకపోయిన పరిస్థితుల్లో చివరి అవకాశంగా మాత్రమే ఈ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తారు. శరీర రక్తనాళాల నుంచి రక్తాన్ని గ్రహించే ఈ పరికరం, ఆ రక్తాన్ని తిరిగి గుండే, ఊపిరితిత్తుల ద్వారా శరీరం అంతటికి ప్రవహించేలా చేస్తోంది. ఈ ప్రక్రియలో రక్త కణాలకు అవసరమైన ఆక్సిజన్ కూడా అందిస్తుంది. సాధారణంగా ఈ ఈసీఎంఓను ప్రముఖలకు మాత్రమే ఏర్పాటు చేస్తుంటారు. -
అమ్మ ఆరోగ్యంపై కరుణ, స్టాలిన్ ఏమన్నారంటే..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని డీఎంకే చీఫ్ కరుణానిధి, ఆయన కుమారుడు స్టాలిన్ ఆకాంక్షించారు. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి.. జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. జయలలిత కోలుకోవడానికి మెరుగైన చికిత్స అందివ్వాలని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ప్రతిపక్ష నేత స్టాలిన్ ట్వీట్ చేశారు. ఆదివారం జయలలితకు గుండె సంబంధిత సమస్య రావడంతో ఆమె ఆరోగ్యం విషమించింది. ఈ రోజు ఉదయం ఆమెకు సర్జరీ చేశారు. అయినా పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టు అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు. -
జయలలిత త్వరగా కోలుకోవాలి
-
అపోలోలో అమ్మ; 74 రోజుల్లో ఏం జరిగిందంటే..
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గత 74 రోజులుగా ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన మొదట్లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెప్పడంతో తమిళనాడు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలో డిశ్చార్జి అవుతారని వైద్యులు, అన్నా డీఎంకే నాయకులు చెప్పడంతో ప్రజలు సంతోషించారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు ఇలాంటి ప్రకటనే చేశారు. దీంతో అమ్మ త్వరలో ఇంటికి వస్తారని ప్రజలు భావించారు. అయితే కొన్ని గంటల తర్వాత జయలలితకు గుండె సంబంధిత సమస్య రావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారిందని తెలియడంతో తమిళనాట విషాదం నెలకొంది. జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరి 74 రోజులు అయ్యింది. నాటి నుంచి ఈ రోజు వరకు కీలక పరిణామాలు.. -
అమ్మ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఓ ప్రకటన చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, అయితే ఐసీయూ సేవలు అవసరమని ఆయన ప్రకటించారు. ‘జయలలిత ఆరోగ్య పరిస్థితిపై చెన్నైలోని అపోలో ఆస్పత్రి వర్గాలతో, తమిళనాడు ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వైద్యుల బృందాన్ని చెన్నైకు పంపాం. జయలలిత ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాం. ఆదివారం ఆమెకు గుండె సంబంధిత సమస్య ఏర్పడటంతో ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఐసీయూ సేవలు అవసరం. జయలలిత చికిత్స కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎయిమ్స్ వైద్యులు చెన్నైకు వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. ఆ తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్నది నిర్ణయిస్తాం’ అని జేపీ నడ్డా చెప్పారు. -
తమిళనాడులో భారీ బందోబస్తు
-
తమిళనాడులో భారీ బందోబస్తు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు సెలవులు రద్దు చేస్తున్నట్టు తమిళనాడు డీజీపీ ప్రకటించారు. 11 కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు, హైవేలపై భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు తమిళనాడు డీజీపీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించాయి. తమిళనాడులో ఈ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వెళ్లే బస్సులను రద్దు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల వద్ద భద్రతను పెంచారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. చుట్టుపక్కల షాపులను ఖాలీ చేయించారు. ఆస్పత్రి వద్ద భారీగా భద్రత బలగాలను మోహరించారు. అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. తమిళనాడులో 144 సెక్షన్ విధించారు. తమిళనాడు లోని అన్నీ పెట్రోలు బంకులను మూసేయాలని మౌఖికంగా అధికారులు ఆదేశించారు. అలాగే ఎక్కడికక్కడ ప్రభుత్వ బస్సులను ఆపేశారు. ఒక్క అపోలో ఆస్పత్రి వద్దనే 10 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. సెలవుల్లో ఉన్న అన్ని స్థాయిల్లోని పోలీసుల సెలవులు రద్దు చేశారు. వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేశారు. టీవీ ఛానెల్, దినపత్రికల ఎడిటర్లతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కానీ డీజీపీ కానీ వారితో ప్రత్యేకంగా మాట్లాడుతారు. డాక్టర్లు అధికారికంగా ప్రకటించే అంశాలపై వార్తలు ప్రసారం, ప్రచురణ చేయాలే కానీ ప్రచారాలను పూర్తిగా విస్మరించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
జయలలిత త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత త్వరగా కోలుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పురచ్చితలైవి జే జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రికి తమిళనాడు మంత్రులు వెళ్లి సమీక్షిస్తున్నారు. Praying for the speedy recovery of Puratchi Talaivi J. Jayalalitha. — YS Jagan Mohan Reddy (@ysjagan) 5 December 2016 -
లేచి నిలబడిన జయలలిత
⇒ కోలుకుంటున్న తమిళనాడు సీఎం.. అభిమానుల్లో ఆనందం సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారు. మంగళవారం ఆమె లేచి కూర్చున్నట్టు, నిలబడ్డట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఫిజియోథెరపీ నిపుణులు సీమా, జూడీ ఇచ్చిన సూచనలు, శిక్షణకు ఆమె తగురీతిలో స్పందిస్తున్నట్టు సమాచారం. జయలలిత 48 రోజులుగా అపోలోలో అందిస్తున్న చికిత్సతో రోజురోజుకూ ఆమె ఆరోగ్యం మెరుగుపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, పోయస్ గార్డెన్ నుంచి ఆమెకు భోజనం అందిస్తున్నారు. అమ్మ స్వయంగా లేచి కూర్చున్నట్టు సమాచారం అందడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఆదివారంలోపు ఆమెను జనరల్ వార్డుకు మార్చేందుకు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. ఆ గదిలో వాకింగ్, చిన్న పాటి వ్యాయామం చేసేందుకు తగ్గట్టు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘అమ్మ’ డిశ్చార్జికి సన్నాహాలు
స్వయంగా ఆహారం తీసుకుంటున్న జయలలిత సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత దాదాపుగా కోలుకున్న నేపథ్యంలో అపోలో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జయలలిత అనారోగ్యానికి గురై గత నెల 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దేశ, విదేశీ వైద్యులు అందించిన చికిత్సలతో ఆమె పూర్తిగా కోలుకుని, స్వయంగా ఆహారం తీసుకుంటున్నారు. చికిత్స చేస్తున్న వైద్యులతో సంభాషిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ మంగళవారం కూడా సీఎంకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీపావళి పండుగలోగా అమ్మ ఇంటికి చేరుకోవాలని అన్నాడీఎంకే శ్రేణులు ఆశిస్తున్న తరుణంలో జయలలిత డిశ్చార్జ్ పై ఈనెల 27లోగా అపోలో ఆస్పత్రి నుంచి ఒక ప్రకటన విడుదల అవుతుందని సమాచారం. కాగాజయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని కోరుతూ తిరువణ్ణామలైలో అన్నాడీఎంకే కార్యకర్తలు నిర్వహించిన పాలబిందెల ఊరేగింపులో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో 16 మంది సొమ్మసిల్లారు. -
మరికొంత కాలం ఆసుపత్రిలోనే జయ
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. అయితే ఆమె పూర్తిగా కోలుకునేందుకు మరి కొంత కాలం ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు శుక్రవారం వెల్లడించారు. గత పదిహేను రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ ఆరోగ్యంపై అపోలో ఆసుపత్రి వర్గాలు గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. లండన్ నుంచి వచ్చిన వైద్యులతోపాటు ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం జయకు చికిత్స అందిస్తున్న విషయం విదితమే. జయలలిత ఆరోగ్య పరిస్థితిని వారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. -
జయలలిత హెల్త్ బులెటిన్ విడుదల
చెన్నై: అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని ఆస్పత్రి చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అపోలో ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జయలలితకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్సను కొనసాగిస్తున్నామని, వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. చికిత్స కోసం జయలలిత మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని వెల్లడించారు. జ్వరంతో పాటు డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22న ఆమె ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. -
ఆస్పత్రిలోనే మంత్రులతో సీఎం సమావేశం
తీవ్రజ్వరంతో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. అక్కడే మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. కర్ణాటకతో నెలకొన్న కావేరీ జలాల వివాదంపై ఆమె ఈ సమావేశం ఏర్పాటుచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో సమావేశం నిర్వహించాల్సి ఉండగా, తన బదులు ఆ సమావేశానికి హాజరు కావాలని ప్రజాపనుల శాఖ మంత్రి పళనిస్వామిని ఆదేశించారు. ఆ సమావేశంలో తాను ఏం చెప్పదలచుకున్నదీ ఒక కాగితం మీద రాసి ఇచ్చారు. పళనిస్వామి దాన్నే చదవాల్సి ఉంటుంది. గత గురువారం ఆస్పత్రిలో చేరిన జయలలిత డీహైడ్రేషన్, జ్వరానికి చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్సకు బాగానే స్పందిస్తున్నారని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రివర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాల గురించి ఉన్నతాధికారులు, మంత్రులు జయలలితకు వివరించారు. రాబోయే మూడు రోజుల పాటు తమిళనాడుకు రోజుకు 18వేల క్యూసెక్కుల నీళ్లు వదలాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా, జయలలిత ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారని, ఆమెకు మరికొంత కాలం విశ్రాంతి అవసరమని అపోలో ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. జయలలితను చికిత్స కోసం సింగపూర్ తరలిస్తున్నారంటూ వచ్చినవి కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేసింది. దానివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఇలాంటి వదంతులు రాకుండా ఉండాలంటే ఆస్పత్రి నుంచి జయలలిత వీడియో సందేశం విడుదల చేయాలని పీఎంకే నాయకుడు రామదాస్ కోరారు. గత మూడు రోజుల్లో 107 అమ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని, ఉచిత అమ్మ వై-ఫై జోన్ల పథకాన్ని కూడా ప్రకటించారని, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్లు దాఖలయ్యాయని.. అంటే ఆమె ఆస్పత్రిలో ఉన్నా అన్నింటినీ పరిశీలిస్తూనే ఉన్నారని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. -
సింగపూర్‌కు జయలలిత తరలింపు?
తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. ఆమెకు మధుమేహం ఎక్కువ స్థాయిలో ఉండటం, దానికి తోడు కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఉండటంతో చికిత్స కోసం ఆమెను సింగపూర్ పంపుతున్నట్లు ఆస్పత్రి వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఛానళ్లు పేర్కొన్నాయి.ఆమెకు జ్వరం తగ్గింది గానీ ప్రస్తుతం ఇంకా అబ్జర్వేషన్లో ఉన్నారని వైద్యులు అంటున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జ్వరం తగ్గడంతో ఆమెకు సాధారణ ఆహారాన్నే ఇస్తున్నట్లు అపోలో ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. అమ్మకు అంతా బాగానే ఉందని, అందువల్ల ఆమెను సింగపూర్ తరలించడం లేదని.. అపోలో ఆస్పత్రి నుంచి కూడా త్వరలోనే డిశ్చార్జి అవుతారని అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై అధికారికంగా మాత్రం ఇంతవరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఆస్పత్రి బయట పలువురు మంత్రులతో పాటు అన్నాడీఎంకే మద్దతుదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆమెకు బొకే పంపారు. అందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. సీఎం అనారోగ్యంతో ఆస్పత్రి పాలు కావడం ఆందోళనకరంగా ఉందని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు అన్నారు. సీఎం జయలలిత త్వరితగతిన కోలుకోవాలని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్ ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు. -
జయం మనదే
స్థానిక ఎన్నికలపై సీఎం ధీమా అన్నాడీఎంకే కార్యాలయంలో సమావేశాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తూ 14 తీర్మానాలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం రానున్న స్థానిక సంస్థల్లో కూడా కొనసాగడం తథ్యమని అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అదే విశ్వాసంతో గెలుపునకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పార్టీ అధికారం చేపట్టిన తరువాత చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి శనివారం తొలిసారిగా వచ్చిన జయలలితకు పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రతి ఆరునెలలకు ఒకసారి పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు శనివారం నిర్వహించిన సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు స్వాగతం పలికారు. జయలలిత వెంట ఆమె నెచ్చెలి శశికళ వచ్చారు. ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అధ్యక్షత వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి జయలలిత ప్రసంగించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలనే ప్రధానంగా ప్రస్తావించారు. పార్టీ శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. 2011 అసెంబ్లీ ఎన్నికలు, 2014 నాటి పార్లమెంటు ఎన్నికలు, మరలా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రజలు అన్నాడీఎంకే పాలన పట్ల అచంచెల విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయడం ద్వారా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయాన్ని అందుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే ఒంటరి పోరుతో ప్రజల మన్నలను పొందగలదని ఆమె విశ్వా సం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యవర్గ, అసెంబ్లీ సభ్యుల సమావేశాలను వేర్వేరుగా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను ఏ విధంగా తిప్పికొట్టాలనే వ్యూహాన్ని ఎమ్మెల్యేలకు వివరించారు. అలాగే కార్యవర్గ సమావేశంలో 14 తీర్మానాలను పార్టీ ఆమోదించారు. తీర్మానం వివరాలు ఇలా.. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, దుష్టశక్తులను అణిచివేస్తూ ప్రజలు తీర్పు చెప్పారు. పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిగా జయలలిత బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచి అన్ని ఎన్నికల్లో అండగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ 29 అంశాలతో కూడిన విజ్ఞప్తిని ప్రధానికి సమర్పించి, తగిన హామీని సైతం పొందిన జయలలితకు అభినందనలు. కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులను రాబట్టుకునేందుకు సీఎం జయలలిత ప్రయత్నం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. తమిళ జాలర్ల జీవనాధారాన్ని కాపాడేందుకు రూ.1,520 కోట్లను కేంద్రం కేటాయించాలి. అంతేగాక తమిళ జాలర్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి, వరదలతో రాష్ట్రానికి ముప్పు ఏర్పడకుండా, సాగునీటి జలాలు సక్రమంగా అందేందుకు తమిళనాడు, దక్షిణాది నదులను కేంద్రం అనుసంధానం చేయాలి. ముల్లైపెరియార్ జలాశయ నీటమట్టాన్ని 152 అడుగులకు పెంచుకోవచ్చని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో జరుగుతున్న జాప్యాన్ని నివారించి కేంద్రం అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. దేశంలోని మరే రాష్ట్రంలో లేని విధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత అన్నాడీఎంకే అధినేత్రి జయలలితది మాత్రమే. తన కఠోర శ్రమతో పార్టీకి వెంట వెంటనే విజయం సాధించి పెట్టిన జయలలితకు వందనాలు తెలుపుతూ తీర్మానాలు చేశారు. -
అమ్మ మార్కు రాజకీయం
ముఠా తగాదాల ప్రచారాలకు చెక్ అభ్యర్థుల కోసం స్వయంగా ఇంటర్వ్యూలు వంద మందితో త్వరలో తొలి జాబితా అన్నాడీఎంకేలో ముఠా తగాదాలు మిన్నంటాయనే ప్రచారాలకు పార్టీ అధినేత్రి జయలలిత చెక్ పెట్టడం ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచడం ద్వారా అమ్మ మార్కు రాజకీయానికి తెరలేపారు. చెన్నై: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే అంటే జనవరి 20వ తేదీ నుంచి అన్నాడీఎంకేలో ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తాము ఆశిస్తున్న నియోజకవర్గాలను పేర్కొంటూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా పార్టీ అధినేత్రి జయలలిత స్వయంగా ప్రకటించారు. అధికార పార్టీ కావడంతో అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎగిసిపడ్డారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు 17,698 మంది దరఖాస్తులు సమర్పించారు. ఇవిగాక జయలలిత తమ నియోజకవర్గం నుండి పోటీచేయాలని కోరుతూ 7,936 దరఖాస్తులు అందాయి. అయితే గత ఏడాది 4వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత నుండి పార్టీ కార్యకలాపాల్లో వెనుకబాటుతనం మొదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఇంటర్వ్యూలు ప్రారంభించగా అన్నాడీఎంకేలో మంత్రులపై వేటు, కార్యకర్తల తొలగింపు, ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని, కుమారుల పెత్తనం అంటూ మంత్రి పన్నీర్‌సెల్వం చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఎన్నికల వేళ ప్రతిపక్షాలకు అన్నాడీఎంకేలోని ఈ పరిస్థితులు ఆయాచిత వరంగా మారాయి. ఈ దశలో జయలలిత ఏదో మొక్కుబడిగా ఐదుగురిని పోయెస్ గార్డెన్‌కు పిలిపించుకుని ఇంటర్వ్యూలను చేశారు. దీంతో ఆశావహులంతా టిక్కెట్ల కోసం పలువురు మంత్రులను ఆశ్రయించడం ప్రారంభించారు. టిక్కెట్ల కేటాయింపు పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని మరో ప్రచారం ఊపందుకుంది. ఇదే ఆరోపణలపై ఐదుగురు అరెస్ట్ కావడంతో ప్రతిపక్షాల ప్రచారానికి బలం చేకూరింది. రంగంలోకి దిగిన అమ్మ ఎన్నికల వేళ అప్రతిష్టపాలైతే దాని ప్రభావం ఫలితాలపై ఉంటుందని అప్రమత్తమైన అమ్మ సోమవారం నేరుగా రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్ నుంచి నివేదికను తెప్పించుకుని ఇంటర్వ్యూలను ప్రారంభించారు. తిరునెల్వేలి, తూత్తుకూడి, కన్యాకుమారి, వేలూరు తదితర 25 నియోజకవర్గాలకు పోటీచేయగోరు అభ్యర్థులు రావాల్సిందిగా పార్టీ కార్యాలయం ఆదివారం కబురు పంపింది. సుమారు 50 మంది ఆశావహులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మ వద్దకు చేరుకున్నారు. 1.30 గంటల నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమైనాయి. నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున నిర్ణయించి ఒకరు అభ్యర్థి, మరొకరు అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని అమ్మ ఆదేశించినట్లు తెలుస్తోంది. టిక్కెట్టు లభించలేదని స్వంత పార్టీ అభ్యర్థినే ఓడించేందుకు ప్రయత్నిస్తే పార్టీ పరంగా తీవ్రపరిణామాలు తప్పవని అమ్మ హెచ్చరించినట్లు సమాచారం. అలాగే మంగళవారం నాడు శివగంగై, రామనాథపురం, మధురై, విరుదునగర్, దిండుగల్లు... ఈ ఐదు జిల్లాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన మిత్రపక్ష పార్టీలకు టిక్కెట్లు ఖరారు చేసి తొలి జాబితాల్లో వంద స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది. -
మా ఆట కోసం ఆర్డినెన్స్ ఇవ్వండి!
సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో జల్లికట్టు ఆటకు సుప్రీంకోర్టులో బ్రేకులు పడటంతో తమిళ పార్టీలన్నీ ఒక్కసారిగా నీరసపడ్డాయి. ముఖ్యమంత్రి జయలలిత నుంచి ఎండీఎంకే నేత వైగో వరకు ప్రతి ఒక్కరూ దీనిపై రకరకాలుగా స్పందించారు. తమ ఆటను ఎలాగైనా ఆడించుకోవాలని మంచి పట్టుదలతో ఉన్న తమిళనాడు సీఎం జయలలిత.. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జల్లికట్టును అనుమతించేందుకు ఒక ఆర్డినెన్సు ఇప్పించాలని ఆమె అందులో కోరారు. సాధారణంగా అయితే.. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు అత్యవసరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలకే ఆర్డినెన్సులు జారీ చేస్తారు. కానీ త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. తమ ఆటను ఆడించుకోడానికి వీలుగా ఓ ఆర్డినెన్సు ఇప్పించి పారేయాలని ప్రధానమంత్రిని జయలలిత కోరారు. జల్లికట్టును ఆమోదించేందుకు వీలుగా చట్టాన్ని సవరించినప్పుడు ప్రధానమంత్రి మీద ప్రశంసల వర్షం కురిపించిన నాయకులు కూడా.. ఇప్పుడు మాత్రం ఈ అంశంపై కేంద్ర వైఖరి సరిగా లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే అధినేత కరుణానిధి కూడా.. జల్లికట్టు ఆడించేందుకు వీలుగా ఆర్డినెన్స్ ఇప్పించాలని ప్రధానమంత్రిని కోరారు. -
అఖిలేష్ యాదవ్ థ్యాంక్స్ : జయలలిత
టీనగర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు రాష్ట్ర సీఎం జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. చెన్నై ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో రాష్ట్రానికి పలువురు ఆర్థికసాయాన్ని అందజేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తమిళనాడుకు రూ.25 కోట్ల రూపాయల నిధులను అందజేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో ముఖ్యమంత్రి జయలలిత అఖిలేష్ యాదవ్‌కు తన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె రాసిన లేఖలో ఈ విధంగా తెలిపారు. రాష్ట్రంలో వరద నివారణ పనులు వేగవంతంగా జరుగుతున్న స్థితిలో ఇందుకు సాయపడే విధంగా తమరు అమూల్యమైన నిధిగా రూ.25 కోట్లు కేటాయించి విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
ఎంపీలకు 'అమ్మ' క్లాస్
చెన్నై: లోక్ సభ, రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన విధానాలపై తన ఎంపీలకు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ప్రత్యేక క్లాస్ తీసుకున్నారు. సోమవారం సచివాలయంలో ఆమె పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి 37 మంది లోక్ సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు హాజరు అయ్యారు. ఉభయ సభల్లో తమిళనాడుకు ప్రయోజనం చేకూర్చే అంశాలను ప్రస్తావించే విధంగా ప్రత్యేకంగా వారితో చర్చించారు. తమిళ జాలర్లపై దాడులు, పడవల స్వాధీనం, కచ్చ దీవుల స్వాధీనం... అంశాల పై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతోపాటు భారీ వర్షాలు వరదలు కారణంగా తమిళనాడులో నెలకొన్న పరిస్థితులను ఉభయ సభల దృష్టికి తీసుకెళ్లడం... రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి.. నిధుల్ని పెద్ద ఎత్తున కేంద్రం నుంచి రాబట్టే విధంగా తీసుకోవల్సిన చర్యతోపాటు వారికి సూచనలు, సలహాలను ఇచ్చారు. అలాగే పార్లమెంట్ ముందుకు కేంద్రం తీసుకురాబోతున్న ముసాయిదాల గురించి చర్చించి, వాటికి ఆమోద ముద్ర వేయడమా లేదా, అందులో సవరణలకు పట్టుబట్టే రీతిలో వ్యవహరించే విధంగా వ్యూహాలు అమలు చేయాలని జయలలిత... ఎంపీలకు వివరించారు. -
ఆర్కె నగర్ ఎన్నికలో జయలలిత ఘనవిజయం
-
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం తమిళనాడు సచివాలయంలో జయలలిత బాధ్యతలు చేపట్టారు. శనివారం జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆమెతో పాటు 28 మంత్రులు ప్రమాణం చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు ఆర్థిక శాఖ కేటాయించారు. -
ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అభినందనలు
తమిళనాడుకు ఐదోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా పీఎంఓ ఐడీ ద్వారా.. ఆయన జయలలితకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆమెకు, ఆమె బృందానికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలిపారు. అవినీతి ఆరోపణలు రుజువై, జైలుశిక్ష పడటంతో ఎనిమిది నెలల క్రితం ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన జయలలిత.. కర్ణాటక హైకోర్టు తీర్పుతో నిర్దోషిగా బయటపడి మళ్లీ పదవి చేపట్టారు. అప్పట్లో కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కూడా జయలలితను మోదీ అభినందించారు. PM @narendramodi congratulates Jayalalithaa ji on taking oath as CM of Tamil Nadu and conveys his best wishes to her & her team. — PMO India (@PMOIndia) May 23, 2015 -
రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
-
రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదాపు 8 నెలల తర్వాత తొలిసారిగా ప్రజలకు దర్శనమిచ్చిన 'అమ్మ'.. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి, తన మంత్రివర్గంలో ఉండబోయే మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు. సుదీర్ఘ కాలం తర్వాత పోయెస్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. ముందుగా ఎంజీ రామచంద్రన్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. ఆ తర్వాత గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యను కలిసి తన జాబితాను ఆయనకు సమర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రోశయ్యకు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులంతా.. 'అమ్మ తిరిగొచ్చింది' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
తమిళనాడు సీఎం సెల్వం రాజీనామా
-
నిరూపిస్తే సగం మీసం తీసుకుంటా...
-
అక్కడ ఆయన... ఇక్కడ ఈయన
ఒకనాటి చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి 100 రోజులు పూర్తి అయిందో లేదో మరో చాయ్‌వాలా ఓ రాష్ట్రానికి సీఎం అయిపోయారు. ఒకరు తన ప్రసంగాలతో దేశ ప్రజల హృదయాలను కొల్లగొట్టి... పీఎం పీఠం అధిష్టిస్తే... మరోకరు 'అమ్మ' యందు భక్తి ప్రపత్తులతో మెలిగి ఆమె అచంచల విశ్వాసాన్ని పొందారు. అందుకు ప్రతిగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కేశారు. ఆయన ఎవరో ఈ పాటికి అర్థమైయే ఉంటుంది. ఆయనే తమిళనాడు సీఎంగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఓ. పన్నీరు సెల్వం. ఈ కొత్త ముఖ్యమంత్రిగారి స్వస్థలం పెరియకుళం. ఆయన స్థానికంగా హోటల్లో టీ విక్రయించే వారు. అంతేకాదు ఆయనే టీ కప్పులు కూడా కడుక్కునే వారు. అనుకోకుండా ఆయన ఏఐఏడీఎంకే పార్టీలో చేరారు. 1996లో పెరియకుళం మున్సిపాలిటి ఛైర్మన్‌గా అయ్యారు. ఆ తర్వాత అంటే 2001లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో... పెరియకుళం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. అప్పుటికే అమ్మ జయలలిత మనస్సు గెలుచుకున్నారు. దీంతో ఆమె కేబినెట్లో పీడబ్ల్యూడీ మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అమ్మ రాజీనామా చేయక తప్పలేదు. దీంతో ముఖ్యమంత్రి ఎంతమంది సీనియర్లు ఉన్నా అమ్మ మాత్రం పన్నీరుకే సీఎం పీఠం అప్పగించింది. దీంతో 2001 నుంచి 2002 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన అమ్మకు తనకు అప్పగించిన కుర్చిని గుడ్బాయిలా మళ్లీ అలాగే అప్పగించేశారు. ఆ వినయం, ఆ విధేయత అమ్మ మనస్సును కట్టిపడేశాయి. అంతే సెప్టెంబర్ 28న జయలలితకు అక్రమ ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడగానే... ఈసారి అయిన తమకు సీఎం పదవి వస్తుందని ఆ పార్టీలోని సీనియర్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ సృష్టిలో విశ్వాసానికే మించినది లేదంటూ మళ్లీ పన్నీరుకే సీఎం పీఠాన్ని అమ్మ అప్పగించి....నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో అంటూ చెప్పకనే చెప్పింది. 1991 -1996 మధ్య కాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత అక్రమంగా ఆస్తులు సంపాదించారని అప్పటి జనతాదళ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ కేసు 18 ఏళ్ల పాటు విచారణ జరిగింది. ఆ క్రమంలో బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. ఆ కేసులో జయలలిత ఆస్తులు కూడబెట్టినట్లు నేరం రుజువైంది. దీంతో సెప్టెంబర్ 28న అమ్మకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో సీఎంగా ఉన్న జయలలిత పదవిని కోల్పోయింది. ఆమె కేబినెట్లో ఉన్న పన్నీరు సెల్వం రెవెన్యూ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి చాయ్‌వాలా అయిన మోడీ కేంద్రంలో పాగా వేస్తే, పన్నీరు సెల్వం తమిళనాడులో గద్దె నెక్కారు. -
రేపు తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం ప్రమాణం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్ రోశయ్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు పన్నీరు సెల్వంను రోశయ్య ఆహ్వానించారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు పన్నీరు సెల్వంను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు జైలు శిక్షపడటంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో జయలలిత తనకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీరు సెల్వంను తన వారసుడిగా ఎంపిక చేశారు. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. పన్నీరు సెల్వం జీవిత విశేషాలు: 1951లో జననం 1996లో రాజకీయాల్లో ప్రవేశం 2001 నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక 2001లో సీఎంగా ప్రమాణం ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు -
పన్నీరు సెల్వంకు రోశయ్య ఆహ్వానం
-
పన్నీరు సెల్వంకు రోశయ్య ఆహ్వానం
చెన్నై: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు ఓ. పన్నీరు సెల్వంను గవర్నర్ కె. రోశయ్య ఆహ్వానించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అంతకుముందు పన్నీరు సెల్వంను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ పార్టీ అధినేత్రి జయలలిత ఆదేశాల మేరకు ఆయనను నాయకుడిగా ఎన్నుకున్నామని అన్నాడీఎంకే నేతలు వెల్లడించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు జయలలిత సీల్డ్ కవర్ లో పంపించినట్టు వార్తలు వచ్చాయి. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఇది రెండోసారి. రేపు ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. -
తమిళనాడు సీఎంగా పన్నీరు సెల్వం
-
పన్నీరు సెల్వంకే పట్టం
చెన్నై: జయలలిత తన అనుంగు అనుచరుడు ఓ. పన్నీరు సెల్వంపై మరోసారి నమ్మకముంచారు. ముఖ్యమంత్రిగా ఆయనకు మళ్లీ పట్టం కట్టారు. 'అమ్మ' ఆదేశాల మేరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనను శాసనసభపక్ష నేతగా ఎన్నుకున్నారు. సీఎం పదవికి పలువురు పేర్లు వినిపించినా 'విశ్వాసపాత్రుడు'వైపే పురచ్చితలైవి మొగ్గుచూపారు. గతంలో జైలుకు వెళ్లినప్పుడు కూడా పన్నీరు సెల్వంకే ఆమె ముఖ్యమంత్రి పదవి అప్పగించిన సంగతి తెలిసిందే. రెండోసారి కూడా ఆయనకే అవకాశం దక్కడం గమనార్హం. పన్నీరు సెల్వం రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. -
జయలలిత.. ఎగిసి పడిన కెరటం!
-
ఎమ్మెల్యేగా జయలలితపై అనర్హత వేటు!
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష ఖరారు కావడంతో ఆమెపై ఎమ్మెల్యేగా అనర్హత వేటుపడింది. ఈ అనర్హత వేటు తక్షణమే అమల్లోకి రానుంది. శనివారం బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆమె సీఎం పదవికి అనర్హురాలు కానుంది. దీంతో పాటు ప్రజాప్రాతినిధ్యం చట్ట ప్రకారం ఆమె ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తాజా తీర్పుతో ఆమె పదేళ్ల పాటు రాజకీయ జీవితానికి దూరంగా ఉండనుంది. ఆమెకు నాలుగేళ్ల శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానాను కోర్టు విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి.1996లో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి ఆమెపై దర్యాప్తు చేయాలని కోరుతూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు చేపట్టాల్సిందిగా కోర్టు ఆదేశించినా.. దర్యాప్తుకు మాత్రం సుదీర్ఘ సమయం పట్టింది. -
'ఆమెకు అంత శిక్ష పడుతుందనుకోలేదు'
చెన్నై : తమిళనాడులో రెండు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి కేంద్రాన్ని కోరారు. జయలలితకు జైలుశిక్ష నేపథ్యంలో తమిళనాడు అగ్నిగుండంగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సామాన్య వ్యక్తిగానే జయలలితపై ఫిర్యాదు చేశానని సుబ్రమణ్యం స్వామి అన్నారు. జయలలితకు అంత శిక్ష పడుతుందని తాను కూడా ఊహించలేదన్నారు. సామాన్యుడు కూడా అవినీతి, అక్రమాలను ప్రశ్నించవచ్చనే దానికి ఈ కేసు ఉదాహరణ అన్నారు. తనపై చాలా దాడులు జరిగాయని అయినా తాను భయపడలేదని సుబ్రమణ్యం స్వామి తెలిపారు. ఇక జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్లేనని ఆయన అన్నారు. అంతకు ముందు సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్లో జయలలిత జైలుకే ...జేజే అంటూ ట్విట్ చేశారు. -
జయను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శిక్ష పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా తీర్పు వెలువడిన వెంటనే జయ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. మరోవైపు న్యాయస్థానం తీర్పుపై ఆమె సోమవారం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జయలలితకు శిక్ష ఖరారు కావటంతో అన్నాడీఎంకేలో నిస్తేజం నెలకొంది. న్యాయస్థానం నాలుగేళ్లు శిక్ష వెలువరించటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు దిగ్భాంత్రికి గురయ్యారు. మహిళా కార్యకర్తలతో పాటు జయ కేబినెట్లోని మంత్రులు కన్నీరు పెట్టుకున్నారు. తీర్పు వెలువడటంతో ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం కోర్టులోనే కంటతడి పెట్టారు. -
జయలలిత జీవిత ప్రయాణమిదీ!
-
జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
బెంగళూరు : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్షతో పాటు వంద కోట్ల భారీ జరిమానా విధించింది. ఇదే కేసులో దోషులుగా ఉన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష , ఒక్కొక్కరికి 10 కోట్ల జరిమానా విధించింది. మరోవైపు జయలలితకు శిక్ష ఖరారైన నేపధ్యంలో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధినేత్రికి శిక్ష పడటాన్ని జీర్ణించుకోలేని అన్నాడీఎంకె కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. దీంతో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. డీఏంకే హయాంలో 1996లో జయపై అక్రమాస్తుల కేసు నమోదైంది. 1991-96 మధ్యకాలంలో తమిళనాడు సీఎంగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని జయపై ఆరోపణలు వెలువత్తాయి. జయలలిత ఆస్తుల కేసులో గత 18 ఏళ్ల నుంచి మొత్తం 358 మందిని కోర్టు విచారించింది. -
జయకు నాలుగేళ్ల జైలు: లైవ్ అప్డేట్స్
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆమెకు ఏ శిక్ష విధించేదీ మాత్రం ఇంకా వెల్లడించలేదు. 18 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో ఆమె దోషిగా తేలడంతో.. ఆమె భవితవ్యం ఏమవుతుందోనని దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ కేసు తాజా పరిణామాలు ఇవీ. * ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హురాలు కానున్న జయలలిత * కోర్టు తీర్పు నేపథ్యంలో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి నెలకొంది * నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు వంద కోట్ల జరిమానా * జయతో పాటు శశికళ, ఇళవరసన్, సుధాకరన్ కు నాలుగేళ్ల జైలు * జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. * జయలలితపై అక్రమాస్తుల కేసులో నేరం రుజువైనట్లు న్యాయమూర్తి తెలిపారు. * ఆమెకు ఏశిక్ష విధిస్తారోనన్న విషయమై తుది తీర్పు మధ్యాహ్నం తర్వాత రావచ్చు. * కర్ణాటక- తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న బ్యారికేడ్లను విరగ్గొట్టేందుకు అన్నా డీఎంకే కార్యకర్తలు ప్రయత్నించారు. వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. * కోర్టు ఆవరణలో ఆందోళన చేస్తున్న జయలలిత మద్దతుదారులపై లాఠీఛార్జి * బెంగళూరు మినీ తమిళనాడుగా మారిపోయింది. భారీ సంఖ్యలో అన్నా డీఎంకే, డీఎంకే కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. * ఈ కేసులో నేరం రుజువైతే.... ఆమెకు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. * 1996లో సుధాకరన్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఆరోపణలు * నేరం రుజువైతే ఆమె ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది * ఇదే జరిగితే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఫలితాలపై కూడా ప్రభావం చూపొచ్చు. * ఒకవేళ జయలలితకు శిక్షపడి, ఆమె పదవిని వదులుకోవాల్సి వస్తే.. ఆమె స్థానంలో తాత్కాలిక సీఎంగా తమిళనాడు మాజీ సీఎస్ షీలా బాలకృష్ణన్‌ను నియమించే అవకాశం * ఆమె కాని పక్షంలో 'అమ్మ'కు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వంకు కూడా అవకాశం. * ఈ కేసు.. తనపై తమ ఆగర్భ ప్రత్యర్థి డీఎంకే పన్నిన రాజకీయ కుట్రగా అభివర్ణించిన జయ * కోర్టు బయట భారీసంఖ్యలో గుమిగూడిన అన్నాడీఎంకే మద్దతుదారులు * ఈ కేసులో జయలలితతో పాటు ఆమెకు అత్యంత సన్నిహతురాలైన శశికళా నటరాజన్, ఇళవరసి కూడా కేసులో నిందితులే. -
జయలలితకు నాలుగేళ్ల జైలుశిక్ష
-
బెంగళూరు కోర్టు పరిసరాల్లో 144 సెక్షన్
బెంగళూరు : బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం పరిసర ప్రాంతాల్లో నగర పోలీస్ కమిషనర్ రెడ్డి 144 సెక్షన్ విధించారు. జయ అక్రమాస్తుల కేసు విచారణకు నగర శివార్లలోని పరప్పన ఆగ్రహార జైలు ఆవరణలో....తాత్కాలిక కోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జయలలితను దోషిగా నిర్థారించిన కోర్టు మరికాసేపట్లో తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు అవుతున్నాయి. కాగా నిరసనలు వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు దగ్గర భారీగా బలగాలు మోహరించాయి. -
జయ కేసు: ట్విట్టర్లో ఎవరేమన్నారు?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో పలువురు స్పందించారు. ట్విట్టర్లో పలు వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఒకప్పుడు లక్స్ ప్రకటనలతో అందరికీ సుగంధాన్ని పంచిన జయ.. ఇప్పుడు జైల్లో అవే సుగంధాలను పంచుతారేమోనని కూడా కొంతమంది వ్యాఖ్యానించారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికున్హా ఆమెను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. Now JJ will smell and admire the interiors of jail cells. @Swamy39 @jagdishshetty @arundharhoney @vijay_rajan pic.twitter.com/43oC5g8c99 — Wandering Wolf (@WanderingWolf2) September 27, 2014 Thanks to freedom movement, going to jail is a qualification for our politicians. For whatever reason. #OnlyInIndia @vvsnair @minhazmerchant — Baba Leopard Singh (@Leopard212) September 27, 2014 Hey political pundits,u remember this? “Ordinance to shield convicted leaders is complete nonsense, tear it up:Rahul” http://t.co/JR93HLbgCv — sachin bahad (@sachinbahad) September 27, 2014 TN people should start looking for options beyond Amma & Ayya ..... unfortunately there are alternatives available i guess — Naveen (@emanin) September 27, 2014 Why is police not forcing dispersal of agitated and angry cadre from outside Poes Garden? #Amma #jayaverdict pic.twitter.com/LdRzZXmt4P — Uma Sudhir (@umasudhir) September 27, 2014 @mswami Karma pays back peduliarly.She is overpunished for crimes whichis miniscule compared toother politicians but paying for bigger sins — Global Indian (@sivashiv) September 27, 2014 Public prosecutor asks for 7 years jail for #Jayalalithaa. Defence pleads for her age and health to be taken into account #Jayaverdict — T S Sudhir (@Iamtssudhir) September 27, 2014 #Jayalalithaa disqualified as MLA, loses Chief Ministership instantly; as a pointer, the National Flag on her car has been removed #THJAYA — dinesh surya (@BooDinesh143) September 27, 2014 Law and order goes for a toss in Tamil Nadu as JJ sentence is awaited. #Jayaverdict #Jayalalithaa — Chandra R. Srikanth (@chandra86) September 27, 2014 It took #18years to prove TN CM #Jayalalithaa guilty of corruption. 18 years -Right to get Law. #jayaverdict. — Arunkumar Alagesan (@ArunzTwit) September 27, 2014 #Jaya life is an example for wrong friendship, but her Army will keep increasing & she will come Much Bigger Next time. Nw, "I'm Waiting" — @kamaljii (@kamaljii) September 27, 2014 Oh when will Mayawati and Mulayam follow in the giant heavy footsteps of Jaya?!?? Oh when??? — SUHEL SETH (@suhelseth) September 27, 2014 10 years back in Nov 2004,#Jaya got Kanchi Shankracharya arrested on Diwali day. Diwali is around d corner&deer she goes. Karma spares noone — Ankita Thakur (@Ankitaaa_) September 27, 2014 -
ఎన్ని పథకాలు పెట్టినా.. 'అమ్మ' ఇంటికే!
అమ్మ క్యాంటీన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ ఉప్పు, తాజాగా అమ్మ సిమెంటు... ఇలా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కూడా 'అమ్మ' చివరకు ఇంటిదారి పట్టక తప్పట్లేదు. ఎప్పుడో 17 ఏళ్ల క్రితమే 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారంటూ నాటి జనతాపార్టీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి కేసు పెట్టడం.. దాని విచారణ ఇన్నేళ్ల పాటు సాగడం, చివరకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డికూన్ ఆమెను దోషిగా నిర్ధారించడంతో ఇక ముఖ్యమంత్రి పదవికి ఆమె రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాకర్షక పథకాలను ప్రకటించడం ద్వారానే జయలలిత ఎక్కువ ఆదరణ పొంది.. ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించారు. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, బాలింతలకు ఉయ్యాలలు.. ఇలా అనేక వరాలు కురిపించారు. అయినా కూడా ఇప్పుడు అక్రమాస్తుల కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో పదవి కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. -
తమిళనాడులో హై అలర్ట్, కేబుల్ ప్రసారాలు బంద్
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషిగా నిర్థారణ అయిన నేపథ్యంలో తమిళనాడులో హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అలాగే కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. బస్సు సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే కార్యకర్తులు దాడులుకు పాల్పడుతూ ....బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. కాగా తమిళనాడులోని పలు జిల్లాల్లో పార్టీ కార్యకర్తలు పాక్షికంగా బంద్ పాటిస్తున్నారు. కాగా తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు భారీగా మోహరించారు.ఇక అన్నాడీఎంకే కార్యాలయం వద్ద అత్యంత్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధి నివాసంతో పాటు డీఎంకే కార్యాలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నన్ను హింసించడానికే కేసులు: జయ
బెంగళూరు : తనను హింసించేందుకే ఈ కేసులు పెట్టారని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత అన్నారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని జయ తెలిపారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఆమె ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను బెంగళూరు స్పెషల్ కోర్టు దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పు వెలువడనుంది. -
ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగనున్న జయలలిత
-
జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది
అనుకున్నంతా అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిపోయారు. 18 ఏళ్ల నాటి ఈ కేసులో జయలలితను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు ఈ తీర్పు విన్నవెంటనే అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో వాతావరణం తీవ్ర ఉద్రిక్త భరితంగా మారింది. ఈకేసుకు సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి.. 1996 జూన్‌లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు విచారణ జరపాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు జారీచేసింది జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్‌లో ఛార్జిషీటు దాఖలు చేశారు అక్టోబర్‌లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు 2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు. 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు 2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్‌ను తప్పించింది. తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు. కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు. 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది. తీర్పును వాయిదా వేయాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు అది కుదరదని, 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరపన అగ్రహారంలోని గాంధీభవన్‌లో ప్రత్యేక కోర్టు ఉంది. 1996లో తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుచేశారన్నది ప్రధాన ఆరోపణ 2014 సెప్టెంబర్ 27 వ తేదీన ఆమెకు నాలుగేళ్లు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. షీలా బాలకృష్ణన్‌ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం. -
జయలలితను దోషిగా తేల్చిన కోర్టు
-
కేసు ఓడితే.. సీఎం పదవి గోవిందా!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరుకు బయల్దేరారు. ప్రత్యేక కోర్టులో నేడు వెలువడనున్న తీర్పు వినేందుకు ఆమె చెన్నై నుంచి బెంగళూరు వెళ్లారు. జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ కూడా బెంగళూరుకు బయల్దేరారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసుకున్నారంటూ ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నమోదైన కేసు విచారణ సుదీర్ఘంగా ఇన్నాళ్ల పాటు సాగింది. ఈ కేసులో తీర్పును వెలువరించకుండా చూడాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దాంతో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శనివారమే తన తీర్పు ఇవ్వనుంది. ఒకవేళ ఈ కేసులో తీర్పు జయలలితకు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఆమె తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. అలా జరిగితే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే విషయం కూడా ఇప్పటికే చర్చించుకున్నారు. జయలలిత దృష్టిలో ముగ్గురు ఉన్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం. వారు రాష్ట్ర రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే రిటైరైన షీలాకు పరిపాలనా అనుభవం ఉంది. ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే రిటైరైన తర్వాత కూడా ప్రత్యేక సలహాదారుగా ఆమెను నియమించుకున్నారు. -
జయ ఆస్తుల కేసులో రేపే తీర్పు
సాక్షి, చెన్నై: తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే చీఫ్ జయలలితపై ఉన్న రూ. 66 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ట్రయల్ కోర్టు శనివారం తీర్పువెలువరించనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటిగా పేరుగాంచిన అగ్రహారం సమీపంలో తాత్కాలిక న్యాయస్థానాన్ని నిర్మిస్తున్నారు. ఆ ప్రాంగణంలో న్యాయవాదులు మినహా మరెవరూ ప్రవేశించకుండా చూడాలని పోలీసులు నిర్ణయించారు. జయపై వెలువడుతున్న తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో 1.18 లక్షల మంది పోలీసులను బం దోబస్తుకు వినియోగిస్తున్నారు. శనివారం కనీ సం 20 వేల మంది అన్నాడీఎంకే కార్యకర్తలు బెంగళూరుకు వచ్చే అవకాశం ఉండటంతో శాం తిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. -
'అమ్మ'ను కాపీ కొడుతున్న 'అన్న'
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వారిలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి రూటే సపరేటూ.. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో వివిధ పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ ఇతర దేశాలలో చూసి అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలను నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టారు. ఉదాహరణకు జన్మభూమి ... దక్షిణ కొరియాలో అమలవుతున్న ఓ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారు. ఆయన తన గత తొమ్మిదేళ్ల పాలనలో ఇలాంటి తరహా పథకాల ఎన్నో ఎన్నెన్నో. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక... తమిళనాడులో జయలలిత ప్రభుత్వం అమ్మ పేరిట ప్రారంభించిన పథకాలు దిగ్విజయంగా కొనసాగుతుండటంతో అవే పథకాలు అన్న పేరుతో రాష్ట్రంలో ప్రారంభించాలని బాబు తలుస్తున్నట్టుంది. అంతే అనుకున్నదే తడువుగా ఆయన మంత్రివర్గంలో కొంతమంది మంత్రుల బృందం ఇప్పటికే రెండు సార్లు అమ్మ పథకాల అధ్యయనం పేరిట తమిళనాడులో రెండు సార్లు పర్యటించి వచ్చారు. ముచ్చటగా మూడోసారి ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడులో మరోసారి అధ్యాయనానికి వెళ్లేందుకు మంత్రుల బృందం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. కాపీ కొట్టిన పథకాలను అమలు చేస్తూ ప్రచారం పొందటం బాబుకి అలవాటే. -
జయ నెచ్చెలి శశికళ భర్త అరెస్టు?
శశికళ భర్త నటరాజన్‌ను చెన్నై పోలీసులు సెంగోట్టైలో సోమవారం అరెస్టు చేసినట్లు, ఆయనను చెన్నైకు తీసుకువస్తున్నట్లు సమాచారం అందింది. ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ భర్త ఎం నటరాజన్, ప్రముఖ కరాటే చాంఫియన్ హూసైనీని తుపాకీతో బెదిరించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు అందింది.దీనిపై తిరువాన్మయూర్ పోలీసులు విచారణ జరిపారు. కుట్రాలంలోని తన బంగ్లాలో నటరాజన్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో తిరువాన్మయూర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సోమవారం ఉదయం వారు నటరాజన్‌ను అరెస్టు చేశారు. తర్వాత ఆయనను చెన్నైకు తీసుకువచ్చారు. నటరాజన్‌ను పోలీసులు అరెస్టు చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో కలకలం రేపుతోంది. -
అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు ఊరట
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణపై సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు జూన్ 16వ తేదీ వరకు పొడిగించింది. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ సి.నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు ఉన్న బినామీ ఆస్తుల అసలు యజమానులు ఎవరన్న విషయం తేలేవరకు ఈ కేసులో విచారణ ముందుకు వెళ్లకూడదని ఈ ధర్మాసనం భావించింది. ఈ కేసులో విచారణపై స్టేను వెకేట్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన డీఎంకే నాయకుడు కె.అన్బళగన్‌కు కూడా కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాగా, తమిళనాడు విజిలెన్స్, ఏసీబీ శాఖ వారం రోజుల్లోగా జయలలిత పిటిషన్‌పై తమ సమాధానాన్ని తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.