హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత త్వరగా కోలుకోవాలని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. పురచ్చితలైవి జే జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలు రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జయలలిత చికిత్స పొందుతున్న చెన్నై అపోలో ఆస్పత్రికి తమిళనాడు మంత్రులు వెళ్లి సమీక్షిస్తున్నారు.
Praying for the speedy recovery of Puratchi Talaivi J. Jayalalitha.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 5 December 2016