తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గత 74 రోజులుగా ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గత 74 రోజులుగా ఆ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన మొదట్లో ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెప్పడంతో తమిళనాడు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలో డిశ్చార్జి అవుతారని వైద్యులు, అన్నా డీఎంకే నాయకులు చెప్పడంతో ప్రజలు సంతోషించారు. ఆదివారం ఆ పార్టీ నాయకులు ఇలాంటి ప్రకటనే చేశారు. దీంతో అమ్మ త్వరలో ఇంటికి వస్తారని ప్రజలు భావించారు. అయితే కొన్ని గంటల తర్వాత జయలలితకు గుండె సంబంధిత సమస్య రావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారిందని తెలియడంతో తమిళనాట విషాదం నెలకొంది. జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరి 74 రోజులు అయ్యింది. నాటి నుంచి ఈ రోజు వరకు కీలక పరిణామాలు..