
రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదాపు 8 నెలల తర్వాత తొలిసారిగా ప్రజలకు దర్శనమిచ్చిన 'అమ్మ'.. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి, తన మంత్రివర్గంలో ఉండబోయే మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు.
సుదీర్ఘ కాలం తర్వాత పోయెస్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. ముందుగా ఎంజీ రామచంద్రన్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. ఆ తర్వాత గవర్నర్ నివాసమైన రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యను కలిసి తన జాబితాను ఆయనకు సమర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రోశయ్యకు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులంతా.. 'అమ్మ తిరిగొచ్చింది' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.