లేచి నిలబడిన జయలలిత | Jayalalithaa recovered almost and walks herself | Sakshi
Sakshi News home page

లేచి నిలబడిన జయలలిత

Published Wed, Nov 9 2016 3:51 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

లేచి నిలబడిన జయలలిత - Sakshi

లేచి నిలబడిన జయలలిత

కోలుకుంటున్న తమిళనాడు సీఎం.. అభిమానుల్లో ఆనందం
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తిస్థాయిలో కోలుకుంటున్నారు. మంగళవారం ఆమె లేచి కూర్చున్నట్టు, నిలబడ్డట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఫిజియోథెరపీ నిపుణులు సీమా, జూడీ ఇచ్చిన సూచనలు, శిక్షణకు ఆమె తగురీతిలో స్పందిస్తున్నట్టు సమాచారం. జయలలిత 48 రోజులుగా అపోలోలో అందిస్తున్న చికిత్సతో రోజురోజుకూ ఆమె ఆరోగ్యం మెరుగుపడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, పోయస్ గార్డెన్ నుంచి ఆమెకు భోజనం అందిస్తున్నారు.

అమ్మ స్వయంగా లేచి కూర్చున్నట్టు సమాచారం అందడంతో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఆదివారంలోపు ఆమెను జనరల్ వార్డుకు మార్చేందుకు ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. ఆ గదిలో వాకింగ్, చిన్న పాటి వ్యాయామం చేసేందుకు తగ్గట్టు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement