చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో పొందిన చికిత్స వివరాలపై ఆర్ముగం కమిటీ దర్యాప్తు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ఆర్.సుబ్బయ్య, జస్టిస్ కృష్ణన్ రామస్వామిల డివిజన్ బెంచ్ అపోలో పిటిషన్‌ను సోమవారం విచారించింది.
జయలలిత మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందనీ, అయితే ఆస్పత్రిలో ఉండగా అందించిన చికిత్స సరైనదో కాదో నిర్ధారించే హక్కు ఆర్ముగం కమిషన్‌కు లేదని అపోలో యాజమాన్యం వాదించింది. కమిటీ నేతృత్వంలో వైద్యులు ఆస్పత్రి రికార్డులు పరిశీలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది.
Comments
Please login to add a commentAdd a comment